Saturday, 23 January 2010

జన్మనిచ్చే మాకు జీవించే హక్కు లేదా?




సృష్టికి మూలం ఆదిశక్తి అంటారు. కాని ఆ ఆడపిల్లకే జన్మించే , జీవించే హక్కు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి.

ఆడపిల్ల పుట్టగానే అమ్మో! ఆడపిల్లా అని మూతి విరుస్తున్న పెద్దమనుష్యులు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకుని మరీ ఊపిరి పోసుకోకముందే పిండాన్ని నాశనం చెస్తున్నారు. అలా వీలుకాకపోతే పుట్టిన తర్వాత చెత్తకుండీలోనో , మురికి కాలువలోనో పనికిరాని వస్తువులా పడేస్తున్నారు. రక్తపు మరకలు ఆరని, కళ్లు కూడ తెరవని ఆ పసికందు ఊరకుక్కలకు, పందులకు ఆహారమవుతుంది. ఈ భ్రూణ హత్యలలో ఎక్కువగా ఆడశిశువులే ఉన్నారు. ప్రాణం ఉన్న పసికందును నోటకరుచుకుని ఎత్తుకుపోతున్న కుక్కను తరిమికొట్టిన జనాలు కన్నతల్లిని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. అసలు అది కన్నతల్లేనా? మదమెక్కి కడుపు తెచ్చుకుని కని ఇలా పారేసింది? ఈ పసిగుడ్డును అలా పారేయడానికి దానికి మనసెలా వచ్చింది? అని అంటారు కాని ఒక్కరైనా ఆ తల్లి ఏ పరిస్థితిలో తన పేగు పంచుకుని పుట్టిన బిడ్డను బ్రతికుండగానే ఎందుకు వదిలించుకుంది. అల్లారు ముద్దుగా తన పొత్తిళ్లలో పెంచాల్సిన చిట్టితల్లిని నిర్దాక్షిణ్యంగా చెత్తకుండీ దగ్గర వదిలేసింది. అలా వదిలేసేటప్పుడు ఆ తల్లి ఒక్క క్షణమైనా తల్లడిల్లకుందా? ఇది ఎవరు ఆలోచిస్తారు?



ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు కాని ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు ఎక్కడ? అతని గురించి ఎవరూ ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఒకవేళ జరిగింది తప్పైతే దానిలో ఇద్దరికీ సమానమైన పాత్ర ఉంది. కాని ఫలితం, పర్యవసానం ఆడదే భరించాలి. పెళ్లి అయ్యాక బిడ్డని కంటే గొడవ ఉండదు. కాని పెళ్లి కాకముందు జరిగిన తప్పుకు బాధ్యత ఆడదానిదే. మగవాడు అమ్మాయిని వాడుకుని, తన కోరికను తీర్చుకుని హాయిగా వెళ్లిపోతాడు. దానిని తప్పు అని నిలదీసేవాళ్లు కూడా ఉండరు. పైగా మగవాడు .. ఏది చేసిన చెల్లుతుంది. ఆడదే జాగ్రత్తగా ఉండాలి అని నీతులు చెప్తుంది ఈ గౌరవనీయ సమాజం. ప్రేమలో ఓడిపోయి గర్భవతి ఐన అమ్మాయిని ఈ సమాజం ఆదరిస్తుందా? లేదు. దానికి కారణమైన మగవాడు మాత్రం దర్జాగా తిరుగుతుంటాడు. మరో పెళ్లి కూడా చేసుకుంటాడు. నష్టపోయేది అమ్మాయే కదా. ఇటువంటి విపత్కర పరిస్థితిలో తన బ్రతుకే అగమ్యగోచరంగా ఉంటే తన కడుపున పుట్టిన నేరానికి ఆ పసికందును అందునా ఆడపిల్లను ఎలా పెంచగలను అని వదిలేస్తుంది గుండె భారం చేసుకుని. అలా కాకుండా ఆ బిడ్డను పట్టుకుని ఒంటరిగా కూడా బ్రతకగలదా?. బ్రతకనివ్వదు ఈ సమాజం. చెడిపోయిన ఆడది అని ముద్ర వేస్తారు. ఆమెతో తిరిగిన మగవాడు మాత్రం చెడిపోలేదు. ఎంతమందితో తిరిగినా అతను పుణ్యపురుషుడే. అందుకే తరచూ మనకు ఎంతో మంది ఆడపిల్లలు ప్రాణమున్నా, లేకున్నా మురికి కాలువలో, చెత్తకుండీల్లో చీమలకు ఆహారంగా, కుక్కలకు విందుభోజనంగా కనిపిస్తారు. ఆ చిట్టితల్లికి అదృష్టముంటే ప్రాణం పోకముందే ఎవరికంటైనా పడుతుంది. ఇలా ఆడశిశువని తెలియగానే తల్లేకాదు, భర్తా, పెద్దవాళ్లు కూడా చెత్తకాగితంలా విసిరేస్తున్నారు.

ఆడపిల్లలను పుట్టిన తర్వాత వదిలించుకోవడమే కాదు , పుట్టకముండే ఆడపిల్లని తెలుసుకుని పుట్టకుండా చంపేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లంటే అదో పెద్ద దింపుకోలేనిభారం. నెత్తిమీద బండలాంటిది. చదివించాలి, కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాత వరకట్న సమస్యలు. అదే మగవాడైతే గాలికి పెరుగుతాడు. ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. జీవిత చరమాంకంలో తల్లితండ్రులను , ఆస్థిని చూసుకునేది వాడే. అందుకే మగపిల్లాడే కావాలి. కాని తనను కన్నది ఆడదే , ఆ ఆడపిల్ల జన్మకు కారణం తానే అని తెలిసినా తెలియనట్టు ఆడపిల్లను వద్దు అంటాడు సదరు మొగుడు. ఇంతకుముందు లింగ నిర్ధారణ పరీక్షలు యదేచ్చగా జరిగేవి. జరుగుతున్నాయి కూడా.. ఆడపిల్ల అని తెలియగానే గర్భస్రావం చేయిస్తారు. అలా తన బిడ్డను చంపుకోవాల్సి వస్తున్నందుకు ఆ తల్లి ఎంత ఆక్రోశించిందో ఎవరికీ పట్టదు. జన్మనిచ్చే తల్లికి కూడా తను ఎప్పుడు, ఎవరికి జన్మనివ్వాలో కూడా నిర్ణయించుకునే అధికారం లేదు. నాకు ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం, చంపడానికి వీళ్లేదు అని అని భర్తను నిలదీసే ధైర్యం ఆ ఇల్లాలికి ఎప్పుడు వస్తుందో?

పుట్టి పెరిగి మరో ఇంటికి ఇల్లాలై వెళ్లినా కూడా ఆడపిల్లకు జీవితం క్షణక్షణం గండంగానే ఉంటుంది. ముఖ్యంగా వరకట్న బాధితులకు. ఈ సమస్య ఈ కాలంలో పట్టణవాసుల్లో, చదువుకున్నవారిలో లేకపోవచ్చు కాని పల్లెల్లో, చాలా కుటుంబాలలో జరుగుతుంది. ఇప్పటికీ పోరాడి అలసిన ఎందరో అమ్మాయిలు ఈ కట్నదాహానికి బలి అవుతున్నారు.

అందుకే సృష్టిలో జన్మనివ్వడం ఆడదానికే ఉన్న అద్భుతమైన వరం. కాని ఆ ఆడపిల్ల జీవితమే నిత్యాగ్నిహోత్రంలా మారుతుంది. పుట్టినప్పటి నుండి మట్టిలో కలిసిపోయేవరకు ప్రతి క్షణం గండమే. అన్నింటికి అణగిమణగి ఉండాలి. తప్పు చేసినా , చేయకున్నా బాధ్యత వహించాలి. అన్నింటికీ జవాబుదారీగా ఉండాలి. వీటన్నింటికి చావు మాత్రమే పరిష్కారం అవుతుంది.

పుట్టకముందు మమ్మల్ని చంపొద్దు. పుట్టాక చెత్తకుండీ పాలు చెయొద్దు. కట్నం కోసం మమ్మల్ని సమిధలా మార్చొద్దు. మమ్మల్ని బ్రతకనివ్వండి.

చిత్రాలు ఒక దినపత్రికలో ప్రచురించబడినవి.

ఇటీవల ఎవరో చెత్తకుండీ దగ్గర ఆడపిల్లను పడేసారంట అని విని కోపంతో రగిలిపోయా.ఇంత దారుణమా? అని.. అది మనసులో దాచుకోలేక ఇలా.......

60 వ్యాఖ్యలు:

గీతాచార్య

This is a disgusting act. One must condemn. will be back to share my experiences... in this regard

Sujata M

కొంచెం ఆలోచన, విచక్షణ, సామాజిక బాధ్యత, మరీ ముఖ్యంగా కనీస మానవత్వం ఉంటే ఇలాంటి అన్యాయాలు జరగవు. ఈ టపా మీ బ్లాగులో అన్ని టపాల లో కెల్లా అత్యుత్తమమైనది. మీ ఆవేశం, వ్యధ ని నేనూ షేర్ చేసుకుంటున్నాను. Remarkable post.

తమిళన్

మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి సానుభూతి ప్రోది చెయ్యడం కోసం టపాలు రాయకూడదు. వాళ్ళలో చైతన్యం కలిగించేలా వాళ్ళ తెలివి పెరిగేలా, ఒక వేళ అతి తెలివి వుంటే అది కరెక్ట్ అయ్యేలాగ టపాలు రాయండి. అప్పుడు మీరనుకున్న రోజులు వస్తాయి. ఆడవాళ్ళు మోసపోయేది ''అతడి ''వల్లకాదు. ''అతి'' వల్ల.(అతి దైర్యం, అతితెలివి, అతి అమాయకత్వం.)

జ్యోతి

తమిళన్ గారు,

నేను ఈ టపా రాసింది సానుభూతికోసం కాదు. తరచూ ఇలాటి సంఘటనల గురించి చదివి, తెలుసుకుని ఆవేశంతో రగిలిపోయి రాసింది. నేను చెప్పినవి నిజామా కాదా చెప్పండి?

సత్యసాయి కొవ్వలి Satyasai

మీఆక్రోశాన్ని అర్ధం చేసుకోగలను. చదువుకున్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలాంటి సమస్యలు తప్పట్లేదు. అయితే తప్పంతా మగాళ్ళదే అన్నట్లుగా రాసారు. మగవాడు బాధ్యతారాహిత్యంగా ఉంటాడని మీఉద్దేశ్యంఅనుకుంటా. అందరూ కాదు. కానీ తప్పుఇరుపక్షాలలోనూ ఉండే అవకాశం ఉంది. ఆడవారికి గౌరవం ఇవ్వడం అన్నది చాలా ఇళ్ళల్లో కనిపించడం లేదు. ఈమధ్య అమ్మాయిల ప్రతాపం కాస్త ఎక్కువగానే ఉంది. పైగా సినిమాలూ, టీవీల ప్రభావం గురించి చెప్పక్కర్లేదు.

జ్యోతి

లేదండి సత్యసాయిగారు, నేను మగవాళ్లను తప్పు పట్టింది ఈ సంఘటనలలోనే. అమ్మకూడా ఆడపిల్ల వద్దంది అని అబార్షన్ చేయించా అన్న మగవాడు ఆ బిడ్డ ఆడపిల్ల కావడానికి కారణం తనే, తన భార్యను కాపాడుకోవలసింది తనే కాదా? ఆపాటి ధైర్యం లేదా తల్లితండ్రులను ఎదుర్కోవడానికి. నేను ఎన్నో సంఘటనలు చూసాను. ఆడపిల్ల వద్దు అన్న మొగుళ్లను.వరుసగా మూడోసారి ఆడపిల్ల అని చూడడానికి కూడా రాలేని పెద్దమనిషి. మీరన్నది నిజమే. ఆడపిల్లలు కూడా దారి తప్పుతున్నారు.ఇలా ఆడపిల్లలను పారేసేది ఇలాటి ఆడపిల్లలంటారా?

నేనెప్పుడూ మగాళ్లందరూ చెడ్డవాళ్లు అనలేదు.

