Monday 11 August 2008

ఒక్క స్మైల్ ప్లీజ్....



నా పేరు జ్యోతి. అంటే వెలుగు. వెలుగు కావాలంటే కరెంట్ ఉండాలి. వానలొచ్చినా, రాకున్నా కరెంట్ కట్. హైదరాబాదులో వానలు పడి హుస్సేన్ సాగర్ నిండింది. హుస్సేనీ అలంలో ఇల్లు కూలింది. హైదరాబాదులో బిరియానీ ఫేమస్. బిరియానీ అంటే బావర్చి లేదా ప్యారడైస్. ప్యారడైస్ అంటే టాంక్ బండు అవతల ఉన్న సికిందరాబాదులో ఉన్న హోటల్. స్వర్గం కాదు. చచ్చాక స్వర్గానికెళతారు. స్వర్గంలో అందమైన అప్సరసలు ఉంటారు. మనకూ అప్సరసలు ఉన్నారు. ముమైత్ ఖాన్. నమితా. ఖాన్ అంటే షారూక్ ఖాన్. షారూఖ్ అంటే హిందీ నటుడు. హిందీ మన రాష్ట్రీయ బాష. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం.


గోవా ఒక సుందరమైన ప్రదేశం. అక్కడ అందమైన అమ్మాయిలు, బీచిలు ఉంటాయి. అందమైన అమ్మాయిలంటే కాలేజీలలోనే ఉంటారు. కాలేజీలలో ర్యాగింగ్ చెస్తే పోలీసులు శ్రీకృష్ణజన్మస్థానానికి పంపిస్తారు. కృష్ణుడు ద్వారకలో ఉంటాడు. ద్వారక నీళ్ళలో మునిగిపొయింది. అది గుజరాతులో ఉందంటారు. గుజరాతులో బాంబులు పేలాయి. పేలినవి బాంబులు , దీపావళి టపాసులు కాదు, కుళ్ళు జోకులు కాదు. టపాసులు పేలిస్తే ఆనందం. కుళ్ళిపోయిన పండ్లు , కూరగాయలు తింటే ఆరోగ్యం పాడవుతుంది. లేదా డాక్టరు బిల్లు పేలిపోతుంది. పండ్లు అనగా రాఘవేంద్రరావు సినిమాలలోనే చూడాలి. ఘరానా దొంగ ఐనా పాండురంగడైనా. ఈ మధ్య దొంగలు దేవుళ్ళను కూడా దోచుకుంటున్నారు. అందరి దేవుడు ఒక్కడే . పాండురంగడు మహారాష్ట్రలో ఉన్నాడు. అక్కడ పావు బాజీ ఫేమస్. పావు కిలో బీన్స్ ఎనిమిది రూపాయలు. మొన్నెప్పుడొ అన్నీ ఎనిమిదులే వచ్చాయి. మనకు రూపాయలు ఎలాగో అమెరికాలో డాలర్లు. అమెరికావాళ్ళు తెల్లగా ఉంటారు, అక్కడి రాష్ట్రపతి ఇల్లు కూడా తెల్లని తెలుపే. బట్టలు తెల్లగా అవ్వాలంటే సర్ఫ్ ఎక్సెల్ వాడాలి. రాజకీయనాయకులు తెల్లని బట్టలే వేస్కుంటారు. స్త్రీ నాయకులు మాత్రం రోజుకో చీర. శ్రావణమాసం వచ్చిందంటే ఆడవాళ్ళకు, చీరల దుకాణాల వాళ్ళకు సందడే సందడి. మొగుళ్ళకేమో గోవిందం భజ మూఢమతే. దుకాణాలన్నీ ఒకే చోట ఉంటే మాల్ అంటారు. ఇది మనకు కావల్సినవన్నీ ఒకే చోట కొనుక్కునే సంత. సంతలో పిల్లాడు మాయమై సత్రంలో తేలాడంట. పిల్లాడేమో చదివేది L.K.G, వీపుపై పదికిలోల లగేజీ, ఒక చేతిలో లంచ్ బాక్స్ బ్యాగేజీ, వాటర్ బాటిల్ లీకేజీ. చివర్లో తల్లితంద్రుల జేబులు, బుర్రలు క్లియరేజీ.

అదేంటో నేను ఏం రాస్తున్నానో, రాసానో నాకే తెలియకుండా ఉంది . ఎందుకిలా జరిగింది.??? కాస్త చెప్పరూ. హల్లో బావున్నారా??

