Saturday, July 17, 2010

ఓట్స్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ఈ బిజీ బిజీ లైఫ్ లో ఆహారం మీద శ్రద్ధ తీసుకోవడం తగ్గుతుంది. అందుకే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఓట్స్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పక చేర్చుకోండి. మరి అవి ఎలా తయారు చేసుకోవాలి అంటారా? ఐతే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ఓట్స్ వంటకాలు చూసి నేర్చుకోండి. చాలా ఈజీ..

14 వ్యాఖ్యలు:

తార

ఆహా ఓట్స్ బాకా మీరూ ఊదతున్నారా?
ఎవడో తలమాసిన వాడు అమెరికా వారు ఏది తినాలో రాస్తాడు, అది చూసి మన పేపర్ వాళ్ళు, నవ్యలో, వసుంధరలొనో, పైన చెప్పిన సాక్షి లోనో వేస్తాడు, మనం పిచ్చోల్ల లాగా, అవి నమ్మేస్తాం,
అమెరికా లో ఉన్న మన చుట్టాలు గొప్పగ ఇవి తింటున్నాం అని చెప్తారు, ఇంకేమి అంతకన్నా బలవర్ధకమైన మన ఆహార అలవాట్లు అంటే చిన్న చూపు వచ్చేస్తుంది.
జీడి పప్పు మొహం చూడని వాడు, అమెరికా నుంచి వచ్చిన ప్యాక్‌డ్ జీడిపప్పు ఊరు మొత్తం వినపడేలా నమిలి తినట్టు ( ఆ జీడి పప్పు మన పలాసనుంచి అక్కడికి పంపింది అని దానిమీద రాసే వుంటుంది ఐనా)
ఒక్కసారి, ఈ పంట మన దేశంలో అడుగుపెడితే వరి, గోధుమ మర్చిపోవటమే, ఘోరమైన కరవు వస్తుంది.
దీని మీద నేను మా అసైన్సులో ఓ టపా వేస్తాను, మీరు కాస్త ఒక ఐది వంటలు 15ని. కన్నా తక్కువ సమయంలో ఐపోయే మన అల్పాహార వంటకాల పేర్లు చెప్తారా?
మర్చిపోయాను, ఓట్స్ కి బాగా దగ్గిరగా ( ఇండియన్ ఓట్స్ అనుకోండి) ఉండే పంట, మందేశంలో పండే పంట ఒకటి వున్నది దాన్నే సజ్జలు అంటారు. ( సజ్జలని తింటం చూసే రష్యా వారు ఓట్స్ ని తినొచ్చు అని తెలిసింది) ఇవి అన్నీ మనకి అనవసరం కదా, అమేరికా లో ఇది తింటున్నారయ్య అంతే.

జ్యోతి

తారగారు,

ఓట్స్ గురించి రాసినంత మాత్రాన బాకా ఊదడమవుతుందా? ఆ కంపెనీవాళ్లు నాకు డబ్బులు ఇస్తే అలాగే చేస్తానేమో? సేమ్యా, అటుకులు లాగే ఓట్స్.ఈ మధ్యే వీటిగురించి తెలిసింది నాకు. వేడిపాలల్లో గుప్పెడు ఓట్లు వేసుకుని పంచదార కలుపుకుని తింటారని మాత్రమే తెలుసు. అమెరికానా, అనకాపల్లా అని ఆరా తీయలేదు. చాలామంది ఓట్స్ తింటున్నారు, ఆరోగ్యానికి మంచిది అంటే ఈ వంటకాలు తయారు చేసుకున్నాను. వరి, గోధుమ, జొన్నలు మేము వాడతాము. ఇంకా నాకు తెలియని ధాన్యాలు ఉన్నాయి. తైదలు, అలసందలు,కొర్రలులాంటివి. కాని వాటిని నేను ఎప్పుడు తినలేదు కాబట్టి ఎలా వండాలో తెలియదు. మీకు తెలిసిన వివరాలు ఉంటే చెప్పండి . తప్పకుండా వాటితో అందరికి ఉపయోగపడే విధంగా వంటకాలు చేస్తాను. ప్రతీదానికి వాడెవడో చెప్పాడు, వాడెవడో తిన్నాడని మనమూ గొర్రెల్లా వాటెనకాల వెళతామా? ఇది నాకు అస్సలు నచ్చని పాలసీ..

Tekumalla Venkatappaiah

Tara garoo.. okka sari Oats upayogalu choodandi. Ascience vallu kooda chadavochu. No prob.

