మీరు ఏమైనా అనుకోండి, ఆయన పోయి, ఆవిడ హాస్పిటల్లో ఉన్నారని తెల్సిన వెంటనే ఆవిడ కూడా ఆయన్ని చేరుకోవాలని నిజంగా కోరుకున్నానండీ! కానీ, ఇందాకే అందిన సమాచారం ప్రకారం ఆవిడ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. ఎలా తట్టుకుంటారో ఏవిటో!
భగవద్గీతను నిత్యం అనుసంధానించుకుంటూ అనుదినం ఎదురవుతున్న గండాలను,సమస్యలనూ ఎదుర్కొన్న ఆ దంపతులు చివరగా తమ ప్రియమైన కూతురు తనువు చాలించడంతో తట్టుకోలేకపోయి ఇలా జీవితాన్ని ముగించాలను కోవడం చాలా బాధాకరం,అత్యంత విషాదకరం.
అయ్యో....ఏంటండీ ఈ అన్యాయం . దేవుడు ఎంత పెద్ద సిక్ష వేసాడు . పాపం ఆదిలక్ష్మి గారు ఒక మనిషి ఎంత కష్టాని అనుభవించగలడో అంతా అనుభవిస్తున్నారు. ఇంతకంటే పెద్ద దుఖం వేరే ఏమీ వుండదు .
ఈ పరిస్థితుల్లో ఇలా రాయడం సభ్యత ఉచితం ఔనో కాదో నాకు అప్రస్తుతం. చెప్పాలనుంది చెబుతున్నా. బ్లాగుముఖంగా తప్ప మీరెవరో నేనెరుగను. 'అమ్మఒడి' బ్లాగర్‌గా మీరు రాసేవాటితో నేనెప్పుడూ ఏకీభవించలేదు, చాలా సార్లు కోపం వచ్చేది. కాని పనికిరాని చెత్తా చెదారం కుప్పపోసేవాళ్ల కన్నా ఒక విషయాన్ని నమ్మి దానికోసం శ్రమించేవారు అనే భావన ఉండేది మీపై. 'నా చిన్నారి' అని మీ పాపగురించి పరిచయం చేయడం చూసి ముచ్చటేసింది, మీలో ప్రేమను పంచే అమ్మను చూసి. మీ చిన్నారి మనకు దూరవడం అమ్మగా మీకు ఒక తీరని లొటు. అందుకని మీరు ఇవాళ ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగడతారనుకో లేదు. నాకు అస్సలు నచ్చడం లేదు ఇది. మిమ్మల్ని మాతృ సమానంగా భావించేవాళ్లు ఉన్నారు మా మధ్య. వాళ్లలో మీ పాపను చూడండి. ఓ స్కూల్ నడుపుతున్నారని కూడా విన్నాను. మీరు లేకపోతే ఆ 'చిన్నారు'ల పరిస్థితి ఏమిటో అలోచించండి. ఎవరికోసమో కాకపోయినా మిమ్మల్ని అభిమానంచే వాళ్లకోసమైనా, ఇక్కడున్న మీ అత్మీయులకోసమైనా, మీతో విభేదించే నాలాటి వాళ్ల కోసమైనా మీరు కోలుకోవాలి. జీవించాలి.
నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ "తీపికి చేదు చెల్లుకు చెల్లు"ను ఈ సెప్టెంబర్ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్‌గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు. వ్యవస్థపై తనదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది. స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్‌గా వినిపించింది. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో.
వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు. తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన... కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.
జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.
ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.
పాప చనిపోవడానికి నెలరోజుల క్రితం కూడా, 'ఒక్కసారి చెన్నయ్ రండి, మీ కుటుంబం ఫోటోలు పంపండి' అని శోభ కోరితే 'నేరుగా వచ్చి కనబడితే సర్‌ప్రయిజ్‌గా ఉంటుంది కదా. వీలైనంత త్వరలో వస్తాము' అని చెప్పింది. వృత్తిపర సంబంధంలోకి వచ్చిన నాకంటే శోభతో ఆమె చాలా విషయాలు పంచుకుందట. "లక్ష్మిగారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లు ఇలా ఎలా చేయగలిగారు" అని శోభ ఇప్పుడు షాక్ తింటూ వలవలా ఏడ్చేసింది. ఆమె ఫోన్‌లో నవ్వితే కూడా అంత స్వచ్ఛంగా, ఆనందంగా వినిపించేదని, అన్ని బాధలు, బరువులు, ఒత్తిళ్లు సంవత్సరాలుగా మోస్తూ కూడా ఎలా భరించి ఆమె అంత సహజాతిసహజంగా నవ్వగలిగేదని శోభకు ఆశ్చర్యం.
