Tuesday, 23 July 2013

అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు




మీకు ఎప్పుడైనా తెలుగు పదానికో, ఇంగ్లీషు పదానికో అర్థం తెలుసుకోవాలి అనిపించిందా? ఫలానా ఇంగ్లీషు పదానికి తెలుగు అర్థమేంటో? ఫలానా తెలుగు పదాన్ని ఇంగ్లీషులో ఏమంటారో? దాని పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో? ఏదైనా పుస్తకం లేదా పురాణ గ్రంథం చదువుతుంటే మధ్యలో ఒక పదం అర్థం కాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు. పండితులైన వారిని అడుగుతారు. కాని వాళ్లు మనకు అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఒక్కోసారి వాళ్లకు తెలియకపోవచ్చు. మరి అలాంటప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది నిఘంటువు లేదా పదకోశం. నిఘంటువు చూడడంవల్ల ఒక పదానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుస్తుంది. అర్థచాయలు అవగతమవుతాయి. స్పెల్లింగ్ తెలుస్తుంది. పదప్రయోగాలు బోధపడతాయి. దీనివల్ల ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ సందర్భంలో ఎలా వాడాలో అర్థమవుతుంది. నిఘంటువు వయసు తేడా లేకుండా ఎప్పుడో ఒకప్పుడు పిల్లలకు పెద్దలకు అందరికీ అవసరం వస్తుంది. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో ఈ నిఘంటువు ఉండేది కాని, నేడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో అంతర్జాల సాయంతో ఏదైనా తెలియని విషయమైనా, పదమైనా అర్థం తెలుసుకునే వీలు ఉంది. కాని అచ్చంగా నిఘంటువులు అందునా తెలుగు నిఘంటువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రపంచంలోని అన్నిదేశాలలో నివసిస్తున్న తెలుగువారికి ఇలా అంతర్జాలంలో నిఘంటువులు ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు ఈ నిఘంటువులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఈ నిఘంటువులను డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వమో, విశ్వవిద్యాలయమో, అధికార భాషా సంఘమో కాదు. ఔత్సాహికులు, తెలుగు భాషాభిమానులైన వ్యక్తులు తమ స్వంత ఖర్చుతో ఈ నిఘంటువులను సేకరించి, వాటి హక్కుదారులనుండి అనుమతి తీసుకుని టైప్ చేయించి జాలంలో పెడుతున్నారు. దీనివలన వారికి ఎటువంటి ఆదాయం లేకున్నా ఈ తరానికి భావి తరానికి తెలుగు భాషను అందజేయాలనే నిస్వార్థమైన అభిలాషతో ఇవన్నీ చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా అందరికీ ముఖ్యంగా స్కూలు పిల్లలున్న ప్రతీ ఇంట తప్పనిసరిగా ఉండే నిఘంటువు శంకర నారాయణ డిక్షనరీ.. ఈ డిక్షనరీ, తెలుగు పదాలకు ఇంగ్లీషు అర్థాలు, ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్థాలు, తెలుగు పదాలకు తెలుగులో అర్థాలు తెలిపే శబ్ద రత్నాకరం, పత్రిక భాషా నిఘంటువులను ఈ లంకెలో చూడవచ్చు.
http://21stcenturytelugu.blogspot.in/2011/10/blog-post_5743.html   ఇక్కఢ నిఘంటువులను టైప్ చేసి కాకుండా స్కాన్ చేసి పెట్టారు. పుస్తకంలోలాగే పేజీలు తిప్పుకుంటూ చదువుకోవచ్చు.

అందరికీ తెలిసిన బ్రౌణ్య నిఘంటువు కూడా లభిస్తుంది.
http://dsal.uchicago.edu/dictionaries/brown/

అంతేకాక సూర్యరాయాంధ్ర నిఘంటువు, మరి కొన్ని తెలుగు నిఘంటువులను ఇక్కడ చూడవచ్చు.

http://www.teluguthesis.com/search/label/Dictionary

తెలుగు మాత్రమే కాధు తెలుగు పదాలకు సంస్కృతలో అర్ధాలు, సంస్కృత పదాలకు తెలుగులో అర్ధాలు ఇక్కడ లభిస్తాయి. 

http://www.teluguthesis.com/%202013/03/%20sanskrit%20-%20telugu%20-%20telugu-sanskrit.html#

