Thursday, February 28, 2008

పుణుకులు

1. అది ఒక ఆఫీసులో లంచ్ టైమ్. కామేశం, వీరేశం, గిరీశం ముగ్గురు తమ తమ లంచ్ బాక్స్ లు తీసారు.

కామేశం : " ఉప్మా!!!.. రోజు ఉప్మా తినలేక చచ్చిపోతున్నా. రేపు కూడా నా లంచ్ బాక్స్ లో ఉప్మా పంపితే చచ్చిపోతానంతే.

వీరేశం : " చపాతీలు!!!..రోజు ఈ చపాతీలు తిని తిని విసుగెత్తింది. రేపు కూడా నాకు చపాతీలు పంపితే నేనూ చచ్చిపోతాను. బ్రతికి లాభంలేదు..

గిరీశం : " పులిహోర!!!.. రోజు ఈ నిమ్మకాయ పులిహోర తిని తిని ప్రాణం మీది తీపి చచ్చిపోయింది. రేపు కూడా నాకు పులిహోర పంపితే నేను బ్రతకనంతే."

మరుసటి రోజు ముగ్గురికీ అవే లంచ్ బాక్స్ లు వచ్చాయి. దానితో ముగ్గురూ ఆఫీసు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురి భార్యలు వచ్చారు.

కామేశం భార్య : "ఏవండి. వెదవది ఉప్మా కోసం ప్రాణంతీసుకున్నారా ? ఒక్క మాట చేప్తే వేరే చేసేదాని కదా" అని ఏడుస్తుంది.

వీరేశం భార్య : "ఏవండి.. చపాతీలు ఇష్టం లేదని ఒక్క మాట అంటే వేరే ఏదైనా చేసి పంపేదాన్ని కదా . ఇంత దానికే ఆత్మహత్య చేసుకున్నారా ?" అని ఏడుస్తుంది.

గిరీశం భార్య మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలా కూర్చుంది.

ఆఫీసు వాళ్ళు వచ్చి "ఏంటమ్మా ! మీ భర్త చనిపోతే ఎటువంటి బాధలేకుండా అలా కూర్చున్నావు?"

గిరీశం భార్య " ఈ నా కొడుకు! రోజు తనే వంట చేస్తాడు కదా ! రోజొక వంట చేయొచ్చుగా. రోజు పులిహోర ఎవడు తెచ్చుకొమ్మన్నాడు. దొంగ సచ్చినోడు. అనవసరంగా నన్ను ఇరికించాడు."


2. ఒక ఆఫీసులో ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఉద్యోగానికి ఒక ఢిల్లీ వ్యక్తి, ఒక ముంబాయి వ్యక్తి, ఒక హైదరాబాది ముస్లీమ్ వచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో ఒకే పదంతో గదిలోకి ప్రవేశించాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడితే అనర్హులుగా ప్రకటిస్తారు.

ఢిల్లీ వ్యక్తి తలుపు తట్టి " May I come in ?" అని అడిగాడు.

నాలుగు పదాలు వాడాడని అతనిని పంపేసారు.

ముంబాయి వ్యక్తి తలుపు తట్టి " మై అందర్ ఆ సక్తా హూ?’

ఐదు పదాలు వాడాడని అతనిని కూడా పంపేసారు.

ఇక హైదరాబాదీ ఈ విషయాలు తెలుసుకుని తలుపు కొద్దిగా తీరిచి " …. " అన్నాడు.

అంతే అతనికి ఉద్యోగం వచ్చేసింది.

ఇంతకీ అతనేమన్నాడు… " ఘుసూ.. घुसू ’

घुसू అంటే దూరనా అని అర్ధం..

వారెవ్వా హైదరాబాదీ…. క్యా బాత్ హై..3. సగం మనిషిగా ఉన్నదెవరు???


క్లూ: ఇది ఇటీవల వచ్చిన ఒక భారతీయ సినిమా పేరు కూడా……..

వంటింటి కుందేలు


"తప్పించుకోలేనిది " అనే అర్ధంలో ఈ మాట వాడతారు. కుందేలు పిరికిజంతువే కాని దాన్ని ఉచ్చు వేసి పట్టాల్సిందే. చాలా వేగంగా ఎగురుతూ గెంతుతూ దూకుతూ పరిగెత్తుతుంది. దొరికిన కుందేళును చెవులు పట్టుకుని లేవదీస్తారు . పొట్ట నొక్కితే చచ్చిపోతుంది. ఆ భాగం పరమసుకుమారమయింది. కుందేలుని పట్టుకున్న వేటగాడు దాన్నినేలమీద పెట్టు చుట్టూ అరంగుళమెత్తున మట్టికుప్ప వేసినా సరే ఆ "కోటగోడ"ను దాటి అది పారిపోదు ! చిన్న పుల్లతో ఆ మట్టికుప్పలో కాస్త దారిపెడితే చాలు, చెంగున ఎగిరి దూకిపారిపోతుంది. అది దాని స్వభావం , బలహీనత కూడ. దొరికిన తర్వాత ఏ కాస్త అడ్డున్నాసరే అది పారిపోదు -పోలేదు. కుందేలును వంటింట్లో బంధిస్తే అది తప్పించుకోవటమనే ప్రశ్నే లేదు. అందువల్ల మనకు దొరికిపోయి తప్పించుకోలేని ఏ వ్యక్తిని గురించయినా ’వంటింటి కుందేలు’ అని వ్యవహరిస్తారు. భారతీయ కుటుంబములోని స్త్రీని గురించి కూడా ఇలాగే వ్యవహరించేవాళ్ళు. ఉద్యోగం, సంపాదన, విడాకులను గురించిన ఆలోచనవంటివేమి లేకుండా కేవలం వంటమనిషిగా మాత్రమే బతికే ఆడవాళ్ళను కూడా "వంటింటి కుందేళ్ల"తో పోలుస్తారు.

Tuesday, February 26, 2008

సాయాన్ని విస్మరించకండి...

"ఆపదలో అభయహస్తం అందించే మంచి మనుషులకు మనం ఇస్తున్న విలువ ఏమిటి? మనలొ స్వార్ధం పెరిగే కొద్దీ మనుషుల విలువలను చిన్నచూపు చూస్తూ వస్తున్నాం. మనలాగే మెటీరియలిస్టిక్‍గా స్నేహపూర్వక స్వభావం, సేవాతత్వం ఉన్నవారు ఆలోచించడం మొదలుపెడితే నిండా కష్టాల్లొ మునిగినా ఎవరి అండా లభించదు. అవును… ఎవరి గురించో ఆలోచించవలసిన అవసరం నాకేమిటీ?" అని ఈ రోజు మనం ఎంత లౌక్యంగా ఆలోచించడం మొదలుపెట్ట్టామో అంతే లౌక్యంగా అందరూ ఆలోచించగలరు. అయితే మనకీ ఎంతో కొంత చేతనైనంతా సాయం చేద్దామని తాపత్రయపడే వారికి ఉన్న ప్రధాన వృత్యాసం.. మనలో మానవత్వం లోపిస్తోంది. వారు భగవంతుడు మనిషి జన్మకంటూ ప్రసాదించిన ప్రేమ, అప్యాయతలు, సేవాతత్పరతలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మన మనసులు ఎంత నీచంగ తయారయ్యారంటే.. ఎవరైనా ఏదైనా సాయం చేస్తే దానికి కృతజ్ఞత చూపించకపోగా ’దానిదేముంది .. వారు కాకపోతే మరొకరు చేస్తారు’ అని ఆలోచించేటంతగా ! ఇది నిజంగా మన మానవత్వపు పార్ఘ్యాలను సమాధి చేస్త్తోంది. కష్టాల్లో
ఉన్నప్పుడూ ఆదుకున్న మంచి మనుషుల్ని మనసుల్ని మన అభిజాత్యంతో తిరస్కరించడం మొదలుపెడితే.. సామాజికంగా ఉన్నత శిఖరాలు ఎక్కగలమేమో గానీ మానసికంగా మన విజయాలను పంచుకోవడానికి, మన ఆనందాన్ని మరింత ఇనుమడింప జేసుకోవడానికి, మరోమారు కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలవడానికి ఏ ఆత్మీయుడూ అందుబాటులొ ఉండరు. కాబట్టి… అర్ధంపర్ధం లేని మెటీరియలిజం ఆలోచనలను స్వస్తి చెప్పి మనిషిగా పుట్టిన తర్వాత మనిషిగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం….