The oats which is included in the diet in the form of cereal bars, biscuits, flapjacks, etc. is recommended for the fulfillment of the nutrition demands of the body. The 50g porridge made from oats would provide the body with following recommended dietary allowances (RDA) of nutrients.
Calcium (19% RDA)
Phosphorous (34% RDA)
Zinc (17% RDA)
Vitamin B (12% RDA)
Iron (67% RDA)
Vitamin B1 (18% RDA)
Vitamin B2 (16% RDA)

Oats Nutrition Facts

1. Helps in Weight Loss

2.Absorbs Cholesterol:
3.Prevents Heart Diseases:

4. Controls Glucose and Insulin Levels:
5. Reduces Cancer Risk:
6. Healthy Diet for Children:
Effects the Nervous System Positively:

7. Acts as Anti-depressant:

8. High-fiber Content:

9. Prevention of the Celiac Disease: The prolamines (commonly known as gluten)

10. Presence of Quality Proteins: The protein quality in oats is equal to that of soy protein and this has been confirmed by the World Health Organization (WHO).

11. Enhances Athletic Performance:

12. Induces Longevity:

13. Helpful in Healing:

The above mentioned oats nutrition facts give us an idea about the benefits of consuming oats on a daily basis. Oats are thus, an ideal meal for those who want stay fit and healthy.

Tekumalla Venkatappaiah

Taara garoo.. pl chadavandi.

The oats which is included in the diet in the form of cereal bars, biscuits, flapjacks, etc. is recommended for the fulfillment of the nutrition demands of the body. The 50g porridge made from oats would provide the body with following recommended dietary allowances (RDA) of nutrients.
Calcium (19% RDA)
Phosphorous (34% RDA)
Zinc (17% RDA)
Vitamin B (12% RDA)
Iron (67% RDA)
Vitamin B1 (18% RDA)
Vitamin B2 (16% RDA)
Oats Nutrition Facts
The oat nutrition facts presented below would enable us in understanding the benefits of consuming oats on a regular basis. The following oats nutrition facts discuss the importance of oatmeal in cholesterol regulation, weight loss, control of insulin levels, etc.

Note: Oats gurinchi inka details kavalante naaku mail ivvandi.

Tekumalla Venkatappaiah

Tara garoo.. chadavandi please.

The oats which is included in the diet in the form of cereal bars, biscuits, flapjacks, etc. is recommended for the fulfillment of the nutrition demands of the body. The 50g porridge made from oats would provide the body with following recommended dietary allowances (RDA) of nutrients.
Calcium (19% RDA)
Phosphorous (34% RDA)
Zinc (17% RDA)
Vitamin B (12% RDA)
Iron (67% RDA)
Vitamin B1 (18% RDA)
Vitamin B2 (16% RDA)
Oats Nutrition Facts
The oat nutrition facts presented below would enable us in understanding the benefits of consuming oats on a regular basis. The following oats nutrition facts discuss the importance of oatmeal in cholesterol regulation, weight loss, control of insulin levels, etc.

తార

--అందుకే మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఓట్స్ ను మీ బ్రేక్ ఫాస్ట్ లో తప్పక చేర్చుకోండి.

దీనికి నేను బాకా ఊదటం అన్నాను, ఎంతో ఉపయోగకరం, తప్పక చేరుకోండి అన్నందుకు. ఆరోగ్యానికి అనేది కుడా ఇంకా నిరూపితమవ్వలేదు,
తరువాత, మిగతా వాక్యాలో ఏ ఒక్కటీ మీ గురించి రాయలేదు, మన జనాభా గురించి, అది అమెరికా అంటే వున్న మోజుతొనే మనకి వచ్చినది.

--ప్రతీదానికి వాడెవడో చెప్పాడు, వాడెవడో తిన్నాడని మనమూ గొర్రెల్లా వాటెనకాల వెళతామా?

అలా వెళ్తున్నామే నా బాధ, అందులోనూ ఇది మన దేశం వచ్చిందా నాశనమే, సంవత్సరం పంట, వరికి కావాల్సిన/ అవసరం ఐన దానికన్నా దీనికి 10 రెట్ల పోషకాలు అవసరం, ఇంతా చేస్తే దాని రేటు సామాన్యుడు భరించగలిగే స్తాయికి సుదూరం. మళ్ళీ అవి అన్నీ బిటీ పంటలు

ఎదో ఇలా గొర్రెల్లగా గుడ్డిగా అమెరికాని అనుసరిస్తూ మనకి మనమే చాలా చేటు చేసుకుంటున్నాం అని తప్ప, మీపై నాకు ఎటు వంటి వ్యక్తిగత ద్వేషం లేదు, కాకపొతే కొంచం ఆవేశపడ్డానేమో క్షమించగలరు.

Malakpet Rowdy

Are oats native to North America? I never knew that before. In any case there is nothing wrong in grabbing a few good ideas from the others. Oatmeal is much better than the American burgers and the Italian Pizzas.

As of the crops even the farmers need money. I know many who gave up on rice for tobacco.