ఈ నిఘంటువులన్నీ అంతర్జాలంలో అంధుబాటులో ఉంచింది ఎటువంటి స్వప్రయోజనం ఆశించి కాదు. దీనివల్ల మాకేంటి లాభం అని ఆలోచించకుండా సమాజానికి, భావి తరాలవారికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో ఈ నిఘటువులను ఏర్పాటుచేస్తున్నారు. ఒకోసారి ఒక నిఘంటువులో దొరకని సమాధానం కోసం మరికొన్ని నిఘంటువులను వెతకక తప్పదు. అందుకు చాలా సమయం పడుతుంది. అందుకే శేషతల్పశాయి, నాగభూషణరావులుకలసి ప్రారంభించిన ఆంధ్ర భారతి అనే సైటులో నేడు 31 వివిధ నిఘంటువులను చేర్చారు. మీకు కావలసిన పదం ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం ఏ భాషలో ఉన్నా వాటి అర్థాలు, పర్యాయపదాలు, మాండలికాలు మొదలైన వివరాలు క్షణంలో లభిస్తాయి. ఈ ఆంధ్రభారతిలో ఎంతో శ్రమకోర్చి, నిఘంటువులను సేకరించి, టైప్ చేయించి నిక్షిప్త పరుస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీషులో లేదా తెలుగులో టైప్ చేసే సౌకర్యం, నిఘంటువుల ఎంపిక మొదలైన సదుపాయం కూడా ఉంది. ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా ఆంధ్రభారతి ద్వారా 31 నిఘంటువులు మన చెంత ఉన్నట్టే..

http://andhrabharati.com/dictionary/index.php

Monday, 1 July 2013

మాలిక పత్రిక జ్యేష్టమాస సంచిక విడుదల

 మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం. మాలిక పత్రిక ఇప్పుడు మాసపత్రికగా మిమ్మల్ని అలరించబోతుంది.  కొత్త కొత్త రచనలను, ఆలోచనలను మా పత్రిక ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఏదైనా కొత్తగా రాయాలన్న తపన, రాయగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా రాయండి..మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంచికలో ఒక కొత్త ప్రయోగం చేయడమైనది అదే కవితామాలిక. ఈ ప్రయోగం విజయవంతం ఐతే ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది.. ఈ సంచికలోని అన్ని రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము..

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

0. సంపాదకీయం
1. కవిత్వంలో ఏకాంతం - కవితామాలిక సంకలన సమీక్ష
2. నల్లమోతు శ్రీధర్ వీడియోలు - యోగా
3. గుర్తింపు 
4. పదచంద్రిక - 10
5. రఘువంశం -1
6. దింపుడుకళ్ల ఆశ
7. అన్నదమ్ములు - అనుబంధం - చారిత్రక సాహిత్య కధామాలిక - 3
8. నమో భూతనాధా - పారశీక చందస్సు - 2
9.  సంభవం - 2
10. అతడే ఆమె సైన్యం -2

Saturday, 29 June 2013

ఎవరేమీ అనుకున్నా....

ప్రతీ మనిషికి జీవితంలో పోరాటం తప్పదు. ఎంత ధనవంతులైనా, పేదలైనా, చదువుకున్నా, చదువుకోకున్నా కష్టాలు, సుఃఖాలు, సమస్యలు తప్పవు. కాని అలా సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివాడి మీద నింద వేయడం పరిపాటి. వాళ్ల వల్లనే ఇలా జరిగింది. నా జీవితం నాశనం చేసారు. లేకుంటే నేను అందలం ఎక్కి ఉండేవాన్ని. ఈ సమస్యకు పరిష్కారం లేదు. చావు తప్ప వేరే మార్గం లేదు. వెదవ జీవితం ఎప్పుడూ ఒకరిమీద ఆధారపడి ఉండాలి. నాకంటూ స్వేచ్ఛ లేదు. సంతోషం లేదు.. నా జీవితంలో అసలు సంతోషం, విజయమనేది ఉంటుందా? ఎవ్వరూ నన్ను గుర్తించరు, నాకంటూ ప్రత్యేకమైన ప్రతిభ లేదు, ఆస్తిపాస్ధులు లేవు.. పెద్దలిచ్చిన మణులు, మాన్యాలు లేవు. ఉధ్యోగంలో వచ్చే జీతం ఏం సరిపోతుంది. నా జీవితమింతే ఎదుగుబొదుగు లేదు. ఇలాగే అసంతృప్తితో చావాల్సిందే. 

