హీరో బైక్ మీద హీరోయిన్ కోసం వచ్చాడు. కాని అక్కడి వాచ్‌మెన్ తను శ్రీశైలం యాత్రా స్పెషల్ బస్సులో వెళ్లింది అని చెప్తాడు.
శ్రీశైలం యాత్రా స్పెషల్ బస్సు వెళుతూ ఉంది.
హీరోయిన్ తల కిటికీకి ఆనించి దిగాలుగా ఉంటుంది.
హీరో బైక్ మీద ఆ బస్సును వెంబడిస్తుంటాడు.
అలా వెళుతూ ఉండగా ఒకచోట బస్సు తిరగబడుతుంది.
ఆ చుట్టుపక్కల హీరో తప్ప ఎవరూ లేరు కాబట్టి అతను వెంటనే బైక్ ని పడేసి తిరగబడి మంటలు చెలరేగుతున్న బస్సునుంది ప్రయాణీకులను కాపాడతాడు. శబాష్. హీరో కదా మరి..
చివర్లో హీరోయిన్ సీట్ల మధ్య కనిపిస్తుంది. తనను ఎత్తుకుని బయటకు తీసుకొచ్చిన మరుక్షణం బస్సు పేలిపోతుంది. ముందే పేలితే ఎలా??
సీన్ కట్ చేస్తే....
గాయపడినవారిని హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో చేర్పిస్తారు.
డాక్టర్లు హీరోని పక్కకు పిలిచి " తనకు (అంటే హీరోయిన్ కి అన్నమాట) బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఐంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. సుమారు ఏడెనిమిది లక్షలు ఖర్చవుతుంది. తొందరగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి (షాపు కెళ్లి బఠానీలు కొనుక్కురండి అన్నంత తేలికగా) లోపలికి వెళ్లిపోతాడు.
డబ్బు దొరక్కుంటే మేనమామ కూతురిని చేసుకుంటానని పదిలక్షలు(మందులు, టిప్పులు గట్రా కలిపి మరి కాస్త ఎక్కువ ఖర్చవుతుందని రెండు లక్షలు ఎక్కువ అన్నమాట) కట్నం సొమ్ము తీసుకుని హీరోయిన్ కి ఆపరేషన్ చేయిస్తాడు. మంచిదే...
ఆపరేషన్ సక్సెస్. హీరోయిన్ ఓకే. అంతవరకు హీరో ప్రేమని ఒప్పుకోని ఆమె ఇంకో అమ్మాయి చెప్పిన లేదా వినిపించిన ఫోన్ మెసేజ్ ని వినేసి , చటుక్కున మనసు మార్చుకుని అతనికోసం స్టేషన్ (పోలీసు కాదు రైల్వే స్టేషన్) కి వెళుతుంది. కొద్ది సేపు డ్రామా అయ్యాక హీరో, హీరోయిన్లు కలుస్తారు.
కహాని ఖతం.
నేను చూసింది ఈ జరంత సిన్మానే .. నాకు తెల్వక అడుగుతా.. ఈరోయిన్ను ఈరో కాపాడాడు. బస్సులో ఉన్నోళ్లందరినీ కూడా.. ఆపరేషన్ ఐనంక నాకో సంగతి అస్సలు సమజ్ కాలే.. దిమాక్ ల రక్తం గడ్డ కట్టిందని డాక్టర్ చెప్పిండు కదా. మరి ఆపరేషన్ ఐనంక చూస్తే తలమీద ఒక్క ఎంటిక కదల్లేదు. ఇంక రంగు కూడా ఏసిండ్రు. ముఖానికి రంగు కూడా మస్తుగుంది.. ఎనిమిది లచ్చలు పెట్టి ఏం చేసిండ్రబ్బా అని సోచాయించిన. తెల్లారో, రెండ్రోజులకో ఈరోయిన్ మాట్లాడుతుంటే మెడకాయ మీద పట్టి ఉంది. ఓహో ఆపరేషన్ ఇక్కడ చేసిండ్రా అనుకున్నా. మరి ముందుగల్ల డాక్టర్ గట్ల చెప్పిండేంది.. ఈరో చాలా మంచోడన్న సంగతి తెల్సుకున్న ఈరోయిన్ను ఒకటే ఉరుక్కుంటూ స్కూటీ బండి తాళాలు తీసుకుని , దవాఖాన బైట ఉన్న బండిని నడుపుకుంటూ ఎల్లిపోతుంది. అంత పెద్ద ఆపరేషన్ ఐనంక పేషంటు అలా పోతుంటే ఒక్కడంటే ఒక్కడూ ఆపడు, పట్టుకోడు. గిదేందబ్బా???
