Monday, 15 March 2010

బ్లాగర్లందరికీ ముఖ్య గమనిక..

గత కొద్ది కాలంగా బ్లాగ్లోకంలో హేయమైన రాతలు, మహిళల మీద వ్యంగ్యంగా, అసభ్యంగా రాతలు, వ్యాఖ్యలు రాస్తున్న సంగతి తెలిసిందే. కాని ఇలా రాసి మహిళలను బ్లాగులు రాయకుండా ఆపగలరని అనుకుంటే అది పొరపాటే. పేరు లేకుండా సదరు బ్లాగరు పేరుతో నీచమైన కామెంట్లు పెట్టి తమకు తామే పైశాచికానందాన్ని పొందుతున్న మానసిక వికలాంగులు.. ఈ విషయం అందరికీ స్పష్టంగా అర్ధమవుతుంది. నిజ జీవితంలో ఉన్న మనుష్యులే కదా ఇక్కడా ఉన్నది. ఎపుడు ఆడవాళ్ళ మీద ఏడవడమే. ఇలా చేసేవాళ్ళు చదువురాని మూర్ఖులు కారు. బాగా చదువుకున్న హోదా ఉన్న పెద్దమనుష్యులే. కాని ఇలా ప్రవర్తించడం వాళ్ళ వ్యక్తిత్వమేమో మరి. ఇలాంటి సంస్కారం ఏ తల్లి నేర్పించదు. కాని ఇలాంటి వాళ్ళ గురించి , వాళ్ళ రాతల గురించి బాధపడ్డం అనవసరం. ఇదే మాట నేను మహిళా బ్లాగర్లందరికీ చెప్పదలుచుకున్నాను. పట్టించుకోకండి. పట్టపుటేనుగులా సాగిపొండి. మొరిగి మొరిగి వాళ్ళే పోతారు.

ఇదంతా చెప్పడానికి కారణమేంటి అంతే.. నా పేరుతో కొన్ని బ్లాగుల్లో చెత్త అనేకంటే చండాలమైన , అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. కామెంట్స్ ఆప్షన్స్ లో నా పేరు, బ్లాగు పేరు ఇస్తే అది చూసినవాళ్ళు నేనే రాసాను అనుకుంటారు. ఎందుకంటే ఆ పేరు క్లిక్ చేస్తే నా బ్లాగు తెరుచుకుంటుంది కాబట్టి. కాని ఇక్కడ కామెంట్ రాసింది సదరు బ్లాగరేనా కాదా అని తెలుసుకోండి. నిజంగా ఆ కామెంట్ ఆ బ్లాగర్ రాయాలి అంతే అతని జిమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి కామెంటాలి. అప్పుడు ఆ కామెంట్ పక్కన ఆ బ్లాగరు ప్రొఫైల్ లేదా ప్రవర లో ఉన్న చిత్రం కనిపిస్తుంది. ఇదే గుర్తు. కాని ఆ బ్లాగర్ పేరు, బ్లాగు అడ్రస్ తో కామెంట్ ఉంది కాని ప్రొఫైల్ చిత్రం లేదంటే అది నకిలీ కామెంట్ అని గమనించండి.


ఇకపోతే ఈ అంతర్జాలంలో నేను ఎక్కడ కామెంట్ పెట్టినా నా ప్రొఫైల్ చిత్రం ఇలా ఉంటుంది అది లేనపుడు పేరు కూడా చెప్పుకోలేని ధైర్యవంతుడు అని తెలుసుకుని నవ్వుకోండి.

ఈ అసభ్య రాతలు మహిళల మీదే కాకుండా మరికొందరు పురుష బ్లాగర్ల మీద కూడా జరుగుతుంది. అందరూ కలిసి దీనికో పరిష్కారం సూచించ పాటించమని మనవి..

46 వ్యాఖ్యలు:

Sensitive Fragrance

హాహా చాల బాగా చెప్పరక్క హట్స్ ఆఫ్ టూ యు :

kvsv

healthy ఎట్మాస్ఫియర్ వుండాలండీ,చివరికి దరిద్రపు సాంప్రదాయాలు బ్లాగులోకాన్ని కూడా వదలడం లేదన్నమాట...

గీతాచార్య

RighttO! Must think of something to change the wordpress type of comment box of giving mail id, and url

తారక

మీకూ అంటిచ్చారా?
స్త్రీలు అని కాకుండా, ప్రముఖ బ్లాగర్లందరికీ ఇలా మసి పుసే కార్యక్రమాన్ని మొదలెట్టారు.

Anonymous

ఇది నిజంగా విచారించ దగ్గ విషయం. మంచో చెడో, మన అభిప్రాయం చెప్పడానికి మన I.D నే వుపయోగించాలి లేదా అనామకులుగా వుండాలి కానీ ఇలా imposterగా మారడమెందుకు?

శ్రీనివాస్

మీ పేరు వాడి రాస్తున్నందుకు అందరూ ఖండిస్తారు. మీరు ఇచ్చిన వివరణ , మీ ఒరిజినల్ కామెంటు ఎలా గుర్తించాలో మీరు చెప్పిన విధానం బాగుంది. కానీ మీ విషయంలో జరిగిన దాన్ని మహిళా బ్లాగరుల మీద దాడిగా మీరు అభివర్ణిస్తున్నట్టు ఉంది మీ టపా.