నల్లమోతు శ్రీధర్

Friday, February 22, 2008

గుంటూరు శేషేంద్రశర్మ - సాహిత్య విశ్లేషణ


ఒక అందమైన పోయెం అంటే
దానికి ఒక గుండె ఉండాలి
అది కన్నీళ్ళు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి…

ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సౌందర్యాత్మకత్వాన్ని కల్పించి,అటు సంప్రదాయాన్ని, ఇటు ప్రగతి శీలతనీ, అటు ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాన్నీ, ఇటు ఆధునిక కాలంలోని మార్క్సిజాన్ని కలగలిపి ఒక నూతన అపురూప సాహిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఒక మహత్ప్రయత్నాన్ని చేసిన కవి శేషేంద్రశర్మ. యాభైకి పైగా కవితలు పండించి రాసులుగా పోసినా ఆయనకు తీరని దాహమే. షోడశి వాల్మీకి రామయణంలోని సుందర కాండకు వినూత్న తాంత్రిక భాష్యం కూర్చారు. హర్షుని నైషధీయ చరితకు తాంత్రిక వ్యాఖ్యానం రాసారు. ఆయన జర్మనీ ఇండోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ ఆహ్వానం మీద వెళ్ళి "కాళిదాసు మేఘదూతానికి, వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధం" అనే సిద్ధాంత వ్యాసం సమర్పించారు. కాళిదాసు అకాడమీ వారి ఆహ్వానం పై "ఇద్దరు ఋషులు - ఒక కవి" అనే శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వానుబంధాల మీద పరిశోధన వ్యాసం సమర్పించారు. నాదేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేష జ్యోత్స్న, ఋతుఘోష, కాలరేఖ, కామోత్సవ్, ప్రేమలేఖలు, నా రాష్ట్రం- ఇవి ఆయన రచనలు కొన్నిమాత్రమే..


శేషేంద్ర పుట్టింది నాగరాజుపాడులో. పెరిగిన ఊరు తోటపల్లి,గూడూరు. తండ్రి గుంటూరు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, తల్లి అమ్మాయమ్మ. ఇద్దరూ చదువుకున్నవారే. ఎమ్.బి.బి.యెస్ చదవాలనుకుని బి.ఎ. చేసి లా చదువుతుండగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మునిసిపల్ కమీషనర్‍గా పని చేసాడు. జర్నలిజం మీద ఉన్న మక్కువతో లా చదువుతుండగానే తాపి ధర్మారావుగారి వద్ద కూడా పని చేసాడు. తొలిసారిగా అచ్చయిన రచన ఒక పాట విశాలాంధ్రలో ముద్రించబడింది.

"ఈ ప్రపంచం ఎక్కడున్నా సరే!
ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే!
మన బాధలూ ఒక్కటే,
ఎప్పుడూ మన గాధలూ ఒక్కటే…"

శేషేంద్రశర్మలో ఉన్న ఒక మంచి లక్షణం వినమ్రత. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్ళైనా ఎంతో మర్యాదగా, హుందాగా మాట్లాడి, వారిని ప్రోత్సహించి, అభినందించేవాడు. తనకంటే ముందున్న కవులను, తనకంటే జ్ఞాన సంపన్నులను గౌరవిస్తాడు ఆయన. వాళ్లు ఏ మార్గానికి చెందినవారైనా సరే. ఆయన ప్రాచ్యసాహిత్యాన్ని బాగా మధించినవాడు. భారతీయ అలంకారశాస్త్రానికున్న పరిమితులన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండిత లక్షణం శేషేంద్రలో ఉంది. సంస్కృత భాషా, సాహిత్య పరిజ్ఞానం తో బాటు పాశ్చాత్య సాహిత్యాన్ని, ఫ్రెంచి కవిత్వం మొదలు రకరకాల దేశ దేశాల కవిత్వాన్ని ఆయన లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాడు. అనేక భాషల్లొ మాట్లాడగలిగిన ప్రజ్ఞావిశేషం కూడా ఆయనకుంది. పాశ్చాత్య అలంకార లేదా విమర్శ గ్రంధాలకు సంబంధించి గ్రీకు విషాదాంత నాటకాలు దగ్గరనుండి రష్యన్ మార్క్సిస్టు భావజాలంతో నిండిన చాలా పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాల్మీకిని, ఉపనిషత్తుల్ని, కాళిదాసుని, గ్రీకు నాటకాల్ని, అరవిందుడిని క్షుణ్ణంగా పరిశీలించిన "కాలరేఖ" వ్యాసాలు అందుకు సాక్ష్యం. అలాగే కవిసేన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉదాహరణలు అలవోకగా ఇచ్చాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఇక కవిత్వంలో అందమైన ఆదర్శాలు..

ఏమని రాశేవు
నిన్ను గురించి ఓ శేషన్
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలో చేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించే పాత్ర
నీ రాత్రులు
అక్షరాల్లో పోసే ఘోష
ప్రజానీకాల అభివ్యక్తి హీనభాష
ఈ దేశపు మృత్తికలో చల్లావు నీ హృదయాల్ని
నీ రక్తనాళాలు తడుపుతున్నాయి కాగితాల తీరాల్ని
ఈ దేశం నీకిచ్చిన గాయం
నీకు మాత్రం తృణప్రాయం (ఆధునిక మహాభారతము)

ఆయన కవిత్వంలో ఏ చిత్రం(image) తీసుకున్నాఆశ్చర్యం కలిగిస్తుంది. "మహానగర కళేబరం బలుస్తోంది. మానవ పదార్థం మేశి" అంటాడు. పలకా పుస్తకాలు మోస్తున్న బలలు శిలువలు మోస్తున్న బాలక్రీస్తుల్లా కనిపిస్తారు ఆయనకు. ఒక ఆధ్యాత్మికమైన చిత్రాన్ని (spiritual image) తీసుకువచ్చి మామూలు వాస్తవిక జీవితంలోని విషయానికి అన్వయించి దాని ద్వారా గొప్ప భావాన్ని వ్యక్తీకరిస్తారు. ఒక రూపకం తీసుకొని దానిలోని మామూలు భావాన్ని తొలగించి, ప్రత్యేక భావనను దానిలో ప్రవేశ పెడతాడు శేషేంద్ర. ఉదా."సూర్యుడు సముద్రాల మీద వంగి నీళ్ళు తాగే గుర్రం" అనడంలో ఆయన ఊహాశక్తిని గమనించవచ్చు.

అంతేగాక శేషేంద్ర కవిత్వంలో ప్రజాస్వామిక భావజాలాన్ని చూడవచ్చు.సాయుధ పోరాటాన్ని సమర్ధించిన భావాలు కూడా ’ఆధునిక మహాభారతం’లో కనబడతాయి.

"అడవిలో నాకోసం మరణించిన
ఆ వీరుడికి
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి
నా గుండె వాడి మీద వేసిన గోపురం
నా అశ్రువులే వాడిమీద రాలుతున్న పూలు."

