పాటల సందడి - బాబుల్ కి దువాయే
బాబుల్ కి దువాయే లేతీ జా
జా తుజ్‌కో సుఖీ సంసార్ మిలే
మైయ్‌కే కి కభీ నా యాద్ ఆయే
ససురాల్ మే ఇత్నా ప్యార్ మిలే
బాబుల్ కి దువాయే
బీతే తేరే జీవన్ కి ఘడియాన్
ఆరామ్ కి థండీ చావ్ మే
కాంటా భి న చుప్ నే పాయీ కభీ
మేరి లాడ్లి తేరే పావ్ మే
ఉస్ ద్వార్ సే భీ ధుఖ దూర్ రహే
జిస్ ద్వార్ సే తేరా ద్వార్ మిలే
బాబుల్ కి దువాయే
నాజోన్ సే తుఝే పాలా మైనే
కలియోన్ కి తరహ్ ఫూలోన్ కి తరహ
బచ్పన్ మే ఝులాయా హై తుజ్‌కో
బాహోన్ నె మేరీ ఝూలోన్ కి తరహ
మేరే భాగ్ కి ఏయ్ నాజూక్ ఢాలి
తుజే హర్ పల్ నయీ బహార్ మిలే
బాబుల్ కి దువాయే
జిస్ ఘర్ సె బంధే హై భాగ్ తెరే
ఉస్ ఘర్ మే సదా తేరా రాజ్ రహే
హోంటోన్ పే హసీ కి ధూప్ ఖిలే
మాథే పే ఖుషీ కా తాజ్ రహే
కభీ జిస్ కి జ్యోత్ న హో ఫీకీ
తుఝే ఐసా రూప్ షింగార్ మిలే
బాబుల్ కి దువాయే
చిత్రం : నీల్ కమల్
గానం : రఫీ
ఆడపిల్ల ఎప్పుడూ ఆడపిల్లే. ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని తెలిసినా, ప్రతి తల్లితండ్రి ఎంతో ప్రేమతో పెంచుతారు. చిన్నప్పటినుండి ఆ చిట్టి తల్లికి కావలసినవి కొనిచ్చి ఏ కష్టమూ రాకుండా. కాపాడుకుంటూ వస్తారు. ఆమెను తమలా కాక తమకంటే ఎక్కువ ప్రేమతో చూసుకునే అబ్బాయికోసం వెతికి వెతికి పెళ్లి చేస్తారు. ఎంతో సంతోషంగా సకల కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి, చివరకు ఆమెను అల్లుడు అతని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి తమ కూతురిలా చూసుకొని, తప్పులుంటే మన్నించమని కన్నీళ్లతో వేడుకుంటారు. అలాంటిదే ఈ పాట. పాటలోని ప్రతి అక్షరం ప్రతి ఆడపిల్లను, ఆడపిల్లలున్న తల్లితండ్రులను కదిలిస్తుంది. మామూలుగా ఆడపిల్లకు అమ్మ దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది. నాన్న దగ్గర ప్రేమ ఉన్నా, భయం కూడా ఉంటుంది. కాని ప్రతి తండ్రి, తన కూతురిని ప్రేమిస్తాడు కాని వ్యక్తపరచలేదు. ఆమెను సరైన వ్యక్తి చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పగించేటపుడు కూడా ఎంతో బాధపడతాడు. అమ్మ ఏడుస్తుంది కాని నాన్న మనసులోనే ఏడుస్తాడు.