మరువం ఉష

జ్యోతి, వీలైతే నా స్నేహితురాలు, పుట్ల హేమలత గారి ఈ టపా, వ్యాఖ్యలు చదువు. http://www.pranahita.org/2009/09/pimdaala-baavi/#comments

ఈ సమస్య ఈనాటిది కాదు. ఇప్పుడు కావాల్సింది జాగృతి, పరిష్కారం. ఈ చర్యల్లో ఇద్దరి పాళ్ళువుంటున్నాయి. తప్పు ఒకరిదే కాదు. అలాగే చైతన్యం, ఉద్యమం రావాలంటే ఇద్దరి భాగస్వామ్యం సంఘటితంగా రావాలి.

జ్యోతి

ఉషా.. ఆ టపా చదివాను. ఇందులో ఇద్దరి తప్పే కాదు, సమాజానిది కూడా. అందులో ఆఢవాళ్లు కూడా ఉన్నారు. కాని నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలలో ఆడపిల్ల అనే కారణంగా అబార్షన్ చేయించారు భర్త, అత్తామామలు కలిసి.అమ్మాయి మాటలు పట్టించుకోలేదు. లేకుంటే వెళ్లిపో.మావాడికి వేరే పెళ్లి చేస్తాం అన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే ఇలాటి సంఘటనలు గురించి ప్రస్తావన వచ్చినా , జరిగినా ముందు తల్లినే తిడతారు ఎందుకు??

శ్రీనివాస్

మీ టపా బాగా కన్‌ఫ్యూజ్ చేస్తుంది , పుట్టగానే ఆడపిల్లా అని మూతి విరిచే పెద్ద మనుషులలో అధిక శాతం ఆడవారే అని గుర్తుంచుకోవాలి. లింగనిర్ధారణ జరిగిన తర్వత పుట్టబోయేది అమ్మాయి అని తెలిసి అబార్షన్ లకు దిగేది అధికశాతం తల్లులు , బలవంత పెట్టేది అత్తలు , భర్తలు కారణం అవుతున్నారు. దాదాపు ఎక్కువ శాతం ఆడవాళ్లే ఆడపిల్ల వద్దు అనుకుంటున్నరనే వాస్తవాన్ని మరువకండి. మగవాడి పాత్ర కూడా ఉంది అసలు లేదు అని అనము. కానీ పుట్టిన తర్వాత ఆడపిల్ల కావడంతో పాలివ్వకుండా దగ్గరకు తీసుకోకుండా మొండిగా ప్రవర్తించిన తల్లులను నేను చాలా మందిని చూసాను. ఇక్కడ ఆడపిల్లల జీవితాలు చిదిమేసేది అధిక శాతం ఆడవాళ్లే . సరే ఇక్కడితో కుటుంబాలు చేసే హత్యలు అయ్యాయి.

మదమెక్కి చేసే హత్యల గురించి చూస్తె .... మీరు మరీ కన్‌ఫ్యూజ్ చేశారు. మదమెక్కి కని వదిలేసింది అంటారు గానీ మదమెక్కి మగాడు కని వదిలేసాడు అనరండీ ఎవరూ... ఎందుకంటే అక్కడ కనింది అమ్మాయి కనుక ... ఆ బిడ్డ వల్ల తనకి సమాజం లో గౌరవం పోతుంది అనే ఉద్దేశంతో చెత్త కుండీలో వదిలేసింది కనుక ఆమెను మాత్రమె అంటారు ఆసందర్భం వరకు. ఏం ఎవరి ఇంటి ముందు ఐన వదిలి పెట్టొచ్చుగా , దేవుడు సినిమాలో అన్నపూర్ణమ్మ లా గుడి లో వదలోచ్చుగా లేదా ఏదైనా హాస్పిటల్ లో వదలోచ్చుగా చెత్త కుండీ లో బిడ్డని వదిలి పోయిన ఆ నికృష్టురాలీని తిట్ట కుండా ఎప్పుడో పది నెలల కింద అమెతో గడిపిన వాడేవడినో తిట్టాలా ???? ఇది నిజంగా అర్ధం లేని వాదన. ఆమె ఆనందించింది వాడు ఆనందించాడు. ఆడది ఇష్టపడి వస్తే ఏ మగాడు కూడ పాపం ఈమెకి కడుపు వస్తుందేమో అని ఇది తప్పు అని నీతి వాఖ్యాలు పలకడు. ఈమెకి ఇష్టం లేకుండా ఏం ఆనందించడు కదా. మళ్లా తప్పుకు ఫలితం అమ్మాయే అనుభవించాలి అంటే అది సృష్టి వ్యవహారం........అబ్బాయిలకి కడుపు రాదు కదా మరి.

మీరు రాసిన రెండో పేరా సారాంశం ఏమిటి???? తప్పు చేసిన మగాడు దర్జాగా తిరుగుతాడు .. కానీ అందరు అమ్మాయే జాగర్త గా ఉండాలి అని నీతులు చెబుతారు ... అంటే ఇక్కడ దాదాపు త్రేతాయుగం నుండి ఇన్ని లక్షల సంవత్సరాలు మగాడు తప్పు చేసి దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు గా .. అయినా కూడా అమ్మాయిలు పోయి ఇలాంటి చోట బలవ్తున్నారు అంటే ఎవరిది నిజమైన తప్పు. చివరిగా ఒక మాట అమ్మాయిని మాత్రమె తిట్టే సమాజం లో ఆడవాళ్లే ఎక్కువ అని మరువద్దు. ముందు ఆడవాళ్ళు తప్పు చేసిన ఆడదాన్ని తిట్టడం మాని ...ఆమెని ఆదరించి తమలో ఒకరిగా కలుపుని పెల్లిలకి పేరంటాలకి పిలవడం అలవాటు చేసుకుంటే .. ఆతర్వాత మగాళ్ళ మీద విరుచుకుపడవచ్చు.

శ్రీలలిత

సమాజం మారాలి.. వ్యవస్థ మారాలి అంటూంటారు అందరూ. కాని మనం నలుగురం కలిస్తేనే కదా సమాజం అయిందీ.. అది ఎవరికీ తెలీదా..
పల్లెటూరిలో చదువులేనివారి సమాజంలో ఆడది ఒకరకంగా బాధ పడుతుంటే, పట్నవాసాల్లో చదువుకుంటూ తోటి విద్యార్ధి తనను ప్రేమించమని వేధిస్తూ యాసిడ్ బాటిల్ చూపిస్తుంటే ఇంకోరకంగా బాధ పడుతోంది. ఎంత ధైర్యం తెచ్చుకున్నా, నాకేమని బ్రతుకుదామన్నా బ్రతకలేకపోతోంది. సంపాదనాపరు రాలయి కూడా ఆ సంపాదన మొత్తం తెచ్చి భర్త చేతిలో పోసి దారి ఖర్చులకి డబ్బు లడిగే పెద్ద పెద్ద ఉద్యోగినులు నాకు తెలుసు. ఈ సమాజం మొత్తం కుళ్ళిపోయింది ఈ విషయం లో. వేళ్ళతో సహా పెకలించి పారేయాలి..

కత పవన్

శ్రీనివాస్ గారు
మీరు చెప్పింది ముమ్మాటికి నిజం.
యు.రాక్

కత పవన్

జ్యోతి గారు.
మీ పుర్తి టపా ద్వరా మీరు చేప్పలనుకున్నది ఏమనగా.
ఏక్కడ ఏ తప్పు ఆడపిల్లకి జరిగిన అందులో పుర్తి బాద్యత మగవాడిని చేయాలంటారు ....
ఆడవారు తప్పు చేస్తే వారిని మానసికంగా ఏక్కువగా హింసించేది మీ ఆడావారన్నది మీరు కాదనగలర.
సమాజం ఏక్కువగా అత్తకోడలు గోడవలే చూస్తున్నాం అంటె ఆ అత్త అడది అనేది మీరు కాదనగలర.
తప్పు మగవారిది ఉంది కాదు అనము అయితే అది మేదలు అవ్వడానికి కారణం మాత్రం మీ అడవారి అనుమతితోనే కాదనగలరా.
ఒక్కవేల మగాడు బలవంతం చేస్తే అడి పరిస్దితి ఎందో అందరికి తేలుసు..
అడవారిని మెసం చేస్తే సమాజం సానుభుతి వారికి ఉంటుంది అదే అడది మగాడిని మొసం చేస్తే అదే సానుభుతీ ఉంటుందా.

మేడమ్ మగవాడిని మగవాడు ఏప్పుడు హేళన చేయడు ఇంకా అవకాశం ఉంటే ఒదారుస్తాడు కాని

అడావారి లా వారిని అనారాని మాటలు అనము.
ముందు మీ దగ్గర నుంచి మార్పు మేదలుపేట్టండి ఆ తరువాత మగావాడి గురించి అలోచిద్దాం.
మీరు సమాజం అంటున్న మగవాడు అడావారికి ఏప్పుడొ సగం అవకాశం ఇచ్చాడు..ఇక మీ చేతుల్లో ఉంది

Anonymous

ఆడదైనా, మగవాడైనా మనుషులు సంప్రదాయాన్ని అనుసరించడం వల్ల ఎప్పుడూ నష్టపోలేదు. తెలిసో, తెలియకో దాన్ని ఉల్లంఘించడం వల్లనే నష్టపోతున్నారు. మీ వ్యాసం చూస్తే దాని అంతర్లీనభావం - సంప్రదాయాన్ని ఉల్లంఘించే హక్కు ఆడదానికీ, మగవాడికీ సమానంగా ఉండాలి అన్నట్లుగా, లేదా ఉల్లంఘించినా నష్టం లేనివిధంగా వెసులుబాట్లు ఉండాలంటున్నట్లు ధ్వనిస్తోంది నా మట్టిబుఱ్ఱకి ! నేను పొఱపడితే క్షమించండి.

సంప్రదాయాన్ని ఎవఱు ఉల్లంఘించినా తప్పే. తప్పున్నఱే. అక్కడ రాజీపడిపోవడం వల్లనే ఆధునిక సమాజంలో ఈ అశాంతి, కల్లోలమూ ! అక్కడ రాజీపడొద్దని నేర్పించాలి ముందు ఆడకైనా, మగకైనా !

అసభ్యంగా మాట్లాడుతున్నానేమో నాకు తెలియదు. మళ్లీ పెద్దమనసు చేసుకొని మన్నించండి. అయినా ఈ రోజుల్లో అందఱూ (నేను కాదులెండి) కండోములూ, నోటిమాత్రలూ స్టాకు రెడీగా పెట్టుకొని మఱీ తెలివిగా (అతితెలివిగా) వ్యభిచరించేస్తూంటే మీరింకా 1970 ల నాటి ఆడబతుకు సినిమాకథ చెబుతున్నారేంటండీ బాబూ ?

తప్పులు చెయ్యడం ఒకప్పుడు మగవాడి మోనోపలి. కానీ ఇప్పుడది ఆడవాళ్ళ సొత్తు కూడా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవఱి తరఫున వకాల్తా తీసుకోమంటారు ?

--తాడేపల్లి

తారక

మొట్టమొదటగా, పెళ్ళి కట్నం కోసం చేసుకోకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుటుంది, ఇప్పుడు పెళ్ళి అనగానే బేరాలు మొదలెట్టేస్తున్నారు, ఇరు పక్షాలు అంటె, అన్ని ఇక్కడె మొదలవుతున్నాయి అని నా ఉద్దేశం.