మీరు గమనించాలి ఆడా మగా అని కాకుండా అందరికీ జరుగుతుంది . ఇది ముఖ్యంగా మా అన్నాయి కి చాలా అవతార్ లు ఉన్నాయి. మొన్నటికి మొన కత్తి మహేష్ గారు సైతం ఆ వాఖ్యలు నావి కావు అని ఒక టపా వేశారు. రెండు మూడు చోట్ల మాకూ జరిగింది ఇది.

మహిళా బ్లాగరుల మీద దాడి అనే పదాన్ని ప్రముఖ బ్లాగరుల మీద దాడి గా మారిస్తే బాగుంటుంది అని నా సూచన.

అజ్ఞాతంగానో లేక వేరే వాళ్ళ ఐడి వాడుకుని అసభ్యంగా రాసే వాళ్ళకి దొరక్కుండా ఎలా తిరగాచ్చో నేర్పుతారట కొందరు.

ఇక పోతే గొర్రె కసాయి వాడిని నమ్ముతున్న చందాన కొందరి స్నేహాలు ఉన్నాయని మాకు కొంత వరకు వచ్చిన సమాచారం. వివరాలు మీరు అడక్కూడదు నేను చెప్పకూడదు.

సుజాత వేల్పూరి

Oh, Thanks jyoti garu,
I added a picture to my profile. Just to check this....my comment is here!

స్వర్ణమల్లిక

చాలా మంచి విషయం చెప్పారు, చాలా చాలా థాంక్స్. ఈ గొడవలతో చాలా మంది బ్లాగుల్లోకి రాడానికే భయపడుతూ ఉండచ్చు. మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తాము.

నాగప్రసాద్

ఉహుహహహా...హహాహహ....

ఫ్రొపైల్‌లో పిక్చర్ చేర్చినా కూడా ఫేక్ కామెంటు రాయొచ్చు. ఇప్పుడు మీ బ్లాగులో మీ పేరుతో రాసినా కూడా కనుక్కోలేరు. హుహ్హుహ్హహ్హహ్హాఆఆఆఆఆ.....

ఫేక్ కామెంటు కనుక్కోవడానికి సింపుల్‌గా ఏమి చేయాలో నాకు తెలుసు. ;-).

ఇట్లు
కెలుకుడు స్వామి.

యమ్వీ అప్పారావు (సురేఖ)

మన దేశం లో చదువుకున్న మూర్ఘ్హులు ఎక్కువ మంది వుండటం మన
దురదృస్టం.తన పిల్లలకు మంచి చెడూ చెప్పేది తల్లే. ఏ మాతృమూర్తి
కూడా పిల్క్లలకు చెడు చెప్పదు.కానీ ఆడ వాళ్ళంటె చులకనగా చూసే
మగవాళ్ళను చూస్తుంటె చెప్పలేని జుగుప్స కలుగుతుంది.వీళ్ళిలా ప్రవర్తించడానికి
వాళ్ళకి సరైన లోక జ్ణానం లేదు.మంచి పుస్తకాలు చదవరు.బైకు మీద తిరుగుతూ
ఆడపిల్లలను చూసి కేరింతలు కొట్టడమే తెలుసు.ఇలా తిరుగుతూ ఏదో ఒక రోజు
గోతుల్లో పడటం ఖాయం.స్త్రీ లంతా తమ బ్లాగుల ద్వారా ఇలాటి వాళ్ళకి జ్ణానోదయమ్
కలిగించాలి................ సురేఖ...

శ్రీనివాస్

అల్లో ఎక్సూస్ మీ సురేఖా గారు ,

బ్లాగుల్లో గొడవలకి బైకుల్లో కుర్రాళ్ళకి ముడి పెట్టడం కాదు హాస్యాస్పదంగా ఉంది. చర్చ పక్కదారి పడితే చండాలంగా ఉంటుంది.

గౌరవనీయులైన బ్లాగరులారా ,

మహిళా బ్లాగరుల మీద మగ వెధవల దాడి గా ఈ టాపిక్ మారక ముందే నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను.

గతం లో రెండు బ్లాగులు ఒకేసారి వచ్చి మహిళల మీద ప్రత్యేకించి ప్రమదావనం మీద అవాకులూ చెవాకులూ రాసారు అని అందరికీ తెల్సు చివరి ఆ బ్లాగరు ఒక మహిళ అని అందరూ తేల్చారు ... ఇప్పుడు చెప్పండి మహిళల మీద వంకర రాతలు ఆనాడు రాసింది ఎవరు ???? మహిళలా , మగ వాళ్ళా

ఈ మద్య మరో అజ్ఞాత బ్లాగరు తన బ్లాగు చివర "గే" అని పెట్టుకుని వచ్చి నానా బూతులు తిడితే ... అది కూడా ఒక "అక్కయ్య" అని మలక్పేట్ రౌడీ గారు అనుమానం వెలిబుచ్చారు .... అయ్యా మహిళల మీద దాడులు చేస్తుంది సగం మంది మహిళలే ... ఇంకోసారి అబ్బాయిల మీద అవాకులు చెవాకులు పేలవద్దు.

