Wednesday 23 September 2009

మామ .. చందమామ ..


ఈరోజు పిల్లలను రాముడు, శూర్పణఖ, భేతాలుడు ఎవరు అని అడిగితే తెల్లమొహం వేస్తారు. అదే స్పైడర్ మాన్, పవర్ రేంజర్స్, బ్యాట్ మాన్ , హ్యారి పోటర్ గురించి అడిగితే ఒక్క లైన్ పొల్లుపోకుండా చెప్పేస్తారు.అవే వింతలు, అద్భుతాలు, మనమూ చిన్నప్పుడే చదివేసాం అంటే నమ్ముతారా?? నమ్మరు.కాని చందమామ పత్రికలో మనం నేర్చుకున్న కథలు, పురాణాలు, జాతక కథలు మర్చిపోగలమా? పుస్తకం రాగానే ఇంట్లో ఎవరు ముందు చేజిక్కించుకుంటారా అని గొడవ జరగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో? చేతికందిన పుస్తకాన్ని గంట,రెండు గంటలలో పూర్తి చేసి నెల రోజులు ఆగాలంటే కోపం, అసహనం. పతికలో వచ్చిన భేతాళ కథలు, జానపద కథల్లోకి మనమూ దూరిపోయి ఆ పాత్రలతో పాటు కథను ఆస్వాదించడం. నచ్చిన సీరియల్లు కత్తిరించి జాగ్రత్తగా అమ్మ బీరువాలో దాచి చివరలో అమ్మను మస్కా కొట్టి బైండింగ్ చేయించుకోవడం ..ఇప్పటికీ మర్చిపోలేని ,మధురమైన అనుభూతి...

ఈ ముచ్చట్లన్ని ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారా?? చందమామతో నా అనుబంధం మీతో పంచుకోవాలని..
నిజంగా ఈరోజు పిల్లలను చూస్తె జాలేస్తుంది. ఆటలు, పాటలు, పుస్తకాలు లేకుండా క్లాసు పుస్తకాలు, ర్యాంకులు, కోచింగులతో అమూల్యమైన బాల్యాన్ని నిస్సారంగా మరమనుష్యుల్లా గడిపేస్తున్నారు.

12 వ్యాఖ్యలు:

గీతాచార్య

నైసో

తారక

gata 4-5 months nunchi chandamama chettaga vuntunnadi, andaru ade rastunnaru kaani vallu marchata ledu, bahusa maa amma ee oct nunchi teppinchatam manestundemo

శ్రీలలిత

చందమామ పుస్తం మాట ఎలాగూ అంతే. కాని నిజంగా కనిపించే చందమామ గురించి మా మనవడు తో నా అనుభవం చెప్పనా.

మా మనవడికి అయిదేళ్ళు. చిన్నప్పుడు చిన్నపిల్లలకి చందమామను చూపించి కథలు చెప్పే అలవాటు మనకుంది కదా. అలాగే ఒకరోజు నేను వాడికి చందమామను చూపించి, అందులో కుందేలు బొమ్మ గురించి, ముసలమ్మ గట్టుమీద కూర్చుని బొంత కుట్టుకోవడం గురించి చెపుదామని మొదలెట్టాను. వాడు నాతో "యు మీన్ ద మూన్?" అంటూ మొదలుపెట్టి, అది కూడా ఒక ప్లేనెట్ అనీ, అది భూమికి ఎంత దూరం లో ఉందో, దాని వైశాల్యమెంతో, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడం మొదలుపెట్టాడు. నాకు కాసేపు ఏమనుకోవాలో అర్ధం కాలేదు. అయిదేళ్ళ పిల్లవాడికి ఉన్న జ్ఞానం చూసి సంతోషించాలో, లేకపోతే అంత చిన్నతనం లోనే అసలు సృజనాత్మకతకే ఫుల్ స్టాప్ పెట్టేసి, భావుకతని ఎక్కడికో నెట్టేస్తున్న ఈ కాలం పిల్లల్ని చూసి బాధపడాలో తెలీలేదు.

Unknown

naa chinnappudu chandamaamato poteegaa baalamithrani koodaa baagaa chadive vaaramandee. aaroju mallee vasthe entha baaguntundo anipisthundi.

జయ

చందమామ ని ఎలా మరచి పోతాం. నాకు ఇప్పటికీ చాలా కథలు గుర్తున్నాయి. మా అక్క తన మనవళ్ళకు బుడుగు కథలతో పాటు చందమామ కథలు కూడా చెప్పుతూనే ఉంటుంది. నాకు కూడా చందమామ కథలు చెప్పింది. ఇప్పటికీ గుర్తే. మా వాడు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, పెళ్ళిచేసుకొని, నాకు మనవడు వొచ్హే కాలానికి నేను వాళ్ళకి ఏం కథలు చెప్పుతానొ ఏమిటో.

మరువం ఉష

Nice post. I guess there is a "SIG, Special Interest Group" in blogsphere about Chandamaama.

రవి

"పుస్తకం చేతిలో పట్టుకుని చదివితే వచ్చే తన్మయత్వం, ఆన్ లైన్ లో చదివితే రాదు." బాగా రాశారు. (ఇంకా రాసి ఉండాలి) అవును. ఆ పుస్తకాల సువాసన ఆఘ్రాణించకుండా, ఆ కథలను నెమ్మదిగా చదువుతూ ఆస్వాదించకుండా, ఏదో పనున్నట్టు ఎలా చదువుతాం?

శ్రీలలిత

జ్యోతీ,

మీ బ్లాగ్ గురువు నుంచే ఈ సందేహం అడుగుదామనుకున్నాను. కాని ఎక్కడ క్లిక్ చెయ్యాలో తెలీక ఇక్కడ అడుగుతున్నాను.

టేప్ రికార్డర్ లోని పాటలను బ్లాగ్ లోకి ఎక్కించడానికి మార్గం ఏదైనా ఉందా?

జ్యోతి

శ్రీలలిత,

టేప్ రికార్డర్ నుండి పాటలు ఎక్కించలేము. అలాగే బ్లాగులో నేరుగా పెట్టలేము కూడా.నెట్ లో ఉన్న కొన్ని సైట్లలో పాటలు,వీడియోలు,చిత్రాలు అప్లోడ్ చేసి, ఆ లింకు మన బ్లాగులో పెడితే పాటలు వస్తాయి. వాటికి పాటలు mp3 రూపంలో ఉండాలి. మీరు మైక్ తో సిస్టమ్ లోనే పాటలు రికార్డు చేసి ఇలా అప్లోడ్ చేసి , బ్లాగులో పెట్టొచ్చు. దీనికి సంబంధించి సమగ్రమైన టపా బ్లాగ్ గురువులో త్వరలో పెడతాను.

శ్రీలలిత

ధన్యవాదములు

తారక

line in tho tapes nunchi direct ga computer looki record chesukovachu.

యమ్వీ అప్పారావు (సురేఖ)

మామ.. చందమామ గురించి మీరు చెప్పిన విషయాలు చదివి చాలా సంతోషపడ్డాను. నా దగ్గర 1953 నుంచి చందమామలు ఏ ఏటీ కాయేడు బైండింగ్
చేసి వున్నాయి. ఖాళీ చిక్కితే ఆ కధలు చదువుతూ, అందమైన బొమ్మలు చూస్తుంటే కాలమే తెలియదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008