Nrahamthulla

తనకు పోషించే శక్తి ఉందా లేదా అని ఆలోచించకుండా మనిషి ఈజీగా చేయగలిగింది పిల్లల్ని పుట్టించటం.ఆడైనా మగైనా ఒక్క బిడ్డకే కుటుంబం పరిమితమైతే సమశ్యలు చాలావరకు రావు.అంతగా కావాలనుకుంటే మొదటి సంతానం కలిగాక అక్కడితో ఆపేసి, ఒక అనాధను దత్తత తీసుకోవాలి.దీనివల్ల ఒక అనాధకు జీవితాన్ని ఇవ్వగలిగినవారు అవుతారు.జనాభా సమస్య అరికట్టవచ్చు.
పిల్లలు లేనివారు ఏళ్ళతరబడి అలా పిల్లలకోసం సొంతబిడ్డలు మాత్రమే కావాలనే పట్టుపట్టి సంతాన సాఫల్యకేంద్రాలలో ఖర్చుపెట్టే డబ్బుతో అనాధలు బ్రతుకుతారు.ఆడవారికి అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ హింస కూడా ఉండదు.రేపుమనది కాదు.మనం మూటగట్టుకు పోయేది ఏం లేదు.మన ప్రాణాలు పోకుండా పిల్లలు కూడా ఆపలేరు.తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు బిడ్డలు నిస్సహాయులే.ప్రాణం పోతున్నా పక్కనే పిల్లలుంటేనే తృప్తి అంటూ శక్తికి మించి కనటం ఎందుకు?కేవలం తృప్తిగా ప్రాణాలు విడవటానికే అయితే అనాధ పిల్లలనూ చేరదీయవచ్చు.పిల్లలు లేని జంటలు ప్రతి జిల్లా కేంద్రంలోని ICDS కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.పిల్లల్ని తీసుకోవడానికి పట్టే రెండు మూడు సంవత్సరాల లోపు పిల్లలు కలిగితే దాన్ని రద్దు పరచుకోవచ్చు.అనాధ శిశువులను పెంచుకోవటం కూడా దేశభక్తే .అదే మానవసేవ,మాధవసేవ.

భావన

ఇద్దరిది తప్పు వుంది ఒక్కళ్ళను జవాబు దారి చేయకండి అని మీరు చెపుతున్నా ఒకరేమో త్రేతా యుగం నుంచి మొగాడూ మోసం చేస్తునే వున్నాడూ.. కలి యుగం లో కూడా జరుగుతోంది అంటే ఎవరిది తప్పు అని, ఇంకొకరు వాళ్ళ గర్భం రావటం ఆడవాళ్ళ ఖర్మ ఏం చేయమంటారు అని. ఇక నుంచి ఒక పని చెయి జ్యోతి. రాసే ముందు ఒక డిస్క్లమైర్ పెట్టు: అమ్మా బాబు ఇందు మూలం గా తెలియ చేయునది ఏమనగా ఈ పోస్ట్ లో ఇద్దరి ది తప్పు అని అన్ని చోట్లా గ్రహించుకోగలరు అని.
LBS గారు అన్నట్లు సంప్రదాయం ఏమో నాకు తెలియదు కాని ఆయన అన్నట్లు తప్పు ఒప్పుల తేడా లు తెలియాలేమో మనుష్యులకు ముందు, ఇలాంటి దురదృష్ట కర సంఘటనలు ఆవృతం కాకూడదంటే. ఈ కాలం యంగ్ జనరేషన్ కుర్రాళ్ళకు ప్రతి దానికి ఆడదానికి ఆడదే శత్రువు, అత్తగారే, అమ్మాయే అంటూ వాదనలు వినిపించేస్తున్నారు. ఆ ఆడది అలా మారటానికి ఆ అమ్మాయి ఆ పంధా లో ఆలోచించటానికి ఎన్ని తరాల మెదడు మర్ధన ఎన్ని తరాలు గా నూరి పోయబడిన భావ బానిసత్వం వలనో తెలియటం లేదు. ఇంత చదువుకున్న (చదువు కు, వితరణ కు సంభందం లేదనుకోండి) మన మధ్యే ఎక్కడో కామెంట్ చదివే నేను ఈ మధ్య న, ఈ ఆడోళ్ళకు ఇంట్లో పని వుండదా వంట వుండదా ఈ టైప్ లో ... ఒక్క మాట తో వ్యంగపు వెక్కిరింత తో వెటకారపు చూపులతో, ఒక విషపు మాట తో ఆపి, ఆ దెబ్బ కు భయపడి ఆడవాళ్ళు నోరుమూసుకుని వుంటారనే అభిప్రాయాలు మారనంత వరకు మరి మాటలు పడటం తప్పదు, మాటలు వినటం తప్పదు.. కానీయండి ఆర్గ్యుమెంట్స్. :-)

Anonymous

"కట్నం వల్లనే ఇదంతా" అంటే నేనంగీకరించలేను. ప్రాథమికంగా ఇదొక ధర్మగ్లాని. ఆడపిల్లల్ని, ఆడభ్రూణాల్ని చంపమని సంప్రదాయం చెప్పడంలేదు. మనుషులు సంప్రదాయాన్ని, ఉల్లంఘించడం, అదే సమయంలో అన్ని ఇతరరంగాల్లో మాదిరే ఈ విషయంలో కూడా పచ్చిలౌకికతతో సైన్సుని దుర్వినియోగం చేయడం - ఇవే అసలు కారణాలు. ఈ పచ్చిలౌకికతా, సైన్సు దుర్వినియోగమూ కేవలం ఆడవాళ్ళ విషయంలో జఱగడం లేదు. అన్ని విషయాల్లోను జఱుగుతోంది. అంటే ఇది పైకి కనిపిస్తున్నట్లుగా ఆడవాళ్ళ సమస్య గానీ, కేవలం ఆడజాతి్కే పరిమితమైన సమస్య గానీ కాదు. ఆ దృష్టితో మనం విషయాల్ని పరిష్కరించాలనుకుంటే ఆ మందు పైపూతే అవుతుంది.

నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది ? ఆ మానవసహజమైన సహాయాపేక్షకి కట్నం అని పేరు పెట్టి చట్టాలు కూడా చేసి శిక్షిస్తున్నారు. అదే సమయంలో తన కాబోయే మొగుడు "ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి" అని ఆడవాళ్ళూ ఆశిస్తే అది శిక్షించదగ్గ నేరం కాదు. రిటైరయ్యి ముసలితనం వచ్చి బి.పి. షుగర్ తో బాధపడుతున్న మొగుళ్ళని కూడా ఎక్కడో ఒకచోట పనిచేసి సంపాదించి తెమ్మని శతపోరు పెట్టి వేధించుకు తినే డబ్బుపిశాచాలైన భార్యలున్నారు. నేనలా చాలా మందిని చూశాను. వాళ్ళకెవఱికీ చట్టాలూ, శిక్షలూ లేవు. ఎందుచేత ? బాధితులు కేవలం మగవాళ్ళు కావడం వల్లనేనా ?

--తాడేపల్లి

శ్రీనివాస్

ఎదురుదాడి వలన టాపిక్ పక్కదారి పట్టే ప్రమాదం ఉంది అని గమనించాలి. ప్రస్తుతం మనం చర్చించే విషయానికి ఎక్కడో ఎవరో వదిలిన విషపు మాటకి ముడి పెట్టడం వలన చర్చ పక్కదారి పడుతుంది. ఖాయంగా. జరుగుతున్నా తప్పులను మనం ఎలాగూ ఆపలేం. టపాలకు ముందు డిస్క్లామైర్ పెట్టడం వలన చర్చ ముందు సాగదు. అన్ని రకాల కామెంట్లు విని మన వాదన వినిపించడం వలన చర్చ అనే పదానికి ఒక అర్ధం ఉంటుంది.

త్రేతాయుగం నుండి మగవాడు తప్పు చేస్తూనే ఉన్నాడు అన న మాట ద్వారా మగవాడిది అనాదిగా తప్పు అని నేను అంగీకరించిన విషయాన్ని వదిలేసి .. ఇలా జరుగుతున్నా మోసపోవడం అమ్మాయి తప్పు అనడాన్నే పట్టుకుని అర్ధం పర్ధం లేని కామెంట్లు పెట్టి .. ఎక్కడో ఎవడో ఏదో కూస్తే అది తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించి మాటలు తిప్పి సగటు స్త్రీ బుద్ధి చూపించడం మానుకోవాలి.

గీతాచార్య

ఈ కాలం యంగ్ జనరేషన్ కుర్రాళ్ళకు ప్రతి దానికి ఆడదానికి ఆడదే శత్రువు, అత్తగారే, అమ్మాయే అంటూ వాదనలు వినిపించేస్తున్నారు. ఆ ఆడది అలా మారటానికి ఆ అమ్మాయి ఆ పంధా లో ఆలోచించటానికి ఎన్ని తరాల మెదడు మర్ధన ఎన్ని తరాలు గా నూరి పోయబడిన భావ బానిసత్వం వలనో తెలియటం లేదు.
*** *** ***

RighttO! భావన గారూ, ఈ మాట మటుకూ మీకు hats-off.

జ్యోతి గారూ,

చాలా స్కోప్ ఉన్న విషయాన్ని ఎత్తుకున్నారు. ఎంతలా ఆఓచించినా ఒక చిన్న వ్యాఖ్య రూపంలో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఈ విషయాల గురించి చాలా ఆలోచించాను. చిస్తూనే ఉన్నాను. పరిష్కారాలు మాత్రం...? హహహ. అదీ పరిస్థితి. ఎవరికి వారు వారి వాదనలే తప్ప ఒక రేషనల్ ప్రాతిపదికన ఆచరణ మాత్రం శూన్యం.

ఒక సారి ఈ కథని చదవండి...

http://gitasrujana.blogspot.com/2008/05/blog-post_23.html

ఎన్నో సంఘటనలు ఇలాంటివి చదివి తయారు చేసుకున్న కథ ఇది.

ఇందులో ఆ భర్త స్థానంలో ఒక బయాలజీ ప్రొఫేసరూ తెలుసు నాకు. అలాగే స్త్రీలూ తెలుసు. కానీ తర తరాల బ్రెయిన్ వాషింగన్నది కొంత వరకు ఈ తరానికీ, పూర్తిగా గత తరాలకీ వర్తిస్తుంది. చూద్దాం ఇంకా ఎవరన్నా వాళ్ళ మాటలు చెప్తారేమో. చాలా కాలానికి మంచి సీరియస్ సమస్యని లేవనెత్తారు. (అన్నింటా ఏకీభవించలేక పోయినా... మీ ఆక్రోశం మాత్రం అర్థం చేసుకోదగ్గదే)

కత పవన్

ఇక్కడ భావన గారు అసలు సమస్య ను ప్రక్కన పేట్టి మగవారిని నిందిస్తున్నారు..
భావన గారు ఇక్కడ తప్పు మగవారిది లేదు అనడం లేదు అడవారిదె ఎక్కువగా ఉంది అంటున్నాను.

మీరు చేపుతున్న సదరు జ్యోతి గారు అవేశం గా మగవాడు మాత్రమే తప్పు అన్న విధంగా రాశారు

భావన

అసలు సమస్య లేదు కొసరు సమస్య లేదు. నేను ఎవ్వరిని నిందించటం లేదు. ఇద్దరూ అన్నిటా అన్నిటికి భాద్యులు. శ్రీనివాస్ నీ కామెంటుకు అర్ధం చెప్పమ్మా
"త్రేతాయుగం నుండి ఇన్ని లక్షల సంవత్సరాలు మగాడు తప్పు చేసి దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు గా .. అయినా కూడా అమ్మాయిలు పోయి ఇలాంటి చోట బలవ్తున్నారు అంటే ఎవరిది నిజమైన తప్పు. " :-)
నిజమే మీరు ఇంత చదువుకుని ఇంత బయట ప్రపంచాన్ని చూసి ఇలా మాట్లాడితే మరి సగటు ఆడదాని లానే మాట్లాడతాను మరి.

