Monday, April 7, 2008

సర్వధారి నామ సంవత్సర రాశిఫలాలు

.మా ఇంటి సింహద్వార స్వాగత తోరణం.


బ్లాగ్మిత్రులందరికీ సర్వదారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఇది సర్వధారి నామ సంవత్సరం. చంద్రుడు రాజు. సూర్యుడు మంత్రి. ఈ సంవత్సరం అందరికి శుభకరముగా ఉన్నది. దేశ పరిస్థితులు ఆర్ధికంగానూ, రాజకీయంగానూ సంతోషజనకంగానే ఉన్నాయి.

మేష రాశి:

ఆదాయం - 4, వ్యయం - 2 , అదృష్ట సంఖ్యలు - 1, 2, 3.

వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. పెద్దవారికి యాత్రలు చేసే అవకాశము మెండుగా ఉన్నది. చెడు గ్రహ ప్రభావములు అధిగమించుటకు ఈ రాశివారు దుర్గాదేవిని పూజించుట మంచిది.

వృషభ రాశి :

ఆదాయం -8, వ్యయం - 11, అదృష్ట సంఖ్యలు - 6, 5, 8

ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడ తలెత్తవచ్చు. ఈ సమస్యలు అధిగమించడానికి గురు, శని, రాహు గ్రహాలకు శాంతి చేయించాలి.

మిధున రాశి :

ఆదాయం - 11, వ్యయం - 8, అదృష్ట సంఖ్యలు - 1, 6

ఈ సంవత్సరం నవంబరు వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత సాధారణంగా ఉండవచ్చు. ఇనుము, సిమెంట్, వ్యవసాయం లో ఉన్న వ్యాపారస్తులకు శుభంగా ఉంటుంది ఈ సంవత్సరం. రైతులకు , కొత్త దంపతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్ళికాని అమ్మాయిలకు జీవితభాగస్వామి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ శుబపరిణామాలకు ఈ రాశివారందరు దుర్గా సప్తశతి పూజ చేయడం మంచిది.
. ఉగాది పూజ సామగ్రి .కర్కాటక రాశి :


ఆదాయం - 5, వ్యయం - 8, అదృష్ట సంఖ్య- 2

ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మనశ్శాంతి కరువవుతుంది. వ్యాపారంలో నష్టం రావొచ్చు. అనవసరమైన ఖర్చులు ఎక్కువవుతాయి. ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలు అధిగమించడానికి కేతు, రాహు మరియు శని పూజలు చేయాలి.

సింహ రాశి :

ఆదాయం - 8, వ్యయం -2, అదృష్ట సంఖ్యలు -2, ,

ఆర్ధికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా అంత చెప్పుకోదగ్గ మార్పులు ఉండకపోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. చుట్టాలతో విభేదాలు రావొచ్చు. వీటన్నింటిని అధిగమించడానికి లక్ష్మీ పూజ చేయాలి.


కన్య రాశి :

ఆదాయం - 11,వ్యయం -8, అదృష్ట సంఖ్యలు - 1, 6

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆర్ధికంగా చెప్పుకోదగ్గ మర్పులు ఉండవు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మామూలుగా ఉంటుంది. బంధువులతో తగాదాలు రావొచ్చు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనడానికి లక్ష్మీ పూజ చేయించాలి.
..ఉగాది వేళ మా ఇంట కొలువైన దేవతలు..


తులా రాశి :

ఆదాయం -8 వ్యయం - 11, అదృష్ట సంఖ్య - 9

వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సంవత్సరం. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా మంచి సమయం. ఉద్యోగులు మంచి గుర్తింపు, లాభాలు అందుకుంటారు. విద్యార్థులు తాము కోరిన ఉన్నత విధ్యలకొఱకు మంచి కాలేజీలలో సీట్లు సంపాదిస్తారు. కళాకారులు, విజ్ఞానవేత్తలకు మంచి శుభ సమయం. భర్తలు తమ భార్యలపై ప్రేమ వర్షం కురిపిస్తారు. కాని ఆదాయం కంటే వ్యయం ఎక్కువ. ఈ రాశివారు లక్ష్మీ నారాయణ జపం చేస్తే మంచిది.


