Wednesday, 1 June 2022

మాలిక పత్రిక జూన్ 2022 సంచిక విడుదల

Jyothivalaboju 


Chief Editor and Content Head 


మాలిక పాఠక మిత్రులకు, రచయితలకు, మిత్రులకు సాదర ఆహ్వానం.. వేసవి వడగాడ్పులనుండి ఉపశమనం పొందే తరుణం ఆసన్నమయింది. చిరుగాలులు, ముసురేసిన మబ్బులతో, అప్పుడప్పుడు పలకరించే చినుకులతో శరీరంతోపాటు మనసును కూడా చల్లబరిచే కాలం నేనొస్తున్నానొస్తున్నా అంటోంది.. మండువేసవిలో చినుకుల కోసం ఎదురుచూపులు, భారీ వర్షాల తాకిడికి తల్లడిల్లిపోతాము. తర్వాత చలికి గిజగిజలాడి ఎండకోసం వెతుకులాడుతాము. మనం ఎలా ఉన్నా, ఏమనుకున్నా కాలచక్రం ఆగదు. తన పని తను చేసుకుంటూనే పోతుంది. ఇదే జీవిత సత్యం.. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మనం కూడా ఆగకుండా సాగుతూనే ఉండాలి. ప్రతీ నెల మీకోసం ఎన్నో ఆసక్తికరమైన కథలు, కవితలు, కార్టూన్స్, వ్యాసాలు, సీరియల్స్ తీసుకొస్తున్నాము. మీకు నచ్చుతున్నాయనుకుంటాను. మీ స్పందనను, సందేహాలు, సలహాలు మాకు తప్పకుండా తెలియజేయగలరు. 


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com ఈ మాసపు విశేషాలు:


1. వెంటాడే కథలు – 9

 

2. సాఫ్ట్‌వేర్ కథలు – తైర్ సాదమ్

 

3. పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

 

4. ధృతి పార్ట్ – 12

 

5. తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

 

6. చంద్రోదయం – 29

 

7. మోదుగ పూలు – 12

 

8. అమ్మమ్మ – 36

 

9. వెళ్ళాం! వొచ్చాం!

 

10. పెద్ద కొడుకు

 

11. శ్రీ గణేశ చరిత్ర

 

12. దేవశర్మ పత్ని- రుచి

 


14. అమ్మ

 

15.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

 

16.కార్టూన్స్ – CSK

Sunday, 1 May 2022

మాలిక పత్రిక మే 2022 సంచిక విడుదల

Jyothivalaboju. Chief Editor and Content Head మాలిక పత్రిక మిత్రులకు, రచయితలకు సాదర స్వాగతం..మీకందరికీ కూడా ఆవకాయ అభినందనలు, రాబోయే మాతృదినోత్సవ శుభాకాంక్షలు.. ఆవకాయ అభినందనలు ఏంటి అనుకుంటున్నారా.. రెండేళ్లకు పైగా ఉన్నామో లేదో అన్నట్టు కాలం గడిపిన మనం ఇప్పుడు హుషారుగా, మునుపటలాగే ఆవకాయలు పెట్టడం మొదలెట్టేసాము కదా. మే నెల అంటే దాదాపు ప్రతీ తెలుగింట వినపడే మాట మల్లెపూలు, మామిడిపళ్లు, ఆవకాయలు, వడియాలు.. సూర్యనారాయణ ఎంత మండినా కూడా వీటిని మనం వదలం, మరువం కదా.. అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, అక్కలు, చెెల్లెళ్లు, అమ్మలాంటి నాన్నలకు అందరికీ మాతృదినోత్సవ శుభకాంక్షలు. మిమ్మల్ని అలరించే, ఆనందింపజేసే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్,కార్టూన్స్ తో మీ ముందుకు వచ్చింది ఈ మాసపు మీ/మా మాలిక పత్రిక..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు మీకోసం: 

 1. ధృతి – 11 

 

 2.  అమ్మమ్మ – 35

 

 3..  మోదుగ పూలు – 10

 

 4.  చంద్రోదయం . 28

 5.  వెంటాడే కథలు – 8

 6.తాత్పర్యం – దిగడానికి కూడా మెట్లు కావాలి

 7.పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

 8.సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

 9.జీవితం-జీతం-మనుగడ

10.*శ్రీ గణేశ చరిత్ర* 81 – 100

11.బ్రహ్మ జ్ఞాని జాబాలి మహర్షి

12.మౌనరాగం

13.నా మనస్సు అనే దర్పణం-నా భావాలకు ప్రతి రూపం।

14.కార్ట్రూన్స్ – భోగా పురుషోత్తం

15.కార్టూన్స్ – CSK

 

16.(వ్యంగ్యల్పిక) ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు!

 

 

Thursday, 7 April 2022

మాలిక పత్రిక ఏప్రిల్ 2022 సంచిక విడుదల


Jyothivalaboju

Chief Editor and Content Head

 

 

మరో కొత్త సంవత్సరానికి, కొత్త పత్రికకు స్వాగతం.. పాఠక, రచయిత మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభాకాంక్షలు. ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, విపత్తులు మళ్లీ రాకుండా ఉండాలని మనసారా కోరుకుందాం. గడచిన సంవత్సరంలోని చేదుసంఘటనలు, ఆపదలు, సమస్యలను మరచిపోవడం కష్టమే అయినా మరువడానికి ప్రయత్నిద్దాం. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుదాం. ఈ జీవన పయనం ఆగలేదు కదా. అంతా మన మంచికే అనుకుంటూ కాలంతో కలిసి నడుద్దాం.