పవన్: పక్క దారి లేదు వెనుక దారి కాదు అసలు దారే నేను మాట్లాడేది జ్యోతి రాసినది సరిగా చదవండి, ప్రెజుడీస్ గా ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకోకుండా చదువు.
"ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు కాని ఆ బిడ్డ జన్మకు కారణమైన మగవాడు ఎక్కడ? అతని గురించి ఎవరూ ఒక్క మాట మాట్లాడరు ఎందుకు? ఒకవేళ జరిగింది తప్పైతే దానిలో ఇద్దరికీ సమానమైన పాత్ర ఉంది."
దీని అర్ధమేమి చెప్పు. ఎక్కువ తక్కువ ఏమి వుండవు అలా మీరు లెక్క కడీతే బోలెడు లెక్కలొస్తాయి అప్పుడూ ఖచ్చితం గా సమస్య పక్క దారి పట్టీ నువ్వు ఎక్కువా నేను ఎక్కువా అని కోట్లాడూకోవటం అవుతుంది. వూరికే దుంకమాకండి ఆలోచించండి సరేనా. (మళ్ళీ "మీరే దుంకుతున్నారు అసలు ఆడవాళ్ళు" అంటారా... సరే ఐతే :-))

ఎక్కడి అభిప్రాయమో నేను ఇక్కడికి తీసుకుని రాలేదు. ఈ టాపిక్ మీద నాకంటే, జ్యోతి కంటే గొప్ప గా నిజా నిజాలు తెలిసి వితరణ గా మాట్లాడ గల ఆడ వాళ్ళు వున్నారు, విపరీతం గా ఆర్గ్యూ చెయ్యలేక పోయినా అవును నిజమే సుమా అని వత్తాసు పలకగల లలనా మణు లు వున్నారు. కాని మాట్లాడరు... భయం, ఎందుకు భయం??? మాకేమైనా కొమ్ములా తోక లా, అది మీ అసమర్ధత, ఆర్గ్యూ చేయటం చేతకాని తనం అంటారు మీరు. అదీ నిజమే ఒక విధం గా. చేతకానితనమే మీరు ( మీరు అంటే ప్రత్యేకం గా ఒక్కళ్ళను ఇద్దరినో వేలెత్తి కాదు నేను చూపించుతుంటా ఒక వ్యవస్త ను వుద్దేశించి) ఒక్క ఈసడింపు మాట, ఒక్క క్యారక్టర్ గురించి అనుమాన దృక్పధాలతో పలుకు చాలు వాళ్ళు వెనుకకి పరుగెత్తి తలుపు చాటు న దాక్కోవటానికి. అది తప్పే మరి. వాళ్ళు దాక్కోవటానికి స్త్రీ సహజ పిరికితనం కారణమైతే, ఆ పిరికి తనానికి 90% వరకు ఇంట్లో అన్నయ్యో నాన్నో తమ్ముడో వీలైతే కొడుకో కూడా ఎందుకు మీకు ఈ గోల అనవసరం గా అందరి నోళ్ళలో బడీ నానటం, మీరు ఏమైనా సమాజాన్ని మారుస్తావా అనే సాఫ్ట్ టోన్ నుంచి ఎంత రఫ్ గా ఐనా పలక వచ్చు ఆ వాణి. (ఇక్కడ ఇలా పలికే వాళ్ళు ఆడ వాళ్ళు కూడా అన్నయ్య కు బదులు అక్క ఈ మాదిరి చదువుకోండి) వెంటనే ఎవరో ఒకరు అనొచ్చు మరి జ్యోతి కి నీకు లేక ఇలా అర్ధం పర్ధం లేకుండా మాట్లాడే ఆడ వాళ్ళందరికి లేరా బుద్ది చెప్పే వాళ్ళు అని. ;-) వున్నారు ఎందుకు లేరు బుద్ది చెప్ప బోయే వాళ్ళు వుంటారు, తప్పేమి లేదు నిలబడు అని వెన్ను తట్టీ దన్ను నిచ్చే మొగ వాళ్ళు వుంటారు, అబ్బురం గా కళ్ళు విప్పర్చుకుని చూసి చప్పట్లు చరిచే వాళ్ళు వుంటారు.. సమాజమంటే అందరి కలయికే కదా కాని ఎక్కువ మంది వుండే శాతాన్ని బట్టి మాట్లాడతాము. అంతే. వీటన్నిటికి మించి ఒక వ్యక్తి వ్యక్తి గా మంచి చెడు ల వితరణ చేసుకోగల రోజొస్తే అలా రాగల అవకాశమొస్తే ఎంత బాగుండు అని నా ఆకాంక్ష, ఆశ.

భావన

ఇంకో అదనపు వాఖ్య.. ఇందాకటి కామెంట్ రాసేక దాని గురించి ఆలోచిస్తే ఇది కలపాలనిపించింది. ఒక్క పిరికి తనమె కాదు ఆడ వాళ్ళను ఆ మాట కొస్తే మనుస్ష్యులను ఆపేది ఇటువంటి కాంట్రవర్షియల్ విషయాల లో చర్చించటానికి ఆసక్తి చూపించకుండా. ఇక్కడ ఆడవాళ్ళ గురించి కాబట్టి కేవలం వాళ్ళ గురించే చెపుతున్నా. తప్పైతే ఆడవాళ్ళు ఎవరైనా సరిదిద్దండే ప్లీజ్. అబ్బ మనకెందుకు ఈ అనవసరపు గోల, చిరాకు గా ఐనా నిజమే కదా ఆడది పొగరక్కి చేసే పని కు మళ్ళీ వెధవ సమర్ధనలు అనే వాళ్ళు వుంటారు, ఇవి అన్నిటిని నెమ్మది గా శాంతం గా చూస్తూ వాదన ల వల్ల మనుష్యులు మారరు అనవసరం వాదనలు. మార్పు ప్రాక్టికల్ గా జీవితాలలో సత్యాన్ని, శాంతి ని అనుష్టించుకోవటం వలనే వస్తుంది అనే వాళ్ళు వుంటారు.

మంచు

పిల్లల్ని పడేయడం గురించి అయితే - జరుగుతున్న దారుణాలకి కారణం ఎవరయితే ఎమిటి . మీరు కారణం అంటే..కాదు మీరు కారణం అనుకుంటే ఎమి ఉపయొగం.. ఇలాంటి పరిస్తితులు తలెత్తకుండా తీసుకొవల్సిన జాగ్రత్తలు గురించి ప్రజల్లొ ముఖ్యంగా అమ్మాయిల్లొ సరి అయిన పరిజ్ఞానం పెంచాలి (అవగాహన కల్పించాలి) . నేనేమి ' జాగ్రత్తగా చెసే తప్పు ఒప్పు అవుతుంది ' అనడం లేదు .. కనీసం ఇలాంటి దారుణాలయిన తగ్గుతాయని ఆశ..
రెండొది ఆడపిల్లలన్న వివక్ష: చక్కగా లక్ష్మిదేవి లాంటి అమ్మయి పుడితే వద్దనుకొవడం .. అదేమి మూర్ఖత్వమో నాకు అర్ధం కాదు .. అలాంటి సన్నాసులకి ఎంత చెప్పినా వేస్ట్ .. అది మొగుడయితే ఎమిటి అత్తగారయితే ఎమిటి..
మగ పిల్లాడే కావలనుకొవడం ,ఆడపిల్లని కంటే మొగుడు అత్తమామలు చిన్న చూపు చూడటం కేవలం మనకున్న జబ్బె కాదు.. ఎ వెస్టర్న్ దేశం లొ చూసిన .. అంతెందుకూ ప్రపంచం లొ ఎక్కడయినా ఇదే సమస్య,,, కనీసం మనొళ్ళకి మొదటిపిల్ల అమ్మాయి అయినా లేక శుక్రవారం పుట్టినా లక్షిదేవి పుట్టింది అన్న సెంటిమెంట్ అయినా వుంటుంది..

తారక

bhavan gaaru, maha baaga chepparu.

paaresina talli antaru tappa, tandri ekkada anaru.

meerannadi 100% correctee

శ్రీనివాస్

మరి చదువుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో బయటి ప్రపంచాన్ని చూసి ఎలా మాట్లాడాలో భావన గారు ఒక పుస్తకం అచ్చువేసి మాకు అందచేస్తే ..నేర్చుకుంటాం :)

అడ్డదిడ్డంగా కని పడేసిన అనాధ పిల్లల మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ వస్తున్న వాడిని నేను. వాళ్ళలో ఎందరికో మామయ్యని , బాబాయిని , అన్నయ్యని ....ఇంట్లో ఏ.సి రూం లో కంప్యూటర్ ముందు కూర్చుని విశేషణలు చేయడం చాలా వీసీ . చిద్రమైన బతుకులను దగ్గరుండి గమనిస్తే అర్ధం అవుతుంది. ఎస్ నేను నేటి జనరేషన్ కి ప్రతినిధిగా అడుగుతున్నాను. నేను మాట్లాడిన దాన్లో నిజం లేదా. అయేషా మీరా లాంటి ఎందఱో అమ్మాయిలు దుర్మార్గుల చేతిలో బలిపొతే మీ లాంటి ఎంత మంది వచ్చి న్యాయం కోసం అరిచారు. ఆ తల్లికి బాసట గా ఎంత మంది మనుషులు నిలుచున్నారు ఇవాళ . నేను అప్పుడు ఇపుడు ఎప్పుడు ఒకటే మాట చెబుతున్నా .. మేము చేతగాని వాళ్ళం ... పిరికివాళ్ళం. రేపులు చేసి కడుపులు చేసి చట్టం లో లొసుగులు అడ్డం పెట్టుకుని దర్జాగా బయట తిరిగే మృగాలని ఏమి పీకలేక .. తప్పు చేసే అమ్మాయిల మీద కోప్పడి ముందు తరాల అమ్మాయిలకు అయిన జాగ్రత్త నేర్పుదామని అనుకునే నేటి యంగ్ జనరేషన్ ప్రతినిధి ని నేను. అమెరికాలో ఒక పదమూడేళ్ళ అమ్మాయికి పుట్టిన్మ బిడ్డకి తండ్రిని నేనంటే నేను అని పిల్లనాకొడుకులు కొట్టుకునే దరిద్రపు పరిస్థితి మన దేశం లో రాకూడదని కోరుకునే యంగ్ జనరేషన్ కి ప్రతినిధిని. చట్టాల్లో మార్పు రాదనీ తెలిసి మనుషుల్లో మార్పు కోసం ప్రయత్నించే హ్యూమనిస్టుని నేను--= ఫెనిమిస్టు ని కాను. ఎందరో ఎయిడ్స్ బారిన పడ్డ స్త్రీలని అక్కున చేర్షుకోవాలని పోరాటం చేసేది మాలాంటి వారే కాని తెలివైన చదువుకున్నా వారిలా మాట్లాడే మీరు, మగాళ్ళ ని మృగాలుగా ఆడవాళ్ళని మల్లెపూవులుగా వర్ణించే సోకాల్డ్ మాటలకి పరిమితం అయ్యే మేల్ ఫెమినిస్టులు కాదు.

భావన

శ్రీనివాస్ చాలా ఆవేశపడ్డారే. గుడ్. అవేశం తప్పకుండా కావాలి. ఏసీ రూమ్ లో కూర్చుని విశ్లేషణలు చేస్తున్నారు అని అంత తేలిక గా అనేసేవే తెలుసా మీకు మేము (మరి నాలాంటి వాళ్ళందరిని కలిపి అన్నావో నన్నే అన్నావో తెలియదు) ఏసీ రూమ్ లలో అనలైజ్ చేస్తున్నామో అవసరమైన వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేయూత నిస్తున్నామో. సరే యంగ్ జెనరేషన్ కు ప్రతినిధి మీ ఆలోచన తప్పు, కొవ్వెక్కి కొట్టుకునే అని అంటూనే వాళ్ళను ఏమి చేయలేక ఆడ పిల్లలను తిట్టీ అన్నారే ఆ ఆలోచన తప్పు నిజం గా అనాధ పిల్లలకు అన్నయ్య బాబాయ్ గా మావయ్య గా మీరు వాళ్ళకు సాయం చేస్తున్నట్లైతే మీరు నేర్ప వలసింది పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆత్మ విశ్వాశం, ఏది తప్పో ఏది ఒప్పో ఆడ మగ కు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం తీసుకున్న నిర్ణయానికి కట్టూబటి దాని పరిణామాలను హుందా గా స్వీకరించగలగటం అంతే కాని తిట్టీ భయపెట్టీ సమస్య మారదు. య్ంగ్ జెనరేషన్ కు ప్రతినిధి గా అది చెయ్యండి మొదటి నుంచి నేను చెపుతున్నది అదే తప్పు ఇద్దరిది. భాద్యత ఇద్దరిది ,మనుష్యులకు తప్పొప్పుల నిర్ణయం ఆత్మ విశ్వాసం నేర్పించాలి అనేది, దానికి పుస్తకం రాయనక్క్ర్లేదు శ్రీనివాస్. మీరు చదవను అక్కర్లేదు. అనాధల జీవితాలను పరిశీలిస్తున్న మీకు వారి అనుభవాలు వారి జీవిత ఆలోచనలే పుస్తకం అక్కడ తప్పక నేర్చుకోండి. పుస్తకాలు చదివి వచ్చే తెలివి తేటల కంటే అవే ముఖ్యం. ఫెమినిస్ట్ లంటే ఆడవాళ్ళను వెనుకేసుకుని వచ్చి అవసరమున్నా లేక పోయినా మొగ వాళ్ళ మీదకు దూకే వారు అని ఎవరు చెప్పేరో తెలియదు కాని దాని అర్ధం అది కాదు దాని గురించి తెలుసు కోవటానికి మాత్రం ఖచ్చితం గా పుస్తకాలు చదవండి మీకు ఎదురైన ఒకరో ఇద్దరో చూసి ఫెమినిజం అంటే ఇదే అని దూకుడు నిర్ణయానికి రాకుండా.. all the best amma ఇంక నేను ఆపేస్తున్నా ఈ టాపిక్ గురించి మాట్లాడటం. వృధా గా పర్సనల్ అటాక్ లు వద్దు ఓపెన్ మైండ్ తో పరిశీలించండి.

