సంబరాల సంక్రాంతి శుభాకాంక్షలు..
బ్లాగ్ మిత్రులందరికి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు...
సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది, తప్పనిసరిగా ఉంఢవలసింది ముగ్గు.
ముగ్గు ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడుగా గొబ్బెమ్మలు,చుట్టూ అలంకరించిన బంతిపూలు,పసుపు కుంకుమ,రేగుపళ్లు,శనక్కాయలు,చెరకు,నవధాన్యాలు..
చివరిగా పండగ పిండివంటలు. అన్నీ ఇవాళే చేయాల్సిరావడంతో టపా కట్టడం ఇదిగో ఇప్పుడైంది. నువ్వుల లడ్డూలు, మసాలాపూరీలు, కారప్పూస, రిబ్బన్ పకోడీ, అరిసెలు. గత సంక్రాంతికి అరిసెలు చేయలేదని ఎంత గోల చేసారు. అందుకే మర్చిపోకుండా ముందు అరిసెలు చేసాను. ఇవన్నీ ఇప్పుడు నేను తినాలి లేదా మా అబ్బాయి అఫీసుకు పంపాలి.
11 వ్యాఖ్యలు:
ఆహా సంక్రాంతి సందడంతా మీ ఇంటకొలువు తీరినట్లుగా ఉందండి. ఈ ఏడు అరిశలు బాగా మిస్ అవుతున్నాను నేను, ఈ సారి ఆంధ్రావచ్చినపుడో పట్టుపట్టాలి. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
తల్బినా --- తరీద్
తెలుగునాట పేపర్లలో టీవీలలో ఎక్కడచూచినా సంక్రాంతి
వంటకాలు ఈ చలికాలంలో ఎందుకు తినాలో అవి ఏం మేలు చేస్తాయో పాకశాస్త్ర ప్రవీణులు తెగ చెబుతున్నారు.అలాగే ఆరబ్బులవంటకాలు ముస్లిముల వంటకాలుమిగతా ప్రజల్లో మంచి పేరుగాంచాయి.కానీ మన ప్రవక్త ఏవంటకాలను ఇష్టపడే వారో వాటిప్రత్యేకత ఏమిటోనని వెదికితేతల్బినా,తరీద్ అనే రెండువంటకాలు నా దృష్టిలోపడ్డాయి.సాయిబులవంటకాలు అనగానేబిర్యాని,పలావు,పాయా,బోటీ,హలీమ...లాంటివి ప్రసిద్ధి చెందాయిగానీ ఈ తల్బినా,తరీద్ అనేవంటకాల గురించి ఏ నవాబు గారూనాకు ఎప్పుడూ చెప్పలేదు.ఉర్దూ
సాయిబులకే వీటి గురించితెలియకపోతే ఇక తెలుగు
ముస్లిములకేంతెలుస్తుంది?
అయినా ఈ వంటకాలను బాగా తినండని
ప్రవక్త గారే చెప్పారుకాబట్టి ఇక మీదట తల్బినా,తరీద్
లు తయారు చేయటం అరబ్బులదగ్గరైనా నేర్చుకోండి. బాగా
తిని ఆరోగ్యాన్నికాపాడుకోండి.
