బ్లాగ్వనభోజనాలు ... సూపర్ హిట్...
ముందుగా బ్లాగ్ వనభోజనాల్లో పాల్గొన్నవారందరికీ అభినందనలు. ధన్యవాదాలు. నిజంగా నిన్నంతా పండగ వాతావరణంలా ఉండింది. ఆగ్రిగేటర్లన్నీ ఘుమఘుమలాడిపోయాయి. నవ్వులు విరబూసాయి అని చెప్పవచ్చు. ఈసారి మేము కూడా ఉన్నాం అంటూ చాలెంజ్ తీసుకుని వంట చేసిన మగమహారాజులకు కూడా థాంక్సులు. అసలు వంటిల్లు ఆడవాళ్ళ సొంతం చేసి తప్పు చేస్తున్నారు. చూడండి ఆడాళ్ళు ఎప్పుడే వంట చేయాలనుకున్నా. ఏదైనా తినాలనుకున్నా చప్పున కిచెన్ లోకి వెళ్ళి యిట్టె చేసుకు తినేస్తారు. మిగిలితే మీకు పెడతారనుకోండి. అది వేరే సంగతి. ఇలా ఎందుకన్నాను అంతే.. ఒకసారి కాదు కాని చాలా సార్లు జరిగింది. ఒక్కటే చెప్తాను. సాయంత్రం ఏడుగంటలకు నెట్లో విహారం చేస్తుంటే సున్నుండలు కనపడ్డాయి. వాటిని చూస్తే వెంటనే తినాలనిపించింది. తెచ్చేవాళ్ళు ఎవరు?? మావారు ఉన్నా వెళ్ళి తీసుకురారు.ఎందుకంటే ఆయనకు స్వీట్లు ఇష్టముండదు. చెప్పి కూడా దండగే.. వంటింట్లో డబ్బాలన్నీ వెతికా. మినప్పప్పు కనపడలేదు. నిండుకుంది .. సేమ్యా కనపడింది. దానితో లడ్డులు చేయొచ్చో లేదో తెలీదు అంతవరకూ.. కాని వాటిని నేతిలో వేయించి పొడి కొట్టేసి , చక్కేరపొడి , నెయ్యి కలిపి లడ్డులు చుట్టేసి పదిహేను నిమిషాల్లో లడ్డూలు చేసుకున్నా. ఏంట్రా నెయ్యి వాసన వస్తుంది అని మావారు పరేషాన్. నాకు ఇప్పటికిప్పుడు లడ్డులు తినాలనిపించింది అందుకే చేసుకున్నా అని చెప్పా. నవ్వేసి తన పని తను చేసుకున్నారు. అదన్న మాట సంగతి. ఇలాంటి సంఘటలు ఎన్నో ఉంటాయి ఆడవాళ్లందరికీ. కాదంటారా ??
సరే ఇక మన వనభోజనాల సంగతి చూద్దాం. ఎవరు ముందు ఎవరు వెనుక అని కాకుండా అందరి వంటకాలు వరుసగా చెప్పేస్తున్నా. అలాగే వాళ్ళ బ్లాగుల్లో కామెంటలేదు కాని ఇక్కడ అందరి గురించి చెప్పేస్తున్నా.. తీరిగ్గా కూర్చోండి మరి..
అసలైతే కార్తీక మాసం మొదటిరోజే మహిళా బ్లాగర్లు కలిసి భోజనాలు చేసి ఈ వనభోజనాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత జయ మిగతా పంతులమ్మలతో కలిసి చేసిన వనభోజనాల విశేషాలు పంచుకున్నారు తన వంతు పులిహోర, దద్ధోజనం పూరీ కూర తో.. కృష్ణప్రియ బాబోయ్! తల్లోయ్ అనకండి టల్లోస్ అనండి అంటూ రంగు రంగుల పండుమిరప లేదా పచ్చిమిరప పచ్చడి తయారు చేసుకొచ్చారు . నిన్న మాత్రం అందరికంటే ముందుగా టిఫిన్ పెట్టారు jb గారు పెసరట్టు అల్లం పచ్చడితో . అలాగే బ్రూ కాఫీ కూడా ఇచ్చారు. ఇక మిగిలింది లంచ్.. ఈసారి స్వీట్లు , పచ్చళ్ళు ఎక్కువైనట్టున్నాయి కదా. తర్వాత ఇందిర ఉసిరి ఆవకాయ , ఇంకా బాదుషా స్వీట్. తను అడిగిన డౌట్ ఎవరికైనా తెలుసా ? అసలు ఆ స్వీట్ ని బాదుషా అని ఎందుకంటారు ? మాల గారు చందమామతో కబుర్లు చెప్తూ బాదం ఆకులలో కందిపచ్చడి వడ్డించారు. నేనూ అంటూ శ్రీలలిత గారు ఉసిరి మెంతికాయ , పైనాపిల్ జ్యూస్ .. పైన ఆపిల్ కాదు పైనాపిలే.. అయిందిగా.. నేస్తం తనదైన స్టైలులో ఉలవచారు వడ్డించారు. మర్యాదకైనా బాగుందని చెప్పేయండి మరి. పనిలో పనిగా భాస్కర్ అన్నాయ్, మంచుగారి మీద కసి తీర్చుకున్నారు. నేనూరుకుంటానా? అంటూ మంచు కూడా తన పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించారు. అదెలా ఉందయ్యా అంటే?? చక్రపొంగలిని చుంబరస్కా అని పేటెంట్ తీసుకునేంత. మరి ముందు ముందు పులిహోర, దద్ధోజనం చేసి ఏమని పేటెంట్ తీసుకుంటారో??
