విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.
స్వాగతం.. సుస్వాగతం.. ముందుగా నన్ను, నా బ్లాగులను అభిమానించి, ఆదరిస్తున్న వీక్షకులందరికీ వందనం. అభివందనం.. సినిమా నిక్కుతూ నీల్గుతూ యాభై రోజులు నడిచినా, జయంతి, వర్ధంతికి వేడుకలు జరిపినా, ఓదార్పు యాత్రలు, రేట్లు పెరిగినా ధర్నాలు, నీళ్లు రాకున్నా బందులు రోజూ న్యూస్ చానెళ్లలో ఏదో ఒక హంగామా, వేడుకలు గట్రా చూసి నాకో ఐడియా వచ్చింది. నేనెందుకు నా బ్లాగు వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకోకూడదు. 4 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎన్ని చూసాను?. అందుకే ఎవరేమనుకున్నా, ఎంత ఫీలైనా సరే ఈ సారి బ్లాగు వార్షికోత్సవాలు సింపుల్గా కాకుండా కాస్త భారీగా జరుపుకోవాలని నిర్ణయించేసుకున్నా. మీరు గమనించే ఉంటారు. ఇక కార్యక్రమలోకి వస్తే.. కొంచం గతం చెప్పుకుందాం. కొత్తవాళ్లకి మ్యాటర్ తెలీదు, అర్ధంకాదుగా.. నాలుగేళ్ల క్రింద టైంపాస్ కోసం బ్లాగు మొదలెట్టి ఇదిగో ఇప్పుడిలా ఉన్నాను. నా బ్లాగు ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే కింది లింకులు చదవండి.ముందే చెప్తున్నా తీరిగ్గా కూర్చోవాలి. బోలెడు ముచ్చట్లు చెప్పాలిగా. ఇంత మంచి సంతోష సమయం కదా ఆ మాత్రం ఉత్సాహం ఉండదేంటి? స్టేజి ఎక్కాక మైకు ఎవరు వదుల్తారంట? ఇన్నేళ్లు నన్ను భరించారు. ఇప్పుడు భరించండి మరి. బోర్ కొడితే పాప్ కార్న్ తినడానికి వెళ్లిరండి.ప్రధమ వార్షికోత్సవంద్వితీయ వార్షికోత్సవంతృతీయ వార్షికోత్సవంఏదొ సరదాగా ఆటలు పాటలతొ టైం పాస్ చేద్దామనుకుంటే బ్లాగు మొదలెట్టించేసారు. అదేంటోగాని ముందునుండి నా మాటకు, రాతకు మోత ఎక్కువ. అందుకే నా బ్లాగు తొందరగానే పాకడం నుండి వేగంగా నడక మొదలుపెట్టింది . ఒంటరిగా ఉండలేక తోడుగా తన చుట్టూ మరికొన్ని బ్లాగులను తయారుచేసుకుని ఎంజాయ్ చేయసాగింది. నేనేం చేసేది మరి. టైం అలా గడిచిపొయింది. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో నాకు అవసరమైనప్పుడల్లా నో అనకుండా సహాయం చేసి, కొండొకచో నాకు సానపట్టిన మిత్రులందరికీ మన:పూర్వక ధన్యవాదాలు. అలాగే నిరంతరం నన్ను ప్రోత్సహించి, నేను చేసే పొరపాట్లను వేలెత్తి చూపి, సరిచేసుకునేట్టు చేస్తున్న ఆత్మీయ మిత్రులకు కృతజ్ఞతలు. స్నేహితులు లేని ఒంటరిదాన్ని అనుకున్న నాకు ఈనాడు ప్రపంచం మొత్తంలో స్నేహితులున్నారు. నన్ను అభిమానిస్తున్నారు అని తలుచుకుంటే గర్వంగా ఉంటుంది. తెలిసి ఎప్పుడూ తప్పు చేయను. తెలియక చేసిన పొరపాట్లకు మన్నించండి. మీ అభిమానం నేను బ్లాగులు రాస్తున్నంతవరకు (ఎంతవరకో నాకే తెలీదు మరి) ఉండాలని కోరుకుంటున్నాను.ఇక చివరిగా నా బ్లాగు ఆదాయవివరాలు చెప్పొద్దా. ఇది నా స్వార్జితమైన,అభిమానంతో నిండిన అమూల్యమైన ఆస్థి. నేను రాసిన, రాస్తున్న బ్లాగులు - 12ఇంతవరకు రాసిన టపాలు - 2100బ్లాగు వీక్షకులు:Jyothi - 80,660జ్యోతి - 1,01,950నైమిశారణ్యం - 40,102ఆముక్తమాల్యద - 1,584ఛైత్రరధం - 2,771గీతలహరి - 13,261బ్లాగ్ గురువు - 5,457ఫొద్దు గడి - స్లిప్పుల సర్వీస్ - 5,368షడ్రుచులు - 74, 310shadruchulu /telugu - 2,04,811shadruchulu/english 0 1,02,602ఇంత అభిమానం చూపించినవారందరికి మరోసారి కృతజ్ఞతలు..
