Tuesday 24 November 2009

నీవేనా నను తలచినది...

నీవేనా నను తలచినది.. ఇది చదవగానే మాయాబజార్ లోకి వెళ్ళిపోయారా. నాకు తెలుసు.నేను ఆ పాట గురించి రాయబోతున్నానని అనుకుంటున్నారు కదా. అదేం కాదు. మాయాబజార్ లో పాటలన్నీ ఆణిముత్యాలే.

ఇపుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే.. ఓ మూడు నెలల క్రింద ఇదే శీర్షికతో ఒక కథ తానావారి సావనీరులో ప్రచురించబడింది. ఇప్పటికి అర్ధమైపోయిందనుకుంటా నేనేం చెప్పాలనుకుంటున్నానో. ఐతే ఏంటి? కొత్తపాళి గారు ఆయన బ్లాగులో ఈ కథ గురించి చెప్పారు. చదివేసాము కూడా అంటారా? నిజమే.. కాని ఇపుడు నేను చెప్పాలనుకున్నది ఆ కథ ఇంగ్లీషులోకి అనువదించబడింది అని. అది ఇక్కడ సి.పి.బ్రౌన్ సైట్ లో చూడొచ్చు. తెలుగు కథ కొత్తపాళి గారి బ్లాగులో చదవొచ్చు. విడి భాగాలుగా చదవడం ఇష్టం లేకుంటే ఇదిగో ఇలా చదవండి.

కొత్తపాళి గారు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈ వారం కబుర్లు కూడా చెప్పలేదు. అందుకే వారి అనుమతి తీసుకుని నేనే చొరవ చేయాల్సి వచ్చింది.

1 వ్యాఖ్యలు:

శ్రీలలిత

ఈ మీ పోస్ట్ చూసి కొత్తపాళీగారి బ్లాగ్ కి వెళ్ళి కథంతా చదివేసాను. బాగుంది. ఎక్కడ ఎంత వర్ణించాలో అంతా వర్ణించారు. పాఠకుల ఆలోచనకు కొంత వదిలేసారు. కథ ఎప్పుడూ అలాగే ఉండాలి. పూర్తిగా స్పూన్ ఫీడింగ్ బాగుండదు. అలా ఆలోచించడం వల్ల ముగింపు చాలా బాగుందని అనిపించింది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008