కొత్త కొత్త ఆలోచనలకు, ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడూ స్వాగతిస్తుంది. ప్రోత్సాహాన్నిస్తుంది.. అదే విధంగా విభిన్నమైన అంశాలతో కవితలు, కథలు, సీరియల్స్, కార్టూన్స్, వ్యాసాలు మీకోసం తీసుకువచ్చింది (కొద్ది ఆలస్యంతో) మీ మాలిక మాసపత్రిక..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు మాలిక పత్రికలో మీకోసం వచ్చిన స్పెషల్స్:

 

 1. వెంటాడే కథలు – 7

 2. ధృతి – 10

 3.చంద్రోదయం – 27

 4. అమ్మమ్మ – 34

 5. తాత్పర్యం – అంటుకున్న అడవి

 6. మోదుగపూలు – 9

 7. సాఫ్ట్ వేర్ కథలు – మైసూరు బజ్జీ

 8. పరవశానికి పాత(ర) కథలు – సయొనారా

 9. బెంగ

10. తృప్తి

11. వ్యసనం

12. అష్టవిధ నాయికలు. ప్రోషితభర్త్రుక.

13. దేవీ భాగవతం – 9

14. గృహస్థాశ్రమ ధర్మాలను వివరించిన - ఔర్వ మహార్షి

15. మొసలి రామలింగేశ్వర ఆలయం “పవర”

16. యాత్రామాలిక – ముక్తినాథ్ యాత్ర

17. కార్టూన్స్ – CSR

18. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

19. కార్టూన్స్ – CSK

20. *శ్రీగణేశ చరిత్ర*

21. మనసే ఒక పూలతోట

22. వనితా ! ఓ వనితా !


Thursday, 3 March 2022

మాలిక పత్రిక మార్చ్ 2022 సంచిక విడుదల

 

 
 
Jyothivalaboju
Chief Editor and Content Head
 
 
 
పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు మాలిక పత్రిక తరఫున హార్ధిక స్వాగతం.  
 
ప్రపంచ వ్యాప్తంగా  ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి  చేరుకుంటుందన్న శుభవార్త హర్షణీయం..అందరూ బాగుండాలి. అందులో మనముండాలి.

మాలిక పత్రికలో అందరినీ అలరించే కథలు, వ్యాసాలు, కవితలు, సీరియల్స్, సమీక్షలు, కార్టూన్లు తీసుకొస్తున్నాము. ఇందులో ప్రముఖ రచయితలు, రచయిత్రులెందరో ఉన్నారు. అలాగే ఔత్సాహికులకు మాలిక ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అప్పుడప్పుడు పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. 
ఈ సారి ఒక కొత్త ప్రయోగంలాటి పోటీ మీకోసం. 
మణికుమారి గోవిందరాజులగారి సీరియల్  'ధృతి' పాఠకులను అలరిస్తోంది. ఎంతో ఆసక్తిగా సాగుతోన్న ఈ సీరియల్ ఈసారి తొమ్మిదవ భాగం ప్రచురింపబడింది. వచ్చే మాసం ఏఫ్రిల్ సంచిక కోసం పదవ భాగం రచయిత్రి రాయరు, ఈ సీరియల్ ని క్రమం తప్పకుండా చదువుతోన్న పాఠకులే రాయాలి.. ఇన్ని భాగాలు చదివిన మీరు వచ్చే పదవ భాగం ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఆలోచించి రాయండి.. వర్డ్ లో  మూడు లేదా నాలుగు పేజీలు ఉండాలి. తర్వాత పదకొండవ భాగం రచయిత్రి అందుకుంటారు. ఈ సీరియల్ నిర్మాణంలో మీరు కూడా పాల్గొంటున్నారన్నమాట.. అంతే కాదు. ఈ పోటీకి వచ్చిన కథాభాగాలన్నీ రచయిత్రి చదివి చాలా బాగున్నదని అనిపించిన రచనకు బహుమతిగా రూ.1000 ఇవ్వాలనుకుంటున్నారు. 
ఇంకెందుకు ఆలస్యం . త్వరపడండి.. ఈ ప్రయోగం రచయిత్రికి, పాఠకులకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిది.. 
ధృతి సీరియల్ చదవడానికి ఈ లంకె ని చూడండి
 
 
 మీరు రాసిన పదవ భాగం కథను ఈ చిరునామాకు maalikapatrika@gmail.com కు మార్చ్  15 వరకు పంపించాలి.. త్వరపడండి.


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 
 
 
 
 
 
 
 
 

Monday, 31 January 2022

మాలిక పత్రిక ఫిబ్రవరి 2022 సంచిక విడుదల

    పాఠక, రచయిత మిత్రులకు మాలిక ఫిబ్రవరి సంచికకు స్వాగతం సుస్వాగతం..

దాదాపు పదకొండేళ్లుగా మీ సహకారంతో మాలిక పత్రిక అందరినీ అలరించే అంశాలతో  అంతర్జాలంలో ప్రచురించబడుతోంది.  గత రెండేళ్లుగా సంతోషం, బాధ కలగలుపు జీవితం అందరిదీ.. అయినా జీవనప్రయాణం ఆగదు. సాగక తప్పదు కదా.. ఒక్కరొక్కరుగా మనలని వీడి వెళ్లిపోతున్న పెద్దవారందరికీ సాదర ప్రణామాలు తప్ప ఏమి చేయగలం.. వారు చెప్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ సాగిపోవాలి.

ఈ మాసపు సంచికలో మీకోసం ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు, సీరియళ్లు ఉన్నాయి. 
మాలిక పత్రికకు మీ రచన పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.com


ఈ మాసపు విశేషాలు:

 


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008