Congratulations Jyothi. You can do way better than what you are doing. You have that capacity. Way to go Jyothi. శుభాకాంక్షలు.
Congratulations Jyothy gaaru, Mee opika ki, mee talent ki hats off.
బాబోయ్ నాకళ్ళు తిరుగుతున్నాయి. ఎవరన్నా పట్టుకోండి...అన్ని టపాలు ఎలా రాయగలిగారండీ బాబూ... హేట్సాఫ్ టు యు.
భావన, రవి ధన్యవాదాలు. ఆకాశరామన్నగారు, హా..హా..హా.. మీకో తమాషా చెప్పనా? ఇవాలొక్కరోజే నేను రాసే పది బ్లాగుల్లో మొత్తం పదిహేను టపాలు పబ్లిష్ అయ్యాయి. చెక్ చేయండి.. :)))
ముందుగా నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.నా బ్లాగు పుత్తినలోజంతూ గెంతడం కాదు చాకులెత్తులు పంచాలి ఊలికే కేకలేత్తే ఒప్పుకోలు తెలుసా."ఎదిగినకొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది" అన్న పాట గుర్తుచేసుకుంటే బావుంటుంది కదా ఈ సందర్భంగా.
శుభాభినందనలు జ్యోతి గారు..
వార్నాయ్ననో ౨౧౦౦ టపాలా..పదికి పైనే బ్లాగులా..అమ్మో...కుమ్మేస్తున్నారుగా..కానివ్వండి...ఇలానే కొనసాగుతూ మరింత ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను..మీరు వార్డ్‌ప్రెస్ నుంచి ఇక్కడికి మారకముందు నుంచి మీ బ్లాగ్ చదువుతున్నాను నేను..
జ్యోతి గారూ !అఖందజ్యోతిగా అఖిలాంద్రుల జ్యోతిగా జగజ్జగేయమానంగా మీ ' జ్యోతి ' వెలగాలి. నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
హార్దిక ఆభినందనలునాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
వావ్!! 12 బ్లాగులు!! 2100 టపాలు!! లక్షల్లో విజిటర్స్!! వీటన్నిటి వెనుక ఉన్నది ఒక్క మనిషి!! హ్మ్ Congratulations / అభినందనలు / శుభాకాంక్షలు ఇవేవి సరిపోవడం లేదనిపిస్తుంది జ్యోతిగారు. ఐనా ఇంకే పదం లేదు కనుక బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు :-) మీరిలాగె మరిన్ని బ్లాగులు రాస్తూ మరింతమంది ఆత్మీయ స్నేహితులను / అభిమానులను సంపాదించాలని కోరుకుంటున్నాను.
శ్రీనివాస్ గారు, మౌనంగా ఒదిగి ఉండి బోర్ కొట్టింది. అందుకే కాస్త హంగామా చేసాను. అదీ ఈ ఒక్కరోజే..చాక్లెట్టులు ఎక్కువతింటే పళ్లు పాడైపోతాయి.తార, మేధ,వేణు,హరేకృష్ణ,రావుగారు, ధన్యవాదాలండి..
బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు :-) మీరిలాగె మరిన్ని బ్లాగులు రాస్తూ మరింతమంది ఆత్మీయ స్నేహితులను / అభిమానులను సంపాదించాలని కోరుకుంటున్నాను.
