-
కౌముది సహా సంపాదకురాలు శ్రీమతి కాంతికిరణ్ గారికి అభినందనలు. ఎందుకంటారా.. ఇదిగో ఇందుకే. చిత్రం మీద క్లిక్ చేసి చదువుకోండి. ఈ ఇంటర్వ్యూ చేసిన సుజాతగారికి కూడా ధన్యవాదాలు. మన(సు) సుజాతగారేనండి.
రాసింది జ్యోతి at 12:22
వర్గములు శుభాకాంక్షలు
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
9 వ్యాఖ్యలు:
కిరణ్ ప్రభలో వెలుగుతున్న కాంతి రహస్యం ఇదన్నమాట :)
కౌముది పత్రిక సర్వాంగ సుందరంగా నెలనెలా క్రమం తప్పకుండా తయారై పాఠకులకి ఒక చక్కటి ప్రింట్ పత్రిక చదివిన అనుభూతుని కలిగిస్తోంది. ఆ సంపాదక దంపతులకి, ఇంటర్వ్యూ చేసిన సుజాత గారికి అభినందనలు
హృదయపూర్వక అభినందనలు కాంతి గారూ.. మర్చిపోకండి, మీరు డిజైనింగ్ కోర్స్ మొదలుపెడితే మొదటి శిష్యురాలిని నేనే :))
ఇంత చక్కని ఇంటర్వ్యూ అందించిన సుజాత గారికీ బోల్డన్ని అభినందనలు. :-)
Thanks for sharing it with us Jyothi :-)
నిషి..
కాంతిగారు కోర్స్ మొదలెట్టకున్నా నాకు నేర్పించాల్సిందే అని నీకంటే ముందే అడిగాను. :))
ఈ పోస్ట్ వేసి నా అభిమాన పత్రిక కౌముది పత్రికను డిజైన్ చేస్తున్నది ఎవరో తెలిపినందుకు ధన్యవాదాలు. కాంతి గారికి బ్లాగుముఖం గా విన్నపం. పత్రిక సౌందర్యం కేవలం ఆడవారి సొగసులను కవర్ మీద చిత్రీకరించడం లోనే లేదేమో. ఆఫీసులొ ఎప్పుడూ కౌముది వోపెన్ చెయ్యను. ఎవ్వరికీ చెప్పను కూడా, ఆ కవర్ పేజీల్లో బొమ్మలకి భయపడి. పసి నవ్వులోను, పూలల్లోను, గల గల పారే సెలయేరుల్లోను వున్న అందం (స్త్రీ సౌందర్య ప్రదర్శన లేకుండా) మీరు కవర్ పేజీ పై చిత్రీకరిస్తే చూడాలని నాదో చిన్ని ఆశ.
కాంతిగారికి , హృదయపూర్వక అభినందనలు.
పైన అరుణగారి ప్రపోజల్ బావుంది.
పసినవ్వుల్లోనూ, సెలయేర్లలోనూ ఉన్న అందం కూడా చూపించాలనే అరుణ గారి విన్నపం నాకూ నచ్చింది.. కానీ ఇప్పుడు వచ్చే కవర్ పేజీలు ఆఫీసు లో ఓపెన్ చేయలేనంత అసౌకర్యంగా ఉన్నాయి అనడమే ఆశ్చర్యంగా ఉంది!! కౌముది వారి ముఖచిత్రాల్లో చాలావరకూ ప్రకృతి బ్యాక్ డ్రాప్ గా ఉంటుంది.. ముఖ్యంగా పల్లెజీవనం (రైతు దంపతులు) కనిపిస్తుంది.. అందుకే ఈ ముఖచిత్రాలు నాకు చాలా నచ్చుతాయి.. నావరకూ అవి స్త్రీ సౌందర్యం కంటే మన నిత్యజీవనరాగాలను అవి ఎలివేట్ చేస్తాయని అనిపిస్తుంది.. ఇప్పటివరకూ వచ్చిన సంచికలు ఇవి.. ఇందులో భయంకరంగా ఉన్నవేవంటారు?
http://www.koumudi.net/monthly_copies.html
మరొక్కసారి.. మిగతా ప్రకృతి అందాలను కూడా చూపించమనడం నాకూ నచ్చింది :-)
కాంతి... హృదయ పూర్వక శుభాకాంక్షలు. సుజాత నీకు కూడ థ్యాంక్స్.. చక్కటి ఇంటర్వ్యూ కు. అరుణ గారు ఆఫీస్ ల లో తెరవ లేనంత గా ముఖ చిత్రం వుందనటం ఆశ్చర్యం కలిగించినప్పటికి ప్రకృతి అందాలను మరింత ఆవిష్కరించమనే మీ కోరిక మాత్రం ముదావహం. కాంతి ఎప్పటికి ఇలానే సాహిత్య కవితా కిరణ ప్రభ కు వెన్నటే తోడు గా, మా వంటి మిత్రులకు స్పూర్తి గా నిలవాలని కోరుకుంటు.. Congratulations Kanthi.
జ్యోతి గారూ !
నూతన సంవత్సరంలో మీ రచనా జ్యోతి నిరంతరం వెలగాలని, ఏ విధమైన గ్రహణాలు పట్టగూడదని కోరుకుంటూ.... ఉగాది శుభాకాంక్షలతో....
- శిరాకదంబం
Post a Comment