Tuesday, 8 November 2011

కార్తీక వనభోజనాలకు ఆహ్వానం


కార్తీకమాసం వచ్చేసింది. ఈ సంవత్సరానికి పెద్ద పండుగలన్నీ ఐపోవచ్చాయి. చలిపులి మెల్లిగా ఒళ్లువిరుచుకుంటుంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికి ప్రియమైనది.నదీ స్నానాలు, ఉపవాసాలు, దీపారాధన,పూజలతో అందరూ బిజిబిజిగా ఉన్నారు. ఈ మాసంలో మరో ముఖ్యమైనది కార్తీక వనభోజనాలు. తమ వృత్తి, ప్రవృత్తులతో ఎవరికి వారు బిజీ ఐపోతున్నారు. ఒకరినొకరు కలవడానికి వీల్లేకుండా మనుషులమా? యంత్రాలమా అన్నట్టు అయ్యారు అందరూ. ఏమంటే తీరికలేదు అంటారు. ఈ వనభోజనాల నెపంతో ఇంటినుండి, ఉద్యోగబాధ్యతనుండి ఒక్కరోజైనా దూరంగా బంధువులతో, స్నేహితులతో గడిపేస్తారు. మరి మన బ్లాగుల్లో రెంఢు సంవత్సరాలనుండి ఈ కార్తీక వనభోజనాల ఒరవడి మొదలైంది తెలుసు కదా... దేశవిదేశాల్లో ఉన్నవారందరూ ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈసారి మాత్రం వదిలేస్తామా? ఎల్లుండే కార్తీక పూర్ణిమ. అందరూ రెడీనా.. మీకు నచ్చిన, వచ్చిన వంటలతో వచ్చేయండి ఎల్లుండి గురువారం 10వ తేదీన బ్లాగ్ వనభోజనాలు.. బ్లాగులు, సంకలినులన్నీ ఘుమఘుమలాడిపోవాలి....

గమనిక : ఇది ఆడవారికే కాదు. నలభీముల వారసులైన మగమహారాజులకు కూడా..

గతంలో మనం జరుపుకున్న వనభోజనాల విశేషాలు:

2009

2010

5 వ్యాఖ్యలు:

శశి కళ

ahaa...kaarteeka bhojanmbu...
vintaina vantakambu....ohoho...
nenu tinta......

జ్యోతి

శశిగారు,

తినండి ఎవరొద్దన్నారు. ముందు మీ బ్లాగులో పెట్టేసి తర్వాత ఓ రౌండేయండి..

Padmarpita

జ్యోతిగారు.....ఆరు నూరైనా ఈసారి తప్పకుండా నాచేతులతో ఏదైనా చేసేస్తా!:)

Ennela

అక్కడ బోల్డు మందిని భోజనాలకి పిలిచేసా...ఇంతకీ నేనేమి తీసుకురాను?యీ భోజనం బొమ్మ కాపీ కూడా కొట్టా..నన్ను కొట్టకండే!!!

mario

Mee blog bagundi......

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008