ఇలా ప్రాణత్యాగం చేస్తున్న వీరుల గురించి గానం చేసాడు.ఆయన రచనలలో "మాట చేసే మాయాజాలం" కొత్తగా కవిత్వం రాసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొట్టమొదటిసారి తెలుగు కవిత్వాన్ని చదవడం మొదలుపెట్టినవాడు ఈయన కవిత్వాన్ని చదివినట్లయితే మోహపరవశుడౌతాడు, ఉద్వేగపరవశుడౌతాడు, ఆవేశభరితుడౌతాడు.ఆయనే అన్నట్టు అక్కడ ’కవిత్వం ఒక మెస్మరిజం’. శేషేంద్ర ఎన్నెన్నో కొత్త కొత్త మాటలు (రస్తా,గొరిల్లా, మజాక్ లాంటి మాటలు) సంస్కృత పదాలు, దేశదేశాల భాషల్లోని పదబంధాలను, శబ్ద భావ చిత్రాలను, తెలుగు కవిత్వంలోకి తెచ్చాడు. అయితే వస్తువు - రూపం విరుద్ధమైన విషయాలే ఐనా ఒకటి లేకుండా మరొకటి ఉండదనేది ప్రాధమిక సూత్రం. ఒకదాన్ని మరొకటి చక్కగా ధీటుగా పోషించినప్పుడే అది ఉత్తమ కవిత్వమౌతుంది. కవితా వస్తువు గొప్పదైనంత మాత్రాన ఉత్తమ కవిత అవడానికి వీలు లేదు. కవిత్వంలో ఒక అధ్బుతమైన భావన(expression) ఉండడం వేరు, ఆచరణలొ దాని పద్ధతి వేరు. కనుకనే శేషేంద్ర విప్లవ కవిత్వం చదివినపుడు ఊగిపోతాం. కాని ఆచరణలో సాగిపోలేం.

"నేను జేబుల్లో కోకిలల్ని వేసుకురాలేదు
పిడికిళ్ళలొ బాంబులు బిగించుకుని వచ్చాను" (గొరిల్లా)

తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు నల్లగొండ కేంద్రంగా రాసిన పాట

"వరద వచ్చిందోయి వరద వచ్చింది !
గగన ఘంటాపదం కదలి వచ్చింది !
నిషధాచలం దాటి తుహినా చలం దాటి !
వసుధా తలం మీద బుసబుసలు విసురుతూ !
భంగ సంఘాలతో పాదమెట్టింది !
పాత కోటలు తాకి పగలగొట్టింది !
కొండ గోగుల కోన కుసుమించినా రీతి !
చిగురెండ వెల్లువలు చిందులాడిన రీతి !
నల్లగొండ మీద నాట్యమాడింది !
ఆంధ్రదేశాకాశమావరించింది !
వరద వచ్చిందోయి వరద వచ్చింది…"

కవిగా శేషేంద్ర ఎప్పుడూ పీడిత వర్గం వైపే నిలుచున్నాడు. ’ఋతుఘోష’ వంటి ప్రకృతి వర్ణన కవిత్వంలో కూడా

" చలిపులి వోలె దారుల
పచారులు చేయుచుండ
ఊరికావల పెనుమర్రి క్రింద
నెలవంకై దీపముగా పరున్న
పసిపాపలెవ్వరికి తప్పుదలంచిరి?
కాలమే హాలాహలమైపోయి ఆ
శిశువుల ఆకలితొ చలితొ నశింపగన్ !
ఎచట నుంటివి, నీవనలుంటివా
ప్రజా శాపములన్ భరించుటకు
సాధ్యముగాదని పాత పెత్తనంబు
ఈపై సాగబోదని ఎటేని పరారైనావా,
బాధలం బాపగలేవు నీవు శిలవా
కలవా సెలవీయుమో ప్రభూ ! : అంటూ సాగుతుంది.


ప్రాచీన కవిత్వానికి అలంకారికులు లేదా ఒకనాటి పండిత లేదా ఉన్నత వర్గాలకు చెందిన కవిత్వ పరిశీలకులు ఏ లక్ష్యమైతే నిర్దేశించారొ ఆ లక్ష్యం మనం శేషేంద్ర కవిత్వం చదివినప్పుడు నెరవేరుతుంది. అతని కవిత్వం చదివినా, వచనం చదివినా గొప్ప ఆహ్లాదం, ఆనందం కలుగుతుంది.తొలిదశలో ఆయన రాసిన పద్య కవిత చదివినట్లైతే ఆయనకున్న సంప్రదాయ విజ్ఞానం, భాషాపరిజ్ఞానం తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఆ పద్యాల్లో కూడా ఆధునిక భావాలు చక్కగా చెప్పాడు. ప్రజాస్వామ్య సమాజానికి ఉపయోగపడే రకరకాల భావనలు చెప్పాడు.

"శ్రమియించే శతకోటి మానవుల కాశాజ్యోతి లేదా? విష
క్రిమి బాధామయ కాళరాత్రికి ఉషశ్రీరేఖ లేదా…"


ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సిద్ధాంతాన్ని తయారు చేయడానికి శేషేంద్ర రాసిన "కవిసేన మేనిఫెస్టో " ప్రయత్నించింది. అందులో భారతీయ కావ్య శాస్త్ర పరంపర, అదే కాలంలొ గ్రీకు, రోమన్ సాహిత్యంలో వున్న శాస్త్ర పద్ధతి, పశ్చిమ దేశాల నుంచి దిగుమతైన ఆధునిక సాహిత్య విమర్శ., మార్క్సిస్టు దృక్పధం - ఈ నాలుగింటి సమన్వయమే కవిసేన మేనిఫెస్టో. సమాజానికి ఏ రాజకీయ నాయకత్వమైతే చాలా ప్రధానమని మనం అనుకుంటున్నామో, ఏ ఆర్ధిక శక్తులు దానికి ఇరుసుగా పనిచేస్తాయని అనుకుంటున్నామో , ఆ ఆర్ధిక శక్తులను అంగీకరిస్తూ రాజకీయ భావజాలాన్ని మాత్రం శేషేంద్ర శర్మ తిరస్కరించాడు. ఆధునిక సమాజాన్ని రక్షించడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు, రాజకీయ భావజాలం పనికిరాదని ఆయన తీర్మానించాడు. కవే దేశానికి అసలు నాయకుడు. కవిత్వమే కవి ఆయుధం. అతనికి వైజ్ఞానిక నాయకత్వం. ఇటువంటి నాయకత్వం కోసం దిక్కు దిక్కుల కవిసేనలు ఉదయించాలి. ఇవి శేషేంద్ర అభిప్రాయలు. ఇది ఒక ఊహాత్మక ప్రతిపాదన మాత్రమే . వాస్తవంలో కాదు. ఉద్యమాలకు దారితీసేవిగాని, విప్లవానికి దారితీసేవిగాని, మౌలికంగా కవుల యొక్క కవిత్వాలు కావు. కవిత్వానికి ఒక పరిమితి ఉంటుంది. కవులకు కూడా ఒక పరిమితి ఉంటుంది. "కవిసేన మేనిఫెస్టో"లో తన ప్రతిపాదనలకు బలంగా శేషేంద్ర ఈ దేశపు , ఇతర దేశాల సాహిత్య , సిద్ధాంతాలను నేపధ్యంలో ఉపయోగించుకున్నాడు. వాటిని ఆధునిక కవిత్వానికి అన్వయించడానికి ప్రయత్నం చేసాడు.

