Wednesday 14 September 2011

వసంత పంచక పూర్ణ "జ్యోతి"




టైటిల్ చూసి కంగారు పడుతున్నారా?? అదేం లేదండి. ఇవాల్టికి ఈ బ్లాగు "జ్యోతి" కి ఐదేళ్లు నిండాయన్నమాట. ఐదేళ్ల క్రింద సరదాగా మొదలెట్టిన నా బ్లాగు తడబడే అడుగులతో పయనిస్తూ ఇపుడు నిలదొక్కుకుని కాస్త నిలబడింది. ఈ పయనం అంత కష్టమైనదీ అనను, సులువైనదీ అనను. నిజ జీవితంలోలాగే ఇక్కడా ఎన్నో తప్పటడుగులు, ఆటుపోట్లు, మెచ్చుకోళ్లు, ఈర్ష్యలు... అన్నీ చూసాను. నా ఈ యాత్రలో నాతో కలిసి నన్ను ప్రోత్సహించి, ముందుకు నడిపించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఎన్నో చెప్పాలని ఉంది ...


ముందుగా పాత వార్షికోత్సవాలు కూడా ఒకసారి తిరగేసి రండి..


ప్రధమ వార్షికోత్సవం
ద్వితీయ వార్షికోత్సవం
తృతీయ వార్షికోత్సవం
చతుర్ధ వార్షికోత్సవం

కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీని నాకు ఓపికగా ఎన్నో సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు, అడిగినప్పుడల్లా వివరంగా నేర్పించిన సాంకేతిక గురువు వీవెన్. నా పిచ్చి రాతలను రచనలుగా చేసుకోవడంలో ప్రోత్సహించి, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునేలా చేసిన సాహిత్య గురువు కొత్తపాళీగారు. ముందుగా వీరిద్దరికీ ఒక మంచి విద్యార్థినిగా నమస్సుమాంజలి.



తర్వాత చెప్పుకోవాల్సింది మా ప్రమదావనం స్నేహితురాళ్లను. మహిళా బ్లాగర్లతో ఒక గుంపు మొదలుపెట్టి అందరూ కలిసి మాట్లాడుకుని, సరదాగా గడపడానికి మొదలుపెట్టిన ప్రమదావనం సమాజ సేవలో కూడా పాలు పంచుకుంటుంది. వీరందరినీ ఒక చోట చేర్చాను, తెలియంది చెప్పాను తప్ప నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. కాని వాళ్లంతా కలిసి నా ఇచ్చిన పుట్టినరోజు బహుమతి మాత్రం అద్భుతం, నిజంగా ఊహించలేనిది అని చెప్పవచ్చు. అసలు ఈ బ్లాగ్లోకంలో ఎవరికీ అలాంటి బహుమతి లభించి ఉండకపోవచ్చు. ఇన్ని రోజులకా ఈ విషయాన్ని చెప్పేది అంటే ఆ అభిమానపు జల్లులో తడిసి ముద్దైనాను. ఇంకా తేరుకోలేదు. తేరుకోలేను, మరచిపోలేను కూడా. అందరూ కలిసి గూడుఫుఠానీ చేసి నా కోసం ఎన్ని బహుమతులు ఇచ్చారో. వారి అభిమానం, ప్రేమనంతా అక్షరాలలో గుచ్చి ఒక మాలగా నాకు వేసారు. వారందరికీ మన: పూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది కాని మీ ప్రేమ ముందు అవన్నీ తక్కువే అనిపిస్తుంది.


అన్ని సమయాల్లో నా బ్లాగు ప్రయాణంలో తోడుండి ప్రోత్సహించిన మరి కొందరు మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

నాగరాజు పప్పు, నల్లమోతు శ్రీధర్, సత్యసాయిగారు, చావా కిరణ్, కల్పన రెంటాల, అఫ్సర్ గారు, తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యంగారు, సుజాత, కస్తూరి మురళీకృష్ణ ,, వరూధిని, ఉమ, ఉష.. ఇంక బజ్జు మిత్రులకు కూడా బోల్డు థాంక్సులూ..



