వీరులం... శూరులం..
pic courtesy: Krishna Ashok
ఎవరేమన్నా ఏమైనా చెక్కు చెదరని ధీరులం
అని విర్రవీగుతాం కాని ఇది నిజమేనా??
ఓ క్షణం గర్వం.. మరుక్షణం బలహీనం
ఒక్కోసారి సంతోషం.. మరోసారి దిగులు ..
ఇవి మనసు ఆడే ఆటలా? ఆ దేవుడి లీలలా?
రాసింది జ్యోతి at 20:57 0 వ్యాఖ్యలు
వర్గములు కవిత
1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!
2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!
3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!
4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!
5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!
6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!
7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!
8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!
రాసింది జ్యోతి at 06:36 0 వ్యాఖ్యలు
వర్గములు కవిత
రాసింది జ్యోతి at 09:57 1 వ్యాఖ్యలు
వర్గములు కవిత
రాసింది జ్యోతి at 08:42 4 వ్యాఖ్యలు
వర్గములు కవిత, నాకు చాలా ఇష్టమైనవి
రాసింది జ్యోతి at 12:40 10 వ్యాఖ్యలు
వర్గములు కవిత
రాసింది జ్యోతి at 09:01 13 వ్యాఖ్యలు
వర్గములు కవిత, నా మనోభావాలు
రాసింది జ్యోతి at 12:20 7 వ్యాఖ్యలు
వర్గములు కవిత
రాసింది జ్యోతి at 06:23 8 వ్యాఖ్యలు
వర్గములు కవిత
మరువం ఉష ప్రారంభించిన జలపుష్పాభిషేకానికి నావంతుగా ఓ తుమ్మిపువ్వు సమర్పిస్తున్నాను. చలాకీ చేపపిల్ల , అమాయకపు ఆడపిల్ల ఒకటే అనే నా భావవ్యక్తీకరణ ఇది..
అదిగదిగో చేపపిల్ల
తుళ్లి తుళ్లి తిరిగేను
ఇదిగిదిగో ఈ చిట్టితల్లి
కేరింతలతో పరుగులెత్తేను
విశాలమైన సాగరానికి భయపడి
అమ్మ వెనకాలే భయంభయంగా
ఈదులాడేను చేప పిల్ల
చుట్టూ ఉన్న వారిని చూసి
భీతిల్లి, తప్పిపొతానేమొ అని
అమ్మ కొంగట్టుకు తిరిగెను చిట్టితల్లి
ఎన్ని రంగులొ, ఎన్ని అందాలో
ఎంతమంది బంధుమిత్రులో
అని కళ్లు విప్పార్చి పలకరించే చేప పిల్ల
ఎన్ని వర్ణాలో, ఎన్నెన్ని అందాలో ప్రకృతిలో
మనసంతా ఆనందాన్ని పదిలపరుచుకునే చిట్టితల్లి
అందరూ మనవారు కాదని అమ్మ
చెప్పెను జాగ్రత్తలు చేపపిల్లకు
అందరినీ నమ్మకు బుజ్జీ అని అమ్మ
హెచ్చరించెను చిట్టి తల్లికి
తనవారే తనకు శత్రువులా
అని మాటవినక సాగిపోయె చేపపిల్ల
అందరూ మనసున్న మారాజులే
అని నమ్మి మోసపోయే చిట్టితల్లి
అన్నా అని చేరబోయి
సొరచేప నోటచిక్కె చేపపిల్ల
తాళి కట్టించుకుని
కట్నదాహానికి బూడిదాయె చిట్టితల్లి.