ముందు వాళ్ళ వెనక తిరిగి అవకాశం కోసం కాచుకునే చొంగ పార్టీల నుండి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. మళ్లా వాళ్ళ ఉంది వెన్నుపోటు పొడిచే సదరు జెమినీ సీరియల్ లేడీ కేరెక్టర్ ల నుండి కాపాడుకోమనండి

ఆ.సౌమ్య

అయ్యో జ్యోతిగారు, ఫొటో పెట్టినా కూడా ఎవరైనా మన పేరు, ప్రొఫైల్ తో కామెంటు పెట్టొచ్చండీ. ఫొటో, ఈ ఫేక్ ఐడి లను ఆపలేదు.

మీరన్నట్టు దమ్ములేకుండా అఙ్ఞాత వ్యక్తులుగానో, లేదా బ్లాగర్ల పేర్లనో ఉపయోగించుకునేవారి గురించి మనం పట్టించుకోనక్కర్లేదండీ. మనదారిలో మనం వెళదాం. అంతే.

పురుషుల ఐడిలు కూడా ఉపయోగిస్తున్న మాట వాస్తవమే అయినా మహిళా బ్లాగర్ల మీద మాత్రమే దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి మన బ్లాగర్లంతా నిరశన వ్యక్తం చేయ్యాలి.

ఈ దాడులు చేసే అఙ్ఞాత వ్యక్తులు ఆడ, మగ అన్నది అనవసరమయిన విషయం. దాడి చేసినదెవరైనా వాళ్ళ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నది అసలు విషయం.

Anonymous

జ్యోతి గారు,
నాకు తెలిసి మీ ఐ.డి. ని ఎవ్వరు అనుకరించ లేదు. ఈ వివాదం ఎక్కడ మొదలైదో తెలుసు. నగ్న దేవతలు అని టైటిల్ పెట్టి హిందూ దేవతా "స్త్రీ మూర్తులను" ప్రదర్శనకు పెడితే మీరెక్కడ కనీసం నిరసన తెలూప లేదు. అలాంటిదీ ఈ రోఈజు మీఎఉ ఆడవాళ్లను అగౌరవ పరుస్తున్నరనడం చాలా హాస్యాస్పదం.

శ్రీనివాస్

I Second Sowmya

Anonymous

జ్యోతక్క గారూ,
బావుంది! కానీ ఇక్కడ వచ్చిన కొన్ని వ్యాఖ్యల్ని గమనిస్తే ఇలాంటి పనులకు ఎవరు దిగరాజారారో అర్థం కావడం లేదా?

మహిళా బ్లాగర్లమీద అసభ్య రాతలు, వారి మీద కామెంట్స్ అనే టాపిక్ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి అనవసరంగా కొంతమంది ఉలిక్కపడేవాళ్లని చూసి మహిళా బ్లాగర్లంతా సరదాగా నవ్వుకోండి. ఆ ఉలికిపాటుకు అర్థం ఏమిటో గ్రహించండి. చాలు!ఇటువంటి వారి బ్లాగులకు, తీయని మాటలకు, స్నేహాలకు దూరంగా ఉండండి చాలు. పైన ఎవరో చెప్పారు కదా...గొర్రె కసాయి వాళ్ళనే నమ్ముతుందని. కసాయి వాళ్ళెవరో గ్రహించే తెలివి ఉంటే చాలు.

చాలా రోజులుగా తెలుగు బ్లాగులు చదువుతున్నా, ఈ మధ్య కొన్ని చెత్త బ్లాగుల్లో మహిళలను ఉద్దేశించి రాస్తున్న వ్యాఖ్యలు చదివినా, వివరంగా అభిప్రాయం రాయలేకపోయాను. సదరు బ్లాగుల్లో రాస్తే వచ్చేది సమాధానం కాదు, బూతు సమాధానాలు. అందుకే అక్కడ రాయలేదు. నాకంటూ బ్లాగు మొదలుపెట్టాలి.

సురేఖ గారూ, చక్కని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్య ఉన్నా, దాని సుగంధం ఎరుగని వారికి ఎంత చెప్పినా వేస్టే!

సౌమ్య గారు,
మీ మీద, మరో బ్లాగర్ ని ఉద్దేశించి రాసిన రాతలు కూడా చూశాను.(మీరు ఆ సౌమ్యేనామ్మా?) జ్యోతి గారు చెప్పినట్లు మొరిగి మొరిగి వాళ్ళే పోతారు.మీరేమీ వర్రీ అవక్కర్లేదు, ఈ మొరుగుళ్ళని పట్టించుకోనూ అక్కర్లేదు.

ఈ వ్యాఖ్య చదివి ఎవరు ఉలిక్కిపడి కామెంట్ రాస్తారో చూడాలి. :-))
నమస్కారాలు.