ఈ సంవత్సరం కొందరు ప్రముఖ వ్యక్తులతో పరిచయం కలిగి ఆత్మీయ స్నేహంగా మారింది. ఏన్నో ఏళ్లనుండి అభిమానించిన వ్యక్తులతో మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారిలో కార్టూనిస్ట్ జయదేవ్ గారు, ఇలియాస్ అహ్మద్ గారు, రచయిత మల్లాది గారు, ఆర్టిస్ట్ అక్బర్ , ఘంటసాల గారి అమ్మాయి శ్యామల ... వీరందరితో నన్ను నేను పరిచయం చేసుకుని మాట్లాడతానని కల్లో కూడా అనుకోలేదు. కాని అదంతా నిజమైంది..ఆంతా ఆ అమ్మ లీల.



అందరికంటే ఎక్కువగా నేను ధాంక్స్ చెప్పుకోవాల్సింది నా బ్లాగు జ్యోతి కే. నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను....



ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పాలి. కాస్త ప్రమాదకరమైన వ్యక్తే.. ఉండండి బయట అన్ని గడియలు వేసి వస్తాను..అతని గురించి ఎప్పుడూ చెప్పలేదు. కాని అతనితో చాలా గొడవలు కూడా జరిగాయి. అయినా అతనికి థాంక్స్ చెప్పకుండా ఉండలేను.. నాకు ప్రమాదమని తెలిసిన ఒక విషయం చెప్పాలి. అసలు మలక్ బ్లాగులోకంలోకి వచ్చింది నా మూలంగానే.. నన్ను కెలకడానికి వచ్చాడు అప్పుడెప్పుడో. తర్వాత పరిచయం కలిగి , స్నేహం పెరిగింది. కాని చివరికి నావల్లే కెలకబడ్డాడు పాపం.. అందుకే పెద్దలు చెప్పారు ... (... ఇది మీకు తెలుసు...)... అతని స్నేహం వల్ల నాకు కొన్ని రౌడీ వేషాలు అబ్బాయి లెండి. ముఖ్యంగా తప్పు చేయనప్పుడు బాధపడకూడదు, ఎవరికీ భయపడకూడదు, లెక్క చేయకూడదు అని.. పాపం పాపాయి మాత్రం ఇరుక్కుపోయాడు. ఎలా అంటారా?? వాళ్ళ అమ్మగారిని నాకు పరిచయం చేసాడు. ఇంకేముంది...ఇక్కడ ఏం గొడవ చేసినా న్యూస్ అక్కడికి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదన్నమాట..:)) ఆ సదవకాశం నేను ఇంకా వినియోగించుకోలేదు లెండి.........థాంక్స్ భరద్వాజ్..



మీ అభిమానం, ప్రేమ , ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ నా పయనాన్ని కొనసాగిస్తున్నాను.


నమస్తే........

49 వ్యాఖ్యలు:

Manga Mani

మీరిలానే మరిన్ని వసంతాలు జరుపుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ మీ బ్లాగుకు పంచమ వార్షికోత్సవ జన్మదిన శుభకాంక్షలు

చింతా రామ కృష్ణా రావు.

వసంత పంచక పూర్ణ జ్యోతి కివే నా శుభాకాంక్షలు.
అమ్మా! నిరంతర అసాధారణ పరిశ్రమతో ప్రతీ రోజూ ఒక క్రొంగ్రొత్త విషయంతో పాఠకుల నాకర్షించుతూ, బహుళ ప్రయోజన కరంగా ఉండేలా మీబ్లాగును తీర్చి దిద్దుతూ, అందరికీ ఆశా జ్యోతిగా, అందరికీ తలలోని నాల్కగా మీరు నిలిచారంటే అందుకు మీ వసుధైక కుటుంబక సిద్ధాంతమే కారణం. అడగాలే కాని ఎలాంటి వారికైనా మంచి సలహాలు, మంచి ఉపకారాలు అవ్యాజానురాగంతో చేస్తారు మీరు.అంతటి ఔన్నత్యంతో ప్రకాశించే జ్యోతి మీరు. మీరూ, ఈ బ్లాగూ సార్థక నామధేయులై విరాజిల్లుతున్నారు.
ఇలాగే శతాధిక వర్ష ప్రాయులవాలనీ, బహుళ ప్రయోజన కారకులవాలనీ,చిదానందంతో, మీరూ, మీ కుటుంబమూ వర్ధిల్లాలనీ, అందుకు మీకు అండ దండగా ఆ పరమాత్మ ఉండాలనీ మనసారా కోరుకొంటున్నాను.
శుభమస్తు.

