Tuesday, 3 November 2009

బ్లాగ్ వనంలో వనభోజనాలు

కార్తీక మాసం కదా పూజలు అవి ఎలాగు చేసుకుంటాము. వనభోజనాలు మంచిది అంటారు .కాని అలా వండుకుని అందరు కలిసి , అందరిని పిలిచి సరదాగా గడిపే సమయం ఎంతమందికి ఉంటుంది. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు. ఎవరికీ ఎవరో,ఎవరు ఎలా ఉంటారో, వివరాలు తెలీకున్నా బ్లాగుల ద్వారా పరిచయాలు పెరిగాయి. స్నేహాలు కలిగాయి. అలాగే రొటీన్ టపాలు రాసి బోర్ కొట్టింది.. వనభోజనాలు పెట్టుకుందామా అనగానే వాయెస్ అని చెంగు బిగించి వంట చేసేసి ఫుతోలు తీసేసి తమదైన శైలిలో టపాయించేసారు అతివలందరూ. మగవాళ్ళు కూడా మేము గరిట తిప్పుతాం అని అంటారేమో అని ఆశ పడ్డా అది అడియాసే ఐంది. (బ్యాక్ గ్రౌండ్ లో నీయాస అడియాస అని పాడుకోగలరు) సరేలెండి.. నిన్నటి రుచులన్నీ ఒకేచోట చేర్చేస్తున్నా.. వంటలు, ఛలోక్తులు, నవ్వులు, పాటలతో పాటు సరదా సరదాగా గడిచిపోయింది కదా.

జ్యోతి

వరూధిని

జ్ఞాన ప్రసూన

పి.ఎస్.ఎం.లక్ష్మి

మాల

సూర్యలక్ష్మి

జయ

సునీత

ఇందిరా

భావన

నీహారిక

తృష్ణ

నేస్తం

సుభద్ర

ఉష

కృష్ణుడు

స్వాతి

రాధిక

శ్రీలలిత

కార్తీకమాసం ఇంకా అయిపోలేదు కాబట్టి ఇంకా ఎవరైనా రాయొచ్చు. అలా రాస్తే ఇక్కడో ఉత్తరం పెట్టేయండి. ఈ లిస్టులో కలిపేస్తా. అందరికీ పనికొస్తాయి కదా.

7 వ్యాఖ్యలు:

మాలా కుమార్

ఇలా అన్ని ఓచోట చేర్చటము బాగుందండి . ఏవైనా మిస్ అయ్యానా అని చూస్తున్నాను .
ఒకటి రెండు అయ్యినట్లే వున్నాను . థాంక్ యు .

తృష్ణ

మర్చిపోయినవి చూసేలాగ ఇలా మీరు ఒక చోట పెట్టడం బాగుందండి.

durgeswara

ఇన్నివంటకాలు చూసాక తినటమే సరిపోతుంది కొత్తగా ఏమి చేస్తాంలెండి మగవాల్లము

వేణూశ్రీకాంత్

హన్నా!! భోజనాలంటే ఎగిరి గంతేసి ముందు వరుసలో కూర్చునే నాలాంటి వాడు కాస్త బిజీగా ఉన్న టైం చూసుకుని, నాకు తెలీకుండా ఇంత పని చేస్తారా.. హబ్బో హబ్బో ఎన్ని రకాలో!! రుచిచూడాల్సిన వంటలు బోలెడున్నట్లున్నాయి అన్నీ తిరగేయడం ఎప్పటికయ్యేనో...

జ్యోతిగారు అన్ని టపాలు ఇలా ఒకే చోట చేర్చినందుకు ధన్యవాదాలు. నాలాగా మిస్ అయిన వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

శ్రీలలిత

జ్యోతీ, మీరు వంటలన్నీ ఇలా ఇకచోట పెట్టడం వల్ల నెను అప్పుడు మిస్ అయినా ఇప్పుడు అందరివీ చదివేసి బాగోగులన్నీ చెప్పేసా. ఇది సులువుగా బాగుంది.

కార్తీక్

ఈ టపావల్ల నేను కొన్ని కొత్త బ్లాగులు దర్సించగలిగాను జ్యోతి గారు.

www.tholiadugu.blogspot.com

నీహారిక

jyothi gaaru,
బాగుంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008