అందరూ అందరే...ముఖస్తుతి
మనకు సాయం చేసినవారిని, మంచిపనులు చేసేవారిని పొగడడం మంచిదే. అలా అని వేరేవాళ్ళని తక్కువ చేసి మాట్లాడ్డం ఎంతవరకు సబబు. భీమేశ్వర వరప్రసాది ఐన వేములవాడ భీమకవి చోడగంగు అనే రాజును పొగిడాడంట. కాని ఎంత శాపమిచ్చే శక్తి ఉంటే మాత్రం ఆ రాజును పొగడడానికి వేరేవాళ్ళని తక్కువ చేసి మాట్లాడం ఏం బావుంటుంది చెప్పండి. కాని వేములవాడ భీమకవి చమత్కార చాటువు. గమనించండి..
ఉ.
భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వ పూ
రాజు కళంకు, దైవత ధరాజము డొంకు, పయోధి యింకు అం
భోజ భవుండు పంకు, ఫణి భూషణ దేవుడు సంకు, పద్మినీ
రాజ హితుండు క్రుంకు , సరిరారు గుణంబుల నీకు ధారుణిన్.
ఎంత శపించే శక్తి ఉంటే మాత్రం ఈ కవి ఇలా తిడుతున్నాడేంటి అనుకుంటున్నారా? చమత్కారమంటే అదే మరి..
భోజుడు మంకు మనిషి. మొండి పట్టు వదలని విక్రమార్కుడు.
ధర్మజుడు బొంకు తాడు. అశ్వద్ధామ విషయంలో బొంకినవాడు కదా..
శచీపతి ఇంద్రుడు అహల్యతో రంకు నడిపినవాడు.
కలువల రాజు చంద్రుడు కళంకుడు. మచ్చ కలవాడు.
దైవత ధరాజాము అంటే కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది. కాని అది కూడా డొంకు తుంది. అంటే ఎండిపోతుంది అన్నమాట.
సముద్రం రత్నాలకు నిలయమైనా ఆతుపోతుల్లో వెనక్కిపోయి యింకు తుంది. కాదంటారా?
అంభోజ భవుడు అదేనండి బ్రహ్మదేవుడు పంకు తాడు. వృదాప్యం వాళ్ళ తల వణుకుతూ ఉంటుందని కవి భావన.
ఫణి భూషణ దేవుడు శంకరుడు సంకు (శంఖం లాగా తెల్లగా పాలిపోయి ఉంటాడు)
పద్మినీ రాజహితుడు (సూర్యుడు) రోజూ క్రుంకు తూ, అస్తమిస్తూ ఉంటాడుగా..
కనుక ఓ రాజా పైవాళ్ళందరూ నీలాగా సంపదలు కలిగి, వరాలివ్వగల వాళ్ళే అయినా, నీ గొప్పతనంతో, సుగుణాలతో ఏ మాత్రమూ సరిరారు. ..
ఇలా అంటే ఎవరు మాత్రం ఉబ్బి తబ్బిబ్బైపోరూ. :)
7 వ్యాఖ్యలు:
sarada ga vundi :0
బావుంది జ్యోతి గారు.
"ఫణి భూషణ దేవుడు సంకు,"
శివుడేమి చేసాడండి? 'సంకు' అంటే??
:) బాగుందండీ మంచి పద్యం గుర్తు చేసారు. ఇలాటిదే అడిదము సూరకవి కూడా రాసేడు. ఏరోజుల్లో నూ ఒకరిని మరొకరితో పోల్చి హేళన చేయ్యడం సరదాయే.
evarinee noppinchaka pothe 'joke' kadu, eppudaina!
ippati jokule theesukondi, kontaina punch lekunda vuntayaa? unte, adi joke ela avuthundi? 'doku'avuthundi.
appudainaa, ippudainaa, eppudainaa anthe! sarva kaaleenamaina satyam adi.
'chatuvu' ante chamatkaaram podagabadina padyam. anduke noppinchaka thappadu.
aa vishayaanne jyothi garu, 'thaa novvaka, noppinchaka', bahu chakkaga vivarincharu.
దైవత ధరాజాము అంటే కల్పవృక్షం కాదు... మేరు పర్వతము....మేరు పర్వతము వంగి ఉండడం వలన ధైర్యములో మేరుపర్వతంతో పోల్చలఎను అని అర్థము....
సంకు అంటే బిక్షమెత్తుకోవడము... అని అర్థము... చోడగంగుకు ఇవ్వడమే కాని తీసుకోవడము ఉండదు అని అర్థము..... మీరు తప్పుగా అర్థము చేసుకున్నారు భీమకవి భావాన్ని గురించి.... ఆయన ఎవరినీ తక్కువగా చేయలేదు...చోడగంగు గుణాల్లో పరిపూర్ణుడు అని చెప్పదలచాడు.
భావము :
పరాక్రమమమున భోజరాజు మొండి పట్టుదల కలవాడు కావున చోడగంగును భోజరాజుతో పోల్చలెను.