బులుసు సుబ్రహ్మణ్యం

వసంత పంచక పూర్ణ "జ్యోతి" కి శుభాభినందనలు.

ఇలాంటి పండగలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

లత

మీ బ్లాగ్ కు జన్మదిన శుభకాంక్షలు జ్యోతిగారూ
హాపీ హపీ యానివెర్సెరీ

durgeswara

శుభాకాంక్షలు

Uma Jiji

ఏన్నో అభిన౦దనలు మీకు, మీ పాఠకలోకానికి!

భమిడిపాటి సూర్యలక్ష్మి

హార్దిక శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ,అందరినీ ఆనందపరుస్తూ ఉండండి.

సూర్యలక్ష్మి, ఫణిబాబు

కృష్ణప్రియ

ఐదు సంవత్సరాలే! శుభాకాంక్షలు.

శశి కళ

చక్కగా ఉంది జ్యొతి గారు...మీరింకా జన్మదినాలు
జరుపుకొవాలని కొరుకుంటున్నాను.

శ్రీలలిత

ఒక జ్యోతి తాను ప్రకాశిస్తూ మరెన్నో జ్యోతులను వెలిగిస్తుంది.
అలాగే అందరినీ సమాదరిస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్నఈ జ్యోతికి ఆయురారోగ్య ఐశ్వర్యాల తులతూగేట్టు దీవెనలివ్వాలని ఈ పండుగదిన సందర్భంగా ఆ పరమాత్మను హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను

Kalpana Rentala

జ్యోతి,

మీరు, ఈ బ్లాగ్ మరిన్న వసంతోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

కల్పన

మాలా కుమార్

మీరు మరిన్ని " వసంత పంచకాలు చేసుకోవాలని కోరుకుంటూ ,
బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు .

SRRao

జ్యోతి గారూ !
మీ ' జ్యోతి ' అఖండజ్యోతిలా వెలగాలని కోరుకుంటూ....
పంచమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శోభ

జ్యోతిగారు...

మీ బ్లాగు ఐదవ పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు అభినందనలు.. మీ "జ్యోతి" ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, మా అందరినీ ఇలాగే కలకాలం అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..

సుజాత వేల్పూరి

జ్యోతి, మీరిలాగే మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలి! జరుపుకుంటారు కూడా!

You are a special woman!

Great achievment!
Congratulations!

జ్యోతి

మణిగారు,
రామకృష్ణగారు
సుబ్రహ్మణ్యంగారు
లతగారు
దుర్గేశ్వరగారు
ఉమగారు
సూర్యలక్ష్మిగారు
కృష్ణప్రియగారు
శ్రీలలితగారు
శశికళగారు
మాలాగారు
రావుగారు
శోభగారు
సుజాతగారు
కల్పన

అందరికీ మన:పూర్వక ధన్యవాదాలు.అంతా మీ అభిమానం..

జ్యోతి

నా బ్లాగు టపాకోసం అందమైన కార్డును తయారు చేసిచ్చిన రామకృష్ణ పుక్కళ్ల గారికి ధాంక్సులు..

సిరిసిరిమువ్వ

శుభాభినందనలు.ఈ జ్యోతి ఎప్పటికీ ఇలానే జ్వలిస్తూ ఉండాలి.