ఇగ హైద్రబాదుల ట్రాఫిక్ సంగతి తెలిసిందేగదా. అంత పెద్ద ఆపరేషన్ ( దవాఖాన కూడా పెద్దదే గందుకేగదా లక్షల్లో వసూలు చేసిండ్రు.. ) ఐన పోరి బండి నడుపుకుంట పోతుంది. నిజంగా ఐతే... జరంత జరమొస్తెనే చాతగాదు . రైల్ స్టేషన్ కొంచం దగ్గర్ల ఉండగనే బండి పడిపోతుంది.. మరి ఈరోయిను ఏడ్సుకుంట ఉరకాలిగా.. గట్లనే ఉరికింది. జరసేపు అటు ఇటు సూసింది. ఈరో కనపడ్లే. రైలే ఎల్లిపోయింది. ఆగుండ్రి. కథ ఐపోలే. జరంత ఏడ్సి తలెత్తి సూస్తే ఈరో కన్పిస్తడు. మధ్యన రైలొచ్చి పోయినంక కనపడడు. మల్ల అక్కడిక్కడ సూస్తుంటే పక్కన నిలబడ్తడు. ఐది నిమిషాలు సూస్కొని సూస్కొని కలిసిపోతరన్నమాట..
ఏం కథనో ఏమొ. సూసేటోల్లు హౌలాగాల్లనుకుంటరు ఈ సిన్మాలు తీసోటోల్లు.
అసలే సిన్మాలూ సూసుడు బంద్ జేసిన. టైం పాస్ కి టీవీల జర సేపు చూస్తే దిమాగ్ ఖరాబైంది.
ఈ సైన్మ ఏందో యాదికొచ్చిందా??
ఓరోజు చిరకాల మిత్రునితో మాట్లాడుతుండగా ధూమ పానం అదేనండి పొగ తాగడం లేదా దమ్ముకొట్టడం మీద చర్చ జరిగింది. అతను నిత్యాగ్నిహోత్రుడు కాకపోయినా సిగరెట్ తాగడం అలవాటే. అది దుర్వ్యసనం, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిసిన విద్యావంతుడే... అన్నీ తెలిసి ఎందుకు తాగుతావ్. వదిలేయొచ్చుగా అంటే.. నీకేం తెలుసు జ్యోతి! .. పొగతాగడంలో ఉన్న మజాయే వేరు..పొగతాగనివాడు దున్నపోతై పుట్టునని ఓ మహాకవి ఏనాడో చెప్పాడు. పైగా ఈ సిగరెట్ తాగడం వల్ల లభించే అనుభూతి, ఆనందం అనిర్వచనీయమైనది. మీ ఆడాళ్లకేంటి నీతులు బానే చెప్తారు? మీరూ అలవాటు చేసుకోండి అప్పుడు అర్ధమవుతుంది. లేదంటే జరుక్ శాస్త్రిగారి రచనలు చూడు. సిగరెట్టు వల్ల కలిగే లాభాలు నీకు తెలుస్తాయి అని ఎదురు నన్నే వెక్కిరించాడు ఆ మిత్రుడు. అలా ఉందా సంగతి. సిగరెట్ సంగతేంటో (తాగడం కాదండోయ్.. దానివలన కలిగే లాభాలు) చూద్దామని మనందరికీ జరుక్ శాస్త్రిగా తెలిసిన పేరడీ సూరీడు జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రిగారి పేరడీల పుస్తకం తెచ్చాను. అందులోని ఓ మచ్చు(సిగరెట్టు) తునక ... ఇది చదివితే ఈ సిగరెట్ ప్రెమికులకు మరింత ఉషారొచ్చేస్తుందేమో..