తల్బినా
రోగి విచారాన్ని పోగొట్టే ఒకవంటకం. అయిషా (ప్రవక్త గారి
భార్య ) బంధువుల్లో ఎవరైనాచనిపోతే స్త్రీలు చూడటానికి
వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారువెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి
బంధువులు,స్నేహితులు మాత్రమేఉండిపోయేవారు.అప్పుడామె ఒకకుండడు తల్బినా
వండించేవారు.గోధుమలు మాంసంతోతయారుచేసిన తరీద్ ను తల్బినాపై పోసేవారు."ఇక తినండి.తల్బినారోగి విచారాన్ని పోగొడుతుందిమనసునుప్రశాంతపరుస్తుందని
దైవప్రవక్త చెప్పేవారని అయిషాచెప్పారు.(బుఖారీ 7:328) శవం దగ్గరరోదిస్తూ శోషిల్లిన వారు,రోగులూ తల్బినా తినాలని అయిషాచెప్పేవారు. తల్బినా రోగిహృదయానికి విశ్రాంతి నిచ్చిదాన్ని చైతన్యవంతంగాచేస్తుందని ,దుఖాన్ని
విచారాన్ని పోగొడుతుందనీ దైవప్రవక్త చెప్పేవారని అయిషా
చెప్పారు.(బుఖారీ 7:593) "తల్బినాతినండి" అని అయిషా
ప్రోత్సహించేవారు."రోగికిఇష్టముండదు గానీ భలేమేలుచేస్తుంది" అనేవారుఅయిషా.(బుఖారీ 7:594)
తరీద్
ముహమ్మద్ గారికి అత్యంతప్రితిపాత్రమైనవంటకం.మాంసం,గోధుమలతో,
రొట్టెగా చేశాక చారులోనానవేయబడుతుంది.(అబూ దావూద్
:1709,ముస్లిమ్:1093)దాని ఆవిరిపూర్తిగా పోయేదాకా
మూతపెట్టాలని అప్పుడే అదిమరింత ఆశీర్వాదాన్ని
పుట్టిస్తుందని ప్రవక్తచెప్పారు(తిర్మిజీ:1130)
స్త్రీలలో అయిషా ఎంతటిపరిపూర్ణమైనదో అలాగే భోజన
పదార్దాలలోతరీద్ అంతటిఆధిక్యత గలది.(బుఖారీ4:623,5:113,114,7:330,339)
అందులోని సొరకాయ ముక్కల్నిఆయన ఎంతో ఇష్టంగాఏరుకొనితినేవారు.(బుఖారీ
7:331)పళ్ళెంలోని తరీద్ నుమధ్యలోనుంచి,పైనుంచి కాకుండాప్రక్క అంచుల్లోనుంచి తినండనిప్రవక్త
చెప్పేవారు(తిర్మిజీ:1116)
రకరకాలపండ్లు పళ్ళెంలో ఉంటే ఇష్టమైనవాటిని ఏరుకొని తినండనిచెప్పేవారు(తిర్మిజీ:1125).
నూర్ బాషా రహంతుల్లా
మీకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ ముగ్గులు మా అమ్మాయిలకు చాలా నచ్చాయి. అరిసెలు చాలా రుచిగా ఉన్నాయి. అదేంటండి, మీరు గారెలు చెయ్యలేదు? :-)
సురేష్ గారు,
లాస్ట్ ఇయర్ గారెలు చేస్తే అరిసెలు చేయలేదని గొడవ చేసారు. అలా అని అరిసెలు చేస్తే మీరేమో గారెలంటారు? ఆరోగ్యరిత్యా వేపుళ్లు, స్వీట్లు తగ్గించాలని నేననుకుంటుంటే అందరు కలిసి నా కొంప ముంచేట్టున్నారే!!:)
సంక్రాంతి శుభాకాంక్షలు జ్యోతి గారు.
బ్లాగులోకం లో పండుగ వాతావరణం కనపడుతుంది ఇలాంటి పోస్టులవల్ల.
ముగ్గులు, పిండివంటల ఫొటోలు చాలా బాగున్నాయి. మీ కెమేరా కి ఫ్లాష్ లేకుండా ముగ్గులని తీస్తే ఇంకా బాగుండేవి.
సంక్రాంతి అంటే అరిసెలు, కారప్పూస తప్పకుండా ఉండాల్సిందే. ఈ టైం లో ఎవరింటికి వెళ్ళిన ప్లేత్ లో పిండి వంటలు సిద్దం గా ఉంటాయి.
Thank you for sharing with us.
వేణుగారు,
ఎన్నోసార్లు ఫ్లాష్ లేకుండా ప్రయత్నించాను కాని వెలుతురు సరిపోలేదు. సూరీడేమో బద్ధకంగా ఉన్నాడు వాన పడుతుండింది కూడా. అందుకే అలా కానిచ్చేసానన్నమాట.
మీకు కుడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకూ మీ కుటుంబానికీ సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు
ma office ki pampina parvaledu...ee year ma intlo cheyyaledu nanannamma chanipoyaru ani...evaru pedatara ani waiting...
Post a Comment