Anonymous

జ్యోతి గారు శుభాకాంక్షలు . ఈ సంవత్సరం కొత్తగా ఏం చేయాబోతున్నారు . ఏ రంగంలో మీరున్నా దానిలో మీరు ఎంతో ఉన్నతి సాధించాలని కోరుకుంటున్నాం

తెలుగుకళ

Dynamic and smart blog leader Jyothiji..... My hearty wishes to you.

Telugukala.padmakala


(eng.lo rasanani thittoddu technical problem.)

Padmarpita

జ్యోతిగారూ......హపీ యానివెర్సెరీ!

Shiva Bandaru

శుభాకాంక్షలు

Admin

మీ బ్లాగ్ కు జన్మదిన శుభకాంక్షలు జ్యోతిగారూ.

వనజ తాతినేని/VanajaTatineni

జ్యోతి గారు ఎన్నో..వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ..పంచవన్నెల పుష్పాల అభినందన మందారమాల అండీ..

సత్యవతి

గురువుగారికి హృదయపూర్వక అభినందనలు.

kavi yakoob

శుభాకాంక్శలు-మీ బ్లాగు విజయానికి.

కొత్త పాళీ

keep blogging. Happy blogging!

శ్రీ

జ్యోతి గారు, మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు!

మధురవాణి

CONGRATULATIONS!!! :)

Ennela

బంగారు పాపాయి బహుమతులు పొందింది
పాపాయి చదివింది మా మంచి చదువూ...
..........................
మీ బ్లాగు పాపాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలండీ..యీ రోజే పాడమని నన్నడగవలెనా పరవశించీ పాడనా కి సంబందించిన రెండు టపాలు చదివానా..నాకూ ఒక్క చాన్స్ రాకపోతుందా అనుకున్నా .ఇక పుట్టినరోజు పండుగ అని తెలియగానే, పాడకుండా ఉండలేకపోతున్నా అన్నమాట..

Malakpet Rowdy

ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పాలి. కాస్త ప్రమాదకరమైన వ్యక్తే..
________________________________________

VammO :O

Newayz thanks, and CONGRATULATIONS!

మేధ

You are always an inspiration to many.. Keep Going and All the best.. :)

Sanath Sripathi

Congratulations madam. :-)

జ్యోతి

వరూధినిగారు
పి.లక్ష్మిగారు,
వనజగారు
యాకూబ్ గారు
కొత్తపాళీగారు
సనత్ గారు
లలిత
పద్మకళ
శివ
పద్మార్పిత
మధురవాణి
ఎన్నెల
శ్రీ
మేధ
మలక్
అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు..

సుధామ

జ్యోతి గారూ! నమస్తే.

ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా బ్లాగ్ నడిపినందుకే కాదు,నా లాంటి వారికి బ్లాగ్ ప్రారంభించేందుకు జ్యోతి వెలిగించినందుకు కూడా శుభాభినందనలు.జ్యోత్ సే జ్యోత్ జగాతె చలో.....

పద్మవల్లి

Jyothi garu,

Congratulations!!!

KumarN

I read your journey above.
Quite a journey. Amazing. Kudos!!

Keep Going..

Kumar N

జ్యోతి

సుధామగారు, పద్మగారు, కుమార్ గారు ధాంక్స అండి..

Lakshmi Raghava

జ్యోతీ,
గురువు గారూ అననా , అమ్మాయి అని పిలుచుకోనా..ఎవ్వరివైనా నా ఆశీర్వాదాలు.
నన్ను ప్రమదావనానికి పరిచయం చేసావు..థాంక్యూ..
ఎన్నో నేర్చుకున్నా..ఇంకా ఎన్నోవున్నాయి..ఇలాగె మరిన్ని వసంతాలు జరుపుకుని అందరికి సహాయపడాలని కోరుకుంటూ..శుభాకాంక్షలతో
లక్ష్మీ రాఘవ

ఆ.సౌమ్య

ఏంటండీ ఐదేళ్లే...హమ్మో!
అన్నేళ్ళు బ్లాగడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు...hreaty congratulations! keep blogging!