శ్రీనివాస్
This comment has been removed by the author.
చైతన్య

అసలు తప్పు ఆడవ్వల్లాడే అని, లేదా మగవాళ్ళదే అని... ఎందుకు వాదించుకుంటున్నారు? తప్పు రెండు వైపులా నుండి జరిగింది కదా...
యుగాల కాలం నుండి మగవాళ్ళు తప్పుడు చేస్తూనే ఉన్నారు కాబట్టి... ఆడవాళ్ళూ వాళ్ళని ఎందుకు నమ్మాలి, అలా నమ్మటమే వాళ్ళ తప్పు అంటున్నారు శ్రీనివాస్ గారు. అలాంటి మగవాళ్ళని నమ్మకుండా స్త్రీలను మార్చాలనుకుంటున్నాను అన్నారు. ఎం? మగవాళ్ళని ఎందుకు మార్చలేరు? ఆ ప్రయత్నం ఎందుకు చేయటం లేదు?
అయిన ఆమె ఏ పరిస్థితుల్లో బిడ్డని వదిలివేల్లిందో మనకి తెలీదు కదా! ఆవిడ ఆర్ధిక స్థితి ఒక బిడ్డని పెంచటానికి అనువుగా లేదేమో? అది ఆడబిడ్డ కాబట్టి ఇంత చర్చ జరిగింది. అదే ఆవిడ మగ బిడ్డని వదిలిపెట్టి ఉంటె? అప్పుడు కూడా ఇంత చర్చ జరిగేదా? అయినా ఏ పరిస్థితి అయినా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఏ గుడి ముందో, ఆశ్రమం ముందు వదిలి పెట్టి ఉండొచ్చు. అది మాత్రం ఆమె చేసింది తప్పే (నా దృష్టిలో).
ఎప్పుడో పది నెలల కిందట తప్పు చేసిన మగవాడిని ఎందుకు అనాలి అన్నారు... అది అసలు అర్థం లేని ప్రశ్న. అప్పుడు పది నెలల క్రితం తను తప్పు చేయకపోతే ఇప్పుడు ఈ చర్చకి దారితీసిన పరిస్థితే ఉండేది కాదు కదా. అయినా ఇక్కడ కూడా పరిస్థితి తెలియకుండా ఆ అబ్బాయిని కూడా అనలేం. అతనికేమైనా జరిగి ఉండొచ్చు... లేదా మరేదైనా contraint ఉండి ఉండొచ్చు.

తప్పు ఎవరిదైనా... శిక్ష పడుతుంది ఆ పసిపాపకి.
కనీసం ఇంతగా దీని గురించి చర్చిస్తున్న మనలో ఎవరమైనా ఆ శిక్ష నుండి తనని తప్పించగలమా!?

జ్యోతి

ఇంత చర్చ జరిగినా కూడా అసలు విషయం గురించి ఒక్క పరిష్కారం రాలేదు. నేను ప్రతి సంఘటనకు మగవాళ్లదే తప్పు అనలేదు. ఈ సంఘటనలలో.. వరుసగా తీసుకుందాం..

ఆడపిల్లలు అని పారేయడం.. పెళ్లిగాకముందు తప్పు చేసినప్పుడు ఇద్దరిదీ సమాన బాధ్యత ఉంది.కాని గర్భవతి ఐన అమ్మాయిని అ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడో లేదో తెలీదు. చేసుకొకపోయినా అతనికి నష్టమేమి లేదు. ఇంచక్కా వేరే పెళ్లి చేసుకుంటాడు దర్జాగా. మరి చంకలో పిల్లాడితో ఉన్నా అమ్మాయి సంగతేంటి? ఆమెను ఎవరు చేసుకుంటారు? కనీసం ఆ అమ్మాయిని ఆదరిస్తారా? లేదు.అటువంటి సమయంలో పుట్టగానే వదిలించుకోవాలనుకుంటారు. అది అడపిల్లైనా, మగపిల్లాడైనా.. తప్పు చేసింది ఇద్దరు. ఫలితం అమ్మాయికే. అలా కాకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలా జరగకపోవును కదా. ఇక కూలినాలి చేసుకునేవాళ్లైతే మగపిల్లాడు గాలికి పెరుగుతాడు.కాస్త ఎదిగితే ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు అని ఉంచుకునే అవకాశం ఉంది. ఆడపిల్లకు అలా లేదు. అదో పెద్ద బంఢలాంటిది. పేపర్లలో చూస్తూనే ఉంటాము ఇలాటి సంఘటనలు. అందులో అఢపిల్లలే ఎక్కువగా ఉన్నారని తెలుసా? ఇలా పిల్లలను పారేసేది పెళ్లికాకుండా పుట్టినందుకే కాదు. పెళ్లయ్యాక ఆడపిల్ల పుట్టింది అని కూడా గుట్టు చప్పుడు కాకుండా పారేస్తారు. లేదా వడ్లగింజ వేసి చంపేస్తారు. ఈ పని చేసేది మగవాళ్లే కాదు. కన్నతల్లి తప్ప మిగతా కుటుంబ సభ్యులు. ఈ హత్యలను అ బిడ్డ పుట్టుకకు కారణమైన మగాడు/మొగుడు ఆపలేడా?... ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు, ఈసారి మగపిల్లాడినే కనాలి. ఆడపిల్లైతే వద్దు అని స్కానింగ్ చేయించి ఆడపిల్లైతే అబార్షన్. ఇది ఆ భర్త అపలేడా?? అలా ఎన్నిసార్లు భ్రూణహత్యలు చేస్తారు.

పెళ్లయ్యాక హత్యలు..

పెళ్లిచేసుకుని తన జీవితానికి తోడుండడానికి వచ్చిన ఇల్లాలిని తన తల్లి రాచిరంపాన పెడుతుంటే ఆపడం భర్త బాధ్యత కాదా? ఆ అత్త ఆరళ్ల గురించి అతనికి తెలీదా? ఒకే ఇంట్లోనే కదా ఉండేది. ఆ అమ్మాయి చనిపోయింది అంటే ఎవరిని అడగాలి.

నేను మగవాళ్లని తప్పు పట్టింది ఈ విషయాలలోనే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అమ్మాయిలను బ్రతకనివ్వండి. నేను అడిగినవాటికి ఎవరైనా సమాధానమివ్వగలరా??

జ్యోతి

శ్రీనివాస్, పవన్ గారు,

చెత్తకుండీల్లో, మురికికాలువల్లో పారేసేది పెళ్లికాకుండా గర్భం తెచ్చుకున్నవాళ్లే అంటారా? అలా తిరిగేవాళ్లు తాడేపల్లిగారన్నట్టు ముందే జాగ్రత్తపడుతున్నారు. ఈనాటి యువత అలా ఉన్నారు.

పవన్ గారు,

నేను మగవాళ్లందరు దుర్మార్గులనలేదే.. నాకు తెలిసి దుర్మార్గులైనా అడవాళ్లను ఎంతోమందిని చూసాను. ఆడవాళ్లను గౌరవించి, ఒదార్చే, ప్రోత్సాహమిచ్చే మగవాళ్లు కూడా తెలుసు నాకు.ఈ సంఘటనలలోనే నేను మగవారిని ప్రశ్నించాను.

తాడేపల్లిగారు,

మీరన్న సాధనాలు తప్పు (అని మనమంటున్నాం) చేసిన యువతీయువకులు వాడుతుంటే మరి తరచూ చెత్తకుండీల్లో, కాలువల్లో దొరుకుతున్న పసిపిల్లలు ఎక్కడివారండి. నేను చెప్పింది పాతకాలం కధలు కావు. ఈనాటి కధలే. జరిగిన సంఘటనలే.

ఈ టపా రాసింది సినిమాలు చూసి , పుస్తకాలు చదివి , ఎవరో చెప్పిన మాటలు విని కాదు. నేను ప్రత్యక్షంగా చూసిన, తెలుసుకున్న సంఘటనలు అందుకే ఈ ఆవేశం, వ్యధ..

చైతన్యగారు,
మీరు చెప్పింది కరెక్ట్, ఇక్కడ నష్టపోయింది ఆ పసిపాపలు..

ప్రియ

చర్చ బాగుంది.

నేను చెప్పాల్సింది ఎప్పుడన్నా ఒక టపా రూపంలో రాయాలి

ఇది సీరియస్ గా సీరియస్ వ్యాఖ్య.

ప్రియ

ఇక్కడందరూ ఏదో ఒక వైపు మాత్రమే ఆలోచిస్తున్నారు. పైగా ఇవి పరిష్కారం లేని సమస్యలు.
పూర్తి ఇండివిడ్యువలిస్టిగ్గా పరిష్కరించుకోవాల్సిందే కానీ, ఒక జనరలైజేషన్ సాధ్యం కాని అంశం. కానీ ఇలాంటి చర్చలు మాత్రం జరగాల్సిందే.
అలాంటప్పుడే భిన్నాభిప్రాయాలు తెలిసి కాస్తన్నా సమస్యకు మూలమేదో కొందరికైనా తెలిసే అవకాశం ఉంటుంది.

గీతాచార్య గారూ,

మీరు మరీ కామెడీ చెయ్యటం లేదు కదా? రేషనల్ అన్నారు బాగుంది. కానీ, ఈ భావ బానిసత్వాన్ని మొదలెట్టింది పురుషులే కావచ్చు కానీ, దీన్ని పెంచి పోషించింది మాత్రం మహిళలే. ఇది మాత్రం బాధ పడుతూనే ఒప్పుకోవాల్సిన చేదు నిజం. సమస్య అన్ని వైపుల నుంచీ ఉంది. ఒక్క వ్యాఖ్యలో మాత్రం చెప్పగలిగేది కాదు.
***

జ్యోతి గారూ,

మంచి విషయం ఎత్తారు. నైస్

మైత్రేయి

ఈ చర్చ లో పాల్గొన్న వాళ్ళు ప్రతి కామెంట్ ని తమ పెర్సనల్ గా ఆపాదించు కొన్నారు అనవసరం గా.
మీరు చెప్పిన భార్యా భాదితులు ఉన్నారన్నది ఎంత నిజమో, కట్నం , స్త్రీ భ్రూణ హత్యలు గరుగుతున్నవి అన్నది అంత నిజం కాదా?
మా కులం లో కోటి కట్నం మినిముం అయితే ఆడపిల్ల పుడితే నా ఆస్తి తగ్గి నా తోటి వారిలో నేను తక్కువ అవుతానని మగ పిల్ల వాడిని మాత్రమే కావాలను కోవటం వింత విషయంకాదు.
దీనికోసమో మరెందుకోసమో మగపిల్ల వాడు కావాలను కొంటె తప్పు లేదు.
కోరుకోవటం నించి పట్టు బట్టటం దానికోసం మానవత చంపుకోవటం జరుగుతున్న విషయాలే. అది ఘోరం. తల్లి పక్క నుండి పిల్లను తీసి బయట వేసే మగాళ్ళు ఉన్నారు.
మీరు మానవత తో స్పందించండి.
కట్నం సంతోషం గా ఇవ్వటం తప్పులేదు చాలా చోట్ల అదే జరుగుతుంది. కాని ఈ ఆచారం ఎక్కడా దుర్వినియోగం కావట్లేదనకండి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

నేను ప్రధానంగా కట్నం గుఱించి రాయలేదు. అదొక ప్రాస్తావికాంశం మాత్రమే. ఆధునిక సమాజం అభివృద్ధి చేసిన మెటీరియలిస్ట్ విలువల యొక్క, మఱియు మెటీరియలిస్టు దృక్పథం యొక్క ఫలితాల్లో కట్నమూ, దాని వల్ల జఱిగే ఇతరేతర అవాంతర పరిణామాలూ కేవలం ఒకానొకటి మాత్రమే. మెటీరియలిస్టు విలువలు మన ఇళ్ళలో దూరిపోయి మన కుటుంబజీవితాల్ని సైతం ఎలా శాసిస్తున్నాయో అది తెలియజేస్తుంది. అందులో ఆడవాళ్ళూ ఒక భాగమే. అంతేతప్ప "ఆడవాళ్ళంతా సెయింట్లు మగవాళ్ళొక్కళ్లే డబ్బుపిచ్చి పట్టిన మెటీరియలిస్టులూ" అన్నవిధంగా ఆలోచించడం సమస్యల పట్ల సమగ్ర అవగాహనకి సహకారి కాదు. ఆడవాళ్ళ సమస్యలుగా ఫెమినిస్టు వలయంలో ప్రచారమవుతున్నవి నిజంగా కేవలం ఆడవాళ్ళ సమస్యలు కావు. వాటి లోతులోకి వెళ్ళాలి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

నా ప్రశ్నకి సమాధానం ఇంకా లభించలేదు.