మా ఇంటబ్బాయి వంట అంటూ ముద్దు ముద్దుగా శ్రీవారి వంటకం గురించి చెప్పింది కొత్త పెళ్లి కూతురు మధురవాణి. కార్తీక మాసం కాబట్టి ఆ కూర పక్కనపెట్టి తన పెళ్లి విందులోని అరిసెలు, లడ్డూలు ,కారప్పూస పట్టుకొచ్చింది. సరే అని క్షమించేసాం. మంజు సొరకాయ కోఫ్తా తీసుకొచ్చారు. జ్ఞానప్రసూనగారేమో బూరెలు వండి తీసుకొచ్చారు. అవి నములుతూ ఇంకా ఎవరేవరేం తెచ్చారో చూద్దాం. నేనేమో మావారు చేసిన టమాటా పచ్చడి తెచ్చాను.అలాగే కొన్ని వంకాయ స్పెషల్స్. అదిగదిగో ఇందు కూడా కొబ్బరన్నం, ఆలు ఖుర్మా, పెరుగు పచ్చడి పట్టుకొచ్చారు. అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. ఎవరో భార్య భర్తలు చాలా తీవ్రంగా చర్చిస్తున్నట్టున్నారా? మాట్లాడుతున్నారా ? తెలీడం లేదు. హాస్యవల్లరిలో పూర్ణపొంకాయ పులుసు తయారైనట్టుందే.. నేను కూడా వస్తున్నా అంటూ మురళి నూడుల్స్ ఉప్మా చేసి పట్టుకోచ్చ్చారు. కుదిరితే తినడం. లేకుంటే బాండీ పడేసి ఇంట్లో వాళ్ళతో ఇడ్లీ తినండి అంటూ. అవసరం ఏదైనా నేర్పిస్తుంది కదా. అందుకే ఈ పాకెట్ నూడుల్స్ తో ప్రయోగాలూ అన్నమాట.
రాధిక అగాకారకాయ కూర పట్టుకొచ్చారు. అటువైపు నుండి లత మేతి చమన్ , బ్రెడ్ బాసుంది తీసుకొస్తున్నారు చూడండి. కూర ఇటు పెట్టి స్వీటు పక్కన పెట్టండి. చివరిలో తినొచ్చు. స్వప్న పాలక్ పనీర్ తీసుకొస్తే సుభద్ర దప్పళం తయారు చేసింది. అలాగే మాంచి వనభోజనాల పాట కూడా వినిపించింది. సత్యాన్వేషి నేను కూడా పాల్గొంటాను అంటూ టర్కీ బిర్యాని అంటున్నారు. తప్పు కదా . కార్తీకమాసం నో నాన్ వెజ్. అందులో కూరగాయలు వేసి బిర్యాని చేసుకురండి.. ఇంకా ఎవరొస్తున్నారు అంటే... కార్తీక్ పట్టుదలతో బ్రమ్మీల పరువు నిలపడానికి పుస్తకం చేత బట్టి టమాటాలు ఓ మాదిరిగా తరిగి పులుసు పెట్టేసాడు. అయినా టమాటాలే పులుపు అంటే ఇంకా పులుసా?? వెనకాలే బెండప్పారావు కూడా రైస్ కుక్కర్లో చపాతీలు చేసాడంట పట్టుకొచ్చాడు. ఇంకా సేమ్యాని రోట్లో దంచి పాయసం చేసాడు.అసలు తన రూమ్లో కుక్కర్ తప్ప వేరే లేదన్నాడు. రోలు ఎక్కడిదబ్బా?? సరేలెండి ఎదో ఒకటి. చెట్టు లేని చోట ఆముదం చెట్టే మేలన్నారు కదా.. చివరిగా లేడీస్, బ్రమ్మీలు వంటలు చేసేస్తుంటే అంకుల్స్ పరువు పోతుంది అని రౌడీ కూడా టోఫు అని కూర చేసాడు. అసలు టోఫు ఎలా ఉంటుందో తెలీదు. అందులో వేసిన సాసులు ఒక్కటి తెలీదు. మరి తను చేసిన తర్వాత ఏం చేసాడో మరి?? ఫోటో పెడితే అన్నా ఓహో ఇలా ఉంటుందా? అనుకునేవాళ్ళం కదా.. గీతాచార్య ఆడాళ్ళ వంటకు ద్రావిడుడి బ్యాటింగుకు ఎదో లింకు పెట్టాడు. చూడండి.
