Tuesday, 8 April 2008

స్నేహం


స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్నేహం ఉండకూడదా??. ముఖ్యంగా పెళ్ళయిన వారి మధ్య వారి స్నేహం , వారి వ్యక్తిగత సంబంధానికి ఎటువంటి ప్రతిబంధకం కానంతవరకు. ఎటువంటి ఆకర్షణ లేకుండా ఆడ మగ స్నేహితుల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉండకూడదా? తప్పనిసరిగా వారి మధ్య ఏదో ఒక వరుస ఉండాలా (అన్నా, అక్కా లాంటివి) ??? ఇటువంటి పవిత్రమైన అనుబంధం సమాజం అంగీకరిస్తుందా ??

2 వ్యాఖ్యలు:

Anonymous

Please explain:
"ప్రతిఫలాపేక్ష"
"వ్యక్తిగత సంబంధానికి ఎటువంటి ప్రతిబంధకం "
"ఆకర్షణ "
"ఆత్మీయమైన అనుబంధం"
"పవిత్రమైన అనుబంధం"

పై వాటికి ఎవరి definitions వారికుంటాయి.
ఆ ఇద్దరి స్నేహితులవీ కూడా ఒకటే అవ్వడం కష్టం.
ఇది నా అభిప్రాయం.

ఓ బ్రమ్మీ

జ్యోతిగారు..

ఇక్కడ ఒక్క విషయం తమరు మర్చిపోకూడదు. అది సమాజం. దానికి ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంత వరకే ఇవ్వాలి. సమాజం గురించినంత వరకూ నాది ఒక ఖచ్చితమయిన అభిప్రాయం. తెలుగులో కన్నా ఆంగ్లంలో .. Society exists for the benifit of it's members, but not the members for the benifit of the society. కాబట్టి, ఇద్దరు వ్యక్తుల మధ్య నున్న అత్మీయతను అర్దం చేసుకోలేని సమాజాన్ని గురించి మనమెందులకు ఆలోచించాలి??

ఇక రెండవ విషయం, ఆకర్షణ లేని స్నేహితులు భవ బంధాలకు అతీతులు.. భవసాగరం గురించి వాళెందులకు చింతించాలి?

ఎవ్వరు కాదన్నా మాంసాహారులు మాంసం తినటం మానేస్తున్నారా.. ఎంతమంది వద్దన్నా లంచగొండులు లంచాలు తీసుకోవటం మానేస్తున్నారా.. హింస వద్దు అని ఎందరు చెవిన్నిల్లు కట్టుకుని కోడై కూస్తున్నా .. ఎన్ని కుసుమాలు రాక్షసచేస్టలకు బలైపోతున్నారు.. వీటన్నింటిని చూస్తూ .. మిన్నుకుండి పోయిన సమాజం మాత్రం పవిత్రమయిన అనుభందం మీద బురద జల్లుతూ ఉంటే.. మనమెందులకు ఊరకుండాలి..

ఏది ఏమయినా ఏనుగన్నాక, అది నడవక మానదు.. దానిని చూసి కుక్కలు అరవక మానవు.. అది మొరిగింది కదా అని ఏనుగు నడవటం ఆపదు .. అలాంటప్పుడు, మన మనస్సుకు తప్పనిపించనంత వరకు.. ఆత్మసాక్షిగా ప్రతిఫలాపేక్ష లేని భందానికి ఎవ్వరి అంగీకారము అక్కరలేదనేది నా అభిప్రాయం

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008