పుట్టింటి దీవెనలతో వెళ్లు తల్లీ, సుఖంగా ఉండు. పుట్టింటివారు కూడా జ్ఞాపకం రానంతగా నీకు అత్తారింట ప్రేమ దొరకాలి. కష్టాలు నీ తలుపు దాటి కూడా రాకూడదు. నిన్ను ఒక పువ్వులా నాజూగ్గా పెంచుకున్నాము. మా చేతుల్లో అల్లరుముద్దుగా చూసుకున్నాము. నీ జీవితంలో ఎప్పుడూ వసంతం ఉండాలి. నీ జీవిత భాగ్యం ఎక్కడుందో అక్కడ నీవు ఎప్పుడూ మహారాణిలా రాజ్యం చేయాలి. పెదవులపై చెరగని చిరునవ్వు ఉండాలి. .. ఇలా ఎన్నో మాటలు చెప్పి పంపిస్తారు కూతురిని. అందునా రఫీ పాడిన ఈ పాట విన్నప్రతిసారి కంట నీరొలికించక మానదు. ప్రతి పెళ్లి క్యాసెట్ లో సీతారాముల కల్యాణము చూతము రారండి అన్న పాట ఉన్నట్టే , అప్పగింతలప్పుడు ఈ పాట తప్పకుండా ఉంటుంది. పెళ్లి అయిన కూతుళ్లు, పెళ్లి కాని కూతుళ్లు, ఇంకా పసిపాపలు ఉన్న ప్రతి తల్లి తండ్రులను కదిలిస్తుంది ఈ పాట.
12 వ్యాఖ్యలు:
అద్భుతమేన పాట..చక్కగా పరిచయం చేశారు. అవునూ సందడిని పందిరి వేశారే.
psmlakshmi
ఈ పాటలో రఫి గొంతు విని తరించాల్సిందే !
నాకు హిందీ పాటలు ఎక్కువగా తెలీదు. అన్నీ పాటలు అర్ధం చేసుకోగాలిగెంత భాషా పరిజ్ఞానం కూడా లేదు :(
అయినా గానీ.. పాట గురించి మీరు చెప్పిన వాక్యాలు చాలా హృద్యంగా ఉన్నాయి.
మధుర వాణి గారు నా మనసులోని మాట చెప్పేశారు :(
లక్ష్మిగారు, :) సరిచేసానండి.
వాణి, పరిమళం గారు,
నేను చెప్పినట్టు పెళ్లి వీడియోలో సీతారాముల కళ్యాణము చూతము రారండి అన్న పాట తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ పాట, నిజంగా రఫీ ఎంత అద్భుతంగా పాడాడంటే విన్నవారికి అది ఒక పాటలా కాక ఒక తండ్రి తన కూతురిని అప్పగించేటప్పుడు కలిగే బాధలా ఉంటుంది. విని అర్ధమైతే , ఎవరికైనా కంట నీరు రాకమానదు.. అయ్యో నా కూతురిని అప్పగించేటప్పుడు నేను ఇలాగే బాధపడతానేమో అనుకుంటారు...
జ్యొతి గారు,
పదిహేను సంవత్సరాల క్రితము మా అమ్మాయి ని అప్పగ్గించిన సీను గుర్తుకు తెచ్చారు.
మధుర వాణి గారు, పరిమళం గారు నా మనసులోని మాటలని కూడా చెప్పేశారు.
మీ ప్రయత్నం అభినందనీయం.అందుకోండి మా అందరి ధన్యవాదాలు.మంచి అయిడియా అమలుపరచేరు.చాలా సంతోషం.
నా కూతురికి నేను తన భావిని అప్పజెప్పి, తన వైవాహిక జీవితాన్ని తనకి తన కాబోయే వరునికి అప్పజెప్తాను. అంతే కాని తనని మాత్రం ఒకరికి అప్పజెప్పను. నా అప్పగింతల వైనం అంతగా నన్ను కంటనీరు పెట్టించింది. తిరిగి దాన్ని పునరావృతం చేసే శక్తి నాలో లేదు. కానీ పాటలోని ఆర్ద్రతతో నన్ను ఆ రోజుల్లోకి తోసేసారు.
Same feeling, as said by Madhu.
పాటలతో మొత్తానికీ మళ్ళీ సందడి తెచ్చారు. బాగుంది మీరు చెప్పిన పాత. కాకపోతే పాథోస్. :-(
hmmmm. హిందీ పాట చాలా మందికి అర్ధం కాలేదని నాకర్ధమైపోయింది. దీనికి బదులుగా చాలా తొందరగా ఒక అలనాటి ఆణిముత్యం తప్పక అందించగలను..
Post a Comment