ఒక్క కానీ ఒకే కానీ రెండు కానులు అర్ధణా! మూడు కానులు ముక్కానీ.. నాల్గు కాను లణాగదా! అయిదు కాను లణాకానీ.. ఆరు కాను లణన్నరా... కానీకి ఒక్కటి యియ్యర్ రెండు కాన్లకు ఒక్కటే మూడు కాన్లకు రెండిస్తార్ నాలుగు కాన్లకు మూడుగా!! (అదేనండి సిగరెట్టు)
సిగరెట్టు పొగలలో చిత్రమున్నాదీ.. పొగల మలుపులతోటి పైకి పోయెదను బ్రహ్మాండ భాండమ్ము బంధించు పొగలూ పొగల మలుపులతోటి మేళవిస్తావా?? పొగ వూది పొంచుండి పాట పాడెదనూ ఆ పాటకై విశ్వవిశ్వాలు మ్రొక్కు పొగలోన పొలములూ వరిమళ్లు కలవు. నా ధన్యలక్ష్మిపై తలలు వొంచెను .. (ఆహా)
సాంధ్యమాధురులలో సారమంతా చిదిపి సిగరెట్టులో బ్రహ్మ పారబోశాడు సిగరెట్టు పొగతాగి బ్రహ్మర్షులంతా దివ్య రూపంతోటి వెలుగుతున్నారు సిగరెట్టు పొగలతో గూడుకట్టుకు తాను మధ్య పడుకున్నాడు చంద్రుడల్లదిగో! (ఓహో. సిగరెట్టుకు , దేవతలకూ లింకు ఉందన్నమాట)
దొంగతనంగా.. సిగరెట్టు త్రాగుదామన్న కోర్కెతో పరాయిపేట పోయి మా నీ డకే మేం బెదిరి ఎవరో చూస్తారన్న దిగుల్తో... గోడల్లో వొదిగి వొదిగి, సిజరు సిగరెట్లు కాలుస్తుంటే.. మా చిన్న హృదయాలకు రవ్వలడ్డూలు తిని సేమ్యా పాయసం తాగి కమ్మగా వేచిన జీడిపప్పు కరకరా నమిలినట్టుండేది.. (పట్టుబడితే మాత్రం వీపుమీద చింతబరికెతో సప్తస్వరాలు పలికించేవారు కదా! .. ఆకాలంలో పిల్లలకు ఆ మాత్రం భయముండేది. ఇప్పుడైతే ధైర్యంగా పెద్దవాళ్ల ముందే సిగరెట్ కాలుస్తున్నారు.
కొంత స్వతంత్రం వచ్చి కొంత యౌవనం వచ్చి ఊహలు రేగే కాలంలో సిజరు సిగరెట్టు ముట్టిస్తుంటే దరి చేరకుండా.. లాలింపబడుతూ వులుకు వులుకున చూస్తే.. ప్రియురాలు.. ప్రౌడాంగన.. నవోపగూహనమ్ములాగు వాయూత్పాతానికి.. బెదిరి దరిచేరవచ్చిన కులపాలిక కరస్పర్శలాగు.. ( అంతే మరి తావలచింది రంభ..తామునిగింది గంగ అన్నట్టు)
నేడు
సిజరు సిగరెట్టు దహిస్తూంటే. స్వచ్చరూపిణి ఐన "ఫీనిక్సు" పక్షిలాగు అర్ధంకాని భావకవి ఖండగీతమ్ములాగు ప్రౌఢ విమర్శకుని బెదిరింపులాగు.. వివిధ సారస్వతములలోని ఏకాంక నాటికల వోలె.. శంకరుని అద్వైతబోధ వోల్కి నా - పాప - క్షయమ్ములాగు నా నాసోద్గతములైన ధూమంపు కొనలు ఈ దేశమాతకు వేయి సాంబ్రాణి ధూపమ్ములాగు...! (ఐపోయింది.. ఇక ఇలాంటివారిని మార్చడం అస్సలు సాధ్యం కాదు. ..))
