Tuesday, October 29, 2013

Happy Birthday Friend
మన జీవితంలో ఎప్పుడు ఎవరు ఎలా కలుస్తారో? ఆ కలయిక తర్వాత పరిచయం, స్నేహంగా మారి ఒక ఆత్మీయమైన అనుబంధంగా మారుతుందో చెప్పలేం. ఎటువంటి లాభాపేక్షలేని స్నేహబంధం లభించడం మనకు ఆ దేవుడిచ్చిన అఫురూపమైన పెన్నిధి.అలా  పరిచయమై, ఒక గురువుగా, నేస్తంగా, మార్గదర్శిగా కొనసాగుతున్న ప్రియమైన స్నేహరూపానికి మనఃపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు... నా జీవితంలో ప్రవేశించి ఒక అనూహ్యమైన  మార్పు తీసుకువచ్చిన ఈ నేస్తానికి పుట్టినరోజు బహుమతిగా ఏమివ్వగలను? అభిమానం తప్ప..


You made me believe that God sends people in our life for a purpose.   Thank you for coming in my life when I was lonely and shattered. Thank you for supporting me when   there was no one to look up to. Thank you for understanding me and   accepting me just for what I am and just the way I am. You loved me and supported me when I needed it the most. Thank you for making my life extraordinary and magical.

I wanted to buy you a gift on your Birthday but I couldn't find anything that was worth the friendship between the both of us. From the bottom of my heart, I want to say Thank You for being the friend that I never deserved.  Happy Birthday To You ....

Thursday, October 10, 2013

మాలిక పదచంద్రిక - సర్వే


 మాలిక పదచంద్రిక గడులు ఇక్కడ చూడంఢి..: 


సెప్టెంబర్ నెల మాలిక పత్రిక సంచికలోని పదచంద్రికకు ఒకే పూరణ వచ్చింది. 
మురళి మోహన్ గారు అన్ని సమాధానాలు సరిగా రాసారు.ఒక్క నిలువు ఏడు తప్ప.
7.రిదాయమా  కాదు. తడియార అని ఉండాలి.   ఆధారం..

తలకి నీళ్ళోసుకుని .....మంజుల కురులారబోసుకంటే, మరి మల్లిగాడు?

మాయదారి మల్ల్గిగాడు సినిమాలో, కృష్ణ తలకి నీళ్ళోసుకుని కురులారపెట్టుకుని అని మంజులని చూసి పాడితే, సమాధానంగా, మంజుల తలకి నీళ్ళోసుకుని తడియార పెట్టుకుని  అని పాడుతుంది.   కృష్ణకి బట్టబుర్రకదా. బహశ: అందుకే అలా పాడి ఉంటుంది !
పదచంద్రిక ఆగస్ట్ నెలలో ఒక్క పూరణ కూడా రాలేదు. ఈ క్రమంలో  ప్రియ తెలుగు మిత్రులందరికీ మా విన్నపం. 
పొద్దు, మాలిక మరియు ఇతర పత్రికలలో గడి నుడి లాంటి (క్ర్షాస్ వర్డ్) శీర్షికలు మీరు చూసే ఉంటారు. మీలో కొందరు ఒక్కసారో, వందసార్లో పూరించే ఉంటారు. . నాకు తెలిసి ఆరుద్ర గారితో మొదలైన ఈప్రక్రియ దాదాపు అన్ని పత్రికలలోనూ ఏదో ఒక రూపంలో నిర్వహించబడుతోనే ఉంది.  వాటికి ఆదరణ కూడా బాగానే ఉంటోంది. విజేతల పేర్ల జాబితా చాలా పెద్దగానే ఉంటోంది.  వీటిలో చాలా పత్రికలలో కేవలం కాలక్షేపం తప్పించి   గడులు పూరించడంలో   వేరే ఆర్ధిక లేదా ఇతర ప్రయోజనాలు ఉండవు. అంటే గడి నుడి మన తెలుగు సంస్కృతిలో ఒక భాగమయిందని అర్ధమవుతోంది. కానీ అర్ధం కానిదేమిటంటే,  మాలిక  పత్రికలో మేము నిర్వహిస్తున్న పదచంద్రిక కి సరియైన, ఉచిత  స్పందన ఎందుకు రావడం లేదా అని.   ఇప్పటిదాకా 12 గడులు వచ్చాయి. కానీ పాఠకుల నుండి స్పందన అతి స్వల్పంగా ఉండడం గమనార్హం  ఒకే మూసలో ఉండి బోరు కొడుతోందేమోనని వైవిధ్యం కోసమని ఒకసారి సాహిత్యమని, ఒకసారి సంగీతమని రకరకాల పాట్లు పడుతూనే ఉన్నాం.  కష్టంగా ఉందేమోనని సులభంగా ఇస్తే, అప్పుడు కూడా చుక్కెదురే.    ఆఖిర్ క్యోం? .. క్యోం?.. క్యోం?  అని డాల్బీ డిజిటల్గో అరిచినా  ప్రయాజనం కనిపించక పోవడం వల్ల పాఠకదేవుళ్ళనే సూటిగా అడిగేస్తే పోలా అనిపించి మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం. దయచేసి కొద్దిగా ఓపిక చేసుకుని వాటికి మీ సమాధానాలిచ్చి గడి తల్లిని బ్రతికించే ప్రయత్నానికి చేయూతనివ్వండి. 