నంద్యాలలో ఉన్నప్పుడు ఆమె అద్దె తక్కువగా ఉంటుందని టౌన్‌కు ఆనుకుని ఉన్న పల్లెలో ఇల్లు తీసుకున్నారు. ప్రకృతంటే ప్రాణం, పక్షులంటే ప్రాణం, రోడ్డుమీద తిరుగాడే పశువులంటే ప్రాణం, సాయంత్రం వేళల్లో ఇల్లు వదిలి వాళ్లిద్దరూ, అప్పుడప్పుడూ పాప కూడా పల్లె బాటలో పొలాల గుండా నడుస్తున్నప్పుడు మంద్రమంద్రంగా వీచే ఆ చల్లటి గాలి గురించి, పల్లె అందాల గురించి ఎన్నిసార్లు ఆమె మాట్లాడారో.. హైదరాబాద్‌లో కొత్తగా స్కూలు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతుండగా వారికి మంచినీళ్ల క్యాన్‌లను కూడా అందనీయకుండా చేసిన తమను చిరకాలంగా వెంటాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తుల గురించి నవ్వుతూనే ఎంత ధర్మాగ్రహం ప్రకటించారో.
రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలలో సత్యం పాత్ర ద్వారా పలికిస్తారు. కష్టాల పట్ల సానుభూతి ప్రకటించగల హృదయం ఉండీ కూడా లోకంలో చాలామంది సహాయం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే అర్థంలో సత్యం, విశాలాక్షికి ఉత్తరం రాస్తాడు. పాతికేళ్ల క్రితమూ ఇంతే. ఇప్పుడూ ఇంతే.
చెన్నయ్ నుంచి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదుకి వెళ్లి వారిని పలకరించలేకపోయాను. ఆమె కోలుకోవడం కష్టమనిపిస్తున్నప్పటికీ కొన్నాళ్లు ఆమెకు తోడు నీడగా ఉండి కాపాడుకోమని లెనిన్ బాబు గారికి చెప్పానే గాని, భరించలేమనుకున్నప్పుడు కొన్నాళ్లు అన్నీ వదిలి చెన్నయ్‌కి వచ్చి మావద్ద ఉండమని చెప్పలేకపోయాను. కొన్నాళ్లు వాళ్లిద్దరినీ అలా వదిలేస్తేనే బాగుంటుందని పూర్తిగా కోలుకుంటే తప్పక కలుసుకోవచ్చనుకున్నామే కాని ఒకటన్నర నెల కాకముందే ఇంత ఘోరానికి ఒడిగడతారని అస్సలు ఊహించలేము. పాప, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు కూడా లేకుండా మిగిలిన ఆమె విషం మింగి కూడా బయటపడిందని తెలుస్తోంది. బతికి బయటపడినా ఆమె జీవచ్చవమే. ఆమె జీవిస్తుందనే భరోసా ఈ క్షణంలో నాకయితే కలగడం లేదు. అమ్మ ఒడి నిజంగా ఇప్పుడే ఇవ్వాళే ఖాళీ అయిపోయింది.
తిరుపతిలో ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తూ చేస్తూ ఉన్నట్లుండి ఇంటికి రాకుండా మాచెల్లెలు కొడుకు మాయమైపోతే గత ఆరునెలలుగా వాడి అనుపానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేం. మావాడు కనిపించలేదని పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చే్స్తే దానికి అతీ గతీలేదు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు మహానగరం నడిబొడ్డున స్వంత ఇంట్లో చంపబడితే కూడా దిక్కులేదు ఈ దేశంలో... మాలాంటి, మనలాంటి సామాన్యుల సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి.
కొందఱు దేవుణ్ణి నిందిస్తున్నారు. మనుషులు కోరి చేసుకునేవాటికి దేవుడేం చేస్తాడు ? హిందువుల్లా రోజూ దేవుణ్ణి దూషించేవాళ్ళెక్కడా లేరు. ఈ అలవాటు మానుకోవాలి మనం,
జీవితంలోని ప్రతిదీ దైవ సంకల్పం వల్లే జరుగుతుందని నమ్మడం వల్లే తీవ్ర సంఘటనలు ఎదురైనపుడు,అయినవారిని కోల్పోయినపుడు అది కూడా దైవ సంకల్పమే అని భావించి,ప్రియమైన వారిని దూరం చేశాడన్న ఆక్రోశంతో, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక దేవుడిని నిందిస్తారు హిందువులు.అంతకు మించి వాళ్ళకు దేవుడంటే ద్వేషం ఉన్నట్టు కాదు కదా!
