Wednesday, July 9, 2008

ప్రమదావనం - నివేదిక

ఆదివారం 6-7-2008 రోజు జరిగిన ప్రమదావనంలో ముగ్గురు కొత్త సభ్యులు వచ్చారు. పూర్ణిమ, సౌమ్య, పద్మ ఇంద్రగంటి (ఈమాట సంపాదకురాలు). ఈ నాటి పిచ్చాపాటి జ్ఞానప్రసూన, పూర్ణిమలతో మొదలయ్యింది. ఊహలన్నీ ఊసులుగా చెప్పే పూర్ణిమ హైదరాబాద్ వాసి. సాప్ట్ వేర్ ఉద్యోగిణి. బ్లాగింగ్ స్నేహాల గూర్చి వీరిరువురూ కాసేపు చర్చించుకున్నారు.. ఇంటెర్నెట్ ఎక్కడెక్కడి మనుషులనో భలే కలుపుతుంది. అభిరుచులు అభిప్రాయాలు కలిసాక స్నేహ మధిరిమలు అంతటా వ్యాపిస్తాయి. అలానే ఈనాటి సమావేశంలో కలిసిన ఇద్దరు.. పూర్ణిమ, వి.బి సౌమ్య. సౌమ్య హైదరాబాద్ IIT విద్యార్ధిని.ఇద్దరికీ పుస్తకాలంటే చాలా ఇష్టం. టాగోర్ రచనల గురించి చర్చ బాగా జరిగింది. చోఖేర్ బాలి, ఘరె భైరే (Home and the world), గోరా తదితర రచనలలోని విశిష్టతను గూర్చి మాట్లాడుకున్నారు. ప్రసూన గారు, నేను , పూర్ణిమ, బ్లాగులకు సీరియస్ రచనలకు గల తేడా గురించి చర్చించుకున్నాం. బ్లాగుల్లో స్వేచ్చ ఉంటుందని, ప్రింట్ మీడియాలో పుస్తకాలు అచ్చు అవటం ఒక ఎత్తయితే, అవి అమ్ముడుపోవడం మరో ఎత్తు. అలానే కథలు రాసేటప్పుడు సహజత్వం కోసమని మరీ ఎక్కువుగా ఆంగ్ల పదాలు వాడక్కరలేదనీ, కథ చెప్పేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాము. ప్రసూన గారు పూర్ణిమని "ఇష్టపడిన పనిని చేయడం మేళా? చేసే పనిని ఇష్టపడడం మేలా?" అని అడిగారు. దానికి పూర్ణిమ.. ఇష్టపడే దాన్ని చేసే అవకాశం ఏ మాత్రం ఉన్నా వదులుకోకూడదు. చేయాల్సి వచ్చిన పనిని అన్యమనస్కంగా కాక కొంచెం ఇష్టాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయచ్చు అని జవాబిచ్చారు. ఇష్టమైన పనిని చేయడం కంటే.. చేయవలసిన పనులు ఇష్టంగా చేస్తే జీవిన సాఫల్యం ఎక్కువేమో అని ప్రసూన గారు అభిప్రాయపడ్డారు.నేనూ అందుకు సమ్మతించాను. అయినా మనకున్నంతలో ఇష్టమైన పనికి సమయం వెచ్చించాలి అని ముగించారు. మనసులో మాట సుజాతగారు వచ్చి, నెట్ సరిగ్గా లేక కొద్ది సేపటికే వెళ్ళిపోయారు. వాళ్ళ నెట్ వాడిని లేపేసే ప్లాన్ అడిగి విసుగుతో వెళ్ళిపోయారు. తెరేస గారు హోటెల్ చెక్ అవుట్ చేసే హడావిడిలో ఉన్నాఆసాంతం చర్చలో పాల్గొన్నారు. ప్రమదావనంలో రోజురోజుకీ నీరసించిపోతున్న ఉత్సాహాన్ని మెరుగుపరచాలి అని రమణి గారు కొన్ని విశేష సూచనలు చేసారు. ఇక పై ప్రతీ ఆదివారం కాక, ఈ సమావేశాలను పక్షం రోజులకొకసారి నిర్వహించాలనీ, ప్రతీ సమావేశానికి ముందే ఒక అంశం నిర్దారించుకుని దానిపై చర్చ సాగించాలనీ, వ్యక్తిగత ప్రస్తావనలు వీలైనంత వరకూ తగ్గించుకోవాలనీ అభిప్రాయపడ్డారు. అందుకు మిగితావారు కూడా సమ్మతించారు. ఈమాట సంపాదక వర్గంతో అనుబంధం ఉన్న పద్మగారు, వరూధిని గారు, తెరెసా గారు నామిని నాయుడు గారి రచనల గూర్చి మాట్లాడుకున్నారు. వారి రచనా శైలి, భాషా ప్రయోగం, కొన్నింటిని వర్ణించిన విధానం గూర్చి వారు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రసూన గారి ఈ మాటతో నివేదికను ముగిస్తున్నాం: "బ్లాగులు రాయటం ఒక ఉత్సాహం ఒక ఊరట" ఇక ఒక సవరణ : ఈ నెల నుండి ప్రతి మొదటి , మూడవ ఆదివారం ప్రమదావనం సమావేశం, రెండవ ఆదివారం హై.బ్లాగర్ల సమావేశం, నాలుగవ ఆదివారం కూడలి కబుర్లలో అందరు బ్లాగర్లు క్రమం తప్పకుండా నిర్వహించాలని అందరి అంగీకారముతో నిర్ణయించడమైనది.