శ్రీనివాస్

hi kiran kumaar ,

నేను గుర్తు ఉన్నానా , నేను బ్లాగ్ మొదలెట్టిన తొలి రోజుల్లో ఒక రోజు నా బ్లాగ్ లోకి వచ్చి .. ఏదో పెడి మూతి బ్లాగరు , పెడి బ్లాగు అని కామెంటు చేశావ్ నువ్వు . అపట్లో నేను కాస్త భయస్తుడిని అవడం వల్ల ఆ కామెంటు డిలీట్ చేశా. నేను రవి గారి ఫ్రెండ్ అవడం వల్ల నువ్వు అప్పుడు అ కామెంట్ రాశావ్ అనుకుంటా. అపట్లో ఆయనకి ఒక గొడవ జరుగుతుంది.

అప్పుడు మీరు నన్ను పేడి అని అలా ఎందుకు అన్నారు . ఉచితార్ధంగా ?..........మళ్లా ఇప్పుడే ఎందుకు ప్రత్యక్షం అయారు చెప్పు తర్వాత ఎవరు ఉలిక్కి పడ్డారో చూద్దాం

cbrao

ఇక్కడ నాకు కొన్ని సాంకేతిక సందేహాలున్నాయి. ప్రొఫైల్ చిత్రం ను కాపీ చేసి వంచకుడు ఎదైనా బ్లాగులో వ్యాఖ్య రాయటం సాధ్యం కాదా? ఈ టపాకు వ్యాఖ్య వ్రాసిన sowmya ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈమె అసలు సౌమ్య కాదు. నకిలీ అనిపిస్తుంది. అయితే ఆమె (అతడు) చెప్పిన నాలుగు మాటలు మంచి మాటలు. అయితే ఈ వ్యాఖ్యాత ను గమనించవలసినదే. OPen ID లో Identity Theft నివారణ సాధ్యమా? మీ పేరుతో వ్రాసిన వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు. మీ పై అసూయతో ఆడవారు చేస్తున్న పనా ఇది? వీటిని పట్టించుకోవాలా?

సుజాత వేల్పూరి

Hi Sowmya,
So, there is no use of adding a picture to profile. ;-))

But, you are right! Ignoring is the best method.

If its a constructive opinion, we can welcome. Doing these things just to have fun in the name of women..thats sick!

Pity them! Simply ignore!

కత పవన్

సురేఖ గారు
నమస్కారం అండి
ఇక్కడ పైనా రాసిన టాపిక్ ఏంటి మీరు రాసిన మాట ఏంటి బైకులో తిరిగే కుర్రాళ్ళు చేస్తున్నారని మీకు ఏలా తేలుసు.తిరిగి తిరిగి కుర్రాళ్ళ మీదికి వచ్చేయడేమేనా.కుర్రాళ్ళు అంటే మరి కామేడి అయిపొయింది ప్రతి ఒక్కరు క్లాస్ లు చేప్పేయడమే..
మీరు అనుకున్నట్టు ఇది కుర్రాళ్ళు చేసిన పని కాదు అయినా నేను రాయకుడదు అనుకున్నాను కాని మీ మాటలు చుసాక రాయలనిపించింది.మీరు అడవారికి మద్దతు ఇవ్వండి దాని కోసం కుర్రాళ్ళని తక్కువ చేయవలసిన అవసరం లేదు.
జ్ణానోదయమ్ కలిగించాలి..జైలు కి పంపాలి అంటున్నారు ఒక్కపని చెద్దాం కుర్రాళందరిని ఊరి తిసేద్దాం అప్పుడు అడవారికి ఏ సమస్య లేదు....

Shiva Bandaru

OPen ID లో Identity Theft నివారణ వందశాతం సాద్యమే.

Shiva Bandaru

పైన నేను రాసిన కామెంట్ CBRAO గారికి.

నాగప్రసాద్

ఇక్కడ బ్లాగుల్లో బైకుల్లో తిరిగేది పవన్ మరియు వికటకవి శ్రీనివాస్ మాత్రమే. కాబట్టి, మొదటినుంచీ కూడా వాళ్ళమీదనే నా అనుమానం కూడా. :))). నేను మాత్రం పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై సైకిల్లో మాత్రమే తిరుగుతాను. ఈ విషయంలో నేను అమాయకుణ్ణి బాబు. నన్నొగ్గెయ్యండి. ;-).

SADASIVARAO

Jyothi garu,................................"UGADI"[nutana telugu samvastaradi]Subhakanshalu. SADASIVARAO

Anonymous

ఇక్కడ మగ-ఆడ విషయం కాదని కొట్టిపడేస్తున్నవాళ్ళందరూ కేవలం ఆడవాళ్ళను ఉద్దేసించి మాట్లాడేటప్పుడే ఇలా వ్రాస్తున్నారని ఎందుకు అర్ధం చేసుకోవట్లేదో? బ్లాగుల్లో మిగతా విషయాలన్నిటికీ మాటలనో, సిద్దాంతాలనో హేళన చేస్తారు. కేవలం ఆడవాళ్ళ విషయానికొచ్చేటప్పటికే అసభ్య రాతలు వ్రాస్తున్నారు. దయచేసి ఇది గ్రహించండి. మీరు అక్కడ మందలించరు. కానీ ఇక్కడ మందలిస్తారు. కారణమేమిటి?