ఆ అలవాటు మానుకోవడం ఎంతో స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళకు తప్ప సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు
ప్రతి మనిషికి తాను ఊహించుకొన్న, నమ్మిన దేవుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధం వుంట్టుంది. వారి కష్ట్టాలు వచ్చినపుడు వారి అనుభవాల కనుగుణం గా దేవుని పై ప్రతిస్పందిస్తారు. మనం ఈ రోజు గొప్ప వారనుకొనే భద్రాచల రామాదాసు జైలు లో ఉన్నపుడు రాముని మీద రాసిన పాటలు విని, ఆయన చేసుకొన్నదానికి రాముని నిందిస్తూ పాటాలా అని అనగలమా? స్థితప్రజ్ఞ కలిగిన వారి సంఖ్య కోట్ల జనాభా గలిగిన మనరాష్ట్రం లో వందల సంఖ్యలో వుండదు. కష్ట్ట కాలం లో స్థితప్రజ్ఞ తో వుండి, బాధను బయటకు వ్యక్త పరచకుండా వుండటమనేది అవివేకమైన పని. మనుషులు సుఖ దు:ఖాలను బయటకు చెప్పుకోకుండా బాలేన్సేడ్ గా వుంటే ప్రజలకి సాహిత్యం, బ్లాగులు అవసరమే వుండదు.
చావులకే కాదు. ప్రతీదానికీ ప్రతిరోజూ దేవుణ్ణి దూషిస్తారు హిందువులు. అదే వద్దంటున్నాను. తెలిసి చేసినా తెలియక చేసినా, ద్వేషంతో చేసినా ఆక్రోశంతో చేసినా - ఎలా చేసినా దైవదూషణ సరికాదు. దానికి తప్పకుండా చెడ్డఫలితాలుంటాయి. తనని దూషించేవాళ్ళని దేవుడు క్షమించడు.
ప్రతీదానికీ దేవుడే కారణమని నమ్ముతున్నారా హిందువులు ? వాస్తవంగా ఏం జఱుగుతోందో గమనించండి. ఏదన్నా మంచి జఱిగితే అది తమ గొప్పతనం, తమ ప్రతిభ. ఏదైనా చెడు జఱిగితే మాత్రం "దేవుడు ఓర్వలేక పోయాడు. దేవుడు అన్యాయం చేశాడు" ఇదీ వరస.
ఇతరమతస్థులెవఱూ దేవుణ్ణి దూషించరు. కానీ వాళ్ళు ఋషులూ కారు. స్థితప్రజ్ఞులూ కారు. వారు దైవవిశ్వాసులు మాత్రమే. మనం (హిందువులం) వాళ్ళలా నిఖార్సైన దైవవిశ్వాసులం కాము. మనం అవకాశవాదులం.
మిగతా మతాల వారికి దేవుడంటే భయం ఎక్కువ కావొచ్చు. హిందువులకు భయ భక్తులతోపాటు దైవంతో అనుబధం ఎక్కువపాళ్ళుంటుందని సర్వత్రా ఉన్న విశ్వాసం. ఆ చనువుతోనే బాధ కల్గినపుడు తిట్టడానికి పూనుకుంటారు.ఇందులో అవకాశ వాదం వెదకడం అన్యాయం!
తిట్టేటప్పటి వారి మానసిక పరిస్థితిని భగవంతుడంతటివాడు తెలుస్కోలేడా? వారిని క్షమిస్తాడే గానీ శిక్షించడానికి ఎందుకు పూనుకుంటాడు? అదే చేస్తే ఆయనకీ మనుషులకీ తేడా ఏముంటుంది?
అయినా ఇక్కడి టాపిక్.. ..అనాయమైపోయిన ఆదిలక్ష్మి గారి కుటుంబం గురించే కానీ, దైవ దూషణ గురించి కాదు!
సుజాతగారూ... మీ బజ్ మేం కూడా చూడవచ్చా... ఇప్పుడు ఆదిలక్ష్మిగారు ఎలా ఉన్నారో చెప్పండి ప్లీజ్.. స్పృహలోకి వచ్చారా, లెనిన్ గారి గురించి తెలిసిందా.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి...? బజ్ లోకి వెళ్లేలోపు వీలైతే చెప్పండి ప్లీజ్....
మనుషులు ఈశ్వరకోటులనీ, జీవకోటులనీ రెండురకాలుగా ఉంటారు. నారదుడు, రామదాసు,. త్యాగరాజు, అన్నమయ్య ఇలాంటివారు ఈశ్వరకోటులు. ఈశ్వరకోటులకి మాత్రమే దేవుడి దగ్గఱ కాస్త చనువుంటుంది. మనబోటి జీవకోటులకి ఉండదు. మనం లేని చనువు తీసుకుని ఈశ్వరకోటుల్ని అనుకరిస్తే మనకి పాపమే సిద్ధిస్తుంది. ఇందులో హిందువులూ, ఇతరులూ అనే తేడా లేదు. "మనమేదో దేవుడికి దగ్గఱ" అనే ఈ భ్రాంతి ఉపయుక్తం కాదు. మనం ఇంకా దేవుడికి భయపడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం, మనం వెళ్ళాల్సిన మైళ్ళు చాలా ఉన్నాయి.
