బ్లాగు స్నేహాలు -- నేర్చుకున్న పాఠాలు
ఈ జీవిత గమనంలో మనం ఎంతో మందిని కలుస్తుంటాము. అందులో కొందరు మిత్రులుగాను, మరికొందరు ఆత్మీయులుగాను స్థిరపడిపోతారు. మన పద్ధతి నచ్చనివాళ్లు దూరమవుతారు. ఇలా మనకు తారసపడి కొద్దో గొప్పో అనుబంధం ఉన్నవాళ్లతో ఎంతో కొంత నేర్చుకుంటాం. అవి జీవిత సత్యాలే కావొచ్చు, మనం గుర్తుంచుకోవాల్సిన పాఠాలే కావొచ్చు. అదే విధంగా తెలుగు బ్లాగుల్లో బ్లాగర్లు కొద్ది మంది తప్ప అందరూ సుహృద్భావంతో ఉంటున్నారని చెప్పవచ్చు.
నా సంగతి చెప్పాలంటే చాలా ఉంది. నా చిన్నప్పటినుండి ఒంటరిదాన్నే అని చెప్పవచ్చు. తమ్ముళ్లది వేరే రాజ్యం. ఇక నేర్చుకునే అవకాశం ఎక్కడిది. ఎందుకంటే నాకు నిజజీవితంలో స్నేహితులంటూ ఎవరూ లేరు మరి. ఇప్పుడైతే చిన్న ప్రపంచం సృష్టించుకున్నాను. బ్లాగు మొదలెట్టినప్పుడు బ్లాగచ్చరముక్క రాదు. తోటి బ్లాగు మిత్రులే బ్లాగు ఎలా మొదలెట్టాలి నుండి ఈరోజు బ్లాగు డిజైనింగ్ ఎలా చెయాలి అనేది అడిగినప్పుడల్లా చెప్పేవారు విసుక్కోకుండా. అలాగే నా రచనలు, వ్యాసాలు మొదలైనవి ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని మెరుగుపరుచుకునేలా చేసి ఈ బ్లాగుల ద్వారా పరిచయమై స్నేహితులుగా మారినవారే. బ్లాగులకు సంబంధించిన విషయాలే కాక ఈ స్నేహితులు జీవితానికి సంబంధించి ఎన్నో సత్యాలు తెలియచేసారు. విపత్కర పరిస్థితుల్లో కృంగిపోకుండా విశ్లేషించుకుని ముందుకు సాగేలా చేసారు. ఒక్కోసారి చనువుగా తిట్టారు కూడా. :).. కాస్త బాధపడ్డట్టు కనిపించినా ఊరుకునేవారు కాదు. నా సంతోషంలో ఆనందించి, బాధలో ఓదార్పు నిచ్చి, విజయాలలో అభినందించే ప్రియమైన బ్లాగు మిత్రులకు వందనాలు. మనఃపూర్వక కృతజ్ఞతలు. అసలు రక్తసంబందం లేకుండా ఇంత ఆత్మీయత , ఆప్యాయత ఉన్న స్నేహాలు ఏర్పడతాయని కలలో కూడా అనుకోలేదు. ఇంతమంది బ్లాగు మిత్రులలో కొందరు కుటుంబ మిత్రులుగా కూడా మారారు....అలాగే కొందరు మిత్రులు అనుకున్నవారు కూడా మరచిపోలేని పాఠాలు నేర్పారు. అవి ఎప్పటికి నాకు పనికొచ్చేవే.. మిధ్యాప్రపంచమైనా , వాస్తవ ప్రపంచమైనా మనుష్యులంతా ఒక్కలాగే ఉంటారు. అదే మంచితనం, కుళ్లుబోతుతనం. మనకు కావలసింది మనం తీసుకుంటే సరి. ఏమంటారు??
ఇదంతా ఎందుకంటారా?? మరేం లేదండి. టైమ్స్ ఆర్టికల్ ద్వారా పరిచయమైన ముత్తులక్ష్మి అనే తమిళ బ్లాగరు తన నాలుగవ బ్లాగు వార్షికోత్సవ సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చింది. తనతో మాట్లాడుతుంటే నాకు ఈ ఆలోచనలు కలిగాయి. ఊరికే టపాలు రాసుకోవడం, కామెంట్లు పెట్టడమేనా. ఇంకేమైనా ఉపయోగాలున్నాయా అని ..
మరి మీరు బ్లాగింగు, బ్లాగు మిత్రుల ద్వారా ఏమైనా నేర్చుకున్నారు??
25 వ్యాఖ్యలు:
జ్యోతి గారు మీరు చాలా బాగా చెప్పారు. మీలాగా అందరు ఉంటె చాలా బాగుంటుంది.
Congrats andi, అవార్డ్ కు మరియు మ౦చి స్నేహాలను స౦పాది౦చేశారు కదా....
జ్యోతీ, ముందుగా మీకు అవార్డ్ వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు.