@srinivas
మీరు వ్రాసే టపాలు చూసి మిమ్మల్ని గౌరవిస్తాను.
But i have problem with you dismissing our views as mere prejudices.
కొన్ని విషయాల్లో prejudices సహజమే. మీడియాలోనో, మరెక్కడైనా ఆడవాళ్ళని ఊరికే సపోర్ట్ చేసెయ్యటం జరుగుతుంది. అలాంటివాటిని ఖండించటంలో తప్పులేదు. కానీ ఇక్కడ విషయం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మీరిలా మాట్లాడటంలో అర్ధంలేదు.
గత కొద్దిరోజుల్లో ఒక వివాదాస్పదమైన టపా వ్రాసినందుకు ఒకతనిపై, ఆ టపాకు అనుకూలంగా కామెంటినందుకూ ఇంకొకామెపై వేర్వేరుగా ఎలా వ్యాఖ్యానించారో మీరే చూడండి. మరి ఈ విధంగా అనుకోక ఇంకేమనుకోమంటారు?

Malakpet Rowdy

ఈ అసభ్య రాతలు మహిళల మీదే కాకుండా మరికొందరు పురుష బ్లాగర్ల మీద కూడా జరుగుతుంది
____________________________________

This sentence tells me a lot.

I strongly feel ( A few others too ) this is an attempt to divert the attention of the bloggers from one of the popular issues.

You people did it last year too :))

Anil Dasari

ఇంటర్నెట్టన్నాక ఇలాంటివుంటాయి. గుంపులో గోవిందయ్య మనస్తత్వాలు కదా మనవి. పట్టుబడమనే ధైర్యముంటే తప్పులు చెయ్యటానికి ఎందరో సిద్ధం. మీరెన్ని టపాలు రాసినా వాళ్లని మార్చటం కష్టం. పట్టించుకోకపోతే వాళ్లే విసిగిపోయి ఊరుకుంటారు.

మంచు

ప్రతీదానికి ఆడ మగ అని మీరెందుకు విభజిస్తారో నాకు అర్ధం కాదు..
నాకు తెలిసి ఈ ఫేక్ ఐ డి లు ఉపయొగించి రాసేది ఎక్కువ మన ప్రవీణ్ పేరు మీద.. చాలా సార్లు ఎది నిజమో , ఏది ఫేక్ కామెంటో ప్రవీణ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా కంఫ్యుజ్ అవుతారు. ఇలాంటివాటికి బెంబేలుపడిపొకుండా తన రాతలేవొ తను దైర్యం గా రాసుకుపొతున్న ప్రవీణ్ దైర్యానికి, పట్టుదలకి చాలా ముచ్చట వెస్తుంది. తనకి నా అభినందనలు..
అవును పైన సాంబశివుడు అనే ఆయన రాసిన కామెంట్ మళ్ళి అడుగుతున్నా.. మీ దృస్టిలొ సీత, ద్రౌపతి , సరస్వతి ఆడవాళ్ళుకాదా :-))

మంచు

Malak

You got the point :-)

ఆ.సౌమ్య

@కిరణ్ కుమార్ గారు
ఆ సౌమ్యని నేనేనండీ.

@cbrao గారు
నేనే నా ప్రొఫైల్ ని బ్లాక్ చేసాను. అందుకే మీకది కనిపించట్లేదు. ఫొటో పెట్టినా కూడా మన ప్రొఫైల్ ని వాడికోగల చావుతెలివితేటలు వాళ్ళకి ఉన్నాయి. అందుకే ప్రొఫైల్ ని మాత్రమే బ్లాక్ చేసాను. so that they can't use my profile anymore.
నేను బ్లాగ్ ని close చెయ్యలేదు,చెయ్యను కూడా. here is my blog
http://vivaha-bhojanambu.blogspot.com/

నా మీదఅనుమానమక్కర్లేదండీ, నేను అసలు సౌమ్యనే.

@సుజాత గారు
అవునండీ ఫొటో పెట్టినా వాళ్ళు మన ప్రొఫైల్ ని వాడుకోగలరు. so just ignore them !

శ్రీనివాస్

@@ myviews2009

మీరు వ్రాసే టపాలు చూసి మిమ్మల్ని గౌరవిద్దామనుకున్నా అక్కడ టపాలు లేవు.

కానీ ఇంకా నేను ఈ వివాదం లో వేలు పెట్ట దలచుకోలేదు. అలాగని ఎప్పటికీ చొంగ కార్చే ప్రసక్తే లేదు. నేను చెప్పేది ఒకటే అన్యాయాలు జరిగినప్పుడు మహిళ పక్కన కాకుండా మనిషి పక్కన నిలబడండి . ఇంక ఇంతే సంగతులు. జైహింద్

సోదరి

చదువు కోని మూర్ఖులు .అంటే చదువు రాని వారు మూర్కులనా?క్షమించండి ఈ వ్యాఖ్యం నాకు నచ్చలేదు

నాగప్రసాద్

@Sowmya: Profile బ్లాక్ చేస్తే ఫేక్ కామెంటు పెట్టడం మరీ సులభం. అస్సలు కనుక్కోలేరు. :))).