17 వ్యాఖ్యలు:

Anonymous

వాఆఆఆఆఆఆ వాఆఆఆఆఆఆ :-( ఏంటిది ఒకదానికొకటి సంబంధం లేకుండా వాఆఆఆఆఆ వాఆఆఆఆఆ. పిల్లాడు పుట్టగానే ఏడుస్తాడు. నేను ఈ రోజు కొత్త బ్లాగు మొదలుపెట్టా. అంటే ఈ లోజే నేను పుత్తాను. జననం, మరణం అంతా మిద్య. మిద్య అంటే నా గర్ల్ ప్రెండ్ విద్య గుర్తోస్తోంది. ఎందుకో.... అవును గర్ల్ ప్రెండ్ అంటే ఓ వయసు వచ్చాక అందరికి తప్పక ఉండాలా? వయసు అంటే పదహారేళ్ళవయసు సూపర్ హిట్ సినిమా. శ్రీదేవి ఓ అద్భుత కధానాయిక. కానీ ప్రతివారి జీవితంలో ఓ కధానాయిక, ఓ కధానాయకుడు ఉంటారు. ఆఆఆఆఆఆ కధానాయకుడు అంటే హీరో రజనీకాంత్. రజనీకాంత్ హిమాలయాల్లో ఋషులదగ్గరకు వెళతారు. అసలు ఋషి అంటే ఎవరు?

ష్!!!!! నేను కూడా రాసా

కల

స్మైల్ ప్లీజ్ అని నా మొహంలో నవ్వు మొత్తం తీసేశారు, ఇదన్యాయం జ్యోతక్కా. ఏంటో ఇదిగో పక్కనే మా కొలీగ్ వచ్చి ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావ్ అని అడుగుతోంది. ఏమని చెప్పాలబ్బా. అమ్మో ఈ టపా చూస్తే ఎమన్నా ఉందా ఇప్పుడు? వెంటనే టపా కట్టేస్తుంది, మనం కాబట్టి తట్టుకొన్నాం.

పెదరాయ్డు

అదేంటండీ, చాలా స్పష్టంగా ఉంది. మాకయితే బాగా అర్థం అయింది. భాగుంది :)

Anonymous

మేం బాగున్నాం. ఐనా ఈ టపా చదివాక మిమ్మల్ని మేం అడగాల్సిన ప్రశ్న మీరు మమ్మల్ని అడుగుతారేంటి?

VJ

బ్లాగుల హెడ్డు లైన్లు కలిపిరాసినట్టు ఉంది మీరు. Thanks, చాలా బ్లాగులకి అవిడియాలు ఇచ్హారు

P S Ravi Kiran

హ హ హ.. వానల్లో బాగా తడిసినట్టున్నారు. ఐనా బా రాసారు.

Gems Of Hindupur

chepthe meeru feel avutaaru

కొత్త పాళీ

free association ట్రై చేశారా? సూపరు. ఇదే పద్ధతిలో ఒక ఇరవై నాలుగ్గంటల్లో మీ మనసులో దొర్లే ఆలోచనలన్నీ కాయితం మీద (పోనీ కంప్యూటరు తెర మీద) పెడితే నవీన్ అంపశయ్యకి దీటైన నవల తయారైపోతుంది. What are you waiting for?
బొమ్మ భలే ఉంది :)

cbrao

అరె! అక్కా ఏమయ్యింది నీకు? హాసిని (వాగుడు కాయ) గాని గుర్తుకొచ్చిందా? రాయి, రాయి నువ్వేం రాసినా తమ్ముళ్లం చదువుతాము బుద్ధిగా. నువ్వంటే మాకిష్టం.

krishna rao jallipalli

వామ్మో ... ఏమయింది మీకు.. T.V. లో వచ్చీ ఎదైనా వంటకాన్ని తాయారు చేసి తిన్నారా??

Unknown

కొత్తపాళీ గారు ఆ వివరాలు కొంచం తెలుప గలరు. జ్యోతి గారు ఆ పిక్ కి క్యాప్ షన్ చాలా బావుందండీ... నిరంతరం పి సి ముందున్నా ఆ పిక్ ని పట్టుకోలేక పోయా

Purnima

హహహ!!! "ఇలా మాట్లాడేవారికి సెంటర్ ఫ్రెష్ తినిపించండి. సెంటర్ ఫ్రెష్ తినడం వల్ల నోరు మూతపడుతుంది, అది తెలుగైనా ఇంకేమైనా!!" అని మొన్నే ఒక ఆడ్ విన్నా ఎఫ్.ఎంలో.. అది గుర్తువచ్చింది నాకు!! బాగుంది. బ్లాగుతూనే ఉండండి!!