జ్యోతి గారు,చించారుగా.. ఠార్ మని ఇవ్వాళ ఉదయం వినిపిస్తే, ఏమిటా అనుకున్నాను. ఇంతకీ ఇది అన్న మాట విషయం. మీరు ఇలాగే పది కాలపాటు ఇలాగే మరో రెండు లక్షల పోస్ట్స్ వెయ్యలని మనసారా కోరుకుంటున్నాను. Keep it up..
ఎక్కడి దింతటి యోపిక?యెక్కడి వీ జ్ఞానరుచులు, హెచ్చగు రీతుల్?చక్కని నీ బ్లాగ్ లోకంబక్కజమును గలుగఁ జేయు నమ్మా, జ్యోతీ!
నాలుగు జ్యోతులు వెలిగించిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు.
అభినందనలు.మీ బ్లాగుయానం చాలా మందికి స్ఫూర్తిదాయకం.
శివరంజని, చక్రవర్తి,శంకరయ్యగారు, విజయమోహన్ గారు, కొత్తపాళీగారు, ధన్యవాదాలు. అంతా మీ అభిమానం..
జ్యోతీమీ బ్లాగు వార్షికోత్సవ శుభాభినందనలు. ఏదో వంద పోస్టులూ, పదివేల విజిటర్లూ కాగానే నా భుజం నేనే తట్టుకుని మీ అందర్నీకూడా తట్టమని గోల చేశాను. మీ అంకెలు చూసి సిగ్గుపడ్డా, మీ స్ఫూర్తి నాలో ఇంకో జ్యోతిని వెలిగించింది. psmlakshmi
లక్ష్మిగారు, నాతో పోల్చుకోవడం ఎందుకండి. నేను మీలా యాత్రలు చేసి రాయగలనా? ఎవరికి వాళ్లే గొప్ప. అప్పుడప్పుడు మనకు మనమే భుజం తట్టుకోవాలి. అఫ్పుడు మరింత ముందుకు సాగడానికి ఉత్సాహం వస్తుంది.
Congrats, and u r inspiring. *** *** ***Ee sandarbham gaa naa Tamil bhaashaa pratigna meeke ankitham
అమ్మో, అమ్మో ఇన్ని టపాలా,ఒకటి రాయడానికి వారం రోజులు తీసుకుంటున్నాను. మీకు టైమ్ ఎలా కుదురుతుంది. రాత్రుళ్ళు నిద్రపోరా?శుభాకాంక్షలండీ!!
నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు :)
జ్యోతీ, బ్లాగ్ లోకంలోకి అడుగిడి చిన్న దివ్వెగా మొదలయ్యి,అందరి మనసులను దోచుకుంటూ,ప్రతి రోజు బ్లాగులను వీక్షించడానికి విచ్చేసే వారిని నిరుత్సహ పరచకుండాఎన్నో రకాలుగా అందరినీ మాటలతో,సాహిత్యంతో,పాటలతో, వంటలతో, ఆసక్తికరమైన వ్యాసాలతో విచ్చేసేవారి మెదళ్ళకు పదును పెట్టే విధంగా, నాలుగు ఏళ్ళుగా విజయవంతంగా సాగిపోతూన్న బ్లాగులు,మరింత దేదీప్యమానంగావెలిగిపోతూ ముందుకు సాగాలని, 4వ బ్లాగోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
వావ్ .. గ్రేట్ జ్యోతి,మీ కృషికి,కార్యదీక్ష కి జోహార్లు. మీబ్లాగ్ నిత్యం ఇలా వార్షికోత్సవాలు జరుపుకోవాలి.హేమలత పుట్ల
నేస్తం, దుర్గ, హేమలత,ప్రియ, నీహారిక .. ధాంక్స్ .. నీహారిక,, అమ్మో నిద్రపోకుంటే ఎలా?? అన్నీ అవుతాయండి.. అదేంటో అలా అలవాటైపోయింది మరి..:)
జ్యోతి గారు, మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
Congrats, and have a nice road ahead...
Congrats :)
జ్యోతి గారు,ఇంతింతై జ్యోతింతై మరియు దానంతై, డజన్ బ్లాగులున్నంతై, అన్నట్టు మరిన్ని బ్లాగులతో మీరు నిరంతరం ఇట్లానే బ్లాగాయమానం గా (ధగధ్ధగాయమానం గా) వెలగాలని ఆకాంక్షిస్తూ.. మీ బ్లాగభిమాని
జయ, సృజన, గీతాచార్య,, ధాంక్ యూ.సనత్ గారు, ధన్యవాదాలు. మరిన్ని బ్లాగులా?? ఇప్పటికే తలకు మించిన భారమైంది. చాలండి...
