Monday 15 July 2019

మాలిక జులై స్పెషల్ సంచిక విడుదల

Jyothivalaboju
Chief Editor and Content Head






శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ
మరియు
అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ
U.S.A
సంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా అందిస్తోంది. ఈ నలభై ఒక్క కథలను మీరు ఈ పత్రికలో ఒకే చోట చదవొచ్చు. మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.


ఒక గమనిక...
మాకు  ఈ పోటీ యొక్క ముఖ్య నిర్వాహకురాలు ఉమాభారతిగారినుండి అందిన కథలను అలాగే ప్రచురిస్తున్నాము. కొన్ని కథలకు సవరణలు చేయడమైనది. మిగతా కథలు చేయడానికి మాకు వీలు కాదు. అందుకే వాటినన్నింటిని అలాగే ప్రచురిస్తున్నాము. ఈ కథలలోని అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు అన్నీ రచయితల పొరపాట్లే. అవి వారు సరిదిద్ది మాకు పంపవలసింది. గమనించగలరు.

 మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com



Monday 1 July 2019

మాలిక పత్రిక జులై 2019





Jyothivalaboju

Chief Editor and Content Head


వేసవి చిటపటలు తగ్గి చిరుజల్లులు మొదలయ్యాయి కదా. ఇంకా పూర్తిగా తడవలేదు. చూద్దాం. దోబూచులాడుతున్న ఈ వానలు ఎప్పుడు వచ్చి తిష్టవేస్తాయో.

పాఠకులకు, రచయితలకు  ధన్యవాదాలు. ఆసక్తికరమైన సీరియళ్లు, కథలు, కవితలు, వ్యాసాలతో ప్రతీనెల మిమ్మల్ని అలరిస్తోన్న మాలిక పత్రిక  ఈసారి కూడా మరింత అందంగా, ఆకర్షణీయంగా ముస్తాబై వచ్చింది.  మీకు నచ్చని శీర్షికలు, రచనలు ఉంటే చెప్పండి. ఎలా ఉంటే బావుంటుందో కూడా చెప్తే చాలా సంతోషం. పత్రికను మరింత మెరుగ్గా తయరు చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనలకు ఎప్పుడూ స్వాగతం పలుకుతున్నాను.

ఇది జులై మాసపు పత్రిక. మరో నాలుగు రోజుల్లో మాలిక పత్రిక స్పెషల్ ఎడిషన్ విడుదల చేయబోతున్నాము. ఏంటా స్పెషల్ అనేది ఇప్పటికి సస్పెన్స్ మరి. జస్ట్ నాలుగు రోజులు. అందాక ఈ  పత్రికలో విహారం మొదలుపెట్టండి..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


 1. మార్మిక శూన్యం
 2. నీ జ్ఞాపకంలో
 3. చీకటి మూసిన ఏకాంతం . 4
 4. అమ్మమ్మ - 4
 5. మజిలీ
 6. చిన్నారి మనసు
 7. నేను
 8. జలజాక్షి - సంగీతం కోచింగ్
 9. విశ్వపుత్రిక వీక్షణం - మైండ్ సెట్
10. చిన్నారి తల్లి - నా చిట్టి తల్లి
11. అత్తగారు - అమెరికం
12. కౌండిన్య కథలు - ప్రకృతి క్రితి
13.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 39
14. విశ్వనాధ వారి విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
15. బాల్యం కురిపించిన హాస్యపు జల్లులు
16. కార్టూన్స్. జెఎన్నెమ్
17. సురవరం ప్రతాపరెడ్డిగారు
18. తేనెలూరు తెలుగు
19. శివ ఖోడి
20. ఉదంకుడు
21. సంఘర్షణ
22. నానీలు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008