మోహన

జ్యోతి గారూ… next ఏ మలుపు తిరుగుతుందో తెలియని roller coaster లా ఉంది ఈ మీ టపా.... అక్కడ ఐతే కేకలు పెడాతాను. ఇక్కడ చక్కిలిగిలి పెట్టినట్టు నవ్వుకున్నాను.. ఒకటేం ఖర్మ.. మీ కోసమే ఇవన్నీ…. :):):):)

నా బ్లాగు నా నేస్తం

అబ్బా ఈ పొటోలో ఉన్న బుజ్జిగాడు, చిన్నగాడు, కన్నగాడు, మున్నగాడు, చిట్టిగాడు, నానిగాడు, చంటిగాడు. చిన్నిమున్నలు నాకు తెగ నచ్చేసాడు. అచ్చం నాలాగే ఉన్నాడు. ఏన్ని ‘గాడు’లో. నిజమే చిన్నపిల్లలు గాడ్ (god)లే కదా!!!

జ్యోతి

పసివాడు గారు, :).. నిజంగా పిల్లలు దేవుళ్ళు. కల్లాకపటం లేనివారు.

అమ్మాయ్ కలా! ఇది చాలా చిన్న పోస్టు. దీని తాతలాంటిది ఇంకోటి ఇస్తాను.నీకు నచ్చనివాళ్ళకు పంఫు. వాళ్ళ మైండ్ బ్లాక్ ఐతే నా బాధ్యత కాదు.

రావుగారు, థాంక్స్ ! బ్లాగున్నది మన డబ్బా కొట్టుకోవడానికే కదా?

పూర్ణిమ : అవును ఈ టపా రాస్తున్నఫ్ఫుడు అదే యాడ్ వచ్చింది. భలే నవ్వొచ్చింది.నాలాంటివాళ్ళు చాలా మంది ఉన్నారులే అన్న ధీమా కలిగింది.

మోహన : నవ్వు నవ్వించు, ఇదే నా పాలసీ మరి..వాటు టూ డూ.

సుగాత్రి గారు, నేను బావున్నానండి. అందుకే ఈ రిప్లై..

కృష్ణారావుగారు, అబ్బే! నేనే ప్రయోగాలు చేసి మావారి మీద ప్రయోగం చేసి, ఆయన బావుంటే నేను తింటా. ఆ తర్వాతే పేపర్లకు పంపడం. టివిలో వచ్చేవి చూడడం వరకే.

కొత్తపాళీగారు, ధాంక్స్ అండి. నిజమే మీరన్నట్టు ఒక రోజంతా వచ్చే ఆలోచనలు పేపర్ మీద పెడితే నవల అవుతుంది. కాని నిజంగా వారం పది రోజుల నుండి విభిన్న అంశాల మీద చేయాల్సిన పన్లు ఉన్నాయి. అంతా కన్‍ఫ్యూజగా ఉన్నాను. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఈ టపా చాలా సీరియస్‍గా ఒకదానికొకటి సంబంధం లేకుండా ( నా బుర్రలో ఆలోచనల్లా) రాసాను. ఈ బొమ్మలో పిల్లాడిలా The more i think , the more confused i get ఉంది నా పరిస్థితి. కాని మీ అందరి కామెంట్స్ చదివి back to normal


అందరికి ధన్యవాదాలు..

Ramani Rao

ఇంత తికమకగా , మకతికగా ఇలా ఉందేంటి? మీరు బాగానే రాసి ఉంటారు నేనే అలా మకతిక, తికమకగా చదివానేమో! ఎవరక్కడ, నా ఏనుగు ని తీసుకొని రండి! నేనా ఏనుగెక్కి, రిక్షాలో షాజహాన్ ఇంటికెళ్ళి, చార్మినారు దగ్గర ఓ కప్పు ఇరాని చాయ్ తాగాలి.

బాగుంది జ్యోతి గారు.

Srividya

అరే ఈ టపా నేను మిస్ అయ్యానా..? లేక చదివి ఏదో అయిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి కామెంటడం మర్చిపోయానా..? ఏమో గుర్తు రావట్లేదు బాబు... :(

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008