"నీ స్నేహితుల పేర్లు చెప్పు.. నీ గురించి చెపుతాను.." అనే ఒక నానుడి వుంది. స్నేహం చెయ్యగలిగే హృదయం అందరికీ వుండదు. స్నేహం చెయ్యడమంటే పంచుకోవడం.. ఒక ఆలోచన అయినా సరే, భావం అయినా సరే, డబ్బు అయినా సరే, పుస్తకాలయినా సరే.. ఏదైనా సరే.. కలిసి పంచుకునేదే స్నేహమంటే. వారికి తెలిసినది స్నేహితులకి కూడా చెప్పడం, స్నేహితునిలోని బలహీనతలు గ్రహించి వాటిని అధిగమించే ధైర్యం ఆ స్నేహితుని కందివ్వడం, ఆ స్నేహితుడు కూడా దానిని సహృదయంతో అర్ధం చేసుకోవడం, సంతోషమైనా విచారమైనా కలిసి అనుభవించడం.. ఇలాంటి ఇంకా చాలా అనుభవాలతో కూడుకున్నదే చక్కటి స్నేహమంటే.
స్కూల్ లో, కాలేజీల్లో చాలామంది తో కలిసి చదువుకున్నా కొంతమందితో మాత్రమే స్నేహం కుదురుతుంది. అదికూడా కాలం గడిచినకొద్దీ అణగారిపోకుండా వుండేదే నిజమైన స్నేహం.
మరింక ఇప్పుడు, ఈ టెక్నాలజీ రాజ్యమేలుతున్న రోజుల్లో "ఈ-స్నేహం" ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనిషి కనపడడు. ఏ వయసో, ఎటువంటి ప్రవర్తనో తెలీదు. కేవలం వారు చెప్పిన మాటల్నినమ్మే స్నేహం చేసుకోవాలి. కాని ఇన్ని సందేహాలున్నాకూడా నిజంగా స్నేహ హృదయం కలవారు నిజాయితీగా ఇక్కడ కూడా మంచి స్నేహితులని సంపాదించుకుంటున్నారు. మనం నిజాయితీగా, నిర్మలంగా వుంటే మన స్నేహితులు కూడా అలాంటివారే అవుతారు.
ముఖ్యంగా నేను ఈ కంప్యూటర్ ద్వారా మంచి స్నేహితులని సంపాదించుకున్నాను. అస్తమానం ఇల్లు విడిచిపెట్టి స్నేహితుల ఇళ్ళకి వెళ్ళలేము. ఇంటిపనులయాక ఎవరితోనైనా కాసేపు నాలుగు మంచిమాటలు మాట్లాడుకోవాలనిపిస్తుంది. అటువంటప్పుడు నేను కంప్యూటర్ ముందు కూర్చుని నా స్నేహితులతో మాట్లాడుతుంటాను. మేము ప్రపంచంలో జరిగే అన్ని విషయాలూ చర్చించుకుంటాము. చిన్నపిల్లల్లా ఒకరి నొకరం వేళాకోళాలు చేసుకుంటాం. ఎవరికైనా కాస్త బాధ కలిగిందన్నట్టు కనిపిస్తే చాలు అందరం కలిసి వారికి ధైర్యం చెప్తాము. ఒకరికి తెలిసినది మరికరితో పంచుకుంటాము. ఇలా మనసు విప్పి మాట్లాడుకోవడం వలన మనలోని ఒంటరితనం దూరమవుతుంది. ఇది నాకు చాలా నచ్చింది.
hai jyothi thanks for posting the award in your blog.. and sharing the positive thoughts..
మిధ్యాప్రపంచమైనా , వాస్తవ ప్రపంచమైనా మనుష్యులంతా ఒక్కలాగే ఉంటారు. అదే మంచితనం, కుళ్లుబోతుతనం. మనకు కావలసింది మనం తీసుకుంటే సరి. ఏమంటారు??
WELL SAID !
me bloge chala bagundi
నాకు ఏ అవార్డో అర్ధం కాలేదు. లింక్స్ క్లిక్ చెయ్యాలా అది తెలుసుకోవడం కోసం?
శరత్ గారు, నాకు వచ్చిన అవార్డు బొమ్మ ఇక్కడే ఉంది. మీకు తమిళ్ వచ్చు అంటే లింకు క్లిక్కండి.చదవంఢి..
అభినందనలు. నాకూ చాలామంది స్నేహితులు అయ్యారు ఈ బ్లాగుల వల్ల.
Congrats,e-friend.
నాకయితే బయటి మిత్రులకన్నా బ్లాగు మిత్రులే ఎక్కువవుతున్నారు. క్లోజ్ ఫ్రెండుకి రెండు నిమిషాలు ఫోను చెయ్యడానికి మనస్కరించడం లేదు కానీ ఇలా కామెంట్లకు మాత్రం కొదవలేదు. నిజమయిన ప్రపంచం కంటే వర్చువల్ ప్రపంచమే ఎక్కువవుతోంది/ప్రాధాన్యమవుతోంది. మంచికో చెడుకో గానీ కాలంతో పాటూ మనమూ మారక తప్పదులావుంది.
