Monday, 11 January 2010

సిరుల పొంగలి

అందరికీ సిరుల పండగ సంక్రాంతి శుభాకాంక్షలు..

అప్పుడేనా అంటారా.. పర్లేదు పండగ పనులు మొదలుపెట్టారు కదా. ఇదిగోండి నా వంతుగా రోజు సాక్షిలో ప్రచురించబడిన కొన్ని పొంగలి వంటకాలు మీకోసం..



11 వ్యాఖ్యలు:

Khushi comics

Akka... congrats

Maruti

మీకు,మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

సుజ్జి

సంక్రాంతి శుభాకాంక్షలు.

మధురవాణి

ఆహా.. ఈ పండక్కి సిరుల పొంగలి పొంగించారన్న మాట.! మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)

జయ

బాగున్నాయండి మీ రకరకాల పొంగళ్ళు. ఈ సంక్రంతికి ఇందులో తప్పకుండా ఒకటి చేస్తాను. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Makineedi Surya Bhaskar

HAPPY AND PROSPEROUS
PONGAL

రవి

ఆహా, భలే, భలే! జఠరాగ్నిని మరింత రగిల్చారుగా!

శ్రీలలిత

జ్యోతీ,
జిహ్వకో రుచన్నట్టు ఎన్ని రకాల పొంగళ్ళు చెప్పారో ఎంచక్క.. బలే బాగున్నాయి. సాక్షి లో ప్రచురించబడినందుకు అభినందనలు..

చింతా రామ కృష్ణా రావు.

అమ్మా! మిమ్మల్ని కాదు మమ్మల్ని మే మభినందించుకొంటున్నాము.
ఎందుకంటారా? చక్కని పొంగలి పంచే అక్క మాకూ, కాదూ మాకే లభించినందుకు సుమా!
ఈ సందర్భంలో మీకు ఉత్పల మాలతో సత్కారం చేయ దలిస్తే ఆ శారదాంబ కూడా చాలా సంతోషించి వట్టి ఉత్పలమాలైతే ఏంబాగుంటుంది? మధ్యలో తెల్లమయే తేటగీతితో చక్కగా పాడుతూ ఆ ఉత్పల మాలతో అలంకరించమని ఆజ్ఞాపించి, నాకు చేతకాదనుకుందో ఏమో తానే ఉత్పల మాలలోనే తేతగీతిగా అంతర్లీనమై రూపుదాల్చిందమ్మా!
చూడండి. ఉత్పల మాలలోఁ గల తేటగీతిని, విడతీసి మీముందుంచాను. మిమ్మల్ని మెప్పించేటంత అద్భుతంగా ఉంటే అది శారదాంబ కటాక్ష మహిమేనండోయ్. ఒకవేళ మీకు నచ్చు బాటుగా లేకపోతే అది నా అసమర్థతగా భావించి మన్నించ మనవి.
ఉ:-
పొంగితినమ్మ! మీ సిరుల పొంగలిఁ గాంచితి చిత్రమందునన్.
పొంగలు హాలిడే.కనఁగఁ
భోగియునౌటను కాంక్షతీరగా
నింగిత మేది, నే తినఁగఁ
నిచ్ఛను పొందితి తీయనైన యా
బంగరు పొంగలుల్,సహజ
పండుగ యౌనిది సాక్షి సాక్షిగా.
తే.గీ:-
సిరుల పొంగలిఁ గాంచితి చిత్రమందు
కనఁగఁ భోగియునౌటను కాంక్షతీర
తినఁగఁ నిచ్ఛను పొందితి. తీయనైన
సహజ పండుగ యౌనిది సాక్షి సాక్షి
సుమనర్నమస్సులతో,
చింతా రామ కృష్ణా రావు.

జ్యోతి

anil, maruti, sujji, vaani,surya bhasker, jaya ధాంక్స్.

రవి.. ఇంకెందుకు ఆలస్యం దీని ప్రింటవుట్ తీసుకుని గరిట పట్టుకుని మొదలెట్టు.

శ్రీలలితగారు,నేను ఎందుకడిగానో ఇప్పుడర్ధమైందనుకుంటా..:)

రామకృష్ణగారు,

పొంగలిలో కొత్తబియ్యం పెసరపప్పు కలిపి చేసినట్టు, ఉత్పలమాలతో కలసిన తేటగీతిని అత్యద్భుతంగా అందించారు. ధన్యవాదాలు తప్ప ఏమనగలరు. నిజంగా ఇది నాకు లభించిన అమూల్యమైన సత్కారం. కాని నేనందుకు తగుదునా??

Andy Says

Thats a great achievement.. Keep it up :)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008