ఈ కృతిని.. నన్నూ కలిపి తిట్టేవాళ్లకు కలిపి ఈ ఖండకావ్యాన్ని అంకితమిస్తున్నాను. అని రచయిత తనదైన ప్రత్యేకతని చూపెట్టారు. ఎవరూ నోరెత్తకుండా..:))
జీవితం... దీనికి ఒక నిర్ధిష్టమైన అర్ధం లేదు. కాని ఇది ఎన్నో వింతలు, విశేషాలు, కష్టాలు, సంతోషాలు, సందేహాలు అన్నీ మిళితమైన వింత వస్తువు.. వస్తువు అంటే అది కళ్లకు కనపడదు. చేత్తో పట్టుకోలేము కాని అది మనని ఎన్నో ఆటలు ఆడిస్తుంది. ఎన్నో సత్యాలను తెలియచేస్తుంది. ప్రతీ మనిషికి సుఖదు:ఖాలులు, విజయాపజయాలు, పోరాటాలు ఉంటాయి. ఏది మనకు సులభంగా లభించదు. నిరంతర పోరాటం తప్పనిసరి చేయాలి. ఈ జీవనపోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, అపజయాలు, వైఫల్యాలు ఒక్కోసారి మనిషిని నిరాశ, నిస్పృహకు గురిచేసి అతనిని కృంగదీస్తాయి. ఎంతో ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడిన మనిషి కూడా అనుకున్నది జరగక డిప్రెషన్లో మునిగిపోతాడు. ఆ మన:స్థితిలో ఆలోచించే శక్తి కూడా ఉండదు."నా అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరు.నాది నష్టజాతకం. అందుకే ఏ పని చేసినా ఫెయిల్ అవుతున్నాను.నేను ఏమీ చేయలేను. నా బ్రతుకుకు అర్ధమే లేదు. ఇంకా జీవించి ఉండడం అనవసరం. నాకు మంచి రోజనేది లేదు .. రాదు కూడా. అలాంటప్పుడు ప్రాణాలతో ఉండడం అవసరమా? నావాళ్లు కొద్ది రోజులు ఏడ్చి ఊరుకుంటారు." ఇలా సాగుతాయి అతని ఆలోచనలు. కాని....
ఈ ఈతిబాధలు ప్రతీ మనిషికి ఉంటాయి. పేదవాడైనా, లక్షాధికారైనా సరే. ఎంత చెట్టుకు అంత గాలి. ఏదైనా విషయంలో నిరాశతో కృంగిపోయినప్పుడు మనంతట మనమే బయటకు రావాలని అనుకుంటే తప్ప ఎవ్వరూ మనని , మన ఆలోచనలని మార్చలేరు. మనం విఫలులైనంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదు. సమస్యలకు చావు పరిష్కారం కాదు. మనకంటే ఏదీ మనకు ఏదీ ముఖ్యం కాదు. అది కుటుంబ కలహమైనా, వ్యాపార విషయాలైనా, ప్రేమ వైఫల్యమైనా సరే.. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు . అస్తమించిన సూర్యుడు మరునాడు ఉదయించకమానడుగా. అలాగే వాడిన చెట్టు నీళ్లు పోసి జాగ్రత్త తీసుకుంటే మళ్లీ చిగురిస్తుంది. అందుకే ముందుగ్ మనని మనం మార్చుకోవాలి. మారాలని అనుకోవాలి. ఎవరికోసమో కాదు. మనకోసమే. చుట్టూ ఎంత మంది ఉన్నా. ఎన్ని పనులున్నా అంతరాంతరాల్లలో ఎప్పుడూ ఒంటరివాళ్లమే . కాని ఆ ఒంటరితనంలో కృంగిపోకుండా అందులోనే మనకిష్టమైన ప్రపంచం నిర్మించుకోవాలి. మన ఉనికిని మనం కాపాడుకుని మెరుగుపరుచుకోవాలి. అలా కృంగిపోయిన వ్యక్తిని అయ్యో పాపం అని ఓదర్చినా, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి అని చెప్తే అతనికి ఇంకా కోపమొస్తుంది. నా కష్టాలు మీకేం తెలుసు? అలాగే చెప్తారు అంటాడు.. కాని ఆ సమయంలో అతనికి కావలసింది ఓదార్పు కాదు. అతని మన:స్థితిని అర్ధం చేసుకుని ఆ నిరాశా , నిస్పృహలను పటాపంచలు చేసే పదునైన మాటలు .. మారాలని అనుకున్న ఆ వ్యక్తి ఆ మాటలకు ఆలోచించి, విశ్లేషించుకుని ఉత్సాహం తెచ్చుకుని తిరిగి జీవన ప్రయాణం మొదలుపెడతాడు. కష్టాలతో పాటు ప్రతీ వ్యక్తికి మంచి రోజనేది తప్పకుండా వస్తుంది. అపజయాలు, అవమానాల, వైఫల్యాలను దాటుకుని పోరాటం సాగిస్తే తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇది తథ్యం...