రాసింది జ్యోతి at 10:33 16 వ్యాఖ్యలు
వర్గములు కవిత
ఈ జీవితం ఎంతో చిత్రమైనది. ప్రతి ఒక్కరిది ఒక్కో మనస్తత్వం. వ్యక్తిత్వం. కాని విలువైన ఈ జీవితంలోని ప్రతి కోణాన్ని, ప్రతీ సంఘటనను గురించి తెలుసుకుని, స్పందించాలి. ఎపుడు కూడా మన ఆలోచనలు ఒకే విధంగా ఉండకూడదు.అది మనకే మంచిది కాదు. మన మనస్సుకు సంకెళ్ళు వేయకుండా, మనం చెప్పినట్టు మాత్రమే వినేలా నిర్దేశించకూడదు. దానికి స్వేఛ్చ నిచ్చి వదిలేయాలి. అప్పుడే మన మనస్సు, ఆలోచనలు ఆ సంఘటనకు తగ్గట్టుగా వివిధ రూపాలుగా స్పందిస్తాయి. Different thoughts at different situations మనం కోపం, బాధ, ఆనందం, అల్లరి, ఆలోచన, సంగీతం, సాహిత్యం... ఇలా అన్నింటినీ సమానంగా అనుభవించి ఎంజాయ్ చేయాలి. ఆ స్పందనను ఎన్నో రూపాలుగా ప్రతిబింబించవచ్చు. వచనం, కవిత్వం, పాట, పద్యం ... ఇలా అన్ని అనుభూతులను మనఃస్పూర్తిగా అనుభవించాలి. దాచుకోవాలి.
ఈ క్రమంలో ఒకరోజు వేసవి చివర్లో తొలకరికి ఎదురుచూపులు. కాని ఈ సారి వాన అలిగిందేమో. ఇంకా దోబూచులాడుతుంది. వేసవి ఉక్కపోతలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ కురిసిన తొలివాన నాలో కలిగించిన స్పందన మొదటిసారి కవితగా రూపుదిద్దుకుంది. చిరు చీకటి కమ్ముకుంటున్న సమయాన, పాట పాటలు వింటూ . చల్లని వాన చినుకుల్లోతడుస్తూ ... ఆ హాయే వేరులే.. ఇక చేతిలో వేడి వేడి టీ ఉంటే??
ఎంత అల్లరిదమ్మ ఈ వాన
రానని ఉడికించి వరవడిగ వస్తుంది
వదలక గిలిగింతలు పెట్టి
ఉల్లాసంగా ఉప్పొంగి నవ్వుతుంది
ఆషాడ మాసాన సాయం వేళ
నేనొస్తున్నా రారమ్మంటూ గాలితో కబురంపింది
రానంటే అలిగింది
రప్పించి నెగ్గింది
ఆనందమో, ఆకతాయితనమో
చినుకులతో తట్టి తనువంతా తడిపింది
అది చూసి మెరుపు కన్ను కొట్టింది
మేఘం రెచ్చి కురిసింది
చెలిమి చేయమంది బాధ మరవమంది
మనసు తెప్పరిల్లి తనువు మించి చల్లనయింది
జగతి మరిచితిని
నెచ్చెలి వానతో జత కలిపితిని ....
రాసింది జ్యోతి at 12:24 20 వ్యాఖ్యలు
వర్గములు కవిత, నా మనోభావాలు
ఓటర్లకు , నాయకులకు
ప్రాణం ఓటు
మీకు, మాకు, అందరికి
ప్రాణం ఓటు (O2)...
ఇంటిలోన పాలబిల్లు
ఎంతో తెలీదంట
ఓటడగా వెళ్లి
నేర్పుగా పాలు పితికేరంట....
వందనోటు విడిపిస్తే
ఏగాని మిగలదంట
ఆ వందకే నెల సరుకులు
ఎలా ఇచ్చేరంట...
నల్లచుక్క కనపడదు
నాలుగు రోజుల్లో
నాయకుడు కనపడదు
నాలుగు ఏళ్లలో .....
మీట నొక్కేవరకు
నీ కాల్మొక్త బాంచన్
మీట నోక్కేసాక
నా కాల్మోక్కరా బద్మాష్..
కొద్ది కాలంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న వింతలు, విశేషాలు, మోసాలు, తమాషాలు, వేషాలు చూసి చిరాకేసి రాసుకున్న భావవ్యక్తీకరణ. అసలైతే ఇంతకంటే వందరెట్లు చిరాకుగా , కోపంగా ఉంది..
రాసింది జ్యోతి at 21:03 6 వ్యాఖ్యలు
వర్గములు కవిత
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008