4 వ్యాఖ్యలు:

sujata

ammo... mee templete enta baavundo..?! :D

జ్యోతి

ఈ నివేదిక రాయడంలో సహకరించిన పూర్ణిమకు ధన్యవాదములు..

cbrao

"ఇంటెర్నెట్ ఎక్కడెక్కడి మనుషులనో భలే కలుపుతుంది." -ఇది ఆధునిక విజ్ఞానం గెలుపు. పూర్ణిమ కు అందమైన టెంప్లేట్ ఇచ్చిన జ్యోతక్కకు తెలుగువాడిని టెంప్లేట్ ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ టెంప్లేట్ కనులకింపుగా ఉంది. పేజీ పైభాగంలో Flash scrolling వేగం తగ్గితే బాగుంటుంది. ప్రమదావనం నివేదికలు చక్కటి సమాచారానిస్తున్నాయి. ఈ నివేదిక బాగుంది. వరూధిని గారు వచ్చినప్పుడు రాసిన నివేదిక చప్పగా ఉంది. 29th June 2008 తారీకు సమావేశ నివేదిక లింక్ తెలియటం లేదు. ఆ లింక్ ఇవ్వగలరు.

మీరు నా టపా అంతర్జాల వీక్షణం -2 లో రాసిన జాబుకు బదులివ్వటం ఎందుచేతనో వీలుపడ లెదు. "మీరు కూడా నన్ను జ్యోతక్కా అని పిలుస్తారు.అలా పిలవమని నేను అడిగానా? నాకంటే పెద్దవారు వద్దు అన్నా మీరు అలాగే పిలుస్తున్నారు కదా. నేనేమైనా అన్నానా?" -ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. జ్యోతిను అక్కా అని పిలిచేది ప్రేమతో, గౌరవంతో. ప్రేమ , గౌరవం అనేది అక్కా అన్న పిలుపులో కాక, చెల్లీ అన్న పిలుపులో వ్యక్తమవదు. పైగా తెలుగు సినిమాలు చూసాక చెల్లీ అని పిలవటం ఎందుచేతనో కృత్రిమంగా ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడు, కళా విమర్శకుడు, దార్శనికుడు అయిన సంజీవదేవ్ కృష్ణాబాయిగారు తనకన్నా వయస్సులో చిన్నదయినా అక్కా అని సంభొదించే వారు. ఇక్కడ వయస్సు బట్టి పిలుపుకాక ,ఆప్యాయత, గౌరవం ఆధారంగా అక్కా అని పిలవటం జరిగింది. ఇందులో నాకు తప్పేమి గోచరించటం లేదు.

జ్యోతి

రావుగారు ,
29th June 2008 తారీకు సమావేశం జరగలేదు. చాలా మందికి ఆరోజు తీరుబడి కాలేదు. ఇక వరూధిని గారి ఇంటర్వ్యూ జరిగినపుడు చాలా ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా జరిగింది. కాని ఆవిడ కోరికపై ఆ వివరాలు నివేదికలో ఇవ్వలేదు. అందుకే చప్పగా ఉండింది..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008