"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది ?"

జ్యోతి

తాడేపల్లిగారు,

ఒకటి రెండుసార్లు ఆశించడం తప్పుకాదు. కాని పీడించడం , పెళ్లికి అదే కేంద్రం కారాదు అంటాను. ప్రతి తల్లితండ్రి తమ కూతురుకు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటారు.తనకు భవిష్యత్తులో దేనికైనా ఉపయోగపడుతుంది. అది తనకొక్కదానికే అని కాదు. తన కుటుంబానికి. కాని అబ్బాయిలకు చదువు, ఉద్యోగం, ఆస్ధిని బట్టి రేట్లు నిర్ణయించి అలా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడం సబబా? ఒకవేళ పిల్ల తండ్రి ఆస్తిపరుడైతే సంతోషంగా ఇస్తాడు. కాని మధ్యతరగతి తండ్రి ఇవ్వలేడుగా. కాని అతనికి కూడా తన తాహతుకు ఎక్కువైనా కూతురిని మంచి ఇంటికి ఇవ్వాలనుకుంటాడు. తనకు శక్తి మేరకు సమకూరుస్తాడు కూడా. అంతకంటే ఎక్కువ ఇవ్వలేడని తెలిసి పెళ్లయ్యాక కూడా కట్నం కోసం పీడించేవాళ్లు ఉన్నారండి.

కత పవన్

"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుత"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది ?"

చాలా బాగా అడిగారండి
ఇక్కడ ఇచ్చే కట్నం కుడా మగాడు ఇస్తున్నాడు మగవాడు తిసుకుంటున్నాడు మద్యలో అడవారికి వచ్చిన కష్టం ఏంటో..
పేళ్ళి అనేది రేండు కుటుంబాల ఇష్టప్రకారం జరుగుతున్నప్పుడు మంచి చేడు ముందు ఏందుకు తేలుసుకోరు అడవారైనా..

జ్యోతి

పవన్ గారు, ఆ ఇచ్చేదా ఆ అమ్మాయి తండ్రి కాబట్టి. ఆ పెళ్లికొడుకు కట్టిన ధర చెల్లించడానికి ఎన్ని కష్టాలు పడతాడో చూస్తుంది కాబట్టి ఆడవాళ్లకే ఈ అభ్యంతరాలు. ఈ సంగతి మీకు ఇప్పుడు తెలీదు. మీకు ఆడపిల్ల ఉంఢి. తన పెళ్లికెదిగినప్పడు తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని కులాల్లో కోటి రూపాయల కట్నం, కిలో బంగారం, యాభై కిలోల వెంఢి కంపల్సరీ ఇవ్వాలి. మీరేమాత్రం , ఎంత ఇవ్వగలరో చూద్దాం? అప్పుడు నన్ను గుర్తు చేసుకోండి.

కత పవన్

జ్యోతి గారు,
మీ వంటి వాంటివారు ఏకపక్షంగా రాయడాం వల్ల భాదా అనిపించి రాశాను..సమస్య విషయం లో మాత్రం తప్పు ముమ్మాటికి అడవారిదే..

ఇక నాకు అడపిల్లలు పుట్టాలని అశిర్వదించారు :)))
మా అమ్మల చూసుకుంటాను

కత పవన్

మరి కోటి రుపాయలంటే నేను ఏక్కడ నుంచి తేవలండి..:))

మైత్రేయి

"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది ?"

మీ వంటి వారు ఈ విషయాన్నీ మళ్ళి మళ్ళి చెప్పటం బాగా లేదు.
సహ జీవనానికి, బాద్యతలు పంచు కోవటానికి వెల కడుతున్నారా? ఇదేనా మన ప్రాచిన వివాహ వ్యవస్తకు ఆధారం ? కన్నందుకు తండ్రి కూతురి పోషణ భారాన్ని చూసే వ్యక్తికీ డబ్బు ఇవ్వాలా? సంతోషం గా కూతురి పై ప్రేమతో ఇవ్వటం కాక ఇవ్వక వీలు లేని పరిస్తితి ఏర్పరచటం తప్పు కాదా? వ్యక్తి గా ఆమె ను అవమాన పరచటం కాదా?
మగ వాడు సంపాదించటం గొప్ప విషయం ఇల్లు నడపటం తక్కువ విషయం అనుకో బట్టే, ఆ విధంగా ఆయా బాద్యతలు చూస్తున్న వాళ్ళను తక్కువ చెయ్య బట్టే, ఈ స్త్రీ వాదమంతా పుట్టుకొచ్చింది అంటే కాదంటారా?
మీరన్న తర్వాతి పాయింట్ బాగుంది. సమస్య డబ్బు చుట్టూ తిరిగే సమాజం వల్ల వచ్చిందే. రాజకీయాలు గూండాగిరి కలిసినట్లు కలిసిన వివాహం, డబ్బు విడిపడితేనే సమాజం బాగు పడుతుంది.
అమ్మాయికి ఆస్తిహక్కు ఉంటే, అది కచ్చితం గా అమలు అయితే సమస్య పోతుంది.

తారక

"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుత"నాకు మొదట్నుంచి ఒక సందేహం. ఆడది మగవాడినుంచి తన యావజ్జీవితానికీ ఆర్థికభద్రత కోరుకోవడం తప్పు కానప్పుడు మగవాడు జీవితంలో కేవలం ఒకటిరెండు సందర్భాల్లో ఆడదాన్నుంచి లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది ?"

sahayam veru, katnam kosamee pelli chesukovatam veeru.

sahayam aite pelli chesukokamundee bargain cheyaru.

ippudu pellillu anni bargains aipotunnai. pelli ayyaka kastallo vunte, appudu sahayam tesukovachu kaani, dabbu meeda aasha thone pelli chesukovatam, chala pedda tappu.

Anonymous

చూడ బోతె ఇక్కడ చర్చ లో పాల్గొనే వారంతా కట్నం రేటు అతి తక్కువ పలికే వర్గానికి చెందిన వారులా ఉన్నారు. ఈ వర్గం వారు ఎప్పుడు ఇలా వాదనలు,న్యా అన్యాయాల మీద చర్చ పెడుతారు. కొంచెం వెనుకకు పోతె ఆ రోజులలో మిగతా వార్గాల వారు వీరిని దేశ స్వతంత్రం వరకు నాయకత్వం వహింప చేయించి తరువాత రాజాకీయాల నుంచి సాగనంపారు. అయినా వీరికి జ్ఞాననోదయం కలగ లేదు. అసలికి మీ వర్గం లో ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి? ఒకటి మటుకు ఎవ్వరైనా చెప్ప గలరు మిగతా వర్గాల వారి తో పోలిస్తె చాలా చాలా తక్కువ అని నా అభిప్రాయం. అటువంట్టప్పుడు ఈ టపా మీద ఇంత చర్చ మీకు అవసరమా? ఇతరుల తరుపున మీరు మాట్లాడ టానికి ఎవరు? మీ వ్యాసాలు చదివి ఎవరైనా మారుతారా? ఎవ్వరు మారరు. మీరే ఒక సారి గమని0చండి మిగతా వర్గాలకి చెందిన రెగులర్ బ్లాగర్లు ఒక్కరు కూడా ఇక్కడ వ్యాఖ్యలు రాయ లేదు.
---------------------------------------------------------------------
భావనమ్మ వ్యాఖ్యలు చదువుతుంటె నాకు అమేరికా లో ఉండె వారు ఎంత వెనకబడి పోయారో అని అర్థమౌతున్నాది. ఆమ్మా ఇండియా ఎంతో మారింది మీరు 1970 సం||వ్యాఖ్యలు చేయకండి. తల్లే పిల్లలను అదుపు లో చేయలేని ఈరోజులలో మగవాళ్ళను అదీ మీకు తెలియని వాళ్ళను తిడతారా?
నేటి యువతులు ఎలా ఉన్నరో ఒక సారి చదవండి. ఇది మారీ ఎక్స్ ట్రిం కేస్ మహేష్ భట్ట్ సినేమా మర్డర్ లో హీరొయిన్ లా ( ఆ సినేమా మీ అభిమాన రచయిత చలం గారి మైదానం నవల కాపి )
She killed mother after being ‘found out’ with boyfriend: cops
http://www.expressindia.com/latest-news/she-killed-mother-after-being-found-out-with-boyfriend-cops/470273/

NEW DELHI: A 26-year-old nursery school teacher, along with her boyfriend, allegedly bludgeoned and stabbed her mother to death with kitchen knives, a broken beer bottle and a pressing iron after they were caught together in her Paschim Vihar house in west Delhi, police claimed on Tuesday.

Kathi Mahesh Kumar

చాలా ఇమ్మెచ్యూర్ టపా. ఒక ఎమోషనల్ రెటొరిక్ ఉందేతప్ప అసలు సమస్యల్ని ఎత్తిచూపలేదు, వాటికి సావకాశమైన సమాధానాలు వెతికే దిశగానూ ప్రయత్నం లేదు.

సాంప్రదాయం సంస్కృతి పేరుతో పితృస్వామ్య భావజాలాన్ని నూరిపోసి మహిళల్నే ఆ పితృస్వామ్య పరంపర కొనసాగించేలా చేసిన బృహత్తర కుట్రకు మీరు సజీవ ఉదాహరణ. I empathize with you because pitying you would not help.

Varunudu

తప్పు ఆడవాళ్ళదా, మగ వాళ్ళదా.? తప్పు ఇద్దరిదీనూ.. !

సమాజం లో నాకు తెలిసీ రెండే వర్గాలు ఉన్నాయి. ఒకటి - మంచి, రెండు - చెడు. ఆడైన, మగైనా ఈ రెంటిలో ఏదో ఒక వర్గం లో ఉండాల్సిందే..

కాక పోతే - మంచి, చెడులకు ఎవరు నిర్వచనాలు ఇస్తారు? నాకు తెలిసీ ఎవరికి వారే ఇస్తారు.

ఉదాహరణకు - లంచగొండితనం తప్పు అనేది అందరికీ తెల్సు. తన పనికి తనకు జీతం వచ్చినా, బల్ల కింద చెయ్యెట్టడం తప్పు అని అందరికీ తెల్సు. ఉదాహరణకు ఒక సుబ్బారావు, మరో అప్పారావు లంచం తీసుకొన్నాడు అని తెలిసి, అతని చర్యను తీవ్రంగా ఖండించాడు. అసలు ఇలాంటి అప్పారవు ల వల్లే దేశం ఇలా తగలడింది అని పది మండి ముందూ వాపోయాడు. అదే సుబ్బారావు, తన ఇంట్లో గాస్ సిలిండర్ అయిపోయిందని, సిలిండర్ కుర్రాడికి ఒక యాభై ఎక్కువిచ్చి సిలిండర్ కొన్నాడు. అలా యాభై ఎక్కువిచ్చేప్పుడూ సదరు సుబ్బారావు తను తప్పు చేస్తున్నాను అనుకోడు. సిలిండర్ లేక పోతే ఇంట్లో ఎంత సమస్య - అవసరార్థం చేసేది తప్పు కాదు అనే కొత్త వాదనతో, మంచి కి నిర్వచనం మార్చాడు.