నాగప్రసాద్

ఇక్కడ ఇంతమంది ఫేక్ కామెంట్ల గురించి ఇన్ని నీతులు చెబుతున్నారు కానీ, మార్తాండ మీద అంతమంది ఫేక్ కామెంట్లు రాసినప్పుడు ఒక్కరైనా ఖండించారా? పైగా ఎంజాయ్ చేసుకున్నారు. :)). అదీగాక, ప్రనా మీద ఏకంగా ఒక బ్లాగే తెరిచి ఆడుకున్నారు. అయినప్పటికీ మార్తాండ ఏమైనా చలించాడా? పోనీలే అని నవ్వుకున్నాడు. :)). మీరందరూ ఫేక్ కామెంట్ల విషయంలో మార్తాండను చూసి నేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నా. :))).

జ్యోతి

ఇక్కడ ఒక్క విషయం గమనించమని మనవి చేస్తున్నా.. ఈ టపాకు మహేష్ కి ఎటువంటి సంబంధం లేదు. I am least bothered abt mahesh. నేను అతడి బ్లాగు చదివి చాలా కాలమైంది. అందుకే మహేష్ కి సంబందించిన, వివాదాస్పదమనిపించిన వ్యాఖ్యలు అనుమతించడం లేదు.

శ్రీనివాస్,, ఇక్కడ నా మీద మరికొందరు మహిళల మీద అసభ్య రాతలు, కామెంట్లు రాసిన వారి గురించి నా టపా పెట్టాను. నువ్వు రాసావని నేను అన్నానా? మరి నీకెందుకు కోపమొస్తుంది. మరి వేరే బ్లాగుల్లో నా మీద కాని ఇతర బ్లాగర్ల మీద వెకిలి రాతలు రాసినప్పుడు అందరూ వెళ్ళి స్మైల్ ఇచ్చేసి వస్తున్నారే. అసభ్యంగా మారినపుడు ఒక్క భరద్వాజ్ తప్ప ఎవరూ ఖండించలేదు. ఇన్నిరోజులు ఊరుకొని ఇప్పుడు నేను నిలదీసి అడిగితే కోపమొస్తుందే అందరికీ. అప్పుడేమయ్యారు మీరంతా?? ఈ రాతల వల్ల మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంటే కెలుకుడు, పేరడీ అంటున్నారు. దానివల్ల కొందరు మహిళా బ్లాగర్లు తమ బ్లాగులు మూసేస్తాము, ఎందుకొచ్చిన పెంట అని అన్నారు. అది మీకనవసరం అంటారు. అందుకే నేను వారందరికీ ధైర్యం చెప్పడానికే ఈ టపా రాసింది. ఐనా నన్ను ఏనుగులా ఉండమని చెప్పింది పురుష బ్లాగర్లే. అదే మాట నేను మిగతా మహిళా బ్లాగర్లకు చెప్పాను.

ఇక సురేఖ గారు చెప్పింది. అబ్బాయిలను అనగానే నీకెందుకు అంత కోపం వచ్చింది. నీ పేరు పెట్టి అన్నారా? లేదా అబ్బాయిలందరికీ నువ్వు ప్రతినిధివా?. మేము చూసిన సంఘటనలు, నువ్వు చూసావా? మరి నిన్నే నిలబెట్టి అడిగినట్టు అంత రెచ్చిపోవడమెందుకు..

భరద్వాజ్ గారు,,

మీరు భలే చెప్తారండి.. స్రీనివాస్ ఏమో మీరెప్పుడూ మహిళా బ్లాగర్ల వైపే మాట్లాడతారు. పురుష బ్లాగర్లని కూడా వెకిలిగా రాస్తున్నారు కదా మరి అంటేనే నేను చివరి లైను కలిపాను. మీరేమో దానికి మరో అర్ధం చూపిస్తున్నారు. కావాలంటే పైన కామెంట్ చూడండి. ఐనా టాపిక్ డైవర్ట్ ఎందుకు చేస్తాను. డైరెక్టుగా అడిగాను. మొత్తం తిరిగి నా మీదకే తిరిగింది గా. ఐనా నేను టాపిక్ డైవర్ట్ చేయగానే నమ్మేటంత అమాయకులా ప్రజలు..:)

అబ్రకదబ్ర గారు

మీరన్నది నిజమే. ఎంతో కాలంగా జరుగుతున్నది చూసి ఊరుకునే ఉన్నాను. కాని ఒక్కసారి నేను ఎదురు తిరిగి అడిగేసరికి అందరికీ ఎంత కాలుతుంది చూడండి. తనదాకా వస్తే కాని తెలీదంటారు. రాయాలంటే ఎవరి పేరుతో వాళ్లని రాయమనండి. నిలదీసి సదరు బ్లాగరునే అడగండి. ఇలా వేరేవాళ్ల పేర్లతో ఫేక్ కామెంట్లు అందునా అసభ్యకరమైనవి పెడితే కూడా ఊరుకోవాలంటారా? దీనివల్ల బ్లాగ్ వాతావరణం ఇంకా చండాలంగా మారుతుంది.

