Wednesday, 16 September 2009

ఆడపిల్లంటే అంత అలుసా???




ఆడది ఆదిశక్తి అనే మాట ఎంతవరకు సత్యం? ఇంతగా అభివృద్ధి చెందిన ఆడదాన్ని అమ్మలా పూజించే మన దేశంలో ఒకేరోజు సుమారు నలబై మంది ఆడపిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు ..ఇది నిజమేనా?నమ్మశక్యమేనా ? వాళ్ళకు అంత కష్టమేమి వచ్చింది? అందరూ చిన్నపిల్లలు స్కూలు దాటి అప్పుడే కాలేజిలోకి వచ్చిన అమ్మాయిలు.

రాజమండ్రి లూతరన్ కాలేజీలోని అమ్మాయిలు తమ కాలేజీ కరస్పాన్డెంట్ చేసే లైంగిక వేధింపులు భరించలేక సుమారు నలబై మంది అమ్మాయిలు బాధతో పురుగుల మందు తాగి ,బ్లేడుతో చేతిపై కోసుకుని జీవితం చాలించాలని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం తండ్రిలా చూసుకోవాల్సిన కరస్పాండెంట్ చేసే వేధింపులు.. అవి ఎంత తీవ్రంగా , భరించలేకుండా ఉంటే ఆ సుకుమారులు అలా చేసారు. ఎంత కాలంగా ఆ వేధింపులు తట్టుకున్నారో వారి ఏడుపులు వింటుంటే తెలిసిపోతుంది. చదువు మీద మక్కువతో ,ఎంతో డబ్బు వెచ్చించి కాలేజిలో చేరితే ఇదా ఫలితం..

కాని ఇలా బాధతో ఆత్మహత్యలకు పాల్పడే బదులు అమ్మాయిలు మానసిక స్థైర్యం తో , అందరు కలిసి ఎదిరించి ఆ దుర్మార్గునికి తగిన గుణపాఠం చెప్పాలి. కాని చాలా సందర్భాలలో అలాటి వాళ్లు అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగి ఉంటారు. ఇలాంటి వాళ్లకు చట్టం, న్యాయం తొందరగా శిక్ష వేస్తుందా. అంత వరకు ఆ నిందితుడు డబ్బులు వెదజల్లి న్యాయాన్ని కొనేసి , బెయిల్ తెచ్చుకుని ఇంటికి చేరతాడు. ప్రతీది ఇలా ఏళ్ల తరబడి న్యాయానికి ఎదురుచూడాల్సిందేనా??? ప్రజలు .లేదా బాధితులు శిక్షించలేరా?? ఈ మధ్యే ఒక పోలీసు ఒక మహిళను నడిరోడ్డుపై వేదించి ఆమె తిరగబడితే చంపడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్సినవాళ్ళతో తన్నులాటకు దిగాడు. ఇక ఎవరు సామాన్య ప్రజలను రక్షించేది??

10 వ్యాఖ్యలు:

తెలుగు వెబ్ మీడియా

బ్లూఫిలింస్ చూసి కుర్రాళ్ళే కాకుండా వయసు పైబడిన వాళ్ళు కూడా చెడిపోతుంటారన్న మాట.

శేఖర్ పెద్దగోపు

మన అధికారులు వాళ్ళ అక్కకో, చెల్లికో, కూతురికో లేక భార్యకో ఇలాంటి వేదింపులు జరిగితేగానీ పట్టించుకునే టైపు కాదులెండి. సర్కారీ కొలువులో తోలు బాగా మందం అయిపోయింది మరి. నాయకులు విసిరే ఎంగిలిమెతుకులు ఉండనే ఉంటాయి....ఇంకెందుకు పడతాయి చెప్పండి సామాన్యుల, అభాగ్యుల కష్టాలు. ఇంక మన న్యాయస్థానాల విధానాల్లో లొసుగుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.

కత పవన్

ఇందులో మేదటి తప్పు వారి తల్లితండ్రలదే అత్మహాత్య ల వరకు పోయిన వారికి తేలియకపోవడం..తేలుసుకోక పోవడం నిజంగా దురదృష్టకరం.పనికి మాలిన సినిమాలకి ఒవర్ పబ్లిసిటి ఇచ్ఛే మన మీడియా ఈ విషయాన్ని పటించుకోకపోవడం అన్యాయం.అత్మహాత్యకు పాలుపడిన పిల్లలు క్షేమంగా ఉండాలి.

Sravya V

Strange !అసలు ఇన్ని రోజుల ఈ అమ్మాయిలు వాళ్ళ ఇళ్ళలో ఈ విషయం చెప్పలేదా? చెబితే వాళ్లాలో కొంతమంది అన్నా పట్టించుకోలేదా. ఇంత దారుణమైన పరిస్థితులా ?
శేకర్ గారు ఇల్లాంటి వాటికి ఎవరో వచ్చి ఏదో చేసేదాక చూడాలంటారా ? కొంత మంది parents కలిసి ఏమి చేయలేరా? ఇలాంటి పరిస్తితులలో ఆ కాలేజీ నడుస్తుంది అని బయట తెలిస్తే వాళ్ళ బిజినెస్ నడుస్తుందా ? పరిస్తితి ఇంతవరకు వచ్చే వరకు పట్టికోకుండా ఉండటంలో తల్లిదండ్రుల భాద్యతరాహిత్యం లేదు?

