Sunday 12 May 2024

మాలిక పత్రిక మే నెల 2024 సంచిక విడుదల


మాలిక మిత్రులు, పాఠకులు, రచయితలకు మాలిక పత్రిక మే నెల 2024 సంచికకు స్వాగతం... సుస్వాగతం... మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు..

మన తెలుగువారింట ప్రస్తుతం ఏం జరుగుతోంది.. మండే ఎండల్లో కాని, ప్రాణాలు తీసే కరోనా విలయతాండవ వేళ కాని, ఆరు నూరు నూరు పదహారైనా మానని ఒకే ఒక ప్రహసనం మీకు తెలుసు కదా.. అదేనండి ఆవకాయ.. 

గోవిందుడు అందరివాడేలే లాగే ఆవకాయ మన అందరిదీ...
ఒకటా రెండా నాలుగా.. అబ్బబ్బా... కొబ్బరి మామిడి, నాటు కాయలు, జలాల్ కాయలు, గులాబీ.. ఇలా పేరు ఏదైనా ఉన్నదొక్కటే మామిడికాయ. కాని ఎన్ని రకాల ఆవకాయలో... నేను పేర్లు చెప్పనులెండి..

చెప్పాలంటే ఆవకాయ ఒక ఎమోషన్ మనందరికీ.. కొందరు ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తి చేసి, తిరగ కలిపి, రుచి చూడడం, విదేశాల్లో పిల్లలకు కొరియర్ చేయడం మొదలైపోయింది కూడా.. ఇంకా కొందరు ఎండలు ఇంకొంచెం ముదిరితే ఇంకొంచెం మంచి కాయలు వస్తాయి. అప్పుడు పెడదాము అనుకుంటున్నారు నాలాగ..  ఈ రోజుల్లో ఆవకాయలు చాలా సులువుగా దొరికేస్తున్నాయి. అయినా మనమే రంగంలోకి దిగి, కారం పొడులు, ఉప్పు, ఆవ,మెంతి, జీలకర్ర, వెల్లుల్లి, కాయలు, ఇంగువ అన్నీ శ్రేష్టమైనవి చూసి, కొనుక్కొచ్చి ఇంట్లో చేయకపోతే తృప్తిగా ఉండదంటే ఉండదు.

అదన్నమాట సంగతి.. 

మాలిక పత్రికకోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ మాసపు విశేషాలు.

 1. సుందరము సుమధురము –13

 2. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10

 3. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

 4. ఎత్తుకు పై ఎత్తు… చిత్తు చిత్తు!

 6. బాలమాలిక – పసి మనసు

 7. బాలమాలిక – మంచి తల్లిదండ్రులంటే…

 9. జీవనయానం

10. అత్తా, ఒకింటి కోడలే…

11. యస్.వి. రంగారావు

12. ఏది పొందడానికి ఏం కోల్పోతున్నావు?

13.మధ్యతరగతి మందహాసం – నవలా సమీక్ష

14. తీర్థరాజ్ లో మా కల్పవాసం




Tuesday 9 April 2024

ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల

పాఠక మిత్రులు, రచయితలకు, అందరికీ క్రోధి నామ నూతన సంవత్సర శుభకాంక్షలు. 

గత మాసంలో మాలిక పత్రిక, ప్రమదాక్షరి (రచయిత్రుల ఫేస్బుక్ సమూహం) సంయుక్త ఆధ్వర్యంలో సమూహ సభ్యులకు నిర్వహించిన సరదా కథల పోటీల విజేతల వివరాలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన కథలను ఈ ప్రత్యేక సంచికలో చదవవచ్చు.. 

ఈ ఉగాది కథలపోటీకి వచ్చిన ముప్పై కథల్లో నియమనిబంధనలకు కట్టుబడి, న్యాయనిర్ణేతలు పది కథలను ఎంఫిక చేసారు. వీలువెంబడి మిగతా కథలు కూడా మాలిక పత్రికలో ప్రచురించబడతాయి. 

మాలిక, ప్రమదాక్షరి ఉగాది కథలపోటి విజేతలందరికీ హార్ధిక శుభాకాంక్షలు.. 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com బహుమతుల వివరాలు: 

ప్రథమ బహుమతి: రూ. 1500 ఒక్కోటి. 

 1.కొత్త కోడలు- తెలుగు కాపురం

2.  చాదస్తపు మొగుడు


ద్వితీయ బహుమతి: రూ. 1000 ఒక్కోటి. 

 1.  భలే భలే పెళ్ళిచూపులు

2.  కిష్కింధ కాండ


తృతీయ బహుమతి: రూ. 500 ఒక్కోటి 

1.  నత్తి రాంబాబు

2. అయిందా పెళ్లి!