సరే, మన టాపిక్ ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాదం అయినప్పుడు మఱి దేవుణ్ణెందుకు రంగంలోకి దించాలి ?
జీవితమంటే చదువు, ఫస్ట్ మార్కులు, ఫస్ట్ క్లాసులు అనే భావన నుండి ఎప్పుడు బయటపడతారో ఈ ప్రజలు. చదువులు నార్మల్ గా ముగించి ఆర్ధిక సమస్యలు తో పని లేకుండా మంచి కెరీర్ తో ఉన్నతమైన జీవితం గడపవచ్చు. అది ఉద్యోగమే కానక్కర్లేదు, ... అయినా మరిచా, ఆదిలక్ష్మి గారి ప్రైవేట్ స్కూల్ ఒక ఉదాహరణ ఉంది కదా. వారికి ఇంత చెప్పనవసరంలేదు.
కోచింగ్ సెంటర్లు నరకం చూపుతుంటే పిల్లలు ఎలాంటి మొహమాటం లేకుండా తల్లిదండ్రులకు చెప్పాలి, అపుడా తల్లిదండ్రులు ఆ పిల్లల మనసెరిగి ప్రవర్తించాలి. సాధారణం గా ఇలాంటి సమయాలలో తల్లిదండ్రులు కట్టిన ఫీజు తిరిగిరాదని, సంవత్సరం వృధా అవుతుందని పిల్లలను ఆ నరకం లోనే సర్దుకు పొమ్మని చెబుతారు. అపుడా పిల్లలు మానసికంగా ఇంకా నలిగిపోయి ఇలాంటి అకృత్యాలకు పాల్పడతారు. ఏకైక సంతానం ఉన్న తల్లిదండ్రులు అపరాధ భావన ఫీలై, తమ జీవితాన్నీ ముగించాలనుకుంటారు. ఇది చాలా తప్పు.
నిజానికి నేను కూడా సుజాత గారు ఆలోచించినట్టే ఆవిడ కూడా దేవుడి దగ్గరకి చేరిపోతే మేలేమో అనే ఆలోచించాను. అయితే నాదో చిన్న ఆలోచన. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది తనదైన ఒక కుటుంబం. అందుకే sos టైపు లో ఆవిడ ఏ జీవని లాంటి సంస్థలోనో మిగిలిన జీవితాన్ని గడిపేలా ఒప్పించగలిగితే ఆ పిల్లలకి ఒక అమ్మ దొరుకుతుంది. ఈవిడకి బోలెడంతమంది ప్రియదర్శినులు దొరుకుతారు. (ఇదంతా సులభం కాదని నాకు తెలుసు. కాకపోతే ఏదో చిన్న ఆశ అంతే) . జ్యోతి గారూ, సుజాత గారూ ఇలా ఆలోచించచ్చో లేదో నాకు తెలియదు. తప్పయితే క్షమించండి.
30 వ్యాఖ్యలు:
అబ్బా ఏం విషాదమండీ ఇది! వాళ్ళమ్మాయి వార్తే ఇంకా ఆలోచింపచేస్తోంది.
వీళ్ళూ .... ఆ కష్టం తీర్చగలిగేది కాదు. అసలు ఆ పరిస్థితే అర్థం కానిది.
ఐనా.....
మీరు ఏమైనా అనుకోండి, ఆయన పోయి, ఆవిడ హాస్పిటల్లో ఉన్నారని తెల్సిన వెంటనే ఆవిడ కూడా ఆయన్ని చేరుకోవాలని నిజంగా కోరుకున్నానండీ! కానీ, ఇందాకే అందిన సమాచారం ప్రకారం ఆవిడ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. ఎలా తట్టుకుంటారో ఏవిటో!
నాకసలు ఏమీ అర్థం కావడం లేదు.
హబ్బ!!!!
'LIFE" I can never understand it.
భగవద్గీతను నిత్యం అనుసంధానించుకుంటూ అనుదినం ఎదురవుతున్న గండాలను,సమస్యలనూ ఎదుర్కొన్న ఆ దంపతులు చివరగా తమ ప్రియమైన కూతురు తనువు చాలించడంతో తట్టుకోలేకపోయి ఇలా జీవితాన్ని ముగించాలను కోవడం చాలా బాధాకరం,అత్యంత విషాదకరం.