’కాలరేఖ" లో మంచి వ్యాసాలున్నాయి.ఆంధ్ర, సంస్కృత, ఉర్దూ, ఫ్రెంచి భాషల పాండిత్యం గల, ప్రాచ్య పాశ్చాత్య విమర్శ సిద్ధాంత అవగాహన గల శేషేంద్ర రచనల నుంచి ఈ తరం కవులు, విమర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

ఆయన రాసిన నవల ’కామోత్సవ్’. శృంగార ప్రధానమైనది . సంపన్న వర్గాలకు చెందినవారు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారొ తెలియజేయడానికే ఆయన ఆ నవల రాసాడు. వాళ్లకి దేశం మీద భక్తి ఉండదు. విశ్వాసం అసలే ఉండదు. అన్ని దేశాలు వారివే, ఏ దేశమైనా వారిదే, ఇక్కడి మనుష్యులతో సంబంధం లేనట్టే ప్రవర్తిస్తారు. ఇక్కడ ఇంతమంది తిండి లేకుండా ఉంటే వాళ్లకి పట్టదు. వారి సుఖాలు వారివే, కామాంధకారంలొ పడి కొట్టుమిట్టాడుతుంటారు. వీళ్ళు దేశానికి ప్రమాదకరం అని చెప్పడానికే ఆ నవల రాశానని ఆయనంటాడు. అందుకే అది చాలా గొడవలు సృష్టించింది.
సాహిత్యాన్ని భోగవస్తువుగా భావించే వెనకటి సంస్కృతిలోని సోకాల్డ్ ’రసికత్వమే’ శేషేంద్ర చేత ’కామోత్సవ్’ జరిపించింది. అది ఆధునిక ప్రజాస్వామిక(సాహిత్య) సంస్కృతికి విరుద్ధమైందని గొడవలు జరిగాయి.ఆయన "ముత్యాలముగ్గు" సినిమాలో గొప్ప పాట రాశారు. "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" కాని చిత్ర రంగంలోని కొందరు అసూయాపరుల కారణంగా ఆ దిశగా రాణించలేకపోయారు.

అయితే వైరుధ్యాలమయమే గుంటూరు శేషేంద్ర శర్మ సాహిత్యం. అటు సంప్రదాయం - ఇటు ఆధునికత, అటు పద్యం - ఇటు వచన కవిత, అటు శృంగారం - ఇటు అనురాగం, అటు రాజసం - ఇటు ప్రజాస్వభావం.ఇటువంటి వైరుధ్యల ఫలితంగానే సమాజంపై తనదైన ముద్ర వేసుకోలేకపోయినా, కవిత్వ ప్రేమికుల్ని, పోషకుల్ని ఆకర్షించగలిగారు. ఆయన తన 79 వ ఏట మే 30 రాత్రి హైద్రాబాదులో మరణించారు.

గత సంవత్సరం వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాల నుండి సేకరించినది. నా సొంతరచన అని భ్రమ పడకండి..

Friday, February 15, 2008

ముచ్చట్లాడుకుందామా !!!
కూడలి కబుర్లు

తెలుగు బ్లాగర్లందరికి ఒక ముఖ్యమైన సమాచారం. ముఖ్యంగా కొత్తగా వచ్చినవాళ్ళకి. బ్లాగర్లందరు తమకు వీలున్న సమయంలో బ్లాగు టపాలు రాసుకుంటారు, కూడలిలో చూసి వచ్చి చదివినవారు వ్యాఖ్యలు రాస్తే రాస్తారు లేకపోతే లేదు. కాని టపాలు రాయడంతో పాటు ఇతర బ్లాగర్లతో మాట్లాడాలని ఉందా?? ఐతే కూడలి కబుర్లలోకి రండి. ఇక్కడ అన్ని విషయాల గురించి చర్చించబడతాయి. ఎక్కువగా బ్లాగులు, టపాలు, వికి, మొదలైనవి.మీరు అందులో పాల్గొనవచ్చు.

ఐతే ఒక ముఖ్య గమనిక..

ఇది సరదా కోసమో, టైం పాస్ కోసమో ప్రారంభించబడిన చాట్ రూం కాదు. బ్లాగర్లకోసం వారి సమస్యలు, సలహాలు, చర్చల కోసమే ఏర్పాటు చేయబడింది. దీనిని దుర్వినియోగపరిచినవారిని, అసభ్యంగా ప్రవర్తించినవారిని హెచ్చరించకుండానే వారిని బహిష్కరించి, వారి I.P అడ్రస్సుతో సహా సైబర్ సెల్ కి కంప్లైంట్ ఇవ్వబడుతుంది. ఈ చాట్ రూమ్ నిర్వాహకులు అన్ని సమయాలలో , దానిని గమనిస్తూనే ఉంటారు. జాగ్రత్త మరి.

సానుభూతిని ఆశించడమంత ఎస్కేపిజం లేదు….

"అయ్యో పాపం తను మాత్రం ఏం చేయగలడు.." "పాపం, తన బ్రతుకు అలా
అయిపోయింది." అంటూ ఇతరులు కురిపించే సానుభూతి మాటల్ని ఆస్వాదించే
వ్యక్తి ఏ దశలోను పైకి రాలేడు. ఒక మనిషి కష్టాల్లొ ఉన్నప్పుడు మనసులో సంబర
పడుతూనే నాలికపై విపరీతమైన జాలిని ప్రదర్శించడం సమాజ సహజమైపోయింది.
పీకలలోతు ఊబిలో కూరుకుపోయినా గుండె నిబ్బరంతో పోరాడూతూ ఉండాలి తప్ప
కావాలని సానుభూతి వ్యక్తపరిచే వ్యక్తులకు దాసోహమైపోతే.. మన పోరాట పటిమని
మనం చేజేతులా చంపుకున్నట్టే అవుతుంది. అవును. ప్రతీ మనిషి జీవితంలోనూ
ఎత్తుపల్లాలు సహజమే! వాటికి నిలువెల్లా నీరుకారిపోవడం, ఎవరి వడిలొ తలపెట్టుకుని
ఏడుద్దామా అని వెంపర్లాడడం మానుకుని మానవ ప్రయత్నంగా ఆ స్థితి నుండి బయటకు
రావడానికి మనం చేయగలిగింది ప్రొడక్టివ్‍గా చేసుకుంటూ పోతే స్వల్పకాలంలోనే అన్నీ
చక్కబడతాయి. తను, తనపై తనకు గల నమ్మకానికి విలువ ఇవ్వని వ్యక్తి అంతర్గతంగా
తనలొ శక్తి సామర్ధ్యాలు ఉన్నా వ్యతిరేక పరిస్థితుల్లో నెట్టుకురాలేడు. శక్తిని మరిచి "ఇంకా
కోలుకోవడం మనవల్లేం అవుతుంది.". అనుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా
కరిగిపోతుంది. పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. అప్పుడు కర్తవ్యం గుర్తెరిగి జీవితం
నావను రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించినా పూర్వపు వైభవస్థితికి రాలేనంతగా పాడై ఉంటుంది…నల్లమోతు శ్రీధర్

పుణుకులు

1.

రాజు దగ్గర ఒక చిలుక ఉంది కాని అది ఎప్పుడు మంచి మాటలు మాట్లాడదు. అన్నీ పోకిరి మాటలే.ఒక రోజు రాజు వాళ్ళ బాస్ ని భోజనానికి పిలిచాడు. ఈ చిలుక మాటలు బాస్‌కి కోపమొస్తుందని, తన స్నేహితుడు శర్మ దగ్గరున్న రెండు చిలుకలు తీసుకొద్దామని వెళ్ళాడు. ఆ చిలుకలు ఎంచక్కా సూక్తులు, భక్తి గీతాలు పాడుతూ ఉంటాయి. ఆ చిలుకలున్న పంజరం తెచ్చి తన ఇంట్లో చిలుక ఉన్న పంజరం పక్కనే పెట్టాడు. అప్పుడు ఆ రెండు చిలకలు అనుకున్నాయి : మనము ఇప్పటికి సరైన చోటికి వచ్చాము. ఇక భక్తిగీతాలు, సూక్తులు పాడవలసిన పని లేదు" ఎందుకలా అన్నాయి. ఎందుకంటే రాజు దగ్గరున్నది ఆడ చిలుక, ఆ వచ్చినవి రెండు మగచిలుకలు. అదీ సంగతి.

2.

కిషోర్ తన మిత్రుడు రమేష్ ఇంటికి వచ్చాడు.

" ఏంట్రా రమేష్! అలా దిగాలుగా కూర్చున్నావ్?"

" ఏం చేయనురా? నాకో పెద్ద చిక్కొచ్చి పడింది"

" నీకేంట్రా? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడివి. హాయిగా ఉండక"

" అక్కడే వచ్చింది చిక్కంతా. ఒకరు వెజిటేరియన్, మరొకరు నాన్ వెజిటేరియన్."

