Wednesday, 1 September 2010

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

అంతర్జాలంలో తెలుగు విరివిగా వాడబడుతున్నది. బ్లాగులు, వెబ్ సైట్లు, పత్రికలు వగైరా మన తెలుగులోనే లభ్యమవుతున్నాయి. కాని ... ఇంకా చాలా మందికి కంప్యూటర్లో తెలుగు చాలా సులువుగా రాయొచ్చు అని తెలీదు. అది తెలియజేయడానికే ఈ వ్యాసం. సెప్టెంబర్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది..





తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించినందుకు అందరం పొంగిపోయాము. కాని తెలుగుభాషకు సాంకేతిక హోదా కూడా లభించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న ఈరోజుల్లో తెలుగుని కూడా సాంకేతికంగా వ్యాప్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ దిక్కున కృషి మొదలైంది కూడా. స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా అంతర్జాలం వాడకం తప్పనిసరి అయిన రోజులివి.


కాని వాటి వాడకానికి ఇంగ్లీషు మాత్రమే అవసరం అనే అపోహ ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ మాట అక్షరాలా సత్యమే అని చెప్పవచ్చు. కాని ఔత్సాహికులైన తెలుగు భాషాభిమానులు ఈ మాట అబద్ధమని నిరూపించేసారు. . ఉద్యోగ, వ్యాపార రీత్యా తెలుగువారు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు. వారందరిని కూడా అంతర్జాలంలోని తెలుగు విజ్ఞానం, పత్రికలు, బ్లాగులు ఒకచోట చేరుస్తున్నాయి. తమ భావాలు, ప్రతిభాపాఠవాలు మరికొందరితో పంచుకునేలా చేస్తున్నాయి. ఈ రోజు ఎటువంటి ఖర్చు , శ్రమ , ఉన్నత విద్య లేకుండా కంప్యూటర్లో చాలా సులువుగా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. కొద్దిపాటి ఆసక్తి, పట్టుదల ఉంటే కాగితం మీద రాసినంత సులువుగా కంప్యూటర్లో, ఇంటర్నెట్టులో (అంతర్జాలంలో) తెలుగులోనే పాటలు, పద్యాలు, కథలు, కవితలు ఏదైనా అలవోకగా రాసేయొచ్చు.

ఐనా ఇంటర్నెట్ లో తెలుగుకు సంబంధించిన సమాచారం ఏముంది అని పరిశీలిస్తే... అంతర్జాలంలో తెలుగు పద్యాలకు, పుస్తకాలకు, సినిమాలకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్ సైట్లు ఉన్నాయి. సాహితీ సౌరభాలు వెదజల్లే వెబ్ పత్రికలు, రాయాలనుకునే ప్రతి వ్యక్తిని ఒక రచయితగా చేసే బ్లాగులు. ఇలా ఎన్నో ఉన్నాయి... అన్నట్టు మనం తెలుగులోనే ఉత్తరాలు కూడా రాసుకోవచ్చండోయ్.. నేటి తరానికి నిత్యావసరమైన కంప్యూటర్ మరియు అంతర్జాలంలో తెలుగు వాడకం కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు. అసలు కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సాధ్యమేనా? మాకు అంత మంచి ఇంగ్లీషు రాదు అంటారా?? ఈ విషయాలు తెలుసుకుంటే ఈ అభిప్రాయం తప్పని మీరే అంటారు..


ముందుగా మనం అంతర్జాలంలోనే ఎటువంటి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా సులువుగా తెలుగులో రాయగలిగే పద్ధతులు ఎన్ని ఉన్నాయో చూద్ధామా??

1. లేఖిని (http://lekhini.org/ )

ఇందులో మీరు పైన బాక్స్ లో తెలుగుని ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే క్రింద పెట్టెలో తెలుగులోకి మారిపోయి ఉంటుంది. అది కాపీ చేసుకుని మనకు కావలసిన చోట సేవ్ చేసుకోవచ్చు

2. గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ (http://google.com/transliterate/indic/telugu )
ఇందులో మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుండగానే తెలుగులోకి మారిపోతుంది. కాపీ పేస్ట్ చేసుకోవచ్చు లేదా ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుంటే నెట్ కనెక్షన్ లేకున్నా మీరు తెలుగులో వ్యాసాలు రాసుకోవచ్చు.

3. క్విల్ పాడ్ (http://quillpad.com/home.html )
ఇక్కడ కూడా మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులోకి మారిపోతుంది.

4. యంత్రం ( http://type.yanthram.com/te )

ఈ ఉపకరణాలన్నీ కూడా అంతర్జాల సంధానం ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇందులో ఇంగ్లీషులో రాస్తుంటే అవే తెలుగులోకి మారిపోతాయి. ఇలా రాసుకున్నదాన్ని కాపీ చేసుకుని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాయడం మొదలుపెట్టినవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి, సులభమైనవి కూడా.

ఇంటర్నెట్ కనెక్ట్ కాకున్నా కూడా తెలుగులో రాసుకోవచ్చు. దీనికోసం బరహా అనే సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్ వేర్ మన సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత చాలా సులువుగా తెలుగులో రాసుకోవచ్చు. మనం ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే అది తెలుగులోకి మారిపోతుంది. ఉదా.. namaskaaram - నమస్కారం.. raama – రామ, seeta – సీత.. ..

కంప్యూటర్లో తెలుగు, బ్లాగులకు సంబందించిన ట్యుటోరియల్స్ కోసం...
బ్లాగ్ గురువు (http://telugublogtutorial.blogspot.com )

6 వ్యాఖ్యలు:

Kalpana Rentala

బ్లాగుల్లోనూ, మెయిల్స్ లోనూ తెలుగు లో రాద్దామనుకునే కొత్త వారికీ ఈ వ్యాసం బాగా ఉపయోగపడుతుంది జ్యోతి.

భాను

చాలా ఉపయోగకరంగా ఉంది మీ పోస్ట్

జ్యోతి

భానుగారు,కల్పన,,

ధన్యవాదాలు. ఇంటర్నెట్టులో తెలుగు రాయడం చాలా సులువు అని చాలామందికి తెలీదు. బ్లాగులు,వెబ్ పత్రికలు, సైట్ల గురించి చెప్పడానికి ముందు ఈ సమాచారం తెలియజేయడం ముఖ్యం అనిపించింది.

Uday Reddy

Hi Jyothi Garu,

"Vamsi maa pasalupudi kasdhalu" link share chesi punyam chesukondi.

mee naxt tapa lo "Vamsi maa pasalupudi kasdhalu" link vuntundhi ani assisthunamu..

Dhanayavadhamulu,
Uday..

malli

జ్యోతి గారూ
ఇంత మందికి ఇన్ని రకాలుగా సాయం చేస్తున్నారు..నా బ్లాగ్ ని కాస్త అందంగా అలంకరించడానికి కూడా సాయం చెయ్యొచ్చుగా

జ్యోతి

తప్పకుండా మల్లిగారు,,

కాని మీరు తరచుగా రాస్తానంటేనే.. నాకు మెయిల్ చేయండి.. ప్రొఫైల్ ఉంది నా ఐడి..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008