Congrats, Happy Birthday to your blog
మాటలు, పాటలు, వంటలమూటలతో, ’బ్లాగులోకము’న నొక్క ’డజన్’కోటలనే నిర్మించినమేటివి ! ’జ్యోతక్క’ ! నీకు మేలగుత సదా !
జ్యోతికి, వార్షికోత్సవ శుభాకాంక్షలు!
ఏం చెప్పాలి, ఎల్లా చెప్పాలి. ఇంత ప్రతిభ ఎల్లా స్వంతం చేసుకోగలిగారు.హార్దిక శుభాభివందనాలు. ఇల్లాగే మీరు మాలాంటి కొత్తబ్లాగర్లకు ఆదర్శప్రాయంగా మరింత ఉత్సాహంగా మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
మీరు వ్రాయడమే కాకుండా, మాలాటివారికి అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఎప్పుడూ మర్చిపోము.అభినందనలు!-- సూర్య లక్ష్మి, ఫణిబాబు.
మీకు మీరే సాటండి జ్యోతి గారూ, అభినందనలు
నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు, హేట్సాఫ్ టు యు.
జ్యోతి గారు,, మీరొక్కరే కాకుండా మీతో పాటు ఎంతోమందిని నడిపిస్తూ బ్లాగు ప్రపంచంలో ఒక తెలుగుజ్యోతిని వెలిగించారు... అది ఎప్పటికీ అలానే వెలుగుతూ వుండాలని, మీ వార్షికోత్సవ సంబరాలలు మా మనసులు ఆనందంతో వూగిసలాడుతున్నాయి... లాంగ్ లివ్ జ్యోతి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాయి..
అభినందనలు జ్యోతిగారు.
స్నేహశీలి, ప్రతిభాశాలి, పిల్లల్లో పిల్ల, పెద్దల్లో పెద్ద, జ్యోతి గారికి, శుభాభినందనలు.
మీరింకా మరిన్ని విజయాలను సొంతము చేసుకోవాలని కోరుకుంటూ ,నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు .
జ్యోతిగారు , మీరు విజయవంతంగా బ్లాగు ప్రయాణం సాగిస్తూ మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ ....నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
Wow! Congrats!Keep going!12 blogs to 120 blogs :P
స్వప్న, ఆచార్యగారు,లక్ష్మిగారు, సుబ్రహ్మణ్యంగారు, సూర్యలక్ష్మిగారు, ఫణిబాబుగారు, శివ, పరిమళం,రుక్మిణి, శిశిర, మైత్రేయి, మాలగారు, మన:పూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం సదా ఇలాగే ఉండాలి. నాకు తెలిసిన విషయాలు తప్పకుండా పంచుకుంటాను. అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేస్తాను. దానిదేముంది..
సౌమ్యా!! ధాంక్స్..ఏంటి బ్లాగులు మెయింటెయిన్ చేయడం అంత ఈజీనా? ఇప్పటికే తలవాచిపోతుంది. అన్నింటిని అప్డేట్ చేయకుండా వదిలేయడం ఇష్టముండదు.నువ్వేమో 120 అంటున్నావు.. బాబోయ్!ఐనా నువ్వు నాకు సీనియర్ కదా..