అబ్బా.... దేవుడా ఆవిడని బ్రతికించకు అని దణ్ణం పెట్టుకుంటున్నాను. ఆవిడకి అంత తోడుగా ఉన్న ఆయన కూడా లేకపోయాక... ఊహించడానికే భయంగా ఉంది.
అయ్యో....ఏంటండీ ఈ అన్యాయం . దేవుడు ఎంత పెద్ద సిక్ష వేసాడు . పాపం ఆదిలక్ష్మి గారు ఒక మనిషి ఎంత కష్టాని అనుభవించగలడో అంతా అనుభవిస్తున్నారు. ఇంతకంటే పెద్ద దుఖం వేరే ఏమీ వుండదు .
లెనిన్ గారు మాట తప్పారు , ఆదిలక్ష్మిగారు బాటనే నడుస్తున్నారు
చూడండి
http://durgeswara.blogspot.com/2011/09/blog-post_17.html
ఆదిలక్ష్మి గారు,
ఈ పరిస్థితుల్లో ఇలా రాయడం సభ్యత ఉచితం ఔనో కాదో నాకు అప్రస్తుతం. చెప్పాలనుంది చెబుతున్నా. బ్లాగుముఖంగా తప్ప మీరెవరో నేనెరుగను. 'అమ్మఒడి' బ్లాగర్‌గా మీరు రాసేవాటితో నేనెప్పుడూ ఏకీభవించలేదు, చాలా సార్లు కోపం వచ్చేది. కాని పనికిరాని చెత్తా చెదారం కుప్పపోసేవాళ్ల కన్నా ఒక విషయాన్ని నమ్మి దానికోసం శ్రమించేవారు అనే భావన ఉండేది మీపై. 'నా చిన్నారి' అని మీ పాపగురించి పరిచయం చేయడం చూసి ముచ్చటేసింది, మీలో ప్రేమను పంచే అమ్మను చూసి. మీ చిన్నారి మనకు దూరవడం అమ్మగా మీకు ఒక తీరని లొటు. అందుకని మీరు ఇవాళ ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగడతారనుకో లేదు. నాకు అస్సలు నచ్చడం లేదు ఇది. మిమ్మల్ని మాతృ సమానంగా భావించేవాళ్లు ఉన్నారు మా మధ్య. వాళ్లలో మీ పాపను చూడండి. ఓ స్కూల్ నడుపుతున్నారని కూడా విన్నాను. మీరు లేకపోతే ఆ 'చిన్నారు'ల పరిస్థితి ఏమిటో అలోచించండి. ఎవరికోసమో కాకపోయినా మిమ్మల్ని అభిమానంచే వాళ్లకోసమైనా, ఇక్కడున్న మీ అత్మీయులకోసమైనా, మీతో విభేదించే నాలాటి వాళ్ల కోసమైనా మీరు కోలుకోవాలి. జీవించాలి.
very Sad. oka maranam inkoka maranam ni..vaanchichadu. aadilakshmi gaari paristhiti ippudu inkaa vishaadam.
నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ "తీపికి చేదు చెల్లుకు చెల్లు"ను ఈ సెప్టెంబర్ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్‌గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు. వ్యవస్థపై తనదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది. స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్‌గా వినిపించింది. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో.
వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు. తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన... కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.
జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.
ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.
పాప చనిపోవడానికి నెలరోజుల క్రితం కూడా, 'ఒక్కసారి చెన్నయ్ రండి, మీ కుటుంబం ఫోటోలు పంపండి' అని శోభ కోరితే 'నేరుగా వచ్చి కనబడితే సర్‌ప్రయిజ్‌గా ఉంటుంది కదా. వీలైనంత త్వరలో వస్తాము' అని చెప్పింది. వృత్తిపర సంబంధంలోకి వచ్చిన నాకంటే శోభతో ఆమె చాలా విషయాలు పంచుకుందట. "లక్ష్మిగారు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లు ఇలా ఎలా చేయగలిగారు" అని శోభ ఇప్పుడు షాక్ తింటూ వలవలా ఏడ్చేసింది. ఆమె ఫోన్‌లో నవ్వితే కూడా అంత స్వచ్ఛంగా, ఆనందంగా వినిపించేదని, అన్ని బాధలు, బరువులు, ఒత్తిళ్లు సంవత్సరాలుగా మోస్తూ కూడా ఎలా భరించి ఆమె అంత సహజాతిసహజంగా నవ్వగలిగేదని శోభకు ఆశ్చర్యం.