నాగ..

కెలుకుడుకు కూడా లిమిట్ ఉంటుంది. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. అన్నివేళలా హాస్యం పనికిరాదు..

Anonymous

కేవలం ఆడవాళ్ళ విషయానికొచ్చేటప్పటికే అసభ్య రాతలు వ్రాస్తున్నారు.

ఈ మాట నిజం కాదండీ ! ఈ మధ్య కలగూరగంప బ్లాగులో వ్యాఖ్యాతలు ఆ రచయితని ఉచ్చరించలేనంత వల్గర్ లాంగ్వేజిలో అటాక్ చేశారు. అందరికీ తెలుసు.

cbrao

సౌమ్య లు చాలా మంది ఉన్నారు. ప్రొఫైల్ ఉన్నవారే నిజమైన సౌమ్య.

Malakpet Rowdy

Ohk, I didnt understand the context and thought you were talking about a specific blogger being criticized.

Sorry bout that!

Malakpet Rowdy

ahhh I understand the issue now.

నేనిందాకటిదాకా పవన్ పోస్ట్ చదవలేదు. అందుకే "అప్పుడెప్పుడో కాగడా బ్లాగులో ఎవరో పెట్టిన ఫేక్ కామెంట్ కి జ్యోతిగారు ఇప్పుడెందుకు రెస్పాండ్ అయ్యారా" అనే డౌటొచ్చింది.

I thought it was an attempt to distract the bloggers.

కత పవన్

బాబోయ్ మలక్ గారు మీరు ఇలా పవన్ అని పేరు చేప్పెసి ఉరుకుంటే మళ్ళి నేను ఏదో చేసాననుకుంటారు.
మిరు భలే వారండి...:)
నా బ్లాగులో జ్యోతి గారి id తో నన్ను తిట్టారు..అది డిలిట్ కుడా చేసా ఇంతలో కోందరు పోరపాటు పడ్డారు..వారికి నేను సమాధానం కుడా చేప్పా..అది రాసింద్ ఫేక్ అని..
ఏ ముహుర్తానా ఈ బ్లాగుల్లోకి వచ్చానో చేయని దానికి వివరణలు ఇచ్చుకోలేక చస్తున్నా..అది విషయం

భావన

హ్మ్... సారి జ్యోతి లేట్ గా చూసేను పోస్ట్. ఎక్కడ చూసినా ఈ మధ్యన అజ్నాత ల పేరు తో అందరి మీద లేకి కామెంట్ లు రాయటం ఎక్కువ అయ్యింది. ఇక ఆడ అనే జెండర్ రాగానే కనుబొమ ఎగరేసి పుటుక్కున బాగా పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మన ఇంట్లో వాళ్ళను కలిపి కామెంటటం సాధారణ ప్రక్రియ ఐపోయింది. బయట పడనంత వరకు అందరు దొర లే దొరసానమ్మ లే. నువ్వన్నట్లు పట్టపు టేనుగు లా సాగి పోవటమే పరిష్కారం. వాదన లతో ఎవ్వరిని మార్చలేము. కాని అలా కామెంటే వాళ్ళను చూసి అధైర్య పడే ఆడ వాళ్ళ కు మాత్రం ఖచ్చితం గా ధైర్యం చెప్పాలి. ఈ రకమైన బురద చిమ్మటం అనేది ప్రతి రంగం లోను వున్నదే ఎదురు తిరిగి ధైర్యం గా నుంచోవాలి కాని పారి పోయి ఏమి ప్రయోజనం. మనం మన మనఃసాక్షి కి తప్ప దేనికి జవాబు దారి కాదు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళకు పిచ్చి రాతలు రాసే, పిచ్చి ఆలోచనల తో తిరిగే వాళ్ళకు ఒకటే మాట. You are doing an action(deed). you know for yourself its right or wrong. Irrespective of your awareness (cause it deceives some times), you will get the price/result for every action you did (good or bad). nothing will be disregarded in this world. ఇదే జీవిత వేదాంతం. అర్ధం అయ్యే వాళ్ళకు అవుతుంది అవని వాళ్ళకు అవ్వదు. కాని నువ్వు చాలా నిర్ద్వందం గా నిక్ష్పక్షపాతం గా బాగా చెప్పేవు అనిపించింది నాకు. Nice of you Jyothi.

Anonymous

@ ఓబుల్‌రెడ్డి
ఓబుల్‌రెడ్డిగారు, మీరిక్కడొక విషయాన్ని గమనించవలసి ఉంది. మీరు తాడేపల్లిగారిని ఒక్కరిని ఉదహరించగలిగారు. సరే ఆ ఒక్కరినే తీసుకుందామాన్నా అతను వ్యక్తం చేసినంత నిక్కచ్చిగా ఈ అమ్మాయిలెవరూ అభిప్రాయాలు వ్యక్తం చేయటం నేను చూడలేదు. అసలు నిక్కచ్చిగా మాట్లాడటం అటుంచండి...కొంతమంది అసలు వాళ్ళ మానాన వాళ్ళు వ్రాసుకుంటున్నారు...వాళ్ళ గురించి కూడా అసభ్య రాతలు వ్రాశారు. అయితే ఆ బ్లాగు కూడలిలో కనిపించదు....అదొక్కటే రిలీఫ్. ఇక్కడ మందలించిన వాళ్ళే అక్కడ స్మైలీలు పెడతారు.