Hearty wishes Jyothi gaaru :)
దీపంజ్యోతి పరబ్రహ్మ.మా జ్యోతి బ్లాగ్ బ్రహ్మ.మనిషినడవడానికి శక్తి కావాలి.ఆ శక్తినందించేది ఆహారం.అందుకే షడ్రుచులు.మనిషి నడతకు కావాలి మేలుకొలుపు.అదే జ్యోతి బ్లాగు.సాహితీసేద్యంలో సాహితీసమరాంగణ చక్రవర్తి పదఝరిలో ఓలలాడించే ఆముక్తమాల్యద,కమ్మనిపాటల గీతాలహరి,చక్కటి పాఠాల బ్లాగ్ గురువు,చరాచర సృష్టివైచిత్రిలో విచిత్ర మానవ స్వభావాలను పౌరాణిక కథలద్వారా ప్రస్ఫుటించే జగన్నాటకం,పొద్దు గడిచేందుకు పొద్దుగడి,నవ్వనివాడు పాపి అని తిట్టిమరీ నవ్వించే Jyothi అందించే హాస్యపు పుణుకులు మాటల చెణుకులు, భక్తిదారులు చూపి ముక్తిమార్గపు బాటను వేసే నైమిశారణ్యం,ఆంగ్లమైనా,ఆంధ్రమైనా మన జ్యోతి అన్నపూర్ణే! ధైర్యేసాహసేజ్యోతి!
నాగార్జున ధాంక్స్ఉమాదేవిగారు, ధన్యవాదాలండి. అంతా మీ అభిమానం. ఆపై ఆ దేవుడి దయ..
మీ బ్లాగ్ ఆలస్యంగా చూసినందుకు క్షమించగలరు..మీ సయయం ఎంతో మందికి ఉపయోగపడుతుంది.మీకు తెలియకుండనే మీరు అందరికి సహయపడుతున్నారు ఈ బ్లాగ్ లోకంలో మీ నుండి నేను చాల నేర్చుకున్నానండి మరి ఇంక ఎన్నో టాపాలు వ్రాసి అందరి అభిమానం పొందలని కోరుకుంటూ...నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు జ్యోతి గారు.
అశోక్ గారు ధన్యవాదాలు..
నేను ఇప్పటికి ఎన్నో బ్లాగ్ లు చదివాను ,కాని కొన్ని మాత్రమే నాకు నచ్చినవి వాటిలో మీది కూడా ఒకటి, ఇంతవరకు నేను ఎవరికి కామెంట్స్ రాయలేదు, కాని మీ బ్లాగ్ చూసి నేను చాలా ఆనందించాను, అందువలన నేను మికు ఈ కామెంట్ పంపుతున్నాను ఇది నా మొదటి వ్యాఖ్య..మీకు నా ధన్యవాదములు,
wow.. Are you in blogs for 4 years? I can not believe it.Anyway congratulations and I hope to see more content worthy posts from you.All the best.
congrats
సందీప్, ఉదయ్, భానుగారు ..ధన్యవాదాలు...
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
Jump to TOP
54 వ్యాఖ్యలు:
Congratulations Jyothi. You can do way better than what you are doing. You have that capacity. Way to go Jyothi. శుభాకాంక్షలు.
Congratulations Jyothy gaaru, Mee opika ki, mee talent ki hats off.
బాబోయ్ నాకళ్ళు తిరుగుతున్నాయి. ఎవరన్నా పట్టుకోండి...
అన్ని టపాలు ఎలా రాయగలిగారండీ బాబూ... హేట్సాఫ్ టు యు.
భావన, రవి ధన్యవాదాలు.
ఆకాశరామన్నగారు,
హా..హా..హా.. మీకో తమాషా చెప్పనా? ఇవాలొక్కరోజే నేను రాసే పది బ్లాగుల్లో మొత్తం పదిహేను టపాలు పబ్లిష్ అయ్యాయి. చెక్ చేయండి.. :)))
ముందుగా నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
నా బ్లాగు పుత్తినలోజంతూ గెంతడం కాదు చాకులెత్తులు పంచాలి ఊలికే కేకలేత్తే ఒప్పుకోలు తెలుసా.
"ఎదిగినకొద్దీ ఒదగమని మొక్క నీకు చెబుతుంది" అన్న పాట గుర్తుచేసుకుంటే బావుంటుంది కదా ఈ సందర్భంగా.
శుభాభినందనలు జ్యోతి గారు..
వార్నాయ్ననో ౨౧౦౦ టపాలా..పదికి పైనే బ్లాగులా..
అమ్మో...
కుమ్మేస్తున్నారుగా..కానివ్వండి...
ఇలానే కొనసాగుతూ మరింత ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను..
మీరు వార్డ్‌ప్రెస్ నుంచి ఇక్కడికి మారకముందు నుంచి మీ బ్లాగ్ చదువుతున్నాను నేను..
జ్యోతి గారూ !