నంద్యాలలో ఉన్నప్పుడు ఆమె అద్దె తక్కువగా ఉంటుందని టౌన్‌కు ఆనుకుని ఉన్న పల్లెలో ఇల్లు తీసుకున్నారు. ప్రకృతంటే ప్రాణం, పక్షులంటే ప్రాణం, రోడ్డుమీద తిరుగాడే పశువులంటే ప్రాణం, సాయంత్రం వేళల్లో ఇల్లు వదిలి వాళ్లిద్దరూ, అప్పుడప్పుడూ పాప కూడా పల్లె బాటలో పొలాల గుండా నడుస్తున్నప్పుడు మంద్రమంద్రంగా వీచే ఆ చల్లటి గాలి గురించి, పల్లె అందాల గురించి ఎన్నిసార్లు ఆమె మాట్లాడారో.. హైదరాబాద్‌లో కొత్తగా స్కూలు తెరిచి పిల్లలకు పాఠాలు చెబుతుండగా వారికి మంచినీళ్ల క్యాన్‌లను కూడా అందనీయకుండా చేసిన తమను చిరకాలంగా వెంటాడుతూ వస్తున్న ఆ అదృశ్య శక్తుల గురించి నవ్వుతూనే ఎంత ధర్మాగ్రహం ప్రకటించారో.
రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలలో సత్యం పాత్ర ద్వారా పలికిస్తారు. కష్టాల పట్ల సానుభూతి ప్రకటించగల హృదయం ఉండీ కూడా లోకంలో చాలామంది సహాయం చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే అర్థంలో సత్యం, విశాలాక్షికి ఉత్తరం రాస్తాడు. పాతికేళ్ల క్రితమూ ఇంతే. ఇప్పుడూ ఇంతే.
చెన్నయ్ నుంచి 400 కిలోమీటర్లు దూరంలో ఉన్న హైదరాబాదుకి వెళ్లి వారిని పలకరించలేకపోయాను. ఆమె కోలుకోవడం కష్టమనిపిస్తున్నప్పటికీ కొన్నాళ్లు ఆమెకు తోడు నీడగా ఉండి కాపాడుకోమని లెనిన్ బాబు గారికి చెప్పానే గాని, భరించలేమనుకున్నప్పుడు కొన్నాళ్లు అన్నీ వదిలి చెన్నయ్‌కి వచ్చి మావద్ద ఉండమని చెప్పలేకపోయాను. కొన్నాళ్లు వాళ్లిద్దరినీ అలా వదిలేస్తేనే బాగుంటుందని పూర్తిగా కోలుకుంటే తప్పక కలుసుకోవచ్చనుకున్నామే కాని ఒకటన్నర నెల కాకముందే ఇంత ఘోరానికి ఒడిగడతారని అస్సలు ఊహించలేము. పాప, ఇప్పుడు ఆమె జీవన సహచరుడు కూడా లేకుండా మిగిలిన ఆమె విషం మింగి కూడా బయటపడిందని తెలుస్తోంది. బతికి బయటపడినా ఆమె జీవచ్చవమే. ఆమె జీవిస్తుందనే భరోసా ఈ క్షణంలో నాకయితే కలగడం లేదు. అమ్మ ఒడి నిజంగా ఇప్పుడే ఇవ్వాళే ఖాళీ అయిపోయింది.
తిరుపతిలో ఎలక్ట్రానిక్ షాపులో పనిచేస్తూ చేస్తూ ఉన్నట్లుండి ఇంటికి రాకుండా మాచెల్లెలు కొడుకు మాయమైపోతే గత ఆరునెలలుగా వాడి అనుపానులు కూడా తెలియని స్థితిలో ఉన్నాం మేం. మావాడు కనిపించలేదని పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చే్స్తే దానికి అతీ గతీలేదు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మేనకోడలు మహానగరం నడిబొడ్డున స్వంత ఇంట్లో చంపబడితే కూడా దిక్కులేదు ఈ దేశంలో... మాలాంటి, మనలాంటి సామాన్యుల సమస్యలకు ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి.
నెలవంక గారూ,
మీ ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ పంపగలరా?
కొందఱు దేవుణ్ణి నిందిస్తున్నారు. మనుషులు కోరి చేసుకునేవాటికి దేవుడేం చేస్తాడు ? హిందువుల్లా రోజూ దేవుణ్ణి దూషించేవాళ్ళెక్కడా లేరు. ఈ అలవాటు మానుకోవాలి మనం,
ఎంత విషాదం! ఆదిలక్ష్మిగారికి ఆ పరమాత్మ స్వాంతన కల్పించాలని ప్రార్ధించడంతప్ప ఏమి చేయగలం.
