Thursday, 26 November 2009

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు





ఈ జీవన ప్రయాణంలో ఎంతోమందిని కలుస్తుంటాము. విడిపోతుంటాము. మన పుట్టుకతో వచ్చిన అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రమే కాక ఎప్పుడో, ఎక్కడో కలిసిన కొందరు వ్యక్తులతో అలా సంబంధం ఏర్పడుతుంది. ఇందులో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. ప్రేమానురాగాలు తప్ప. అలాగే అంతర్జాలానికి వచ్చిన కొద్దికాలంలో ఏర్పడిన కొన్ని అనుబంధాల గురించి తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇక్కడ చాలామంది నన్ను అక్క అని ప్రేమగా, గౌరవంగా భావిస్తారు. కాని నన్ను తన మానస పుత్రికగా చేసుకున్నారు జ్ఞానప్రసూనగారు. సాధారణంగా ఎవరినైనా అక్క, అన్న, బాబాయి, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ అని సులువుగా అనేస్తుంటాము. కాని అమ్మ అని అనడం చాలా తక్కువ కదా. కాని జ్ఞానప్రసూనగారిని అమ్మ అనే పిలుస్తాను. ఆవిడ కూడ వాళ్ల చుట్టాలకు కూడా నా కూతురు అని పరిచయం చేసారు. ఇదెక్కడి అనుబంధం ? ఇలా కలిసింది అని అనుకుంటూ ఉంటాను. మరో విషయం . మాది బూరెల బంధం కూడానండోయ్. అదిగో అలా అసూయపడకండి. ఆవిడ ఎప్పుడు బూరెలు చేసినా ఫోన్ చేసి తీసికెళ్లరా! అంటారు. మొన్నైతే ఇంటికి పొట్లం కట్టి తీసుకొచ్చారు నాకోసం.. ఇంతకీ ఆవిడెవరో గుర్తుపట్టారా??
మనందరికీ తెలిసిన సురుచి బ్లాగర్ జ్ఞాన ప్రసూన గారే..

అమ్మకాని అమ్మ ఈ ఇంకొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జ్యోతి..

13 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.

గీతాచార్య

My wishes too.

Unknown

అమ్మకుపుట్టిన రోజు శుభాకాంక్షలు

రవి

నా తరపు నుంచీ కూడాను.

జయ

నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా అమ్మకు అందజేయండి జ్యోతి గారు.

పరిమళం

అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి

GKK

అమ్మగారికి నమస్సుమాంజలి. జన్మదిన శుభాభివందనాలు

శ్రీలలిత

అమ్మకు,
జన్మదిన శుభకాంక్షలు అందచేయండి..

భావన

అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకూ బూరెలు ఈ సారి.. :-)

Unknown

I WISH YOU A VERY HAPPY B'DAY MOM.

మాలా కుమార్

అమ్మకు జన్మదినశుభాకాంక్షలు .
ఈ సారి మీకేకాని , మరోసారి బూరెలు మాకు కూడా .

సంతోష్

నా తరపు నుంచీ కూడా మీ అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు.

వేణూశ్రీకాంత్

నా తరపు నుంచీ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంత చక్కని అనుభందాన్ని పంచుకుంటుంన్నందుకు అభినందనలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008