అంబరాన ఆదిత్యుని కేళీవిలాసం
ప్రచండ రూపంతో నిత్యసంచారియైన సూరీడు ఇవాళ చల్లబడ్డాడు. ఆ నీలాకాశంలో కదులుతున్నది సూరీడా సెందురూడా అన్న అనుమానం అందరికీ కలిగింది. గగనంలో చుట్టుముట్టిన కరిమబ్బుల మధ్య తరుగుతూ అలా కదలిపోయాడు. ఒకానొక సమయంలో మబ్బులను చెల్లా చెదురు చేస్తూ తన ప్రకాశాన్ని పెంచుకుంటూ వెలిగిపోయాడా రవి. నిత్యం నిప్పులు చిమ్ముకుంటూ చెలరేగే భానుడు గ్రహణ వేళ చల్లబడి వెన్న ముద్దలా మారాడు. ఒక్కసారిగా మిట్ట మద్యాహ్నం సంధ్యా సమయాన్ని తలపించింది. పిట్టలన్నీ కిలకిలారావాలు చేసాయి, ఇంటికెళ్ళే సమయమైంది అనుకున్నాయేమో. ఎల్లెడలా చిరు చలి వ్యాపించి ఒళ్ళు జలదరింప చేసింది. నేను వేసవి మంటలే కాదు శీతల పవనాలు కూడా అందించగలను సుమా అన్నట్టుగా నింగిన భాసిల్లాడు భాస్కరుడు....
ఈ రోజు మద్యాహ్నం అనుకోకుండా నింగిలోని అద్భుత దృశ్యకావ్యాన్ని పది నిమిషాలు బందించే అవకాశం దొరికింది. మబ్బుల మధ్య చకచకా కదిలిపోతున్న సూర్యుడిని చూస్తుంటే షర్ట్ వేసుకోకుండా , తల్లికి దొరక్కుండా ఇల్లంతా పరుగులు పెట్టె చిన్నపిల్లాడిలా అనిపించింది నాకైతే..
8 వ్యాఖ్యలు:
భలే చేశారే... నేను అసలు సూర్యుణ్ణీ చూడనే లేదు. ఉదయం 10.30 కల్లా భోజనాలు చేసేసి కాస్సేపు కంప్యూటర్ తో , తర్వాత నిద్రతో కాలం గడిపి, ఇప్పుడు డ్యూటీకి బయలుదేరుతున్నా.. మొత్తానికి సూర్య గ్రహణం చూపించారు మాక్కూడా.. ధన్యవాదాలు.
Wow.. mabbu chaatu Suryudu, Chadrudu !
Beautiful pictures..!
సూర్య గ్రహణం గురించిన మీ వ్యాఖ్యానం మరింత అందంగా ఉంది జ్యోతి గారూ..!
super .
జ్యోతీ,
ఫొటోలు, మీ వ్యాఖ్యానం నీవా--నేనా అన్నంత బాగున్నాయి. మళ్ళీ వేయి సంవత్సరాలకు కాని రాని గ్రహణాన్ని ఫొటోలో బాగా బంధించారు
జ్యోతి,
ఫోటోలు, వ్యాఖ్యానం రెండూ చాలా బావున్నాయి.
అదిసరే, ఒక పక్క సూర్యుడు గ్రహణం పట్టి విలవిల్లాడుతుంటే కేళీ విలాసమనే పోలిక ఏమిటి?
ధన్యవాదాలు జ్యోతి గారు సూర్య గ్రహణాన్ని ఇంత బాగా చూపించినందుకు.
మీ వ్యాఖ్యానం కూడా చాల అందంగా ఉంది
Post a Comment