" ఇంకేంటి మరి హాయిగా ఎంజాయ్ చేయక"

" ఎంజాయా! పాడా! రోజు ఒకరికి వెజ్, మరొకరికి నాన్ వెజ్ వంటలు చేయలేక చచ్చిపోతున్నాను "

3.

మనకు ఎన్నో పండగలు ఉన్నాయి. దసరాకి కొత్త బట్టలు, దీపావళికి టపాసులు, ఉగాదికి పచ్చడి, బొబ్బట్లు, సంక్రాంతికి అరిసెలు , చక్కిలాలు అలా. కాని ఒక పండగ మాత్రం తాళం చెవులకు సంబంధించింది. అదేంటి???

Tuesday, February 12, 2008

ఏడువారాల నగలు ..

పూర్వం రాజకుటుంబానికి చెందిన , మిక్కిలి ధనవంతులైన స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. అవి వారి ఆడంబర ప్రదర్శనకు, గ్రహాల అనుగ్రహమునకు సరిపోయే విధంగా చేయించుకునేవారు. అంటే రోజు కొక గ్రహాన్ననుసరించి ఒకో రకమైన రత్నాభరణాలు ధరించేవారు . వివిధ ఆభరణాలలో జాతి రత్నాలు పరీక్షించి మరీ పొదిగి అద్భుతమైన నగలు తయారు చేసేవారు .అనంతరం నియమ నిష్టలతో పూజలు జరిపి వాటిని శక్తిమంతం చేసి రోజుకో నగ ధరించేవారు. వారంలో ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా చెప్పబడుతుంది. ఆ రోజు ఆ గ్రహానికి సంబంధించిన జాతిరత్నాలతో చేసిన ఆభరణములు ధరిస్తే శుభప్రదం అని అనాదిగా నమ్ముతున్నారు .
రవివారం
ఆదివారం నాడు అధిపతి సూర్యుడు. ఈ రోజు సూర్యుని రంగులో ఉండే కెంపులు పొదిగిన ఆభరణాలు ధరించి , లేత ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించి, తమ కుటుంబమును రక్షించమని సూర్యదేవుని ప్రార్ధిస్తారుసోమవారం
సోమవారం నాడు అధిపతి చంద్రుడు. ఈ రోజు చంద్రుడి రంగులో ఉండే ముత్యాలు పొదిగిన ఆభరణములు ధరించి చంద్రవర్ణంలో (తెలుపు) ఉండే దుస్తులు ధరించి మానసిక ఆరోగ్యాన్ని, ప్రశాంత జీవనాన్ని కలిగించమని చంద్రుణ్ణి ప్రార్ధిస్తారు.మంగళవారం
మంగళవారం నాడు అధిపతి అంగారకుడు . ఈ రోజు స్త్రీలు అంగారకుని రంగులో ఉండే పగడపు రంగు వస్త్రాలు ధరించి పగడాలతో చేసిన ఆభరణములతో అలంకరించుకుని శక్తిని ,సౌఖ్యాన్ని ప్రసాదించి , రుణబాధలు లేకుండా చేయమని కుజుడిని ప్రార్దిస్తారు.బుధవారం
బుధవారం నాడు అధిపతి బుధుడు . ఈ రోజు స్త్రీలు ఆకుపచ్చగా, బుధుడి రంగులో ఉండే ఆకుపచ్చని దుస్తులు ధరించి మరకతం ( పచ్చలు)తో చేసిన ఆభరణములు ధరించి మేధోశక్తిని పెంపొందించి, బుద్ధిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇవ్వమని బుధుడిని వేడుకుంటారు .గురువారం
గురువారం నాడు అధిపతి గురువు. అతని రంగులో ఉండే లేత పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి కనక పుష్యరాగాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్త్రీలు సంపద, సచ్చీలం పెంపొందాలని గురుడిని ప్రార్దిస్తారు.శుక్రవారం
శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు . ఇతని అనుగ్రహం కోసం తెల్లని రంగులో ఉండే దుస్తులు ధరించి తెల్లని వజ్రాలు పొదిగిన ఆభరణములు ధరించిన స్త్రీలు తమ కుటుంబ జీవనం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని , దాంపత్యం కలకాలం సుఖశాంతులతో వర్దిల్లాలని శుక్రుడిని ప్రార్దిస్తారు .శనివారం
శనివారం నాడు అధిపతి శని . అతడి శరీరవర్ణమైన నీలం రంగు దుస్తులు ధరించి , నీలంతో చేసిన ఆభరణములు ధరించి తమకు పీడలు , బాధలు లేకుండా చేయమని శనీశ్వరుడిని ప్రార్దిస్తారు.

స్త్రీలు ఇలా గ్రహాలకు సంబంధించిన పూజలు చేసి, తదనుసార జాతి రత్నాభరణములు ధరించడంలో ఆంతర్యం కుటుంబ శ్రేయస్సు మాత్రమే. మనం ధరించే నవరత్నాలు సహజసిద్ధమైనవి ఐతేనే మనకు సరియైన ఫలితం చెకూరుతుంది . ఏడు వారాల నగల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతిష నిపుణులు , రత్న శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నమ్మకమైన దుకాణములో కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం.

కనీసం ఆరు గ్రహాల స్థితైనా తమ జాతకంలో బావున్నవారు మాత్రమే ఇలా ఏడు రకాల రత్నాలతో ఆభరణాలు తయారుచేయించుకుని ధరించవచ్చు.అలా కాని పక్షంలో మనం కోరుకునే శాంతిసౌభాగ్యాల్ని అవి ప్రసాదించలేకపోవచ్చు. ఉదాహరణకు తమ జాతకంలో కుజస్థితి బాగాలేని స్త్రీలు పగడాలు పొదిగిన నగలు ధరించడం వల్ల వారి భర్తలకు అరిష్టం. లేదా భూమి తగాదాలూ, ఋతుబాధలూ తీవ్రతరమౌతాయి. అలాగే శుక్రుడు యోగించని స్త్రీలు వజ్రాభరణాలు ధరించడం వల్ల దాంపత్యసౌఖ్యలోపం, వ్యభిచార భావాలు, భర్తతో గొడవలు, విడాకులు, సాటి స్త్రీల మూలంగా అశాంతి, వాహనప్రమాదాలు, పొట్టలో ఇబ్బందులు సంప్రాప్తమౌతాయి. జాతకంలో సరిపడని గ్రహాల రత్నాలని ఉంగరంలో పొదిగించి ధరించే పురుషులకు సైతం ఇదే ఫలితం.

Monday, February 11, 2008

అమర గాయకుడికి శ్రద్ధాంజలి

అల్లంత ఆ పైలోకాన దేవతలను తన గానంతో పరవశులను చేయుటకు నింగికేగిన ఘంటసాల గారికి మనఃపూర్వక శ్రద్ధాంజలిపోలీసెంకటసామి

అత్తలేని కోడలుత్తమురాలు

కుంతీ విలాపం

పుష్పవిలాపం

Saturday, February 9, 2008

చేయి చేయి కలుపుదాం...
కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ వీవెన్ తో కలిసి ఒక మహత్తర ఆశయంతో మొదలు పెట్టిన సాంకేతిక సహాయం అనే చాట్ రూమ్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కంప్యూటర్ ఎరా ఛాట్ రూమ్ ద్వారా దాదాపు అందరం తెలుగులోనే టైప్ చేస్తూ మొదటి నుండి కొత్తగా వచ్చేవాళ్లకు అసలు తెలుగులో టైప్ ఎలా సాధ్యం అనే క్యూరియాసిటీ కలిగేలా జాగ్రత్తపడుతున్నాం. ఇంటర్నెట్ వాడుతున్న చాలా మందికి తెలుగులో ఇంత సులువుగా అదీ డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు అనే విషయం తెలీదు. ఈ సాంకేతిక సహాయం ద్వారా ఇంతవరకు ఎంతో మంది , ముఖ్యంగా కంప్యూటర్ ఎరా పాఠకులు ఈ విషయం తెలుసుకుని, నేర్చుకున్నారు. తమ మాతృభాషలో అలా సులువుగా రాసుకుంటూ ఎంత సంతోషిస్తున్నారో !!!

నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ చాట్ రూమ్‍లో ఇప్పటి వరకు ఎన్నో సాంకేతిక సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఇందులో చాలావరకు టీమ్ వ్యూయర్ సాధనంతో పరిష్కరించబడినవే. ఇందులో , సహాయం చేసేవారు ఆ సమస్య పరిష్కరించడం వరకే ఆలోచిస్తారు కాని మిగతా వివరాలు వారికి అక్కరలేదు. ,తమ స్వకార్యములలో బిజీగా ఉన్నా కూడా అందరు నిస్వార్ధంగా సహాయం చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ వచ్చారు.

దానికితోడు ఈనాడు ఆదివారంలో వచ్చిన వ్యాసంలో ఇచ్చిన ఛాట్ రూమ్ అడ్రస్ కు వచ్చిన దాదాపు ఓ 200 మందికి పైగానే తెలుగు టైపింగ్ ఎలాగో నేర్పే లింకులు అందించాం. వారిలో 25% పైగా తెలుగు నేర్చుకుని వాడుతున్నారు కూడా! కొంతమందికి బ్రౌజర్ లో తెలుగు సరిగ్గా డిస్ ప్లే అవకపోవడం వంటి సమస్యలు పరిష్కరించాం. సిస్టమ్ సమస్యలు, వైరస్ లు, జావా, సి వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డౌట్లు, ఎక్సెల్ టెక్నిక్స్, ఆసక్తికరమైన వెబ్ సైట్లు వంటివి ఎన్నో ఈ ఛాట్ రూమ్ ద్వారా డిస్కస్ చేయడం జరిగింది. విజిటర్స్ కి ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా ముఖ్యమైన వాలంటీర్లం టైమ్ షెడ్యూల్ షిఫ్టులు వేసుకుని మరీ స్పెండ్ చేయడం జరుగుతోంది. అలాగే కొత్తగా వచ్చేవారిలో బాగా ఔత్సాహికులను గుర్తించి వారిని మోటివేట్ చేయడం ద్వారా ఇంతవరకూ దాదాపు 25 మంది వరకూ తక్షణ సహాయంకు ఏదో సమయంలో డెడికేటెడ్ గా కంట్రిబ్యూట్ చేసే టీమ్ తయారైంది. ఈ ప్రధాన సభ్యులందరితోనూ తరచూ టచ్ లో ఉంటూ మరింత ప్రొడక్టివ్ గా దీనిని డెవలప్ చేయడానికి అందరి ఆలోచనలు, సూచనలు సేకరిస్తూ సరైన, స్థిరమైన ప్రణాళికను రూపొందించాలన్నది ఆలోచన. అలాగే ఈ ప్రాజెక్టులో ఇంతవరకూ జ్యోతి, ప్రసాద్, వీవెన్, శ్రీధర్, శ్రీనివాస్ కర, సాయి పోతూరి, మౌర్య, మురళీ, గిరిచంద్, రామచంద్రరావు, రాము, నాగశివ, జాకబ్, రవీంద్ర కాట్రగడ్డ, జీవి, మొయిన్, సలీంభాషా, చైతన్య, రాము, రామ్ యనమల, వినయ్, రాజ్ కిరణ్ (అమెరికా), జాహ్నవి (వైజాగ్), సరిత (అమెరికా), రఘునాధ్ (రిటైర్డ్ జడ్జ్ అమెరికా), శ్రీను (పర్చూరు), భరత్, రాధిక (కువైట్), శాస్ర్తి (హైదరాబాద్), అభిరామ్ వంటి అనేకమంది చాలా డెడికేటెడ్ గా కమిట్ మెంట్ తో వర్క్ చేస్తున్నారు. వీరిలో తెలుగు బ్లాగర్లు, కంప్యూటర్ ఎరా పాఠకులు కాక కొత్తగా వచ్చినవారు కూడా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు.

ఈ ప్రాజెక్ట్ పై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తెలియజేయగలరు.

Friday, February 8, 2008

గత స్మృతుల (టపాల) పసందైన విందు...

ఏడాదిన్నరగా రాస్తున్న బ్లాగులో నాకు నచ్చిన కొన్ని ముఖ్య టపాలు,


1.
సెల్ ఫోన్ వ్రతం.
2.
వారెవ్వా క్యా సినిమా హై
3.
అనుబంధం
4.
అదే మరి మండుద్ది
5.
శ్రీవారి అలవాట్లు
6.
ఆడపిల్ల
7.
భార్య మనోవేదన
8.
కలసి ఉంటే కలదు సుఖం
9.
ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు
10.
నమస్తే అన్న
11.
పడ్డానండి ప్రేమలో మరి

12.
కనపడుటలేదు -2
13.
కనపడుట లేదు - 1

14.
నేర్చుకుంటారా
15.
హాస్య పుణుకులు
16.
ఏడుగురు పెళ్ళాలు
17.
శతశతమానం భవతి
18.
అంకెలతో పద్య సంకెలలు
19.
గ్యాస్ కొట్టండి
20.
మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు

21.
ధైర్యం
22.
ఏది సులభం
23.
శుభవార్త
25.
యదార్థ గాధ
26.
HAPPY BIRTHDAY JYOTHI
27.
సరూప ముచ్చట్లు
28.
పెళ్ళైనవారికి మాత్రమే
29.
టైమ్ మెషీన్
30.
శ్రీ శ్రీ శ్రీ మర్యాదరమణ
31.
ఇది అవసరమా
32.
చీరల సరాగాలు
33.
ఆక్షరాలతో అల్లరి
34.
500
35.
అదేంటోగాని
36.
బ్లాగ్భాధితుల సంఘం
37.
బ్లాగ్ వార్తలు
38.
ఏడుపుగొట్టు పద్యం
39.
స్నేహం
40.
బ్రేవ్

41.
ఆటాడుకుందామా
42.
నాకు నచ్చిన పాట
43.
పుట్టినరోజు పండగే అందరికి
44.
పుట్టినరోజు బహుమతులు
45.
శ్రీనాధుని చాటువులు
46.
పాపం మగవాడు
47.
షడ్రుచుల సాహిత్యం
48.
ఆహారపద్యాలు
49.
సంక్రాంతి సంబరాలు
50.
ఆంధ్రాంగ్ల పద్యాలు

బ్లాగు సమీక్ష - ఆహ్వానం

సెప్టెంబరులో కంప్యూటర్ ఎరా సాంకేతిక మాస పత్రికలో ఇంటర్నెట్‌లో తెలుగు వెలుగులు అనే వ్యాసం తర్వాత నవంబరు నుండి ప్రతి నెల ఒక బ్లాగు సమీక్ష ప్రచురించబడుతుంది. మొదటి సమీక్ష కొత్తపాళిగారిది చూసారుగా. అలాగే ప్రతీనెల ఒక బ్లాగు సమీక్ష రాయడానికి అందరికి ఇదే ఆహ్వానం. మీకు నచ్చిన బ్లాగు/బ్లాగులు గురించి వివరంగా కనీసం రెండు పేజీలు రాయండి. ఎలా రాయాలో ఈ సమీక్ష చూసి తెలుసుకోండి. ఇది రాయడానికి కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడాలు లేవు. ఎవరైనా రాయొచ్చు. మీరు బ్లాగరు కాకున్నా సరే. సమీక్ష రాయగలము అనుకుంటే ఆ బ్లాగు టపాలన్ని చదివి సవివరంగా రాయండి. మీరు రాసిన సమీక్షను నాకు పంపండి. అందులో దిద్దుబాట్లు ఉంటే సరిచేసి కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ కు పంపిస్తాను. త్వరపడండి మరి..
నా చిరునామా. :- jyothivalaboju@gmail.com

శుభవార్త : బ్లాగర్ల అసంతృప్తి గమనించి , వచ్చే నెల నుండి బ్లాగు సమీక్షకు పుల్ పేజి ఇవ్వడానికి నల్లమోతు శ్రీదర్ ఒప్పుకున్నారు. సో మిని సమీక్ష కాకుండా పూర్తి సమీక్ష రాయండి. వర్డ్ లో కనీసం మూడుపేజీలు ఇవ్వాలి, పత్రికలో ఒక పుల్ పేజీ కావాలాంటే...


