వినాయక చవితి, రంజాన్ శుభాకాంక్షలు
మొదటిసారిగా మేము మట్టి వినాయకుడిని తెచ్చాం. రంగులు ,హంగులు లేకున్నా చాలా బావున్నాడు. మరీ బోసిగా ఉంటే బాగోదని కాసింత అలంకారం చేసాను. మిత్రులందరికీ వినాయక చవితి శుబాకాంక్షలు.
శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం̣
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం
రంజిత నాటక రంగ తోషణం
సింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం
ముస్లీము సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదినాన ఈద్ ముబారక్. అల్లా అందరిని చల్లగా చూడాలి.
అదేంటోగాని ఈసారి ఇద్దరు దేవుళ్ళు ఒకేరోజు పండగ జరుపుకుంటున్నారు. అందరు కలిసిమెలిసి సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు. కాని.. ఒకాయనేమో చంద్రుడిని చూడొద్దు అంటాడు. ఇంకోయానేమో చంద్రుడు వచ్చాకే పండగ అంటాడు. ప్చ్..
11 వ్యాఖ్యలు:
Wish you all happy Ramzan and Vinayaka Chathurthi :)
మా ఇంట్లో ఎప్పుడూ మట్టి వినాయకుడే! ఒకటి రెండు సార్లు కాబోలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడిని పెట్టాము. ఈ సారి జనాలకు కొంచెం పర్యావరణ స్పృహ పెరిగిందనే చెప్పాలి.ఎక్కడ చూసినా మట్టి విగ్రహాలకే గిరాకీ ఎక్కువగా ఉంది.
గణేష్ చవితి కంటే వినాయక చవితి అంటే బావుండేమో !లేదా గణేష్ చతుర్థి!
మీ షడ్రుచులు సైట్లో చూసి ఇప్పుడే కొబ్బరి తో ఉండ్రాళ్ళు చేసి ఇటొచ్చా!
మీ కుటుంబమందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
వినాయక చతుర్థి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
జ్యోతి గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!
హారం
అక్కడ కూడా దేవుళ్ళిద్దరు చెపుతున్నారేమో జ్యోతి, పొద్దుట మీరు అటు వెళ్ళండి సాయింత్రం మీరు ఇటూ రండి అని. :-) మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
నాగార్జున, ఉమ,సావిరహే, విజయమోహన్,శ్రీనివాస్, భాస్కర్ ... ధన్యవాదాలు.
సుజాతగారు పొద్దున తొందరలో చూసుకోలేదు. మా ఇంట్లో ఎప్పుడో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలే. నాకు నచ్చదు ఐనా ఏడాదినుండి మావారి బుర్ర షంటేసి వెంట ఉండి మరీ ఈ గణపతిని కొనిపించాను. దీనికో కధ ఉంది. తర్వాత బ్లాగుతాను.
భావన .. నిజమే కదా. ఈ మతవిద్వేషాలు ఆ దేవుళ్లకు, మనకు లేవు.అందరికి కలిసి ఉండాలని ఉంటుంది.ఈ రాజకీయనాయకులు, మతపెద్దలు సృష్టిస్తున్న మారణహోమం ఇది. అందుకే ప్రతిసారి ఇలాగే పండగలు కలిసి వస్తే బాగుంటుంది కదా. ఇక్కడైతే చార్మినార్ నీడన వినాయకుడి విగ్రహాలు, పూజాసామగ్రి అమ్ముతున్నారు. కూతవేటు దూరంలో మక్కా మసీదులో వేలమంది నమాజు చేస్తున్నారు. ఎంత అందమైన దృశ్యం. ఇది కలకాదు వాస్తవమే..
వినాయక చవితి శుభాకాంక్షలు !
వినాయకచవితి శుభాకాంక్షలు జ్యోతి గారూ..
Post a Comment