ఈ విషయం చెప్పడం లో ఉద్దేశ్యం ..పిల్లల్ని కని వదిలెయ్యడం తప్పు అనేది సమాజం వ్రాసుకొన్న సూత్రం.. ప్రతీ మనిషీ ( ఆడైనా, మగైనా) తమ తమ అవసరార్థం అర్థాలు మార్చేసి తప్పు మీది అంటే తప్పు మీది అని కొట్టుకోవడమే విడ్డూరం..

అలాంటి వాదనే మీరూ చేసారు. అమ్మాయి ఆ తప్పు చెయ్యడానికి మీరు చాలా కారణాలు చెప్పి, ఆయా కారణాల దృష్ట్యా తప్పని సరి పరిస్థితుల్లొ తప్పు చేసిన ఆడదాన్ని క్షమించాలన్నారు. తన పాపం కడిగేసారు. కొంచం ముందుకెళ్ళి ఆలోచిస్తే సదరు మగాడి తరపున కూడా మరో బలమైన, ఆమోదయోగ్యమైన మరో కారణాన్ని, లాజిక్ ను ఇంకెవరైనా నిర్మిస్తే అదీ ఒప్పేసుకొందామంటారా.. ?

అసలు మీరు రాసిన చర్య ఎవరు చేసినా హేయమైన చర్య - ఆ చేసింది ఆడైనా, మగైనా .. ! తర్వాత సమాజం లో సెక్యూరిటీ ఉండదు అనే లాజిక్ తో పురిటి పిల్లను చెత్తకుండి పాలు చేసిన ఆడది అసలు తల్లే కాదు. దేవుడికి మరో రూపమైన తల్లే, నిర్దాక్షిణ్యంగా తన స్వార్థం కోసం అలా చేస్తే అది అర్థం చేసుకొమ్మంటారేమిటి? అంత భయం ఉంటే ముందే జాగ్రత్త పడాలి గా. తీరా అంతా అయ్యాక, బతికించండి, రక్షించండి అంటూ ఆర్తనాదాలు ఎందుకు?

అలాగే, తన కామ వాంచ తీర్చుకొనే పురుషుడు, అలా తీర్చుకొంటున్నప్పుదు తద్వార రాబోయే బాధ్యతను వదిలించుకొనే పని చేస్తే.. ఆ మృగాన్ని మగాడు కనుక వదిలెయ్యడం అనేది ఘొరాతి ఘొరం.. మళ్ళీ సంసారానికి పనికి రాకుండా చెయ్యాలి అలాంటి వాళ్ళను! ఐనా అలాంటి వాళ్ళు దర్జాగా సమాజం లో ఎప్పటికీ బతకలేరు ( మీరు వ్రాసినంత సులభమైతే కాదు).

కాబట్టి తప్పులు, ఒప్పులు చెయ్యడానికి లింగ భేదాలు ఉండవు. ఇప్పటికే భాష, ప్రాంతీయత , కులం, మతం ఇలా లక్ష కారణాలతో కొట్టుకు చస్తున్న ఈ సమాజం లో ఇలా, ఆడ గొప్ప, మగ అధమ లేక మగ గొప్ప, ఆడ అధమ అనే బదులు, తప్పులు చేసిన అందరినీ నిలదీసినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుంది.. !

నా రెందు సెంట్లు మాత్రమే. ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం లేదు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

చూడ బోతె ఇక్కడ చర్చ లో పాల్గొనే వారంతా కట్నం రేటు అతి తక్కువ పలికే వర్గానికి చెందిన వారులా ఉన్నారు. ఈ వర్గం వారు ఎప్పుడు ఇలా వాదనలు,న్యా అన్యాయాల మీద చర్చ పెడుతారు. కొంచెం వెనుకకు పోతె ఆ రోజులలో మిగతా వార్గాల వారు వీరిని దేశ స్వతంత్రం వరకు నాయకత్వం వహింప చేయించి తరువాత రాజాకీయాల నుంచి సాగనంపారు..

ఇక్కడ కులప్రసక్తి అసందర్భం. ఇలాంటివి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తాయి. ఇక్కడ ప్రస్తావించబడ్డ కులం బ్రాహ్మణులైతే నాదొక మాట. బ్రాహ్మణుల్ని రాజకీయాల నుంచి ఎవఱూ సాగనంపలేదు. వారే స్వచ్ఛందంగా విరమించుకున్నారు. బ్రాహ్మణులు మొదట్నుంచి రాజకీయజీవులు కారు. మతజీవులు మాత్రమే. ఆ కాలంలో వారు తప్ప దేశవిషయాలు తెలిసినవారూ, ఆలోచించగలవారు ఎవఱూ లేకపోవడంతో అనుకోకుండా వారు ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. అంతే ! తరువాత ఆ అవసరం లేదనుకున్నప్పుడు వారు విరమించుకొని ఎప్పటిలాగే చదువులకి పరిమితమయ్యారు.

పాత బ్రాహ్మలు నిజంగా గొప్పవారు. వారిమీద నాకు గౌరవం ఉంది. వారు రాజకీయాల్లో ఉన్నా ఏమీ సంపాదించుకోలేదు ఈ కాలపు అబ్రాహ్మణ నాయకులలాగా ! మనం చూస్తున్న దేశాన్ని, దానిలోని రాష్ట్రాల్ని, దాని రాజ్యాంగాన్ని ఏర్పఱచినవారు వారు. వారు దేశాన్ని కలపాలని చూశారు. ఈనాటి అబ్రాహ్మణ నాయకులు దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు.

"కట్నం ఎక్కువ పలకని" అంటే అర్థం ? అంటే కట్నం తీసుకోనివాళ్ళు పనికిమాలినవాళ్ళనా ? సారీ, ఇలాంటివాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో నేను ఊహించుకోగలను. ఇలాంటివాళ్ళకి చర్చల్లో పాల్గొనే ఎమోషనల్ అర్హత ఉండదు. సమాజం గుఱించి సీరియస్ గా ఆలోచించేవాళ్ళకి, బాధపడేవాళ్ళకి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. "కట్నం గుఱించి చర్చిస్తేనే తమ కుబుసాలు కదిలిపోతాయేమో, తమ బతుకులు బయటికొస్తాయేమో" నని ఏడ్చేవాళ్ల కథ ఏంటో, వాళ్ళెవఱో, వాళ్ళ బండారం రాష్ట్రమంతటా అందఱికీ తెలుసు. ఆ అమానుషులెవఱో అందఱికీ తెలుసు. వాళ్ళ వెధవబుద్ధుల మూలంగానే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కుంటున్న ఉద్యమాలు వచ్చాయి కూడా !

అయ్యా ! చర్చలు ఏ వొక్క వర్గపు అబ్బసొత్తూ కాదు.

తెలుగు వెబ్ మీడియా

ఆరు సంవత్సరాల క్రితం (అప్పట్లో నా వయసు 21 ఏళ్ళు) రెడిఫ్ మాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టాను. నాకు కట్నం అవసరం లేదు అన్నాను. అప్పట్లో కూడా మాకు 15 లక్షలు ఆస్తి ఉంది కానీ ఉద్యోగం లేదు. అందుకే ఒక్క అమ్మాయి కూడా నన్ను పెళ్ళి చేసుకోవడానికి ముందుకి రాలేదు. నాకు తెలిసిన ఒక అమ్మాయిని గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చేశారు. అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగుల కుటుంబమే అయినా ఆ కుటుంబానికి అప్పులు ఉన్నాయి. ఈ విషయం తెలియని అమ్మాయి తల్లితండ్రులు ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళైన తరువాత అబ్బాయి తల్లితండ్రులు అతనికి మరో పెళ్ళి చెయ్యడానికి అమ్మాయిని హత్య చేశారు. కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కెనడాలో ఉంటున్న నా స్నేహితురాలికి పైసా కట్నం లేకుండానే పెళ్ళయ్యింది.

గీతాచార్య

Chaitanya garu,

తప్పు ఎవరిదైనా... శిక్ష పడుతుంది ఆ పసిపాపకి.
కనీసం ఇంతగా దీని గురించి చర్చిస్తున్న మనలో ఎవరమైనా ఆ శిక్ష నుండి తనని తప్పించగలమా!?

Very good question most of the people missed it, and going on presenting their views. If we ACT, then there could be no such things will occur. Naaku telisinanthalo, chethanainanthalo chesthunnaanu. But okallo iddaro chesthu povatam... sarle vadileddaam.
***

Priya,

Hahaha LOL. I did not express my opinions here. Just shown some cases. Thatz all. Also as of Bhavana garu, I appreciated a valid point, which I observed in my experience. The point u arose is also one such. In all these comments, only one person asked a question regarding children. Donno how many are acting for them.

Nenu modati nunchee ceppedi ade. ikkada chaalaa mandi emotionlo raasthaaru. emotion tho act chesthaaru. ade samasya. alanti sandarbhaallo saraina points aashinchatam thappu. This thing go...................es................ onnnnn like this, including making me a Praveen Sharma ;-)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

ఆడవాళ్ళకి ఆస్తిహక్కు ఇప్పటికే ఉందండీ, గత పాతికేళ్ళనుంచి ! అది నూటికి నూఱుశాతం అమలు జఱుగుతున్నది కూడా. కానీ కట్నం అనేది మాత్రం పోలేదు. నా అభిప్రాయంలో దేనితోనైతే సమాజానికి ఎనలేని అవసరం ఉంటుందో అది చచ్చినా పోదు, మీరొక లక్ష చట్టాలు తెచ్చినా సరే ! స్త్రీలు ఉద్యోగం చెయ్యకుండా మానిపించే పరిస్థితిలో ఉందా మన సమాజం ? చెప్పండి. అలాగే వాళ్ళ నుంచి కట్నం తీసుకోకుండా బతకలేని పరిస్థితి (కనీసం మానసికస్థితి) కూడా ఉంది.

కట్నాలు పెద్దగా లేని కులానికి చెందినవాడుగా నా పరిశీలనని మీతో పంచుకుంటే ఏమీ అనుకోరుగా ? బాగా గమనించండి. కట్నాలు భారీగా తీసుకునే కులాలు చాలా బాగా పైకొచ్చాయి. వాటికి అదనపు పెట్టుబడి అందుబాటులోకి వచ్చింది. అవి సమాజాన్ని శాసించే స్థితిలోకి వచ్చాయి. ఆ ఆచారం అంతగా లేని/ లేదా ఇవ్వలేని కులాలన్నీ అణగాఱిపోయాయి. ఎందుకంటే వాటి సభ్యులు ఎవఱి సహాయమూ లేకుండా ప్రతితరంలోను తమ జుట్టుపట్టుకుని తాము పైకి లేవాల్సిన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. పైగా కట్నాల ద్వారా కులంలోని సంపద కులానికంతటికీ కొంతలోకొంత తేరగా పంపిణీ (డిస్ట్రిబ్యూట్) అవుతుంది. అదొక రకం కుల-సోషలిజమ్ అనుకోవచ్చు. ఆ రకంగా ప్రభుత్వం చేయలేని పనిని కట్నం కొంత నెఱవేఱుస్తుంది. ఆడవాళ్ళ క్వాలిఫికేషన్లనీ, శ్రమశక్తిని ఉపయోగించుకునే కుటుంబాలవంటివే కట్నాల్ని ఆశించే కుటుంబాలు కూడా ! మొదటిది తప్పు కానప్పుడు, పైపెచ్చు ప్రోత్సహిస్తున్నప్పుడు రెండోదీ తప్పు కాదు. కానీ ఇది ఇతరేతరమైన వక్రాలోచనలకి దారితీయకుండా ఏం చెయ్యాలనేది ఆలోచించాల్సి ఉంది.