ఈ విధంగా మనని ఎంతో ఉత్సాహపరిచే ఆలోచింపచేసే పాటలు కొన్ని ఉన్నాయి. అవి మీకోసం (నాకోసం కూడా).. ఆటోగ్రాఫ్ చిత్రం తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో చిత్ర పాడిన ఈ పాటలు ... మన జీవితాన్నిమనమే మార్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది. దానికోసం సంకల్పం ముఖ్యం.. దాని తర్వాత సాధన...
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాల కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మౌనంగానే....
దూరమెంతొ ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగరమధనం మొదలవగానే విషమేవచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొచ్చింది. అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది. తెలుసుకొంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది
చెమట నీరు చిందగా నుదుటిరాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే...
చిత్రం : నా ఆటోగ్రాఫ్ (sweet memories ) రచన : చంద్రబోస్ గానం : చిత్ర సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
దుఖం ఇల్లే ఎన్ తోళా ఒరు ముదివిరిందాల్ అదిల్ తెలివిరిందాల్ అంద వానం వసమాఘుమ్ మనమే ఓ మనమే నీ మారివిడు మలయూ అదు పనియూ నీ మోదివిడు
ఒవ్వొరు ...
Every flower says, Life means battle; every flower says, Life means battle! every sunrise says, Day and night shuttle!
Belief is the need in our life; Aim shall triumph for sure you strive; Mind, oh mind, you bash! Mountain or snow, just dash
Your heart shall break never; ”What is life” thought, brim u never! bet a heart without a wound, amidst? These wounds, sure to go into mist! Stone which stands nail, turns statue on sand; Hearts that stand pain, runs warmth inland! Who has no struggle, why tears in eye? Who acts now, becomes true to die (day)!
Mind, oh mind, you bash! Mountain or snow, just dash ! Every flower says, Life means battle!
Let us verse life, spread it up to sky; Let this attempt, shall fill our life! let eyes dream, a lakh ways at heart; Bet struggles with faith, beat you not! Oh man, just pierce and seed, tree blooms; Shame gets defeated, relation grooms ! History without failure? Why grieve friend? His story has clear end, endless sky his find!< o:p>
Mind, oh mind, you bash! Mountain or snow, just dash!
Every flower says, Life means battle; every flower says, Life means battle! every sunrise says, Day and night shuttle! Belief is the need in our life; Aim shall triumph for sure you strive!
Mind ,oh mind, you bash! Mountain or snow, just dash!
చిత్రం : Autograph (తమిళం) రచన : విజయ్ గానం : చిత్ర సంగీతం : భరద్వాజ్
మనవే ఓ మనవే నీ కుగ్గదిరు బెట్టా బయలిరలి నీ నుగ్గుతిరు
అలరువ హూవుగలే ఆలిసిరి ...