ఇలా ఎంతోమంది అనుకుంటుంటారు. కాని ఒక్కసారి ఈ జరుగుతున్న పరిణామాలలో నావంతు పాత్ర ఏముంది. నన్ను నేను ఎలా మార్చుకోగలను? పోరాడగలను? సమస్యలకు పరిష్కారం ఎలా ఆలోచించాలి? అంటూ ఆలోచన మొదలెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పోరాడే శక్తి వస్తుంది. ఎంత పెద్ద సమస్య ఐనా చిన్నగానే ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చినా పర్లేదులే తర్వాత సరిదిద్దుకోవచ్చు. లేదా మనకింతే ప్రాప్తం. దానిగురించి బాధపడుతూ ఇక్కడే ఆగిపోకుండా వేరే పని చేద్దాం అన్న పాజిటివ్ ధింకింగ్ అలవడుతుంది. కాదంటారా? ఈ పాట వినండి. అందులో ప్రతీ లైన్ మళ్లీ మళ్లీ అర్ధం చేసుకోండి. మీ జీవితానికి అన్వయించుకోండి. పని చేస్తుంది.. సందేహమా?? ఇది అక్షరాలా సాధ్యమవుతుంది అనడానికి నేనే నిదర్శనం.. అందుకే ఎప్పుడైనా కాస్త దిగులుగా ఉన్నప్పుడు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటాను. తొందరగా తేరుకుని మళ్లీ నా పనిలో పడతాను. మీరూ ట్రై చేయండి.. సమస్యలు తీరడానికి పూజలు, ఉంగరాలు, నోములు, వ్రతాలు చేసే బదులు లేదా చేస్తూనే మిమ్మల్ని మీరు ధృడంగా తయారు చేసుకోండి..



ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

అంతర్ముఖం ... (నాలో నేను. నాకోసం నేను)




ప్రతి ఉదయం ఒక కొత్త ఆవిష్కరణా? లేక మరో పొరాటమా?.
ఏన్నో ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ
సంఘర్షణలకు సమాయత్తమవుతూ
పోరాడడం,
సర్దుకుపోవడం, ఓడిపోవడం 
ఆ ఓటమిలోనే గెలిచానన్న అబద్ధపు తృప్తితో
అప్పుడప్పుడు మిణుకుమిణుకుమనే
సంతోషాల తారలకోసం ఎదురుచూస్తూ
అందరికోసం అన్నీ చేస్తూ, తనకోసం తాను అన్వేషిస్తూ
బంధాల(బంధనాల) చిక్కుముడులలో ఇరుక్కుని
అందులో ఉండలేక, బయటకు రాలేక
ఆ బంధాల(రంగుల)లో కలిసిపోవాలనే తాపత్రయంలో
వాటినే చుట్టుకుని ఒదిగిపోయి మురిసిపోతూ
స్వచ్చమైన తన శ్వేతవర్ణాన్నే
మర్చిపోయి .. ఊపిరాడక తల్లడిల్లగా...

Thursday, 27 June 2013

మాలిక పదచంద్రిక - 9 ... సమాధానాలు



మే 2013 మాలిక పద చంద్రిక – 9 సమాధానాలు
మే నెల పదచంద్రిక పూరణ ఈక్రింద ఇస్తున్నాము. కేవలం ఇద్దరే పూరించి పంపారు. వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మిగారు, శ్రీ ఫణికుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగు కర్త).  ఇద్దరి తప్పులూ ఒకటే అవడం విశేషం.ఈసారి విజేతలెవ్వరూ లేరు..

  1. అడ్డం 1.పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు   --  పాలకొల్లు అని రాసారు. పాల్కురికి సరైన సమాధానం.
  2. అడ్డం 15    ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో  -- తకొ. తశి సరైన పదం. తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి కి పొట్టి పేరు.
  3. నిలువు 16. 5 నిలువుతో చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే.  చివరికి మిగిలేది రాసిన బుచ్చిబాబు గారి ఇంటిపేరు శివరాజు.
సూర్యలక్ష్మిగారు అదనంగా చేసిన తేడా  14 నిలువు ద్విరుక్త అని రాయడం. ద్వితీయ (విభక్తి) అని ఉండాలి.

ఏదైనా ప్రత్యేకంగా చేద్దామని జ్యోతిగారు సూచించినమీదట పదచంద్రిక -9 ని సాహిత్య పదచంద్రికగా తయారు చేసాము. మరి కొందరు కూడా పూరించి ఉంటే పత్రికకూ, నాకూ కూడా ఉత్సాహంగా ఉండేది.

సత్యసాయి కొవ్వలి

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008