3.  మామ్మగారు

4.  హ్యాపీ హార్మోన్స్

5.  ‘ప్ర’మా’దాక్షరి’

6.  వాస్తు

Friday 5 April 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2024 సంచిక విడుదల

మాలిక పాఠక మిత్రులు, రచయితలకూ సాదర ఆహ్వానం. మండే ఎండాకాలంలో అందరూ ఎలా ఉన్నారు. మధురమైన మామిడిఫలాలు, మనసును మురిపించే మల్లెపూవులు కూడా ఈ మండే ఎండలతో పోటీపడే సమయమిది. ఉగాది పండగ రాబోతోంది. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుందాం. ఒక ముఖ్య ప్రకటన: ఈ ఏప్రిల్ సంచిక తర్వాత ఉగాదికి మరో ప్రత్యేక సంచిక రాబోతోంది. విశేషాలు ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఉండదు కదా. కొద్దిరోజులు ఆగితే చాలు. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

 

ఈ ఏప్రిల్ సంచికలో ముఖ్య విశేషాలు: 

 1. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

 2. సుందరము సుమధురము –12

 3. శుచిరో అస్మాకా!

 4. జామాత

 5. అమ్మమ్మ – 56

 6. బాలమాలిక – బెల్లం కొట్టిన రాయి

 7. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 8

 8. పూల సంకెల

 9. బాలమాలిక – రెప్లికా

10. తప్పదు!

11. భగవత్ తత్వం

12. కార్టూన్స్ – భోగా పురుషోత్తం


Wednesday 6 March 2024

మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల

 
 
 
మాలిక మిత్రులు, రచయితలు, శ్రేయోభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం.. 
 
ముందుగా మీ అందరికీీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రతీరోజు మనదే కాని ఒకరోజు ఇతర మహిళామణులతో కలిసి పండగ చేసుకోవాలి. ఈ స్పెషల్ డే రోజు ఇంటిపని ఏ మాత్రం తగ్గదు నాకు తెలుసు కాని, పనంతా తొందరగా ముగించుకుని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి సరదాగా గడపండి.. గొప్పగా ఏమీ చెప్పను కాని అన్ని రంగాలలో ఎంతో ప్రతిభ చూపిస్తూ, రాణిస్తూ, మిగతావారికి స్ఫూర్తిగా ఉన్న మహిళలందరికీ మరోసారి అభినందనలు.. ఇందులో ఉద్యోగం, వ్యాపారం చేయకుండా ఇంట్లో ఉండే గృహిణులకు పెద్ద పీట వేయాలి సుమా.. 
 
 
మరొక ముఖ్యగమనిక మాలిక, ప్రమదాక్షరి గ్రూపు సభ్యులకోసం ఉగాది కథలపోటీ ప్రకటించబడింది. ఫలితాలతో బాటు బహుమతి పొందిన కథలు వచ్చే నెల సంచికలో చూడండి... చదవండి...
 
 
మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.comm
 
 
ఈ మాసపు సంచికలో ముఖ్య విశేషాలు.


Monday 5 February 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2024 సంచిక విడుదల

స్వాగతం... సుస్వాగతం... ప్రియ పాఠకమిత్రులు, రచయితలందరికీ మాలిక పత్రిక తరపున ధన్యవాదాలు... కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒక నెల గడిచిపోయింది కదా.. చలి పులి పారిపోయినట్టే అనిపిస్తోంది. మామిడిచెట్లన్నీపూతబట్టి నిండుగా ఉన్నాయి. మల్లెలు కనపడుతున్నాయి.. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ గా ఉన్నారు.. ఎప్పటిలాగే మీకోసం, మీరు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, సంగీతం, మొదలైన అంశాలతో మాలిక కొత్త సంచిక వచ్చేసింది. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

ఈ మాసపు విశేషాలు: 

 1. వెంటాడే కథ – 25

 2. డయాస్పోరా జీవన కథనం – త్రిశంకు స్వర్గం

 3. ‘కల వరం’

 4. అమ్మమ్మ – 54

 5. సుందరము సుమధురము – 10

 6. లోపలి ఖాళీ – మృత్యువు యొక్క మృత్యువు

 7. సినీ బేతాళ కథలు – సమ్‍అంతరరేఖ

 9. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 6

 10. ఎవరు మారాలి?

11. ఉరూరి – ఉరూరి

12. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

13. అన్నమాచార్యులు – హరి నీవే సర్వాత్మకుఁడవు

14. చివరి బోధ

15. మనసు యొక్క ప్రాశస్థ్యం


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008