పృశ్చిక రాశి :


ఆదాయం -14, వ్యయం - 2, అదృష్ట సంఖ్య -9

ఇది చాలా మంచి సంవత్సరం . ఆస్తిపాస్తులు రెట్టింపు కావొచ్చు. వివాహితులు సంతోషంగా ఉంటారు. పిల్లలకు కూడా అనుకూలమైనది. ఇరుగుపొరుగు వాళ్ళు కూడా సహాయకరంగా ఉంటారు. కొత్త మదుపు పెట్టడానికి, ప్రమోషన్లకు, కొత్త వ్యాపారాలకు అనుకూలమైనది. కళాకారులు, ప్రావీణ్యము ఉన్నవాళ్ళు గుర్తింపు పొందుతారు.

ధనుస్సు రాశి :

ఆదాయం -2, వ్యయం -11, అదృష్ట సంఖ్య - 3

ఇది చాలా గడ్డు సమయం.అష్టమ శని వల్ల ఆరోగ్య సమస్యలు రావొచ్చు. చాలా కష్టతరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు కలిగే అవకాశం చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆర్ధిక ఇబ్బందులు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థులకు తమ పరీక్షలు గట్టెక్కాలంటే చాలా శ్రమించాల్సి వస్తుంది. పెళ్ళికాని అమ్మాయిలకు సరియైన జోడి కుదిరే అవకాశం లేదు. ఈ రాశి వారు దాన దర్మాలు చేస్తు , గురు జపం చేయాలి.

. ప్రసాదాలు - ఉగాది పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర.


మకర రాశి :

ఆదాయం - 5, వ్యయం - 5, అదృష్ట సంఖ్య - 8

దొంగతనాలు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాసి వారు చాలా జాగరూకతతో ఉండాలి. ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారంలో మదుపు చేయడానికి ఇది మంచి సమయం. సాంకేతిక విషయాలు చదివే విద్యార్థులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ లో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా ఉపయోగకరమైనది. ఇరుగుపొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మనశ్శాంతికోసం శ్రీ కృష్ణుడి పూజ జరిపించాలి.కుంభ రాశి :

ఆదాయం - 5, వ్యయం - 5, అదృష్ట సంఖ్య - 8

ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. రైతులకు మొదటి పంట సంతృప్తికరంగా ఉంటుంది. రెండవ పంట మామూలుగా ఉంటుంది. కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు. పోటి పరీక్షలు రాసే వారికి విజయం లభిస్తుంది. కంట్రాక్టర్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైనదీ సంవత్సరం. దానధర్మాలు చేయాలి. రాహు, కేతు, శని గ్రహాలకు పూజలు చేస్తే మంచిది.

మీన రాశి :

ఆదాయం - 2, వ్యయం -6, అదృష్ట సంఖ్య 3

ఈ సంవత్సరం చాలా పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. కాని అదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. చేతినిండా డబ్బు ఉంటుంది. కొత్త ఇల్లు నిర్మాణానికి, వ్యాపారాభివృద్ధికి అనుకూలమైనది ఈ సంవత్సరం. చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. స్త్రీలు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. దుష్టగ్రహ దోష నివారణకు సూర్య నమస్కారాలు చేయాలి.
ఈ రోజు భోజనం లోకి పులిహోర, బీరకాయ పెసరపప్పు కూర, పాలక పనీర్, టొమాటో పప్పు,
ములక్కాడల రసం , టొమాటో పచ్చడి, పెరుగు, వడియాలు.. అంతే


రాశి ఫలాలు చదువుకున్నారుగా... ఇవి దైవజ్ఞ శర్మగారు రాసినవి. ఈ రాశిఫలాలు ఇంకా సవివరంగా రాసి త్వరలో నైమిశారణ్యం లో పెడతాను. అందాకా మా పండగ స్పెషల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఎప్పుడూ నెట్ లో చిత్రాలు పెడతాను కదా. ఈసారి మా ఇంట్లో చేసినవే ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో ఇలా ప్రయత్నించా అన్నమాట. ఎవరూ తిట్టకుండా ఉంటే ఇలాగే కంటిన్యూ ఐపోతా. లేకపొతే గూగులమ్మకి జై ...