జ్యోతి

సత్యవతిగారు, ఇరవై ఏళ్లక్రింద మీరు రాసిన కధలోని నాయికను ఇప్పుడు మీకు గురువునైనాను. చాలా గర్వంగా ఉంది. కాని మీరు బ్లాగును అస్సలు పట్టించుకోవడంలేదండి.. మీ జ్ఞాపకాలు, మధురస్మృతులు మాతో పంచుకోవచ్చుగా..

జ్యోతి

లక్ష్మిగారు మీ ఆశీర్వాదాలు చాలండి..
సౌమ్యా!! అదే మరి 5 ఇయర్స్ ఇన్ ది ఇండస్త్రీ. రాటు దేలిపోయాను..:)))

psm.lakshmi

జ్యోతీ,
హార్దిక శుభాకాంక్షలు. దిన దిన ప్రవర్ధమానమవుతున్న మీ బ్లాగు జ్యోతి కలకాలం కోట్ల కాంతులతో కళ కళలాడాలని కోరుతూ
psmlakshmi

చాతకం

శుభాకాంక్షలు

హనుమంత రావు

జ్యోతిగారి బ్లాగుకి....జన్మదిన శుభాకాంక్షలు....
బ్లాగు ప్రారంభించాలంటే ఎలాగ ? అంటే "జ్యోతిగారిని సంప్రదించండి " అని చెప్పడమే తెలుసు..
నాకూ ఓ బ్లాగు ఉంది అంటే అది జ్యోతి వెలుగే. అందరికోసం కాకపోయినా, అది నా ఆనందంకోసం.
...కార్తీక వనభోజనాలు, కలసి సామూహిక చాటింగ్, మాలిక మాగజైన్... మొ||న వాటికి శ్రీకారం చుట్టారు.
నాలాంటివాణ్ణి ప్రోత్సహించారు.. అవన్నీ ఆనందానుభవాలు...
మీ బ్లాగు సమావేశాలు, టి.వి. ఇంటర్వ్యూలు తెలుగు బ్లాగుకే ఓ గుర్తింపు... ఐదు వత్సరాల
ఈ చిన్ని వటువు... ఇంకా ఇంకా క్రొత్త ,,,కొంగ్రొత్త ఆలోచనలతో మంచి మంచి కార్యక్రమములు చేయాలని ఆకాంక్షిస్తూ:............ మీ అమూల్యమైన చెలిమి నాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ...శలవు.

కాయల నాగేంద్ర

కాయల నాగేంద్ర

జ్యోతి గారికి అభినందనలు. మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు. మీ బ్లాగ్ ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

పంతుల విజయ లక్ష్మి

ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న’బ్లాగ్జ్యోతికి‘,జ్యోతిగారికి
శుభాభినందనలు, ఆశిస్సులు. మీ బ్లాగ్ మాలాంటి వారికి స్పూర్తి.ఆర్నెల్ల క్రితం బ్లాగ్ ప్రారంభించి--సత్యవతిగారి కధలోని శారద లాగ అలుకు గుడ్డ పట్టుకుని బ్లాగుని నిర్లక్ష్యం చేసాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఒకటి రాయాలనిపిస్తోంది.తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను..

సుభ/subha

ఐదు సంవత్సరాలు బ్లాగు నడిపిన మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవచ్చండీ. మీరు మాలాంటి వాళ్ళకి ఎంతో స్పూర్తిదాయకం కూడా.

పంచేద్రియాల సాక్షిగా
పంచ భూతాల సాక్షిగా
మీ జ్యోతి వెలుగుల సాక్షిగా
మీ పయనాలకి అలుపే లేక
నిరంతరం సాగిపోవాలని
అకాంక్షిస్తున్నా మనస్పుర్తిగా..!

Uma Bharathi Kosuri

Jyothi garu,
You are an inspiration....Amazing journey through this world of literature, as writer, editor.... Congratulations!!!!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008