సమీక్ష ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై సూచనలు/సలహాలు :


1. బ్లాగరు వివరాలు : బ్లాగరు ఏయే వివరాలు (వ్యక్తిగత, ఉద్యోగ, వివాహ, ఆసక్తి/ఆభిరుచి మొదలగు) అయితే ఇతరులతో పంచుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ .... సమీక్ష వ్రాయబోయే ముందు ఒకసారి వారినే అడిగి చూడవచ్చు ... అలాగే ఒక వేళ బ్లాగరు Profile (About Page) లో ఎక్కువ సమాచారం ఉంటే ఆ లంకె కూడా ఇవ్వటం మంచిది.

2. ఎన్ని బ్లాగులు ఉన్నాయి .. వాటి పేర్లు, లంకెలు ... టపాల సంఖ్య .. చివరి టపా వ్రాసినది ఎప్పుడు ... సగటున నెలకు మరియు ఎన్నిరోజులకు ఒక టపా వ్రాస్తున్నారు .. ముఖ్యంగా ఈ బ్లాగు గురించి ఒకటో, రెండో వాక్యాలు ... ఒకవేళ కాప్శన్ వివరంగా ఉంటే లేదా వివరణకు సరిపోతుందు అనుకుంటే అదే వాడుకోవచ్చు.

3. ఈ బ్లాగరుకు ఉన్న అన్ని బ్లాగులు, అందులొ వ్రాసిన టపాలను బట్టి మరియు తను వివిదా బ్లాగుల్లో వ్రాసే/వ్రాసిన వ్యాఖ్యలను బట్టి, తనకు ఏ విషయాలపై మక్కువ/అవగాహన/ఉత్సాహం ఉంది....ఆయా విషయాలపై తనకున్న పట్టును ఎంత బాగా వ్యక్తీకరించ గలుగుతున్నారు ... అలా అనిపించిన టపాలు ఏవైనా ఉంటే వాటి లంకెలు....

4. ఈ సమీక్షకునికి ఆ బ్లాగరు యొక్క అన్ని బ్లాగులలో నచ్చినవి(మచ్చుకి) కొన్ని టపాలు, వాటి లంకెలు ... అలాగే ఎక్కువ వ్యాఖ్యలు వచ్చిన టపాలు, ఆ బ్లాగరుకు నచ్చిన లేదా కొత్త/పాత పాఠకులకు పరిచయం చేయాలి అనుకునే టపాలు

5. ఒకవేళ ముందుగానే ఫలానా బ్లాగు వచ్చే నెలలో రివ్యూ చేస్తున్నాము అని చెప్పవచ్చు అనుకుంటే, దీనికి ఒక చిన్న టపా వ్రాసి, పాఠకుల నుంచి వారికి నచ్చిన లంకెలు పొందవచ్చు. లేదా సమీక్ష వ్రాసిన తరువాత అయినా, ప్రతి పాఠకుడినీ వారికి నచ్చిన టపాలు, వ్యాఖ్యలు అడిగి తెలుసుకొని వాటిని ఆ సమీక్షలో పొందుపరచాలి (అలాగని ప్రతి రోజూ లేక ప్రతి పాఠకుడి వ్యాఖ్య తరువాత కాదు .. ఒక వారం పది రోజుల తరువాత అంటే ఈ సమీక్షకు పాఠకుల తాకిడి తగ్గింది, ఇక వ్యాఖ్యలు రాకపోవచ్చు
అనుకున్నప్పుడు)


6. సమీక్ష లో చెప్పిన విషయానికి సంబంధించి ఎన్ని లంకె లు ఇవ్వగలిగితే అంత సులభంగా ఆ బ్లాగరు, బ్లాగులు, టపాలు కొత్త/పాత పాఠకులకు చేరువకాగలుగుతుంది. ఈ చేరువచేయటం తద్వారా సరికొత్త చేయటం అనేది ఈ సమీక్షల ముఖ్యమైన ఉద్దేశ్యాలలో ఒకటి కావాలి.

7. దయచేసి మినీ సమీక్షలు లేదా ఒక పది, పదిహేను వాక్యాలు వ్రాయటం లేద వ్రాయాలి కాబట్టి వ్రాయటం లేదా అసంపూర్ణంగా వద్దు ... మొదటికారణం ఏమిటి అంటే భ్లాగర్లు కొంచెం ఎక్కువగానే ఉన్నారు...నెలకు ఒకటో రెండో తీసుకున్నా తిరిగి మరలా అదే బ్లాగు సమీక్షకు అవకాశం/సమయం చాలకపోవచ్చు. ఇంకొక కారణం ఏమిటి అంటే, చదివే పాఠకునికి, ఈ సమీక్ష వ్రాసిన గుండెలోతుల్లోనుంచి, మనసు పెట్టి, తన భావాభిమానోత్సాహపానందాభిప్రాయాలను ఇక్కడ అక్షర రూపం ఇచ్చారు అనిపించేలా ఉండాళి.

8. ముఖ్యంగా చేయవలసింది ఇంకొకటి ఏమిటి అంటే ... ఆ బ్లాగరు యొక్క టపాలలో చాలా అరుదుగా క(వి)నిపించేవి ఏవైనా ఉన్నాయేమో పరిశీలించి వాటిని వెలుగులోకి తీసుకురావటం .. ఉదాహరణకు : అరుద్దైన చిత్రాలు, సేకరణలైనా ఫర్వాలేదు, “కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి మరియు రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ గారి స్వరంలో

9. సమీక్ష ఎప్పుడూ ఒక క్రమపధ్ధతిలో, ఒక ప్రవాహం లాగా ఉండాలి అంతే గానీ ఎగుడు దిగుడుగా అంటే రెమ్డు వాక్యాలు వ్రాయటమ్ వెంటనే వేరే విషమ్యంలోకి దూకెయ్యటమ్ మరలా కొంత సేపు తర్వాత ఇంతకు ముందు చెప్పిన విషయంలోకి వెళ్లకుండా చూడాలి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఈ సమీక్ష అనబడే మల్లెదండలో, ఇలా వ్రాసే క్రమం అనే దారం లాంటి ప్రయత్నం, ఆయా బ్లాగుల్లోని విర(సన్న)జాజులు లాంటి టపాలను, అక్కడక్క చటుక్కున మెరిసే కనకాంబరాల వంటి వైవిధ్యమైన మరి కొన్ని టపాలను, తక్కువగా వాడే/కనిపించే/పరిమళించే మరువం లా మీ మాటల కూర్పూ/చేర్పు ఉండేలా చూసుకోవాలి.

Thursday, February 7, 2008

మన తెలుగు - వెబ్‍లో బహు బాగు..

గత ఆదివారం ఈనాడులో వచ్చిన వ్యాసం యొక్క చిత్రాలు ఇవి..
శ్రీనివాస్ కర గారు పంపినవి...
ప్రతి చిత్రంపై క్లిక్ చేసి పెద్దగా చూడొచ్చు...

1.


2.


3.


4.


5.

Wednesday, February 6, 2008

షష్టి పూర్తీ మహోత్సవ శుభాకాంక్షలు


చీమకుర్తి భాస్కర్‍రావు గారికి (cbrao) 60 వ జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిత్యయవ్వనులై ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ....

Tuesday, February 5, 2008

వివాహ మహోత్సవ శుభాకాంక్షలుడా.ఇస్మాయిల్ సుధలకు తొమ్మిదవ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

శ్రేయ, సుహాస్ లకు కూడా ఆశీర్వాదాలు..