12 వ్యాఖ్యలు:

chandramouli

మీరుపెట్టిన ఫొటొలు బాగున్నాయండి...
మీరు చెప్పక పొయినట్టయితే,నేను అవి గూగులమ్మవే అనుకునే వాడిని,

ఈ రోజు కొద్దిగా నాకు సంతోషం వేసిందండీ,ఎందుకంటారేమో?
అస్సలు మీఇంటి తోరణం చూసి,అహా ఇంకా సాంప్రదాయాన్ని,yo! yo! మాదిరిగా మార్చకుండా,నిక్కచ్చి కొద్ది మంది అయనా చేసుకుంటున్నారు అని వాదించే నాకు కొద్దిగా ఊతం దొరికినట్టయింది.
మీరు ఇలానే మీ ఇంటి ఫొటొలే పెట్టండి....

నిషిగంధ

జ్యోతి గారు, ఉగాది శుభాకాంక్షలు..
మీ మామిడాకుల తోరణం, పండగ వంటకాలు సూపరండి.. ఇవి చూసి నా లంచ్ బాక్స్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది!

ప్రవీణ్ గార్లపాటి

మీ తోరణం కూడా అచ్చు మా ఇంటికి కట్టిన తోరణం లాగానే ఉంది. (మావిడాకులు, బంతిపూలతో)

మా ఇంట్లో బొబ్బట్లు, అలసందుల గారెలు.

Srividya

మీ పిండి వంటలు చూస్తుంటే నోరూరిపోతుందండి. మొత్తానికి ఉగాది సంప్రదాయబద్దంగా, చాలా బాగా జరుపుకున్నారన్న మాట.

కొత్త పాళీ

నాకో నాలుగు వృశ్చిక రాసులు, రెండు సింహరాసులు ఇప్పించండి. :)
భోజనం నిండిన పళ్ళెం .. బహు బాగు .. పులిహోర తప్ప పిండి వంటలేమీ కనబడలేదే??

కొత్త పాళీ

ఏ రాశిలో ఆదాయణ్ యెక్కువుందో చూసే హడావుడిలో బొబ్బట్ల ప్లేటు మిస్సయ్యా.

రవి

జ్యోతి గారూ,
యుగాది శుభాకాంక్షలు. ఒక విషయం గమనించాను.
నా ఆదాయం - 2 వ్యయం -11. మా ఆవిడ ఆదాయం - 12 వ్యయం - 2.
నా ఎడమ కన్ను ఎందుకో అదురుతున్నది.
ఫోటోలు బావున్నాయి. నేనో విదేశం లో వున్నానిప్పుడు. మీ ఇంట పిండి వంటలు చూసి ఉగాది జరుపుకున్నాను. ధన్యవాదాలండీ!

Raj

మీకు ఉగాది శుభాకాంక్షలు. ఫోటోలు బాగున్నాయి. ఇక్కడ వచ్చినప్పటినుంచి పండుగలను అంత శ్రద్ధగా జరుపుకోవటం కుదరటం లేదు. కనీసం మీ ఫోటోలు చూసి కడుపునిండింది.

కొత్త పాళీ

ఓ బ్లాగాడించే మార్తాండ తేజా .. ఇప్పుడు మీరున్న పొజిషన్ పర్లేదు. మీ ఆదాయం 2, మీ భార్యామణి వ్యయం 11 అయినప్పుడు - అప్పుడు నిజంగానే కలవరపడాల్సి రావచ్చు :-)

నాగరాజా

ఉగాది శుభాకాంక్షలు.

వింజమూరి విజయకుమార్

ఉగాదిని బ్లాగులో చూపించేశారు. చాలా బావున్నాయి ఫోటోలు. మీకూ, మీ కుటుంబానీకీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ. . .

రమణి

ఉగాది శుభాకాంక్షలు జ్యోతిగారు. నా ఆదాయం 14 వ్యయం 2 అని నేను చదివాను, విన్నాను ఈ సంవత్సరం బాగుందన్నమాట. బొబ్బట్లు అదిరిపొయాయండి. నేను ఇంచుమించి ఇలాగే చేసాను ఒక్క బొబ్బట్లు తప్ప.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008