Sunday, August 1, 2010

నేస్తమా నేనున్నాను.....


బ్లాగ్ మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....


స్నేహమంటే మీరు చెప్పే నిర్వచనం ఏంటీ??

అరమరికలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే తోడు స్నేహం. ఆడ మగ అన్న తేడాలు , వయసు అంతరాలు లేకుండా తప్పు చేస్తే నిలదీసి సరియైన మార్గం చూపేవాళ్లే అసలైన మిత్రులు. శ్రేయోభిలాషులు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇస్తూ ఓదార్చే స్నేహితులను పొందినవాళ్లు నిజంగా అదృష్టవంతులు, మిక్కిలి ధనవంతులు . ఒక్కోసారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని విషయాలు మనసు తెలిసిన స్నేహితులతో పంచుకుని సేదతీరతాము. వాళ్లు ఇచ్చే సలహా, ధైర్యం మనను బాధనుండి ఉపశమనం ఇస్తుంది. మన జీవితంలో తోడు, నీడా, ధైర్యం, ధీమా, ఆప్యాయత ఇవ్వగల స్నేహితులు ఉంటే అంతకంటే గొప్ప ఐశ్వర్యం వేరొకటి ఉండదు. ఇటువంటి ఆత్మీయ మిత్రులను ప్రత్యక్షంగా కలిసే పని లేదు. తరచూ మాట్లాడుకోవాల్సిన పని అస్సలు లేదు. ఒక్క మాట , నా గురించి ఆలోచించే ఆత్మీయ స్నేహితులు ఉన్నారనే ఒక్క భావన చాలు... కాని ఈ స్నేహానికి ఎటువంటి అపనమ్మకం, అనుమానం, అసూయ అనేది ఉండకూడదు. ప్రతీ బంధం యాంత్రికమైన ఈ రోజుల్లో స్పటికమంటి స్వచ్చమైన స్నేహాన్ని అందివ్వండి. అందిపుచ్చుకోండి. భద్రంగా చూసుకోండి.

చిన్నప్పటినుండి దాదాపు ఒంటరిగానే పెరిగిన నాకు ఈ అంతర్జాలంలోనే పరిచయమై ఆత్మీయులుగా మారిన నా స్నేహితులు ఎప్పుడూ నా సంతోషాన్ని పంచుకుంటూ , నన్ను ప్రోత్సహిస్తూ, నా తప్పులు ఎత్తిచూపిస్తూ, బాధను కూడా అర్ధం చేసుకుని ఓదార్చి మామూలు మనిషిగా చేసేస్తారు. మరి ఆ ప్రియనెచ్చెలులకు ఏమివ్వగలను?? నావంతు సంతోషాన్ని వాళ్లకు రాసివ్వడం తప్ప..

THANK YOU MY DEAR FRIENDS.....

11 వ్యాఖ్యలు:

సవ్వడి

Happy Friendship Day..

పరుచూరి వంశీ కృష్ణ .

Happy Friendship Day..

swapna@kalalaprapancham

Happy friendship day Jyothi gaaru

Dhanaraj Manmadha

http://bandgf.blogspot.com/2010/08/blog-post.html

I hope u know

మాలా కుమార్

హాపీ ఫ్రెండ్షిప్ డే .

నీహారిక

Happy Friend Ship Day

రుక్మిణిదేవి

HAPPY FRIENDSHIP DAY JYOTIGAARU...

సి.ఉమాదేవి

స్నేహానికన్నా మిన్న ఏముంది జ్యోతిగారు? బ్లాగ్మిత్రులందరికీ మీ ద్వారా నా స్నేహసుమాలు.

SRRao

జ్యోతి గారూ !

THANQ ! HAPPY FRIENDSHIP DAY

శ్రీలలిత

HAPPY FRIENDSHIP DAY..

డా.ఆచార్య ఫణీంద్ర

జ్యోతి గారు !
మీ టపా చదివాక, లోగడ స్నేహం గురించి నేను వ్రాసిన ఒక పాట గుర్తుకు వచ్చింది.
అది ...

నీ హృదయంలో నా స్వప్నాలు
నెలకొని ఉన్నాయి -
నా హృదయంలో నీ భావాలు
బలపడి ఉన్నాయి -
కళ్ళు నాలుగైనా, చూసే
దృశ్యమొకటేలే !
కాళ్ళు నాలుగైనా, చేరే
గమ్యమొకటేలే !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

పై పై మెరుగుల బహుమతి కాదు
స్నేహమంటే -
అవసర పూర్తి సాయం కాదు
స్నేహమంటే -
ఒకరి కోసం ఒకరు గడిపే
జీవనం – స్నేహం !
ఒకరి కోసం ఒకరు చేసే
భావనం – స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

చేయి, చేయి కలిపి తిరిగితే
స్నేహమైపోదు -
మాట, మాట కలిపి నవ్వితే
స్నేహమైపోదు -
ఒకరి సౌఖ్యం కోసం ఒకరు
కష్ట పడుటే స్నేహం !
ఒకరి కష్టం ఒకరు చేకొని
సుఖం పంచుట స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

మీకు మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు !

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008