కూడలి బ్లాగుల్లో అసభ్యరాతల వరకూ వస్తే ఇక్కడ కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్‌కి కొంచెం వ్యతిరేకంగా ఉండే ఆడవాళ్ళున్నసరే ఈ విధంగా సైలెన్స్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి గమనించండి.

మన జీవితాలను బ్లాగులకే అంకితం చేసేసినట్లు ఇక్కడ ఏమైనా జరిగితే దాన్ని ఎంతో conspiracy చేసి సైడ్‌ట్రాక్ చెయ్యటానికి ప్రయత్నిస్తామా? ఈ ఆరోపణలు ఎంత వరకూ సమంజసం? దయచేసి చెప్పండి. ఇదేం అజమాయిషీ? వాళ్ళొక అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళనెవరైనా అడుగుతున్నారా? మరి జ్యోతిగారినెందుకలా ఈ ప్రశ్నలు వేయటం?

Malakpet Rowdy

ఇక్కడ మందలించిన వాళ్ళే అక్కడ స్మైలీలు పెడతారు.
___________________________________

శ్రీనివాస్ స్మైలీలు పెట్టాడు, తప్పనుకున్నప్పుడు తప్పు అనీ చెప్పాడు. ఇక్కడ ఇన్ని లెక్చర్లిస్తున్న మీరు మరి అక్కడ ఎందుకు సైలెంట్? ఏమన్నా అంటే మిమ్మల్ని కడిగేస్తాడని భయమా?

ఇదే జ్యోతి విషయంలో ఏడాది క్రితం కాస్త లిమిట్ దాటి రాసినప్పుడొ, లేకపోతే రమణి విషయంలో ఎవరో అర్ధం లేని కామెంట్ పెట్టినప్పుడూ మీరేం గాడిదలు కాస్తున్నారు? వాటిని కాస్త తీసెయ్యమని చెప్పారా? లేదే? వాటిని చూసి ఎంజాయ్ మాత్రం చేశారు. కానీ మీరాడిపోసుకుంటున్న ఈ శ్రీనివాసే ఆ కామెంటుని వ్యతిరేకించినవారిలో ఒకడు. అక్కడ నచ్చనప్పుడు అక్కడ నచ్చలేదన్నాడు, ఇక్కడ కూడా అదే మాట మీదున్నాడు - మీలాగా కాకుండా!

Malakpet Rowdy

ఇప్పుడే ఎవరో చెప్పారు. నేనేవో బూతురాతలకి సపోర్ట్ ఇస్తున్నానని కొంత మంది బ్లాగర్లు అనుకుంటున్నారని. నేనెక్కడ బూతురాతలకి సపోర్ట్ ఇచ్చానో ఎవరైనా చెప్తారా?

పోస్ట్లు చదవకుండా, పోస్టులో ఏ వాక్యానికి సంబంధించి నేను కామెంట్ పెట్టానో చదవకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు హారం లో కామంట్లు చదివితే అలాగే ఉంటుంది మరి.

My friends know what I am and what I am not. EoD.

Malakpet Rowdy

అన్నట్టు పేరుకి ముందు "@" పెట్టే అలవాటు బ్లాగుల్లో ఎంతమందికుందబ్బా?

కమల్

ఏంటో ఎక్కడ చూసినా ఈ టి.వి సీరియలాంటి గొడవలేనా..? బహుశ మన భారతీయ సంస్కృతే ఇంతేనేమో..? మన ఆలోచనలు, అభిప్రాయాలు, సరదాలు, గతస్మృతులూ రాసుకోవడానికి పదిమందితో పంచుకోవడానికీ బ్లాగ్స్ తయారు చేసుకున్నాము..ఇక్కడ కూడ అదే గొడవేనా..? వీల్లందరినీ చూస్తుంటే కేవలం గొడవలకోసమే పుట్టినట్లు..వాటికోసమే బతుకుతున్నట్లుంది..!ప్చ్ అంటూ ఈ మానసికరోగుల మీద జాలి చూపిస్తూ మన పని మనం చేసుకోవడం ఉత్తమమైన పని..!

sridevi

jyothi garu,me guru,nenu e blogs ki kottha.e madyaney blogprasana chesanu.ninna eenadu lo chadivi me blog chuddunu kadda!?ikkada hot hot ga vundi.ikkada react ayina vallalo peru petti cheppakundaney kattipeetalu lanti vallunnaru.kandalu kuda vallenemo ani anukovalsi vasthundi ani theliyadam leda vallaki?ledante nijamganey ........edi emyna meru chesthunna seva karyakramalu prasamsaneeyam.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008