నోవు నలివు అన్నోదు, బాల రైలు కంబిగలు నడువే నమ్మదీ పయన, నగుత సాగు హగలిరులు ఈనె బరలి బాలినలి, ధ్యేయవొందు జొతెయిరలి ఏలుబీలు ఏల్లడాటి ఏలుతీవి నావుగలు అవమాన ఎల్లరిగుంటు, ఈ లోకద దృష్టియలి నావెల్లరు ఎండు ఒందె ఆ దేవర సృష్టియలి బాలిగొందు అర్ధవిదె, హెజ్జెగొందు దారియిదె నిన్న అత్మబల నిన్న జొతెయురలు ఆకాశవే అంగై ఇలే..
మనవే ఓ మనవే.. నీ బదలాగు ఏని సాధనెగు నీ మొదలాగు
Flowers which are just blooming now, please listen to me Flowers which are just blooming now, please listen to me Life is a big struggle, don't forget this Early morning sun rays - please describe for me That there is light emerging from darkness - please show this Let there be hope for tomorrow in our lives Let the trust of victory lead us to light Mind, O Mind - don't hesitate Rain or thunderstorm - you keep moving on
The mind which is like a mirror - must never be shattered Life is full of sorrow - saying so, it must not quit who (here) doesn't have sorrow? who (here) doesn't face death? As time moves on, everything gets shadowed The same stone which you trip on, becomes a huge sculpture The life which struggles and endures pain daily - becomes a role model and stays alive forever who (here) doesn't have to strive hard? who (here) doesn't have to roam about to get work done? every dream of yours - would become true one day - such a day is soon on the way... Mind O Mind, please don't shrug Mountain or a desert (bayalu : plain open land), keep forging ahead
Pain and happiness are parallel like the railway tracks In between these is our journey of life, smile and travel, day and night whatever comes along in life, see your destination clearly and keep it with you Cross the ups and downs easily, and we would emerge successful Embarrassment is common to everyone in the eyes of this world we all are always united as ONE - in the eyes of God and his creation Life has a meaning, every step has a direction As long as your inner strength is with you, its like having the sky in your palm Mind O Mind, please change whatever you have to achieve, do that immediately
చిత్రం : My Autograph గానం : చిత్ర సంగీతం : రాజేష్ రమణ
పాటలు వింటూ రాసాను . అచ్చు తప్పులుంటే మన్నించండి. అనువాదం నేను చేయలేదు మిత్రులు సహాయం చేసారు అర్ధం తెలుసుకోవడానికి....
అందరికీ అన్నీ తెలిసినవే ! తమకు తెలియనివి కొన్ని విషయాలు ఉంటాయనీ, తమనితాము వ్యక్తిత్వపరంగానూ, జ్ఞానంలోనూ ఉన్నతుల్ని చేసుకోవడానికి మరింత కృషి చేయవలసి ఉందని గ్రహించేవారే లేరు. 'ఇప్పటికి తెలిసింది చాల్లే..' అనే ధీమా, 'తెలుసుకుని ఏం చేస్తాం...' అనే ఉదాసీనతా అందరి మెద్దళ్లకూ తాళం వేస్తోంది. ఆ బంధనాలు తెరుచుకునేవరకూ కొత్త విషయమేదీ మన బుర్రలను తాకలేదు. ఎక్కడ చూసినా జీవితం అంటే ఓ రకమైన నిర్లిప్తత! ఏదోలా రోజులు గడిపేస్తే చాలనే నిరాసక్తి, మన జీవితానికి పరమార్ధమేమిటో అంతుపట్టని స్థితిలో కూరుకుపోయి ఉంటున్నాం. అందుకే కోటికో, నూటికో తప్ప ఏ జీవితానికీ నిర్ధిష్టమైన లక్ష్యాలు ఉండవు. జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న దాఖలాలు కనిపించవు. ఒక గమ్యం మనిషిని శక్తివంతం చేస్తుంది..ఆ శక్తి ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఆ ధైర్యం ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రోజువారీ యాంత్రిక జీవితంలో గడుపుతున్న ప్రతీ క్షణాన్ని బేరీజు వేసుకుని ఎంత పరిమిత చట్రంలో మనల్ని మనం ఇరికించుకున్నామో అర్ధం చేసుకోగలిగితె .. ఆ చట్రపు సరిహద్దులను మానసికంగానైనా దాటగలిగితే మరింత విస్తృతమైన జీవితపు పరిధిలోకి మన ఉనికిని వ్యాపింపచేసుకోవడానికి ప్రయత్నాలు ఆరంభిస్తాం.