Malakpet Rowdy

Indians didn't need oats so far because the traditional Indian food contained a lot of fiber. Now with new food trends especially in the urban areas the risk of Colon cancer is going up. Eating oats is one of the effective ways of dealing with this.

By the way I shed a few pounds by substituting rice with oats for a few weeks.

తార

ఓట్స్ రష్యా పంట మలక్ గారు, మిగతా ప్రశ్నలకి నేను అసైన్సులో సోమవారం జవాబిస్తాను.

శరత్ కాలమ్

నేను ఓట్స్ రోజూ పాలల్లో కలుపుకొని అల్పాహారం లాగానూ స్నాక్ గానూ వాడుతుంటాను. అందువల్ల నా శరీరానికి మంచి ఫైబర్ లభించడమే కాకుండా నాలో హెచ్చుగా వున్న ట్రైగ్లిసరాయిడ్స్ తగ్గిముకి అది దోహద పడుతుంది. ఓట్‌మీల్ వివిధ ఫ్లేవర్లలో వస్తోంది కాబటి తినడానికి/తాగడానికి చాలా రుచికరంగా వుంటోంది. నాకు బ్రవున్ సుగర్ మరియి మ్యాపిల్ సిరప్ ఫ్లేవర్ అంటే బోలెడంట ఇష్టం. నా ఫేవరెట్ మీల్స్ లో ఓట్ మీల్స్ ఒకటి. చాలా బాధేసినా, ఆనందం వేసినా ఏ స్వీటో తినకుండా ఓ ఓట్మీల్ ప్యాకెట్ ఒహటి లాగించేస్తాను.

ఇది విదేశీ అని తిరస్కరించేవారు అలాగే అన్ని విషయాలు తిరస్కరిస్తే బావునుంది. ఉదాహరణకు తాము వ్యాఖ్యక్లు వ్రాయడానికి ఉపయోగించే కంప్యూటర్ మరియు సెల్ ఫోనులు గట్రా గట్రా. తాటాకుల మీద వ్యాఖ్యలు వ్రాసి పంపిస్తే బెటర్ :) అలాగే తాటాకుల మీద వ్రాసే బ్లాగర్లని చూసుకోవడం బెటర్. స్వదేశీ అని, సంప్రదాయం అనీ, సనాతనం అనీ జండా పట్టుకొని ఊపే తాడేపల్లి లాంటివారయినా కనీసం కంప్యూటర్లు వదిలేసి తాటాకుల (మీద) బ్లాగింగ్ చేస్తున్నారేమో చూడండి. అన్నట్లు బ్లాగింగ్ కూడా విదేశీ సంస్కృతి కాదేం :))

శరత్ కాలమ్

హి హి. నిద్రమత్తులో కామెంటేసాను. అందుకే పై నా కామెంటులో చాలా అప్పుతచ్చులు దొర్లాయి!

నాగప్రసాద్

>>"తైదలు, అలసందలు,కొర్రలులాంటివి:.

కొర్ర అన్నం మంచి టేస్టీగా ఉంటుంది. కొర్ర అన్నం మరియు గొంగూర పప్పు కాంబినేషన్ సూపర్. :-)

ఇక అలసందలతో చేసిన వడలైతే సూపరో సూపర్. :-)

ఓట్స్ గురించి నాకు తెలియదు. :-)

ఇక్కడ శరత్ గారు, సంస్కృతికి మరేదో దానికి ముడిపెడుతున్నారు. :-))

శరత్ కాలమ్

@ నాగ
మన సంస్కృతిని కాపాడుకుంటూనే ఏ సంస్కృతిలో ఏ గొప్పదనం వున్నా దత్తత తీసుకుంటూ ఎప్పటికప్పుడూ బూజు పట్టిన విధానాలకు తిలోదకాలు ఇచ్చేవారే నిజమయిన సంస్కృతీ పరిరక్షకులు అని నా అభిప్రాయం. అలా కాని ద్వంద, కుహనా సంస్కృతీ వాదులకు తాటాకులు కట్టే ప్రయత్నమే ఇది. ఈ సోమవారం నా బ్లాగుకి సెలవు కనుక (ఎందుకో ఊహించండి) వీలయితే మంగళవారమే 'తాటాకుల బ్లాగింగ్' పోస్టు. తార భుజం మీద తుపాకీ పెట్టి కొందరినయినా కాల్చాలనేదే నా ప్రయత్నం :D మరి మిస్ ఫైరింగ్ అవుతుందేమో, బూమరాంగ్ అవుతుందేమో :(

ఎనీ వే, ఈ టపాకి జ్యోతి గారు కామెంట్లు డిజబుల్ చేసే సమయం ఆసన్నమయినట్లుంది :)

Afsar

Whatever, at this point I'm an "oat"er! This essay is on my refrigerator now and trying each recipe each day! So cool and convenient!

afsar
www.afsartelugu.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008