అఖందజ్యోతిగా అఖిలాంద్రుల జ్యోతిగా జగజ్జగేయమానంగా మీ ' జ్యోతి ' వెలగాలి. నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
హార్దిక ఆభినందనలు
నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
వావ్!! 12 బ్లాగులు!! 2100 టపాలు!! లక్షల్లో విజిటర్స్!!
వీటన్నిటి వెనుక ఉన్నది ఒక్క మనిషి!! హ్మ్ Congratulations / అభినందనలు / శుభాకాంక్షలు ఇవేవి సరిపోవడం లేదనిపిస్తుంది జ్యోతిగారు.
ఐనా ఇంకే పదం లేదు కనుక బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు :-) మీరిలాగె మరిన్ని బ్లాగులు రాస్తూ మరింతమంది ఆత్మీయ స్నేహితులను / అభిమానులను సంపాదించాలని కోరుకుంటున్నాను.
శ్రీనివాస్ గారు, మౌనంగా ఒదిగి ఉండి బోర్ కొట్టింది. అందుకే కాస్త హంగామా చేసాను. అదీ ఈ ఒక్కరోజే..
చాక్లెట్టులు ఎక్కువతింటే పళ్లు పాడైపోతాయి.
తార, మేధ,వేణు,హరేకృష్ణ,రావుగారు, ధన్యవాదాలండి..
బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు :-) మీరిలాగె మరిన్ని బ్లాగులు రాస్తూ మరింతమంది ఆత్మీయ స్నేహితులను / అభిమానులను సంపాదించాలని కోరుకుంటున్నాను.
జ్యోతి గారు,
చించారుగా.. ఠార్ మని ఇవ్వాళ ఉదయం వినిపిస్తే, ఏమిటా అనుకున్నాను. ఇంతకీ ఇది అన్న మాట విషయం. మీరు ఇలాగే పది కాలపాటు ఇలాగే మరో రెండు లక్షల పోస్ట్స్ వెయ్యలని మనసారా కోరుకుంటున్నాను. Keep it up..
ఎక్కడి దింతటి యోపిక?
యెక్కడి వీ జ్ఞానరుచులు, హెచ్చగు రీతుల్?
చక్కని నీ బ్లాగ్ లోకం
బక్కజమును గలుగఁ జేయు నమ్మా, జ్యోతీ!
నాలుగు జ్యోతులు వెలిగించిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు.
అభినందనలు.
మీ బ్లాగుయానం చాలా మందికి స్ఫూర్తిదాయకం.
శివరంజని, చక్రవర్తి,శంకరయ్యగారు, విజయమోహన్ గారు, కొత్తపాళీగారు, ధన్యవాదాలు. అంతా మీ అభిమానం..
జ్యోతీ
మీ బ్లాగు వార్షికోత్సవ శుభాభినందనలు. ఏదో వంద పోస్టులూ, పదివేల విజిటర్లూ కాగానే నా భుజం నేనే తట్టుకుని మీ అందర్నీకూడా తట్టమని గోల చేశాను. మీ అంకెలు చూసి సిగ్గుపడ్డా, మీ స్ఫూర్తి నాలో ఇంకో జ్యోతిని వెలిగించింది.
psmlakshmi
లక్ష్మిగారు, నాతో పోల్చుకోవడం ఎందుకండి. నేను మీలా యాత్రలు చేసి రాయగలనా? ఎవరికి వాళ్లే గొప్ప. అప్పుడప్పుడు మనకు మనమే భుజం తట్టుకోవాలి. అఫ్పుడు మరింత ముందుకు సాగడానికి ఉత్సాహం వస్తుంది.
Congrats, and u r inspiring.
*** *** ***
Ee sandarbham gaa naa Tamil bhaashaa pratigna meeke ankitham
అమ్మో, అమ్మో ఇన్ని టపాలా,ఒకటి రాయడానికి వారం రోజులు తీసుకుంటున్నాను. మీకు టైమ్ ఎలా కుదురుతుంది. రాత్రుళ్ళు నిద్రపోరా?
శుభాకాంక్షలండీ!!
నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు :)
జ్యోతీ,
బ్లాగ్ లోకంలోకి అడుగిడి చిన్న దివ్వెగా
మొదలయ్యి,
అందరి మనసులను దోచుకుంటూ,
ప్రతి రోజు బ్లాగులను వీక్షించడానికి
విచ్చేసే వారిని నిరుత్సహ పరచకుండా
ఎన్నో రకాలుగా అందరినీ మాటలతో,
సాహిత్యంతో,పాటలతో, వంటలతో,
ఆసక్తికరమైన వ్యాసాలతో
విచ్చేసేవారి మెదళ్ళకు పదును పెట్టే
విధంగా,
నాలుగు ఏళ్ళుగా విజయవంతంగా
సాగిపోతూన్న బ్లాగులు,
మరింత దేదీప్యమానంగా
వెలిగిపోతూ ముందుకు సాగాలని,
4వ బ్లాగోత్సవం
జరుపుకుంటున్న సందర్బంగా
నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
వావ్ .. గ్రేట్ జ్యోతి,
మీ కృషికి,కార్యదీక్ష కి జోహార్లు. మీబ్లాగ్ నిత్యం ఇలా వార్షికోత్సవాలు జరుపుకోవాలి.
హేమలత పుట్ల
నేస్తం, దుర్గ, హేమలత,ప్రియ, నీహారిక .. ధాంక్స్ ..
నీహారిక,, అమ్మో నిద్రపోకుంటే ఎలా?? అన్నీ అవుతాయండి.. అదేంటో అలా అలవాటైపోయింది మరి..:)
జ్యోతి గారు, మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
Congrats, and have a nice road ahead...
Congrats :)
జ్యోతి గారు,
ఇంతింతై జ్యోతింతై మరియు దానంతై, డజన్ బ్లాగులున్నంతై, అన్నట్టు మరిన్ని బ్లాగులతో మీరు నిరంతరం ఇట్లానే బ్లాగాయమానం గా (ధగధ్ధగాయమానం గా) వెలగాలని ఆకాంక్షిస్తూ.. మీ బ్లాగభిమాని
జయ, సృజన, గీతాచార్య,, ధాంక్ యూ.
సనత్ గారు, ధన్యవాదాలు. మరిన్ని బ్లాగులా?? ఇప్పటికే తలకు మించిన భారమైంది. చాలండి...
Congrats, Happy Birthday to your blog
మాటలు, పాటలు, వంటల
మూటలతో, ’బ్లాగులోకము’న నొక్క ’డజన్’
కోటలనే నిర్మించిన
మేటివి ! ’జ్యోతక్క’ ! నీకు మేలగుత సదా !
జ్యోతికి, వార్షికోత్సవ శుభాకాంక్షలు!
ఏం చెప్పాలి, ఎల్లా చెప్పాలి. ఇంత ప్రతిభ ఎల్లా స్వంతం చేసుకోగలిగారు.హార్దిక శుభాభివందనాలు. ఇల్లాగే మీరు మాలాంటి కొత్తబ్లాగర్లకు ఆదర్శప్రాయంగా మరింత ఉత్సాహంగా మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
మీరు వ్రాయడమే కాకుండా, మాలాటివారికి అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఎప్పుడూ మర్చిపోము.అభినందనలు!
-- సూర్య లక్ష్మి, ఫణిబాబు.
మీకు మీరే సాటండి జ్యోతి గారూ, అభినందనలు
నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు, హేట్సాఫ్ టు యు.
జ్యోతి గారు,, మీరొక్కరే కాకుండా మీతో పాటు ఎంతోమందిని నడిపిస్తూ బ్లాగు ప్రపంచంలో ఒక తెలుగుజ్యోతిని వెలిగించారు... అది ఎప్పటికీ అలానే వెలుగుతూ వుండాలని, మీ వార్షికోత్సవ సంబరాలలు మా మనసులు ఆనందంతో వూగిసలాడుతున్నాయి... లాంగ్ లివ్ జ్యోతి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాయి..
అభినందనలు జ్యోతిగారు.
స్నేహశీలి, ప్రతిభాశాలి, పిల్లల్లో పిల్ల, పెద్దల్లో పెద్ద, జ్యోతి గారికి, శుభాభినందనలు.
మీరింకా మరిన్ని విజయాలను సొంతము చేసుకోవాలని కోరుకుంటూ ,
నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు .
జ్యోతిగారు , మీరు విజయవంతంగా బ్లాగు ప్రయాణం సాగిస్తూ మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ ....నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
Wow! Congrats!
Keep going!
12 blogs to 120 blogs :P
స్వప్న, ఆచార్యగారు,లక్ష్మిగారు, సుబ్రహ్మణ్యంగారు, సూర్యలక్ష్మిగారు, ఫణిబాబుగారు, శివ, పరిమళం,రుక్మిణి, శిశిర, మైత్రేయి, మాలగారు, మన:పూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం సదా ఇలాగే ఉండాలి. నాకు తెలిసిన విషయాలు తప్పకుండా పంచుకుంటాను. అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేస్తాను. దానిదేముంది..
సౌమ్యా!! ధాంక్స్..ఏంటి బ్లాగులు మెయింటెయిన్ చేయడం అంత ఈజీనా? ఇప్పటికే తలవాచిపోతుంది. అన్నింటిని అప్డేట్ చేయకుండా వదిలేయడం ఇష్టముండదు.నువ్వేమో 120 అంటున్నావు.. బాబోయ్!ఐనా నువ్వు నాకు సీనియర్ కదా..
Hearty wishes Jyothi gaaru :)
దీపంజ్యోతి పరబ్రహ్మ.మా జ్యోతి బ్లాగ్ బ్రహ్మ.మనిషినడవడానికి శక్తి కావాలి.ఆ శక్తినందించేది ఆహారం.అందుకే షడ్రుచులు.మనిషి నడతకు కావాలి మేలుకొలుపు.అదే జ్యోతి బ్లాగు.సాహితీసేద్యంలో సాహితీసమరాంగణ చక్రవర్తి పదఝరిలో ఓలలాడించే ఆముక్తమాల్యద,కమ్మనిపాటల గీతాలహరి,చక్కటి పాఠాల బ్లాగ్ గురువు,చరాచర సృష్టివైచిత్రిలో విచిత్ర మానవ స్వభావాలను పౌరాణిక కథలద్వారా ప్రస్ఫుటించే జగన్నాటకం,పొద్దు గడిచేందుకు పొద్దుగడి,నవ్వనివాడు పాపి అని తిట్టిమరీ నవ్వించే Jyothi అందించే హాస్యపు పుణుకులు మాటల చెణుకులు, భక్తిదారులు చూపి ముక్తిమార్గపు బాటను వేసే నైమిశారణ్యం,ఆంగ్లమైనా,ఆంధ్రమైనా మన జ్యోతి అన్నపూర్ణే! ధైర్యేసాహసేజ్యోతి!
నాగార్జున ధాంక్స్
ఉమాదేవిగారు, ధన్యవాదాలండి. అంతా మీ అభిమానం. ఆపై ఆ దేవుడి దయ..
మీ బ్లాగ్ ఆలస్యంగా చూసినందుకు క్షమించగలరు..మీ సయయం ఎంతో మందికి ఉపయోగపడుతుంది.మీకు తెలియకుండనే మీరు అందరికి సహయపడుతున్నారు ఈ బ్లాగ్ లోకంలో మీ నుండి నేను చాల నేర్చుకున్నానండి మరి ఇంక ఎన్నో టాపాలు వ్రాసి అందరి అభిమానం పొందలని కోరుకుంటూ...నాల్గవ వార్షికోత్సవ శుభాకాంక్షలు జ్యోతి గారు.
అశోక్ గారు ధన్యవాదాలు..
నేను ఇప్పటికి ఎన్నో బ్లాగ్ లు చదివాను ,కాని కొన్ని మాత్రమే నాకు నచ్చినవి వాటిలో మీది కూడా ఒకటి, ఇంతవరకు నేను ఎవరికి కామెంట్స్ రాయలేదు, కాని మీ బ్లాగ్ చూసి నేను చాలా ఆనందించాను, అందువలన నేను మికు ఈ కామెంట్ పంపుతున్నాను ఇది నా మొదటి వ్యాఖ్య..మీకు నా ధన్యవాదములు,
wow.. Are you in blogs for 4 years? I can not believe it.
Anyway congratulations and I hope to see more content worthy posts from you.
All the best.
congrats
సందీప్, ఉదయ్, భానుగారు ..ధన్యవాదాలు...
Post a Comment