జ్యోతి గారు:
ముందు మీకు అభినందనలు.
స్నేహితులూ, శత్రువులూ సమ పాళ్ళలో వుండడమే జీవితం అనుకుంటా. వొక విజయం వెనక వారిద్దరికీ సమాన వాటా వుంటుందేమో!
కోపం పెంచుకొనీ, కడుపు మండీ నాలుగు రాళ్ళు విసిరీ, శత్రువులు మనకు చేసేది మేలే, కీడు కాదు!
మీకు అవార్డు వచ్చిన ఈ శుభ వేళ నా బ్లాగుకి వొక రంగూ రూపం పరిమళం అద్ద్దిన మీ తోడ్పాటుని తలచుకుంటూ...మీ మరిన్ని విజయాల కోసం చూస్తూ...
Dear Jyoti,
I am not sure if my Telugu is good enough to express my thoughts and feelings about this post. So I apologize for writing in English.
I am so very glad that I had joined ' Pramadaavanam." Thanks to you. I love it, enjoy the posts, feel so much a part of the group which was unknown to me till some time back. I am learning so much- not just the language. I feel amazed at the wisdom I gain from every one's posts.
I have no blog. So, I am not qualified about commenting on blogs. But then I was able to share my personal feelings and experiences through the telugu ladie's blog groups which I was unable to so, even with my very personal friends.
I congratulate you. You deserve more than this- by fighting the odds.
You are right. I have learnt that I was able to share my deepest fears and insecurities thru the net which I could not do even do with the closest of my friends.
Jyoti, My heartiest congratulations again. May you be the inspiration for so many others. You truely deserve much more. Do not bother about the ones you envy you. Envy is a part and parcel of a non- achiever. Like you said, ignore the the bad and go on whatever you need and want to achieve.
Good luck and best wishes.
Krishna
Congratulations Jyothi gaaru
Meeku Blog Ambassador ani title istunnaanu naa tarapu ninchi!
cheers
zilebi
http://www.varudhini.tk
Jyothi garoo... ariche kukkalu moruguthoone untayi. Dont care. Emee rayadam rani valle ila postlu
chetagaka pitchi vagullu vagutoo
untaru. Prabhandallo kaneesam "kukavi ninda" ani chestaru. Manam avi kooda cheyyani samskaravantulam. Kusamskarulanu kshaminchi vadileyyandi. Keep it up.
అందరికి ధన్యవాదాలు..
కృష్ణ.. ఎవరికి ఎవరో తెలీకుండా ఈ నెట్ ద్వారా పరిచయమై, స్నేహం పెరిగి ఆత్మీయులుగా మారుతున్నాము. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఒక పదునైన కత్తివంటిది. దానితో పెన్సిల్ చెక్కుకోవచ్చు, పీకలు కోయవచ్చు లేదా అద్భుత కళాఖండాలు సృష్టించవచ్చు.అంతా మన చేతిలోనే ఉంది.
అఫ్సర్ గారు, నిజమేనండి. అందుకే అన్నారు.. తనమీద విసిరే రాళ్లక్రింద నలిగి చచ్చేవాడు పిరికివాడు. అదే రాళ్లతో బలిష్టమైన దుర్గాన్ని నిర్మించుకునేవాడే విజయుడు అని.. :)
ఆదిరాజుగారు, నాకు తెలుసండి. నామీద చెత్తరాతలు రాసేవాళ్లెవరో!.. ఎవరిమీదా కోపంలేదు. నాకు ఈ బ్లాగులే లోకం కాదు. నేను చేస్తున్న, చేయాల్సిన ముఖ్యమైన పనులెన్నో ఉన్నాయి. నాకున్న పరిమితమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం కాబట్టి ఇలాటి రాతల్ని పట్టించుకోదలుచుకోలేదు..
మీకు అవార్డ్ వచ్చినందుకు అభినందనలండి .
జ్యోతీ గారు, ముందుగా మీకు అవార్డ్ వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు.
జ్యోతి గారు చాల బాగ చెప్పారండి..అవార్డ్ వచ్చినందుకు శుభాభినందనలు.
జ్యోతి గారు చాలా బాగా చెప్పారండి. అవార్డ్ వచ్చినందుకు శుభాభినందనలు.
జ్యోతి గారు, అవార్డ్ సందర్భం గా మీకు నా అభినందనలు!
అభినందనలు
లక్ష్మి ఫణి
జ్యోతి గార్కి పురస్కారం వచ్చిన సందర్భంగా శుభాభినందనలు.ఇల్లాగే మరెన్నో పురస్కారాలు గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.
బ్లాగు నెయ్యము మనకెంతొ బాగు బాగు
ఒకరి కొకరుగ సాయము ఒనర గూడ
జీవితంబున మనకెంతొ తావి నిచ్చు!
జయము జయమేను మనకింక జగతినందు.
సమస్త సన్మంగళాని భవంతు...
Post a Comment