తినడానికి అన్నీ వచ్చేసాయి. మరి ప్లేట్లూ, చెంచాలు, నీళ్ళు వద్దా?? వేణు ఏమో వెండి కంచాలు, కట్లరీతో పాటు స్టీం దోస చేసాడు అలాగే దోసలు చేసేటప్పుడు కొన్ని ట్రిక్కులు తీసుకొస్తే పద్మార్పిత మినరల్ వాటర్ అందించింది. భోజనాలు అయ్యాక భుక్తాయాసంతో లేచాకా నేను సైతం అంటూ కశ్యప్ ఫింగర్ బౌల్స్ పట్టుకొచ్చాడు. టిప్ ఇచ్చేయండి పాపం. చేతులు కడుక్కున్నాక భాను చేతిలో ఉన్న తాంబూలం వేసుకోవడం మర్చిపోవద్దు.
ఈ వనభోజనాల ఘుమఘుమలు ఇంకా వస్తున్నాయేమో జాజిమల్లి ఎన్నో నోరూరించే కబుర్లు పట్టుకొచ్చారు .. సుజాత ఏమో వంట మీద తనకున్న నిక్కచ్చి అభిప్రాయం చెప్పారు. పర్లేదు లెండి. అర్ధం చేసుకున్నాం, కుంటున్నాం,, కుంటాం కూడా..
వచ్చే కార్తీక పున్నమి రోజు కలుద్దాం..
18 వ్యాఖ్యలు:
Thanks Jyoti!
ప్చ్ కార్తీకాల్లోనే మాకు పొలంపనులెక్కువ దానికితోడు ఈ సంవత్సరం వర్షలెక్కువై మాకు సమస్యలెక్కువయ్యాయా!దాంతో కార్తీక వనభోజనాలకు సమయానికి రాలేకపోయాం వచ్చేటప్పటికే అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ప్చ్.
This comment is for SWAPNA.
స్వప్న గారూ,
మీరు మరీ అంత అతి కాకపోతే కాస్త స్వయం గా ఏదయిన అవండచ్చు కదా. మరీ చిన్న పిల్ల లాగ పోజు కొడితే బాగోదండీ.పైగా సన్నగా ఉన్నాను అంటూ మమ్మల్ని మీ బ్లాగు లోనే కాకుండా మురళి గారి కామెంటు సెక్షన్ లో కూడా చంపుతారేంటండీ బాబూ.
జ్యోతి గారు ఏర్పాటు చేసిన బ్లాగ్ వాన భోజనాలు చాలా బాగున్నాయి. నేనేమీ వండక పోయినా అన్ని రకాలూ తినేసా, మీతో సమానంగా ఎంజాయ్ చేశా అందుకే మీఅందరికీ రొంబ నండ్రి.
ఈ రోజూ కొంచం కడుపు ఉబ్బి కష్టం గా ఉందన్నారు కొంత మంది అన్నలు అక్కలు అందుకే నా వంతుగా లేట్ గా నైనా బిస్లేరి క్లబ్ సోడా తెచ్చాను. అందరూ తాగి ఈ పూటకి మరింకేం తినకుండా రెస్ట్ తీస్కోండి
Thank you Jyothi garu.. very nice experience..
మీరు సేమ్యా రోటి పచ్చడి గురించి రాయాడం కడు ఆనంద దాయకం.. మాకది తినేటప్పుడు కలిగే ఆనందం కంటే చేసేటప్పుడు కలిగే తృప్తే ఎక్కువలేండి.. :P
వనభోజనాలు సూపర్ హిట్ చేసి నందుకు అభినందనలు .