ఈ క్షణం మనది. ఈ క్షణాన్ని ఈ ప్రపంచంలో మనం గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషించాలి. ఆ సంతోషం కలగాలంటే కాలం యొక్క విశిష్టత అర్ధం కావాలి, కాలాన్ని భారంగా గడిపినంత కాలం సంతోషం ఎక్కడనుండి వస్తుంది? మనకు నిరంతరం ఎన్నో సవాళ్లు, మానసిక వత్తిడులు! ఇన్ని ఇబ్బందుల మధ్య జీవితమెందుకా అన్నంత వైరాగ్యతా వెంటాడుతూనే ఉంటుంది. అయినా ఆ వత్తిడి నుండి ఊరట లభించి మెరుగైన జీవితం వైపు మన గమ్యం మరలినప్పుడు కలిగే ఆనందం ముందు ఈ సవాళ్లేపాటి? ఒత్తిడులను మెదడుకెక్కించుకున్నంత బలంగా మనం మెరుగైన జీవితపు క్షణలను సంతోషంగా అనుభవించం. అందుకే ఆనందమూ మనల్ని సంతుష్టులని చెయ్యలేదు. ఎలాగోలా ఇబ్బందికరమైన జీవితం నుండి మెరుగైన క్షణాలను అనుభవిస్తున్నామన్న ఊరటే మనసులో నిలుపుకుంటాం తప్ప గతంలో అనుభవించిన ఇబ్బందికరమైన జీవితాన్ని ప్రస్తుతపు ఆనందంతో ముడిపెట్టకుండా దీన్ని మనసారా ఆస్వాదించము. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటికోసం కృషి చేయడం, బాధ్యతలు నిర్వర్తించడం వంటివి బలవంతంగా చేయాల్సిన పనులు కాదు. ఒక్కోసారి ఎటూ చెయ్యక తప్పని పనుల్ని కూడా ప్రపంచాన్ని మోస్తున్నంత భారంగా చేస్తుంటాం.. అలసట రాక ఏం చేస్తుంది? అందరూ చెప్తుంటారు.. 'ప్రతీ పని ఇష్టంలో చేయాలి కానీ కష్టంతో కాదూ అని! ఆ సత్యం విని వినీ దాని సారం మాత్రం బుర్రకు ఎక్కించుకోలేకపోతున్నాం. ఆచరణలో దాన్ని అనుసరిస్తెనే వృత్యాసం అవగతమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం... జీవితం అంటే ఏదోలా రోజుల్ని, సంవత్సరాల్ని గడిపేయడం కాదు.. ప్రతీ జీవితానికి ఓ అర్ధం ఉండాలి.. ఎన్నో నేర్చుకోవాలి... ఎంతో ఎదగాలి. అలాగే మానసికంగా అంతే ఒదిగిపోవాలి. అదే నిజమైన జీవితం...
ఆంతా ఇంగ్లీషుమయమైన ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు పదాలు వినగానే మనసు పులకరిస్తుంది.. ఎవడూ పుట్టించకుంటే మాటలెలా పుడతాయని అలనాడే పింగళి వారు నొక్కి వక్కాణించారు మన ఘతోత్కచులవారినోట.. అదే మాట స్పూర్తిలో తెలుగుపదం మొదలైంది. ఎన్నో ఆంగ్ల పదాలకు సమానార్ధకములైన తెలుగుపదాలు వాడకం మొదలుపెట్టారు తెలుగు బ్లాగర్లు. ఇదే విధంగా మరో మాట కూడా తెలుగు బ్లాగర్లు విరివిగా వాడుతున్నారని చెప్పవచ్చు. "వీరతాడు" .. ఎవరినైనా అభినందించాలంటే ఒక వీరతాడు వేసేస్తారు. అసలు వీరతాడు అంటే ఏంటి ? ఎలా ఉంటుంది? అంటే మాయాబజార్ లోని లంబు జంబులని అడగాలి. మరి అడిగేద్దాం. ఆ వీరతాడు ఎలా ఉంటుందో చూడండి మరి.
ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక పాట, వర్ణన, పద్యం చెప్తే అసలు దృశ్యం కళ్లముందు సాక్షాత్కరించాలి. కొందరు మహాకవులు అందమైన అలంకారాలతో, పదాలతో ఆ దృశ్యాన్ని లేదా సంఘటనను మనకు కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తారు. ఈ పదవిన్యాసం రాయలవారి పద్యాలలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ప్రకృతికి ప్రతీక స్త్రీ. స్త్రీకి సంబంధించిన పనులన్నీ అందంగానే ఉంటాయి.. ఇక సరసులైన రాయలవారు మాత్రం తక్కువతిన్నారా?... మేడపై జడవిప్పుకుని పూలను తీసివేస్తున్న కాంతను ఎంత రమ్యమనోహరంగా వర్ణించాడో చూడండి... ప్రభాతవేళ మేడపై చూరుపక్కన నిలబడి తన జడను ముందుకువేసుకుని విప్పుకుంతుందంట ఓ వారకాంత. ఆ దృశ్యం చూడడానికి సర్వసాధారణంగానే ఉంటుంది. కాని కవికదా. సాధారణ విషయాన్ని మరింత అందంగా చెప్పాలిగా.. ఆ స్త్రీ తన జడవిప్పి అందులో చిక్కుకుని వాడిపోయిన పూలను గోటితో తీసివేస్తున్నది. పువ్వులున్నప్పుడు తుమ్మెదలు రాకుండా ఉంటాయా? ఆ ఇంతి పూవులు తీసేస్తుంటె తుమ్మెదలు చెదిరి ఝుమ్మని రొద చేస్తున్నాయంట. ఆ వీధిలో వెడుతున్నఒక కాముకుడు అది చూసి నిలబడిపోయాడు. అప్పటి కాంతలు వీణావిద్వాంసులు. తన జుట్టునుండి పూలను గోటీతో రాలుస్తుండగా ఆమె వీణవాయిస్తున్నట్టుగా అనిపించిందంట ఆ యువకుడికి. త్వరత్వరగా పూలను విదిలిస్తుంటే ఆమె నల్లని జుట్టు వీణియగాను, అందులో చిక్కుకున్న పూలు దంతపు మెట్లుగాను తోస్తున్నాయి మరి ఆ కాముకుడికి. అందునా తుమ్మెదల రొద కూడా వీణాగానంవలె నున్నది. ఎంత అందమైన భ్రాంతి కదా..
విల్లిపుత్తూరులో వరిమళ్లకోసం తవ్విన పిల్ల కాలువలు ఉన్నాయి. ఆ పంటకాలువలలో బాతులు తమ స్వభావగుణముచేత తలలు రెక్కలలో దూర్చికొని నిద్రిస్తున్నాయి. అది చూసిన భటులు /కాపరులు ప్రాతఃకాలములో స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు తమ ధోవతులను పిండి అక్కడే మరచిపోయినట్టున్నారు. వాటిని తీసికెళ్లి వారి ఇంటిలో అప్పగిద్దామని నీటిలోకి దిగారంట. ఆ అలికిడికి ఉలిక్కిపడ్డ బాతులు ఎగిరిపోయాయి. ఆ పక్కనే పొలాలను కాపలా కాసే యువతులు అది చూసి పక్కున నవ్విరంట. తెల్లని బాతులను చూసి బ్రాహ్మణుల పంచెలని భ్రమపడి భంగపడ్డారు ఆ భటులు..