Monday, February 4, 2008

ఆహ్వానం !!!!

ముందుగా తెలుగు బ్లాగర్లందరికీ అభినందనలు.

సెప్టెంబరులో కంప్యూటర్ ఎరా సాంకేతిక మాస పత్రికలో ఇంటర్నెట్‌లో తెలుగు వెలుగులు అనే వ్యాసం తర్వాత నవంబరు నుండి ప్రతి నెల ఒక బ్లాగు సమీక్ష ప్రచురించబడుతుంది. మొదటి సమీక్ష కొత్తపాళిగారిది చూసారుగా. అలాగే ప్రతీనెల ఒక బ్లాగు సమీక్ష రాయడానికి అందరికి ఇదే ఆహ్వానం. మీకు నచ్చిన బ్లాగు/బ్లాగులు గురించి వివరంగా కనీసం రెండు పేజీలు రాయండి. ఎలా రాయాలో ఈ సమీక్ష చూసి తెలుసుకోండి. ఇది రాయడానికి కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడాలు లేవు. ఎవరైనా రాయొచ్చు. మీరు బ్లాగరు కాకున్నా సరే. సమీక్ష రాయగలము అనుకుంటే ఆ బ్లాగు టపాలన్ని చదివి సవివరంగా రాయండి. మీరు రాసిన సమీక్షను నాకు పంపండి. అందులో దిద్దుబాట్లు ఉంటే సరిచేసి కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ కు పంపిస్తాను. త్వరపడండి మరి..
నా చిరునామా. :- jyothivalaboju@gmail.com


ఇంకో ఆహ్వానం..

నిన్నటి ఈనాడు వ్యాసం లో అందరికి వికీ గురించి వివరాలు తెలిసాయి కదా. తెలుగు బ్లాగులు రాసేవాళ్ళు కూడా ఒక అడుగు అటువైపు వేయండి. మీరు రాసే బ్లాగులు మీకోసమే . అందులో వచ్చే మెప్పులు, కామెంట్లు మీవరకే పరిమితమై ఉంటాయి. పైగా ఈ మధ్య బ్లాగుల ఎక్కువై వాటిని చదవడంలనే అందరికీ ఓపిక తగ్గి ఎక్కువ వ్యాఖ్యలు రాయడం లేదు. బాధ కలుగుతుంది. కాని ఏం చెయ్యగలం? సో మీరు బ్లాగులకు రాసే సమయాన్నే కొంచం పక్కన పెట్టి కనీసం వారానికొకసారైనా , వారానికొక గంటైనా వికిలో రాయండి.ఈ వికీలో ఏం రాయాలి , ఎలా రాయాలి అనే సందేహాలుంటే వికీ గుంపులో చేరి అడగండి. బ్లాగు గుంపులోలాగానే ఇక్కడ కూడా మీకు చేయిపట్టి ఎలా రాయాలో, ఏమి రాయాలో చూపించడానికి సభ్యులు సిద్ధంగా ఉంటారు.

మీకు ఎలాంటీ సందేహమైనా, సలహా ఐనా, సహాయమైనా కావాలనుకుంటే కూడలి కబుర్లలోకి రండి. అక్కడెవరూ లేకపోతే సాంకేతిక సహాయానికి రండి. ఎవరో ఒకరు మీకు చేయందిస్తారు.

ఇదీ పోలిక అంటే … !

విచిత్రమేమిటో కాని ఒక విజయం లభిస్తే.. ఆ విజయం అందించే మాధుర్యం కన్నా విఫలమైన వారితో పోల్చుకోవడం ద్వారా పొందే ఆనందమే ఎక్కువ ఉంటుంది మనకు. ఏదైనా వైఫల్యం ఎదురైనా అంతే.. వైఫల్యం చిన్నదే అయినా ఇతరులతో పోల్చుకుని కుళ్ళి కుళ్ళి దుఖపడితే కానీ ఊరట పొందదు మనసు ! ప్రతీ దానికీ ఇతరులతొ పోల్చుకోవడం ద్వారా భావోద్వేగాలను ఒంటరిగా ఆస్వాదించగలిగిన ధైర్యం, అదృష్టం చాలామంది కోల్పోతుంటారు. దాంతో అసలైన సంఘటన మిగిల్చిన అనుభూతులు చెరిగిప్యి పోల్చుకోవడం ద్వారా
మనసులో పాతుకుపోయే సంకుచిత భావాలు ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఇవి క్రమేపీ మన వ్యక్తిత్వాన్ని పతనం చేస్త్తుంటాయి. ఏ ఒడిదుడుకులూ లేనంత కాలం "నేనే రాజుని" అంటుంది మన బుద్ధి. చూసే చూపులోనూ, నడిచే నడకలొనూ, మాటలోనూ మిడిసిపాటు కవర్ చేసుకున్నా కానవస్తూనే ఉంటుంది. ఎవర్నీ లెక్కచేయం ! మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లు పురుగుల కన్నా హీనంగా కన్పిస్తుంటారు. కన్పించిన ప్రతీ వాళ్లకీ వెధవ సలహాలు ఇవ్వడమే.. ఏదో కారణ జన్ములమైనట్లు ! అంతలొ అనుభవించిన భోగాలు చాలు కానీ కాస్త ఈ హాట్ రుచి కూడా రుచి చూడు నరుడా" అంటూ కొన్ని కష్టాలు మనపై కుమ్మరిస్తాడు భగవంతుడు. కష్టం అలా తలుపు తట్టిందో లేదొ "చూశావా కొద్దిగా జాగ్రత్తగా ఉండమంటే ఉన్నావా, చూడు ఇపుడు ఏం జరిగిందో" అంటూ బుద్ధి తన తప్పేమీ లేనట్లు మనల్ని నిందించడం మొదలు పెడుతుంది.

అంతటితో ఆగకుండా" అయినా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని కష్టాలన్నీ నీకే రావాలా..? ఆ ప్రక్కనున్న సుబ్బారావుని చూడూ , ఎలా హాయిగా ఉన్నాడో ! నువ్వే ఇలా పడి ఏడవాల్సి వస్తోంది. ఇక నీ జన్మ వ్యర్ధం. ఏ హుస్సేన్ సాగర్‍లో పడి చావరాదూ" అంటూ నిరంతరం మనసుతో యుద్ధం చేస్తుంటుంది తప్పుడు బుద్ధి. ఇలా డ్రామా వేషగాళ్ళ మాదిరిగా లోపల కష్టాలు దాచుకుని పైకి నవ్వుతూ కన్పించే ప్రతీ ఒక్కరినీ వారెంతో ఆనందంతొ ఉన్నారని నిరంతరం పోల్చుకుంటూ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది అదే బుద్ధి. ఇలా కష్టాల్లొ ఉన్నప్పుడు సుఖాలు అనుభవిస్తున్న వారితో పోల్చుకుంటూ చివరకు మనం రెండింటినీ సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞతని కోల్పోతాం. ఒక్కసారి కష్టాల్లొ ఉన్నప్పుడు మనకన్నా పీకల్లోతు కష్టాల్లొ ఉన్నవారిని తలుచుకోండి. ఎంత మెరుగైన స్థితిలో ఉన్నామన్న ధైర్యం కలుగుతుందో ? అదే సుఖాలనుభవించేటప్పుడు మనకంటే కోట్ల రెట్లు ఉన్నతంగా ఉన్న ఏ బిల్‍గేట్స్ తోనో పోల్చి చూడండి. కనీసం మనం సాధించింది అణుమాత్రమైనా ఉందేమో అర్ధమవుతుంది. మీ విజయాలను, వైఫల్యాలను ఇతరులతో పోల్చుకోనిదే నిద్రపట్టనపుడు ఆ పోల్చుకునే విధానాన్నయినా ఇలా పాజిటివ్‍గా చేయండి !.

నల్లమోతు శ్రీధర్.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008