మరువం ఉషపై చేయి చేసుకున్నాను......
చల్లని,ఆహ్లాదకరమైన వాతావరణం. సాయంకాల సమయంలో తాజా ఫిల్టర్ కాఫీ పట్టుకుని కూర్చుంటే ఏం రాద్దామా? అని ఆలోచించాను. ఈ మధ్య ఒక వ్యక్తి పై నాకు భలే ఈర్ష్యగా ఉంది. నిజమండి. చాలా చాలా ఈర్ష్య అసూయగా ఉంది. అదేమో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక తప్పదని చేయి చేసుకోక తప్పలేదు. :))
కంగారు పడకండి.. నాకు ఈర్ష్యగా ఉంది ఉష మీద. అదే మరువం బ్లాగర్. ప్రతీ అనుభూతి, ఆలోచన ఇట్టే కవితలా రాసెస్తుంది. చిన్ని చిన్ని పదాలలో, వాక్యాలలో ఎంత భావాన్ని నిక్షిప్తం చేస్తుంది . రోజూ పప్పు,కూరలు, వేపుళ్ళు చేసినంత సులువుగా కవితలు రాసెస్తుంది అని కుళ్ళుకునేదాన్ని. కాని మరువపు తావి దానిని కట్టిన దారానికి అబ్బినట్టు ఉష స్నేహంతో కవితలను చదివి, అర్ధం చేసుకుని ఆస్వాదించే అవకాశం కలిగింది..
పుస్తకంలో నేను ఉషాపై చేయి చేసుకున్న విధంబిట్టిది..
3 వ్యాఖ్యలు:
చాలా బాగుందండీ పరిచయం...ఎదుటి మనిషిలోని ప్రతిభను నిస్వార్ధంగా మెచ్చుకునే మీ మంచి మనసుకు మరోసారి అభినందనలు.
నిజమా!!! నేను నమ్మనులెండి:):)
hammoe! henta pani cheasaaruu! neanu eppudu maruvapu vaasanalani maruvaka aswaadistaanu (miiru cheyyi cheasukunnaTlugaanea)
Post a Comment