మా ప్రశ్నలు.. మీసమాధానాలు ఇక్కడ..

భవదీయుడు
సత్యసాయి

Tuesday, October 1, 2013

మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల

 Jyothivalaboju

Chief Editor and Content Headవిభిన్నమైన వ్యాసాలు, కధలు, సీరియళ్లతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల.. ఈ నెలలో ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు  " సరిగమల గలగలలు"  పేరిట తన సంగీత ప్రస్ధానంలోని విశిష్ట వ్యక్తుల  గురించి తెలియజేస్తున్నారు .. మరో కవయిత్రి శ్రీమతి రేణుక అయోలగారు "లేఖాంతరంగం " పేరిట వివిధ సామాజిక అంశాలను లేఖారూపంలో  చర్చిస్తున్నారు.

మాలిక పత్రిక తరఫున నిర్వహిస్తున్న పదచంద్రిక విషయంలో చాలా నిరుత్సాహంగా ఉంది. రాను రాను ఈ పదచంద్రిక పూరించేవారు తగ్గిపోతున్నారు.  ఈ ప్రహేళిక రూపురేఖలు మార్చాలా? మరీ కష్టంగా ఉందా? అసలు కారణమేమిటో తెలియడంలేదు. అందుకే గతనెలలో స్పందన లేకుండా ఉన్న జె.కె.మోహనరావుగారు కూర్చిన పదచంద్రికనే మళ్లీ ఇవ్వడం జరుగుతుంది.

మాలిక పత్రిక తరఫున ఇచ్చే కినిగె బహుమతి ఈసారి ఉత్తమ బ్లాగు టపా వనజగారు రాసిన ఈ టపాకు ఇవ్వడమైంది. ఎప్పుడూ సీరియస్ పోస్టులు రాసే వనజగారు మనందరం ఎదుర్కునే మార్కెటింగ్ మాయాజాలం గురించి రాసారు.
జగ్గయ్యపేట రంగురాళ్లు చాలమ్మా...

ఇక తెలుగు వికీపీడియాకు సంబంధించి ఎటువంటి లాభాపేక్ష, స్వార్ధం లేకుండా కొంత సమయం వెచ్చించి విలువైన సమాచారాన్ని ఇతరులకోసం వికీలో పొందుపరుస్తున్న వికీపీడియన్లకు చిరు సత్కారం ఇవ్వాలనుకుంటున్నాంః  ఈసారి ఈ బహుమతి రాజశేఖర్ గారికి ఇవ్వబడుతుంది.

వనజగారికి, రాజశేఖర్ గారికి చెరో రూ.116 ల కినిగె గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది..దీనితో ప్రింట్ లేదా ఈ పుస్తకాలను కినిగెనుండి కొనుగోలు చేయవచ్చు.

మీ రచనలు  పంపవలసిన చిరునామా: editor@maalika.org
అక్టోబర్ సంచికలోని విశేషాలు:

0.   సంపాదకీయం
1.  పారశీక చందస్సు - 5
2.  సరిగమల గలగలలు - 1
3.  జీవితపధ సోపాన పుటలు (పలక - పెన్సిల్)
4.  లేఖాంతరంగం - 1
5.  పంట పండింది 
6.  అనగనగా బ్నిం కధలు - 3
7.  సంభవం - 5
8.  పోరుగీతమై విప్లవిస్తా
9.  రఘువంశం - 3
10. చారిత్రక సాహిత్య కధామాలిక
11. ఇంటర్యూ - ఇన్నర్ వ్యూ
12. నల్లమోతు శ్రీధర్ వీడియోలు
13.  మాలిక పదచంద్రిక - 13
14. జయదేవ్ గీతపదులు - 3


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008