ఓటు సిత్రాలు...
ఓటర్లకు , నాయకులకు
ప్రాణం ఓటు
మీకు, మాకు, అందరికి
ప్రాణం ఓటు (O2)...
ఇంటిలోన పాలబిల్లు
ఎంతో తెలీదంట
ఓటడగా వెళ్లి
నేర్పుగా పాలు పితికేరంట....
వందనోటు విడిపిస్తే
ఏగాని మిగలదంట
ఆ వందకే నెల సరుకులు
ఎలా ఇచ్చేరంట...
నల్లచుక్క కనపడదు
నాలుగు రోజుల్లో
నాయకుడు కనపడదు
నాలుగు ఏళ్లలో .....
మీట నొక్కేవరకు
నీ కాల్మొక్త బాంచన్
మీట నోక్కేసాక
నా కాల్మోక్కరా బద్మాష్..
కొద్ది కాలంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, మోసాలు, తమాషాలు, వేషాలు చూసి చిరాకేసి రాసుకున్న భావవ్యక్తీకరణ. అసలైతే ఇంతకంటే వందరెట్లు చిరాకుగా , కోపంగా ఉంది..
6 వ్యాఖ్యలు:
వహ్వా వహ్వా
>>> ఓటర్లకు , నాయకులకు
ప్రాణం ఓటు
మీకు, మాకు, అందరికి
ప్రాణం ఓటు (O2)...
*** *** ***
ఇది మాత్రం కత్తి. ఓటు. Double entendre.
నల్ల చుక్క paragraph కూడా బాగా వచ్చింది.
బావుందండీ :) :)
" మీట నొక్కేవరకూ.... " చాలా బాగుంది
ట్రాక్టర్ ను ఎగిరిస్తాడు
గాల్లో పదడుగులు
మరి ఇవ్వలేడా
వందకు నెల సరుకులు
mee chiraaku kopam mee feelings anni mee kavitalo kanapaddaayi. kaani inkaa entakaalamo ee nissahaayata.
Post a Comment