నా మాయదారి చంద్రుని తెచ్చినందుకు థాంక్ యు :)
నన్ను మర్చిపోయారేమో అనుకున్న . thanks మీ ఆహ్వానంతో అందరిని ఒక దగ్గరికి చేర్చారు. good experience
ముందుగా అసలు ఈ ఆలొచన వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.చాలాబాగా వ్రాసారండీ ఈ టప...ఇంచుమించు అందరినీ కవర్ చేసారు...నేను మిస్ అయిన కొన్ని బ్లాగ్ భోజనాలు ఇప్పుడె చూసాను వెళ్ళి వాటిని చూసొస్తాను.
vanabhojanaalu miss ayyaanu kaani,nidaanamgaa anni aaraginche prayatnam repatinundi modalu pedataanu..jyothi gaaru hats off..
థాంక్స్ జ్యోతి గారూ,
నిజంగా నిన్నంతా చాల థ్రిల్లింగ్ గా అనిపించింది.
జ్యోతీ,
అభినందనలు. చక్కగా అందరం కలిసి విందు భోజనం చేసే పసందైన అనుభవం బాగుంది.
థాంక్స్ జ్యోతి గారూ,
>>"అసలు తన రూమ్లో కుక్కర్ తప్ప వేరే లేదన్నాడు. రోలు ఎక్కడిదబ్బా??"
మా అపార్ట్‌మెంట్ ఎదురుగా రోలు తయారీ సంస్థ ఉంది. అక్కడికెళ్ళి ఒకసారి వాళ్ళ రోలు టెస్ట్ చేస్తానని చెప్పి, సేమ్యాని దంచానన్నమాట. దంచిన సేమ్యాని తీసుకొని, మీ రోలు మాకు నచ్చలేదని వచ్చేశాను. :-))
సెహభాష్ జ్యోతిగారూ....అందమైన ఆలోచన.
ఆప్యాయంగా అందర్నీ ఆహ్వానించారు. ఎందరో
ఉత్సాహంగా పాల్గొన్నారు...రకరకాల రుచులు
రంజుగా రంగుల్లో అందించారు..అక్కడతో
"పూర్తిఅయింది" అంటే అది జ్యోతిగారి స్టైల్ కాదు
కదా...మొత్తం సమీక్షించి అభినందిస్తున్నారు.
నిజానికి యెవరు యెవర్ని అభినందించాలి....
మిమ్మల్ని...మిమ్మల్నే అభినందించాలి...ఇది
నామాట కాదు మా అందరి మాట...తల్లి చేసే వంట
తన కోసం కాదు తన వారందరి కోసం...
ఆ అమ్మతనం ఈ ఆలోచనలో
కనపడి మనసు చెమ్మగిల్లుతోంది.
విజయమోహన్ గారు, నిజంగా మిమ్మల్ని చాలా గుర్తుచేసుకున్నామండి. వెలితిగా ఉండింది.
ఆత్రేయగారు, నిజంగా ఆయాసంగానే ఉంది. అభిమానం భోజనం రెండూ కలిసి.. అప్పటికి భానుగారు తాంబూలం ఇచ్చారు కూడా..:)
ఇక ఈ వనభోజనాల్లో తమవంతు వంట చేసిన బ్రహ్మచారి బెమ్మీలకో ఆశీర్వాదం.. మీకు వంట రాని, వంట చేయడం ఇష్టం లేని అమ్మాయి పెళ్లాంగా రావాలని కోరుకుంటున్నాను..తధాస్తు..
మళ్లీ వనభోజనాలతో వచ్చే కార్తీకపూర్ణిమరోజు కలుద్దాం. ధాంక్స్ అగేన్...
ఇల్లు మారిన హడావుడిలో నేనీ వనభోజనాలు మిస్సయ్యాను..:( ఇప్పుడెలా? రుచిలో వీలైనన్ని వంటకాలు రాసేస్తాలెండి...!!
జ్యోతిగారు,
అసాంతం చదివాక నేను హైదరాబాద్ వాసిగా మీకు దగ్గర్లో వుంటే బాగుండుననిపించింది. బ్లాగర్ గా బ్లాగ్ ప్రపంచం లో మీరు ఏంటో ప్రగతి సాధించారు. కార్తీకమాసం వనభోజనాలంటే భోజనప్రియులకు నోరు వూరించినట్లే.
Post a Comment