Thursday, 28 February 2013

షడ్రుచులు ebook

షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్

                                                     అన్నదాతా సుఖీభవః

కడుపునిండా రుచికరమైన భోజనం తినగానే వచ్చే మాట ఇది. ఆకలి ఎరిగి అన్నం పెట్టినవారిని సాక్షాత్తు అన్నపూర్ణగా భావించే పవిత్ర సంప్రదాయం మనది. తనవారికోసం రకరకాల వంటకాలు నేర్చుకుని వండి పెట్టడం దాదాపు ప్రతీ వారికీ ఇష్టమైన, సంతోషాన్నిచ్చే కార్యక్రమం. నాకు కూడా చిన్నప్పటినుండి అమ్మ చేసిన వంటలు తినడం తప్ప వండడం రాకున్నా పెళ్లయ్యాక తప్పదు కదా. అప్పుడు నేర్చుకోవడం మొదలెడితే ఇంకా అయిపోవడంలేదు. సరదాగా మొదలెట్టిన బ్లాగు ప్రయాణంలో నాకు నచ్చిన, వచ్చిన వంటలను షడ్రుచులు అనే బ్లాగులో పెట్టసాగాను. తర్వాత్తర్వాత బ్లాగు విశిష్ట గుర్తింపు పొందింది.
మూడేళ్ల క్రింద నా వంటల ప్రయాణం షడ్రుచులు వెబ్ సైట్ రూపంలో కొత్త దారిలో పయనించడం మొదలుపెట్టింది. తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో రుచి పేరుతో రెండేళ్లుగా వ్రాస్తున్న నా వంటల కాలమ్ నేను వంటలు చేయడం నుంచి వంటలు వ్రాయడం దిశగా సాగిన మరో ముందడుగు. ఈ కాలమ్ మూలంగా కొత్త కొత్తవంటల గురించి తెలుసుకోవడం, ప్రయోగాలు చేయడం ఉత్సాహాన్నిచ్చే వ్యసనంగా మారింది.. ఈ క్రమంలో నేను స్వయంగా చేసిన వంటలు ఇలా ఈబుక్ లా మీ ముందుకు తీసుకొస్తున్నాను.. మీ సలహాలు, సూచనలు తెలుపగలరు. దీనివలన నన్ను నేను ఇంకా మెరుగుపరుచుకోగలను. ముందు ముందు మరిన్ని పుస్తకాలు తయారు చేయగలను.

- జ్యోతి వలబోజు 



షడ్రుచులు సిరీస్ 1 – స్నాక్స్ On Kinige

5 వ్యాఖ్యలు:

Zilebi

ఏదో షడ్రుచులు అంటే ఇలా వచ్చాం - ఏదైనా విందు భోజనం దొరుకుతుందేమో అని - ఇట్లా చదవ మంటే ఎట్లా చెప్పండి ! వంట ఏదైనా చేసి మాంచి ఘుమ ఘుమ లాడే స్నాక్స్ ఏమైనా పెడితే తింటాం గాని !

ఈ బుక్ ఎట్లా చెయ్యటమో కాస్తా టపా కరిద్దురూ ?


చీర్స్
జిలేబి.

జ్యోతి

జిలేబిగారు కష్టపడి నేర్చుకుని ఈ బుక్ చేస్తే మీరు కొని చదవకుండా ముందే ఎలా చేయాలో చెప్పమంటే ఎలాగండి?? కాని కధలకు, వంటలకు వేర్వేరుగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కధలను ఈబుక్ చేయాలంటే డాక్యుమెంట్ లేదా పిడిఎఫ్ ఉంటే చాలు. కాని నా షడ్రుచులు ఈబుక్ ని మరికాస్త అందంగా ఉండేలా చేసాను. టపాకరించడం కష్టమే.. ఎందుకంటే ఈ డిజైనింగ్ ఎవరిష్టాన్ని బట్టి వాళ్లు చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. ఇప్పటికిలా కానివ్వండి. ముందు పుస్తకం చూసి ఎలా ఉందో చెప్పండి..

Kottapali

అభినందనలు

కంది శంకరయ్య

జ్యోతి గారూ,
ముందు కినిగెలో చూసిన తర్వాతే ఇక్కడ చూస్తున్నాను. అభినందనలు.

oremuna

జిలేబీ గారు ముందు మీరు ఉచిత మునుజూపు కినిగె నుండి దింపుకోవచ్చు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008