Anonymous

ఒకప్పుడు ఆటవిక సమాజంలా వుండే మన సమాజం చదువు, సంధ్య, బుధ్ధి,జ్ఞానం నేర్చి చాలా సంవత్సరాలకి కాని నాగరికసమాజం అవలేకపోయింది. కాని ఈ నాగరిక సమాజంలో ఇటువంటి కలుపుమొక్కలు పుట్టి మనిషికి ముఖ్యంగా వుండవలసిన బుధ్ధినే నాశనం చేస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఆటవికంగానే శిక్షించాలి, అంటే నడిబజార్లో నిలబెట్టి, రాళ్ళతో కొట్టించాలి. అసలు ఆ పిల్లల్ని తలుచుకుంటేనే గుండె నీరైపోతోంది. ఇన్నాళ్ళకి తల్లితండ్రులు ఆడపిల్లల్ని కూడా చదివించాలి అనే ధోరణికి వచ్చేటప్పటికి ఈ రాక్షసులు ఆ అవకాశాన్ని కూడ పోగొడుతున్నారు. మంచీ, చెడ్డా తెలీనివాడికి అధికారమిస్తే ఇలాగే ఉంటుంది. పాపం ఆ పిల్లలు ఎంత కష్టం రాకపోతే ఈ పని చేస్తారు? వాళ్ళు ఆ బాధనుండి త్వరగా బయటపడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం.....

Unknown

విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిందిపోయి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడటం హేయమైన చర్య. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలి.

చిలమకూరు విజయమోహన్

మన అధికారులు వాళ్ళ అక్కకో, చెల్లికో, కూతురికో లేక భార్యకో ఇలాంటి వేదింపులు జరిగితేగానీ పట్టించుకునే టైపు కాదులెండి.
అలాంటి సంఘటన వారికి జరిగినా వ్యక్తిగతంగా వారే ఇబ్బంది పడతారేమోగానీ మిగిలిన అధికారులు మారతారనే నమ్మకం లేదు.ఏదైనా తనదాకా వస్తేగాని ఎవరికీ అర్థంకాదు.
అప్పుడే అతడిని రక్షించడానికి రాజకీయనాయకులు ప్రవేశించారు చూసారా!

భావన

ఎంత అమానుషం.. మొగ్గల లా ఎదగవలసిన ఆ పసి మనసులు పడుతున్న ఆక్రోశం వింటుంటేనే కళ్ళనీళ్ళు వస్తున్నాయి... వాళ్ళ తల్లి తండ్రులకు ఈ వ్యవహారం పట్ల అంత గమనింపు వుండి వుండదు... బయటకు వెళ్ళె వుత్తరాలు కూడా చదివే వాడని చెపుతున్నారు కదా పిల్లలు.... ఇంక అవి పోస్ట్ చేసేడంటారా! అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటకు వెళ్ళిన రోజే నిజమైన స్వాతంత్రం అంటే అసలు అర్ధరాత్రి ఆడ పిల్లకు బయటకు వెళ్ళే పని ఏమిటి అని వాదించే మనుష్యుల ల లో తల్లి తండ్రులని ప్రత్యేకం గా ఏం అంటాము.. రాజకీయ నాయకులు అప్పుడే వచ్చారు అని చెప్పాలా విజయ మోహన్ గారు, ఆ లోఫర్స్ వుండేదే ఇలాంటి దిగజారుడు దళారి పనులు చెయ్యటానికి..

కెక్యూబ్ వర్మ

మీ ఆవేదన అర్థవంతమైనదే. వ్యవస్థ ఆలోచనా ధోరణి రోజురోజుకూ చెడిపోతూ వుందనడానికి ఇలాంటివే తార్కాణం. సత్వర న్యాయ పరిష్కారం లభించకపోవడమనేది వ్యవస్థ లోపమే. ప్రతిది లంచాల మయం, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వలన న్యాయం జరగడం లేదు. దీని నుండి బయటపడాలంటే మళ్ళీ ఒక ఉద్యమమే రావాలి.

జయ

నిజంగానే ఈ రోజుల్లో ఆడపిల్లలకి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎంతో అభివ్రుద్ధి చెందామంటున్నారు. అన్నిట్లో ఆడపిల్లలు సమానం అంటున్నారు. ప్రతి రంగం లో కూడా వీళ్ళ అభివ్రుద్ధి చూస్తున్నాం. అయితే మాత్రం ఏం లాభం. సంఘంలో రక్షణ లేని అడపిల్లలు ఏ విధంగా అభివ్రుద్ధి సాధించగలరు. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగలిగే శక్తివంతులైన ఆడపిల్లలను బలవంతంగా శక్తిహీనులుగా మార్చేస్తున్నారనిపిస్తుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008