కదంబ మాలిక....
భావవ్యక్తీకరణకు బ్లాగు అనువైన చోటు . రాతలే తెలీని వారెందరో తమ ఆలోచనలు, స్పందనలు తమ బ్లాగులో వ్యక్తపరుస్తున్నారు. మొదట్లో అవి మామూలు పిచ్చి రాతలుగా ఉన్నా క్రమంగా పరిణతి చెందుతున్నాయి. అందుకే అన్నారు రాయాలనుకునేవారిని రచయితలుగా చేస్తాయి బ్లాగులని. దీనికి ముఖ్యకారణం. ఆయా టపాలకు కామెంట్ల రూపంలో వస్తున్న ప్రశంశలు, విమర్శలు, తప్పొప్పులు ఎత్తి చూపి సరిచేసే పెద్దలే.. ఈ క్రమంలో బ్లాగు రాతలనుండి కొంచం ఎదిగి ఏదైనా కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను..
బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు. కలం పుచ్చుకుని ఎవరూ పుట్టలేదు. జన్మతః ఎవరూ రచయిత్రులు కారు. అందుకే కథలు చదవడం తప్ప రాయడం అలవాటు లేని బ్లాగర్లు ఎక్కువమంది ఉన్నారు. కాని ప్రయత్నించడంలో తప్పు లేదు కదా.
ఈ కదంబ మాలిక లో మొదటి పుష్పం. సురుచి లో ...
2 వ్యాఖ్యలు:
అమ్మో!!
Interesting.
Post a Comment