ధర్మరాజు “అశ్వద్ధామ హతః కుంజరః” అని అసత్యమాడినందున ధర్మము తప్పిన వాడగుటచే బొంకినవాడకుట వలన ధర్మము విషయంలో ఇతనికి పోల్చుటకు వీలుకాదు. శచీపతి ఇంద్రుడు అహల్యాజారుడగుటవలన చోడగంగును ఇతనితో పోల్చరాదని, కలువలరాజు అయిన చంద్రుడు కళంకము(మచ్చ) కలవాడు కావున సాటిరాజాలడని, మేరుపర్వతము క్రుంగుటచే ధైర్యమున ఈతనికి సరిరాదని. సముద్రపు ఇంకిపోయే గుణం కలిగినది కావున గంభీరమున ఇతనికి సాటికాజాలదని. బ్రహ్మదేవుడికి బంకించే గుణము ఉండుటచేత విద్యలో చోడగంగునకు తీసికట్ట అని, శంకరుడు బికిరమడుగుకొనుటచే ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని చోడగంగును పరమేశ్వరునితో పోల్చరాదనియూ, సూర్యుడు క్రుంగిపోవుగుణము కలిగిన వాడగుటచే తేజము నందు పోల్చడానికి సరిరాడని భావము. చోడగంగు గుణములలో పరిపూర్ణుడు అని అర్థము.
అంతే కాని ఎవరినీ తిడుతున్నడని అర్థము కాదు.... భీమేశ్వరుని తనయున్ని అని చెప్పుకొనే భీమకవి భీమేశ్వరున్నే ఎందుకు తక్కువ చేసి చెబుతాడు.
ఏదైనా ఒక వ్యక్తీ గురించి వ్రాస్తే పరిపూర్ణంగా తెలుసుకొని వ్రాయండి.
inko example ఒకనాడు వేటకు వెళ్ళినపుడు తెలున్గారాయుడు నలువైపులా బాణాలను సంధించి వరాహాన్ని ఇక్కడికీ వెళ్ళనీయకుండా నిలిపేసాడు. అదిచూసిన భీమకవి జంతువులను భాద పెట్టరాదు. అవి అడవిని వదిలి జన వాసానికి ఇబ్బంది కల్గించే టపుడు మాత్రమే వేటాడాలని వారించాడు. తిరిగి వచ్చాక రాజుకు వరహమును చంపబోయిన పాపము కలగకుండా వృషభపురాణము(నృసింహపురాణము) అనే గ్రంథాన్ని రచించి రాజుకు అంకితం ఇచ్చి, దాన్ని విశ్లేషనాత్మకంగా చదివి వినిపించాడట. అలా రాజుకు ఆ గ్రంథం వినిపించడానికి ఒక సంవత్సరం పట్టిందట.
అందులో తము వరాహమును బంధించిన కళంకం అంటకుండా ఆ వరాహాన్ని చందమామతో పోలుస్తూ క్రింది నృసింహపురాణములో క్రింది పద్యములో వివరించాడు.
సురచిరపానపాత్రమున సుందరియొక్క తే కేలనిండు చం
దురుడు ప్రకంపితాంగములతోఁ దిలకించెఁ దదానంబుజ
స్ఫురిత వికాస వైభవము సొంపులడంకునమ్రుచ్చిలొంపఁ జె
చ్చెరఁ జనుదెంచికట్టువడి చేడ్పడి భీతివడంకుచాడ్పునన్
భావము: ఆ సుందరి చేతియందున్న మిక్కిలి రమణీయమైన పానపాత్రము (లోటా లేదా పాత్ర) నందు చంద్రుడు అత్యంత ప్రకాశిస్తూ ఉనాడు. చంద్రుడు తన సొంపులన్నియూ ఆ సుందరి ముఖ వైఖరులచే దొంగలింపబడినట్లుగా ఆమె చేతిలో కట్టుబడిపొయిభయముతో వనుకుతూ ఉన్నట్లుండెను...
ఈ పద్యము చదివిన తర్వాత తెలుంగరాయుడు “ భళిరే! కవితా వైచిత్యము. కవీస్వరునిచేఁ చంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ దేవుడు కూడా కట్టుభడిపోతారు. కొద్ది పదార్థమును గొప్పదిగాను, గొప్ప పదర్థమును కొద్దిగాను చేయ నేర్పు కవీశ్వరునికి గాక ఇంకెవరి తరము అవుతుంది? మహా తపస్సు చేసి అష్టసిద్ధులు పొందిన సంయమీంద్రులు కూడా భీమకవీంద్రునకు సాటి రాగలరా? “ అని మిక్కిలి ప్రశంసించగా భీమకవి అష్టసిద్ధులు అనగా ఏమిటో చెబుతాను అని ఈ క్రింది శ్లోకమును చదివాడు.
“అధిమా మహిమా చైవ గరిమా లఘిమా తధా
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వంపశత్వం చాష్ట సిద్ధియః”
Post a Comment