పరిమళం

చాలా చర్చ జరిగింది .నేను పెళ్లై ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేయించేవాళ్ళు ,ఇప్పుడు లింగ నిర్ధారణ చెయ్యట్లేదు కనుక పుట్టాక విసిరి పాడేసేవారి గురించి మాత్రమే కామెంట్ చేస్తున్నా ! ఆడపిల్ల పుట్టడానికి సైంటిఫిక్ గా కూడా తానే కారణమైన భర్త ,భార్యదే తప్పన్నట్టు చిన్నచూపు చూడడం , కొన్ని సందర్భాల్లో ఇలా బిడ్డని విసిరిపాడేసి ఆ తల్లికి కడుపుకోత మిగల్చడం దారుణం ఐతే అత్తగారి స్థానంలో ఉన్న స్త్రీ సాటి స్త్రీ కష్టాన్ని అర్ధం చేసుకోకుండా అతనికి సహకరించడం బాధాకరం !నాగరికత ఎంత పెరిగినా ఇటువంటి దారుణాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి .చూసినప్పుడల్లా మీలాగే బాధపడుతూ ఉంటాను .

నాగప్రసాద్

ఈ టపా ఎలా మిస్సయ్యానబ్బా!. అసలు విషయం వదిలేసి కట్నం గురించి చాలా చర్చ జరిగింది. కాస్త ముందే చూసుంటే, మొన్న నేను రాసిన "కట్నం" టపాలో మరికొంత విలువైన సమాచారం జోడించేటోణ్ణి. మా అబ్బాయిలకు చక్కగా పనికొచ్చేది. :)))


సరే ఇక అసలు విషయానికొద్దాం. ఇట్టాంటి సమస్యలకు నాలాంటి "సందేహం స్వామిజీ"లైతేనే పరిష్కారాలు సూచించగలరు.

నేను పరిష్కారం చెప్పిన తర్వాత, అమ్మాయిలు మరింత విచ్చలవిడిగా తిరగొచ్చు. ఎంతమంది ఆడపిల్లలనయినా కనొచ్చు. నింద వారి మీదకు రాకుండా చూసుకోవచ్చు. బ్లాగుల్లో ఇలా చర్చలు పెట్టి ఆమె తల్లి కాదు దెయ్యం లాంటి అభాండాలు పడాల్సిన పనిలేదు.

మా అబ్బాయిలకు నష్టం కలుగుతుందని తెలిసీ గుండెను బండరాయిగా చేసుకొని పరిష్కారం చెబుతున్నాను. సావధానంగా చదవండి.


"ఇకనుంచి ఏ అమ్మాయైనా ఎవడి వల్ల తల్లి అవుతుందో, వాడి ఫోటో ఒకటి దగ్గర పెట్టుకుంటే చాలు. ఎంచక్కా పిల్లల్ని కనేసి, వాడు మోసం చేశాడని తెలిస్తే, ఆ పాపాయి మెడలో వాడి ఫోటో తగిలించి పోలీస్ స్టేషన్‌ ముందు వదిలేస్తే చాలు. లేదూ పోలీస్ స్టేషన్ అంటే భయం, చెత్త కుప్పే బెస్ట్ అనుకుంటే, పోలీస్ స్టేషన్‌కు దగ్గరలో నున్న చెత్తకుప్పలో "ఆ పాపాయి మెడలో తండ్రి ఫోటో తగిలించి పడేస్తే చాలు". అబ్బే! ఇది కూడా కష్టం స్వామిజీ అంటే, సరే! ఏ చెత్తకుప్పలోనయినా పడేయండి. కానీ ఫోటో విషయం మాత్రం మరవొద్దండి". అప్పుడు అందరి దృష్టి తల్లి మీద కాకుండా, ఆ ఫోటో మీద, ఫోటోలోని మగాడి మీద పడుతుంది. కాగల కార్యం దగ్గరుండి మరీ లోకం సారీ మీడియా నడిపిస్తుంది. :)))


ఇంకా ధైర్యం చెయ్యగల వనితలైతే, ఏకంగా ఎవడి వల్ల తల్లైందో వాళ్ళింటి ముందే వదిలెయ్యచ్చు. :)))


తీరా పట్టుబడ్డ తర్వాత, ఆ మగాడు నేరం నాది కాదు అని బుకాయించొచ్చు. అప్పుడే మహిళా సంఘాలోళ్ళు, టీవీ9 నోళ్ళు రంగంలోకి దిగాలి. DNA test జరిపించాలని గోల చెయ్యాలి.

వాళ్ళ రక్షణ కోసం ఆడోళ్ళు ఈ మాత్రం కూడా చెయ్యలేనప్పుడు నిజంగానే వాళ్ళకు జీవించే హక్కు లేదూ..లేదూ..లేదూ..లేనే లేదు. ఎవడో వచ్చి రక్షిస్తాడులే అనుకుంటే వాళ్ళ ఖర్మ. అలాంటప్పుడు నాలాంటి స్వామిజీల సలహాలు అవసరం లేదు. :)))


అబ్బో! చాలా పెద్ద కామెంట్ రాశాను. దీనికి మరికొంత సమాచారం జోడించి నా బ్లాగులో పెట్టేసుకోవాలి. కుదిరితే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారుచేసి, పొరపాటున మోసపోయి తల్లైతే ఎలా తప్పించుకోవచ్చో కాలేజీ అమ్మాయిలకు లెక్చర్లు ఇవ్వాలి. :)))


చివరగా ఒక మాట: ఎలాగూ డిస్కషన్ పక్కకు నడిచింది కదా అని, నా కామెంటు సరదాకి రాశాను. ఇందులో ఏవైనా నొప్పించే పదాలుగానీ, వ్యాఖ్యానాలు గానీ ఉంటే మీరు నిరభ్యంతరంగా నా కామెంటును తొలగించి చెత్తకుప్పలో పడెయ్యచ్చు. మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను. :)))))))

జ్యోతి

నాగప్రసాద్ గారు ,

మీ ఐడియా బావుంది. ఈ మధ్య కొందరు అమ్మాయిలు తెగించి ఇలాగే చేస్తున్నారు. పోటోల ఐడియా బావుంది.

Malakpet Rowdy

డమ్మీ,

ఇంతకీ నువ్వు బ్రాహ్మణులని తిట్టావా, పొగిడావా? :))

భావన & శ్రీనివాస్,

మీ పోట్లాట బాగుంది. కొనసాగించండి :))

జ్యోతి,

ఒకళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వడం ఏమిటి?


ఇక మీరన్నది - "ఆ తల్లి ఏ పరిస్థితిలో తన పేగు పంచుకుని పుట్టిన బిడ్డను బ్రతికుండగానే ఎందుకు వదిలించుకుంది?" ... తప్పు పనులుచేసేవాళ్ళందరూ పరిస్థితులని ఆసరాగా తీసుకుని తప్పించుకుందామనుకుంటే అసలు ' తప్పు ' అనే మాటని నిఘంటువులలోంచి తీసెయ్యచ్చు.

"పిల్లల మీడ తల్లికెంత ప్రేమ ఉంటుండో తండ్రికీ అంతే ఉంటూంది - ముఖ్యంగా ఆడ పిల్లల మీద .. ఏ పరిస్థితిలో ఆ తండ్రీ ఈ దారుణానికొడిగట్టాల్సొచ్చిందో" అని నేను కూడ వాదిస్తే?


మగవాడు అమ్మాయిని వాడుకుని, తన కోరికను తీర్చుకుని హాయిగా వెళ్లిపోతాడు.
__________________________________

అమ్మాయిలలో ఇలాంటి వాళ్ళు లేరంటారా? తిరగడం, పారిపోవడం లాంటి పనులు అమ్మాయిలు అబ్బాయిలు సమానంగానే చేస్తారు. .. కానీ అరిటాకుమీద ముల్లు పడ్డా, అరిటాకు ముల్లు మీద పడ్డా, జనాలు తిట్టేది ముల్లునే కదా?


ఆ బిడ్డను కని చెత్తకుండీ పాల్జేసినందుకు ఆడదాన్ని ఆక్షేపిస్తారు
__________________________________

నిజమే, కానీ ఆ ఆక్షేపణ వల్ల ఏమైనా జరుగుతుందా? ఆ ఆడదానికి చీమకుట్టినట్టైనా ఉండదుకదా? వదిలేసిన తండ్రీ, పారేసిన తల్లీ బాగానే ఉంటారు. పైన ఎవరో చెప్పినట్టు అసలైన కష్టం ఆ పసి పిల్ల/పిల్లాడికే

ఇంతకీ మీ ఆవేశం దేనికి? పసిపిల్లలని అంత దారుణంగా చంపుతున్నారనా లేక ఆ విషయంలో అందరూ ఆడవాళ్ళనే తిట్టేస్తున్నారు, మగవాళ్ళని ఏమీ అనట్లేదనా?

Malakpet Rowdy

Pavan,

I disagree with you.

Follow Malak's Three commandments in this issue:

1. పోషించే పరిస్థితి లేనప్పుడు పెళ్ళే చేసుకోకుడదు 2. పెంచే తాహతు లేనప్పుడు పిల్లలని కనకూడదు 3. సమాజాన్ని ఎదిరించే ధైర్యం లేనప్పుడు వెధవ తిరుగుళ్ళు తిరగకుడదు

(స్వగతం: కొంచం ఎక్కువయ్యిందా?)

Kalpana Rentala

జ్యోతి, చాలా ఆలస్యంగా వచ్చినట్లు వున్నాను. నీ ఆవేదన అర్ధవంతమైనది. నాకైతే ఎలాంటి తప్పు కనిపించలేదు. ఈ టాపిక్ మీద మాట్లాడి, అరిచి, గొడవ చేసి ఆడవాళ్ళు అలిసిపోయారు.

David

ఆడపిల్ల పుట్టిందని ఆడవాళ్ళు కూడ ఆసహించు కుంటున్నారంటే దానికి కారణం మగవారిదే....తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ,మగ అని వేరువేరుగా పెంచినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి...పురుషాధిక్య సమాజంలో ఆడదానికి సొంత నిర్ణయాలు తిసుకునే స్వేచ్చ ఉండదు. ఇలాంటివి జరగకుండ ఉండాలంటే మొదట ఈ సమాజం మారాలి.

Nrahamthulla

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చమెత్తుకునే పిల్లలకు చదువు వసతి కల్పించాలని మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానించారు.
పసికందులతో భిక్షాటన
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌)కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.
అప్పులబాల్యం
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=439892&Categoryid=1&subcatid=33

dhaathri

asalu aadapilla putttadanikai ganee moga pilladu puttadaniki kanee beejame pradanam ani mana vallandarikee vivarangaa bodhapariche konni cinemalu ante mahesh garu theese lanti chinna okka nimisha cinemalu veetini popular cheste chaduvurani vallukuda ardham chesukuntaru ani naa uddesam viswasam....deenni e rakamaina taboo lekunda chupgalagali...i hope it will give a bit of awareness and they will not hold the woman responsible....any way its a burning issue many of u churned ur brains nice...love j

narayana

ivannee chadivina taruvaatha naaku bhale navvochindi.. kadupulo padda praanam edainaa.. champese hakku evarikee ledu.. asalu aadapillalu leni jeevitam vyardhamani naa uddesyam.. ammayilanu penchina vaalaku maatrame telustundi kevalam anandam maatrame kaadu goppatanam koodaa....eee srushti pravaham laa saagenduku dohadapadelaa
knyadanam cheyagagadam adrushtam kaadaa..

Unknown

nijimga adavala dusthithi chusi badapadli. e dusthithi ki majarity reason adavale. andukante kanna thalle ada maga valanu samanamga chudadhu . enka a e lokam gurinchi ami chepali . nenu na swa anubavam lone chusa. manchi talluluo vunaru kani kondaru thalulu adapillala jeevethalanu vala maga biddala kosam nasanam kuda chestunaru ada pillalu a dress veyali ,ami chaduvukovali (dabbulu mathram evaru chadavadaniki)ami thinali .eppudu thinali valu kurcho ante kurchovali valu nelabadamante nelabadali adi narakam thandri epudu bagavalake support chestadu. maga vala jeevithala kosam adavalanu dabbu ku asapadi valaku estam leni pelli cheyadaniki siddamina nana lo kuda vunaru kani e blag chadivaka narayan gari lanti varu kuda vunnarante santhosham ga vundi

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008