Thursday 30 April 2009

గుడ్డీ

స్టాచ్చ్యూ ....

ఇలా అనగానే మనకెదురుగా ఉన్నా వ్యక్తి అలాగే విగ్రహం లా నిలబడిపోవాలి. కంటి రెప్పలు కూడా కదల్చకూడదు. గుర్తుందా. ఈ ఆట ఒక సినిమాలో పాపులర్ ఐంది. ఒక స్కూలు అమ్మాయి ఓ సినిమా నటుడి పిచ్చిలో కనే కలలు కంటూ , అతనే తన జీవితం అనుకుంటుంది. సినిమా అనగానే అద్భుత ప్రపంచం. అందమైనది అనుకుంటారు చాలామంది.... కాని సినిమా వెనకున్న అసలు కథను చూపించే ఒక అత్యద్భుతమైన సినిమా "గుడ్డీ". జయాబాధురి నటించిన మొదటిసినిమా. ఆ చిత్ర విశేషాలు నవతరంగంలో .. అందులోని కొన్ని మరపురాని, మధురమైన పాటలు ఇక్కడ..




5 వ్యాఖ్యలు:

అరుణాంక్

తెలుగు లో కూడ అటువంటి సినిమా శివరంజని అనుకుంటా దాసరి తీసారు.

మీ వంటల బ్లాగ్ గురించి ఈ టి వి లో చెప్పారు.అభినందనలు

కొత్త పాళీ

సినిమాలో మిగతా సంగతులు నాకంతగా గుర్తు లేవుగానీ, జయ పాత్రకి నటుడు ధర్మేంద్ర అంటే ఉన్న పిచ్చి ఆరాధనకి సూచనగా "యా దిల్ కి సునో" అనే పాట (హేమంత్ కుమార్ పాడింది) చూపిస్తారు. అది బాగా గురుతుండి పోయింది.

జ్యోతి

అరుణాంక్ గారు,
థాంక్స్ అండి . ఈ విషయం నాకు తెలీదు. ఎప్పుడు, ఏ కార్యక్రమంలో వచ్చిందో చెప్తారా?? శివరంజని కధ వేరు కదా??

కొత్తపాళీగారు..
యా దిల్ కి సునో పాట అనుపమ చిత్రంలోనిదండి..

రాధిక

మా ప్రతి దీపావళి సంబరాల్లోనూ "హంకొ మన్ కి" పాట కంపల్సరీ.ఆ పాట సంగీతం,సాహిత్యం రెండూ నాకిష్టం.ఒక్కోసారి ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ వుంటాయి ఆ పాట వింటుంటే.

అరుణాంక్

29th or 30th April మద్యాన్నం ఒంటిగంట కు ఈ టీ వి -2 లో సఖి ప్రొగ్రం అనుకుంట విజయరావు గా రి వంట ముందు మీ షడ్రుచులు ,cookery బ్లాగ్ గురించి చెప్పారు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008