జీవితంలోని ప్రతిదీ దైవ సంకల్పం వల్లే జరుగుతుందని నమ్మడం వల్లే తీవ్ర సంఘటనలు ఎదురైనపుడు,అయినవారిని కోల్పోయినపుడు అది కూడా దైవ సంకల్పమే అని భావించి,ప్రియమైన వారిని దూరం చేశాడన్న ఆక్రోశంతో, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక దేవుడిని నిందిస్తారు హిందువులు.అంతకు మించి వాళ్ళకు దేవుడంటే ద్వేషం ఉన్నట్టు కాదు కదా!
ఆ అలవాటు మానుకోవడం ఎంతో స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళకు తప్ప సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు
ప్రతి మనిషికి తాను ఊహించుకొన్న, నమ్మిన దేవుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధం వుంట్టుంది. వారి కష్ట్టాలు వచ్చినపుడు వారి అనుభవాల కనుగుణం గా దేవుని పై ప్రతిస్పందిస్తారు. మనం ఈ రోజు గొప్ప వారనుకొనే భద్రాచల రామాదాసు జైలు లో ఉన్నపుడు రాముని మీద రాసిన పాటలు విని, ఆయన చేసుకొన్నదానికి రాముని నిందిస్తూ పాటాలా అని అనగలమా? స్థితప్రజ్ఞ కలిగిన వారి సంఖ్య కోట్ల జనాభా గలిగిన మనరాష్ట్రం లో వందల సంఖ్యలో వుండదు. కష్ట్ట కాలం లో స్థితప్రజ్ఞ తో వుండి, బాధను బయటకు వ్యక్త పరచకుండా వుండటమనేది అవివేకమైన పని. మనుషులు సుఖ దు:ఖాలను బయటకు చెప్పుకోకుండా బాలేన్సేడ్ గా వుంటే ప్రజలకి సాహిత్యం, బ్లాగులు అవసరమే వుండదు.
చావులకే కాదు. ప్రతీదానికీ ప్రతిరోజూ దేవుణ్ణి దూషిస్తారు హిందువులు. అదే వద్దంటున్నాను. తెలిసి చేసినా తెలియక చేసినా, ద్వేషంతో చేసినా ఆక్రోశంతో చేసినా - ఎలా చేసినా దైవదూషణ సరికాదు. దానికి తప్పకుండా చెడ్డఫలితాలుంటాయి. తనని దూషించేవాళ్ళని దేవుడు క్షమించడు.
ప్రతీదానికీ దేవుడే కారణమని నమ్ముతున్నారా హిందువులు ? వాస్తవంగా ఏం జఱుగుతోందో గమనించండి. ఏదన్నా మంచి జఱిగితే అది తమ గొప్పతనం, తమ ప్రతిభ. ఏదైనా చెడు జఱిగితే మాత్రం "దేవుడు ఓర్వలేక పోయాడు. దేవుడు అన్యాయం చేశాడు" ఇదీ వరస.
ఇతరమతస్థులెవఱూ దేవుణ్ణి దూషించరు. కానీ వాళ్ళు ఋషులూ కారు. స్థితప్రజ్ఞులూ కారు. వారు దైవవిశ్వాసులు మాత్రమే. మనం (హిందువులం) వాళ్ళలా నిఖార్సైన దైవవిశ్వాసులం కాము. మనం అవకాశవాదులం.
ఆదిలక్ష్మి గారి విషయమై అప్డేట్ నా బజ్ లో చూడగలరు
మిగతా మతాల వారికి దేవుడంటే భయం ఎక్కువ కావొచ్చు. హిందువులకు భయ భక్తులతోపాటు దైవంతో అనుబధం ఎక్కువపాళ్ళుంటుందని సర్వత్రా ఉన్న విశ్వాసం. ఆ చనువుతోనే బాధ కల్గినపుడు తిట్టడానికి పూనుకుంటారు.ఇందులో అవకాశ వాదం వెదకడం అన్యాయం!
తిట్టేటప్పటి వారి మానసిక పరిస్థితిని భగవంతుడంతటివాడు తెలుస్కోలేడా? వారిని క్షమిస్తాడే గానీ శిక్షించడానికి ఎందుకు పూనుకుంటాడు? అదే చేస్తే ఆయనకీ మనుషులకీ తేడా ఏముంటుంది?
అయినా ఇక్కడి టాపిక్.. ..అనాయమైపోయిన ఆదిలక్ష్మి గారి కుటుంబం గురించే కానీ, దైవ దూషణ గురించి కాదు!
దయచేసి టాపిక్ డైవర్ట్ చేయకండి..
సుజాతగారూ... మీ బజ్ మేం కూడా చూడవచ్చా... ఇప్పుడు ఆదిలక్ష్మిగారు ఎలా ఉన్నారో చెప్పండి ప్లీజ్.. స్పృహలోకి వచ్చారా, లెనిన్ గారి గురించి తెలిసిందా.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి...? బజ్ లోకి వెళ్లేలోపు వీలైతే చెప్పండి ప్లీజ్....
మనుషులు ఈశ్వరకోటులనీ, జీవకోటులనీ రెండురకాలుగా ఉంటారు. నారదుడు, రామదాసు,. త్యాగరాజు, అన్నమయ్య ఇలాంటివారు ఈశ్వరకోటులు. ఈశ్వరకోటులకి మాత్రమే దేవుడి దగ్గఱ కాస్త చనువుంటుంది. మనబోటి జీవకోటులకి ఉండదు. మనం లేని చనువు తీసుకుని ఈశ్వరకోటుల్ని అనుకరిస్తే మనకి పాపమే సిద్ధిస్తుంది. ఇందులో హిందువులూ, ఇతరులూ అనే తేడా లేదు. "మనమేదో దేవుడికి దగ్గఱ" అనే ఈ భ్రాంతి ఉపయుక్తం కాదు. మనం ఇంకా దేవుడికి భయపడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం, మనం వెళ్ళాల్సిన మైళ్ళు చాలా ఉన్నాయి.
సరే, మన టాపిక్ ఆదిలక్ష్మి గారి కుటుంబ విషాదం అయినప్పుడు మఱి దేవుణ్ణెందుకు రంగంలోకి దించాలి ?
జీవితమంటే చదువు, ఫస్ట్ మార్కులు, ఫస్ట్ క్లాసులు అనే భావన నుండి ఎప్పుడు బయటపడతారో ఈ ప్రజలు. చదువులు నార్మల్ గా ముగించి ఆర్ధిక సమస్యలు తో పని లేకుండా మంచి కెరీర్ తో ఉన్నతమైన జీవితం గడపవచ్చు. అది ఉద్యోగమే కానక్కర్లేదు, ... అయినా మరిచా, ఆదిలక్ష్మి గారి ప్రైవేట్ స్కూల్ ఒక ఉదాహరణ ఉంది కదా. వారికి ఇంత చెప్పనవసరంలేదు.
కోచింగ్ సెంటర్లు నరకం చూపుతుంటే పిల్లలు ఎలాంటి మొహమాటం లేకుండా తల్లిదండ్రులకు చెప్పాలి, అపుడా తల్లిదండ్రులు ఆ పిల్లల మనసెరిగి ప్రవర్తించాలి. సాధారణం గా ఇలాంటి సమయాలలో తల్లిదండ్రులు కట్టిన ఫీజు తిరిగిరాదని, సంవత్సరం వృధా అవుతుందని పిల్లలను ఆ నరకం లోనే సర్దుకు పొమ్మని చెబుతారు. అపుడా పిల్లలు మానసికంగా ఇంకా నలిగిపోయి ఇలాంటి అకృత్యాలకు పాల్పడతారు. ఏకైక సంతానం ఉన్న తల్లిదండ్రులు అపరాధ భావన ఫీలై, తమ జీవితాన్నీ ముగించాలనుకుంటారు. ఇది చాలా తప్పు.
నిజానికి నేను కూడా సుజాత గారు ఆలోచించినట్టే ఆవిడ కూడా దేవుడి దగ్గరకి చేరిపోతే మేలేమో అనే ఆలోచించాను. అయితే నాదో చిన్న ఆలోచన. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది తనదైన ఒక కుటుంబం. అందుకే sos టైపు లో ఆవిడ ఏ జీవని లాంటి సంస్థలోనో మిగిలిన జీవితాన్ని గడిపేలా ఒప్పించగలిగితే ఆ పిల్లలకి ఒక అమ్మ దొరుకుతుంది. ఈవిడకి బోలెడంతమంది ప్రియదర్శినులు దొరుకుతారు. (ఇదంతా సులభం కాదని నాకు తెలుసు. కాకపోతే ఏదో చిన్న ఆశ అంతే) . జ్యోతి గారూ, సుజాత గారూ ఇలా ఆలోచించచ్చో లేదో నాకు తెలియదు. తప్పయితే క్షమించండి.
Very Sad..
can u pl. tell us which hospital she is in? can we visit?
Hi aravind,
If you have a gmail account, you can visit my buzz! I feel it doesn't sound good to share about her treatment here in publicly in the blog.
sujatha bedadakota is my name in the buzz
sure. thank u. very sad to hear what happened with her& her family.
very sad to know this
బాధని మాటలలొ రాయలెను.ఆమె ఫొటొ పేపెర్ లొ చుడగానె కనీర్రు ఆగలెదు.చాలా అనాయ్యం జరిగింది ఆవిడికి.ఇది ఎవరు ఒదార్చలెనిది.
Post a Comment