Saturday 9 February 2008

చేయి చేయి కలుపుదాం...




కంప్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ వీవెన్ తో కలిసి ఒక మహత్తర ఆశయంతో మొదలు పెట్టిన సాంకేతిక సహాయం అనే చాట్ రూమ్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. కంప్యూటర్ ఎరా ఛాట్ రూమ్ ద్వారా దాదాపు అందరం తెలుగులోనే టైప్ చేస్తూ మొదటి నుండి కొత్తగా వచ్చేవాళ్లకు అసలు తెలుగులో టైప్ ఎలా సాధ్యం అనే క్యూరియాసిటీ కలిగేలా జాగ్రత్తపడుతున్నాం. ఇంటర్నెట్ వాడుతున్న చాలా మందికి తెలుగులో ఇంత సులువుగా అదీ డైరెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు అనే విషయం తెలీదు. ఈ సాంకేతిక సహాయం ద్వారా ఇంతవరకు ఎంతో మంది , ముఖ్యంగా కంప్యూటర్ ఎరా పాఠకులు ఈ విషయం తెలుసుకుని, నేర్చుకున్నారు. తమ మాతృభాషలో అలా సులువుగా రాసుకుంటూ ఎంత సంతోషిస్తున్నారో !!!

నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ చాట్ రూమ్‍లో ఇప్పటి వరకు ఎన్నో సాంకేతిక సమస్యలు పరిష్కరించబడ్డాయి. ఇందులో చాలావరకు టీమ్ వ్యూయర్ సాధనంతో పరిష్కరించబడినవే. ఇందులో , సహాయం చేసేవారు ఆ సమస్య పరిష్కరించడం వరకే ఆలోచిస్తారు కాని మిగతా వివరాలు వారికి అక్కరలేదు. ,తమ స్వకార్యములలో బిజీగా ఉన్నా కూడా అందరు నిస్వార్ధంగా సహాయం చేయడానికి ఎప్పుడు ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ వచ్చారు.

దానికితోడు ఈనాడు ఆదివారంలో వచ్చిన వ్యాసంలో ఇచ్చిన ఛాట్ రూమ్ అడ్రస్ కు వచ్చిన దాదాపు ఓ 200 మందికి పైగానే తెలుగు టైపింగ్ ఎలాగో నేర్పే లింకులు అందించాం. వారిలో 25% పైగా తెలుగు నేర్చుకుని వాడుతున్నారు కూడా! కొంతమందికి బ్రౌజర్ లో తెలుగు సరిగ్గా డిస్ ప్లే అవకపోవడం వంటి సమస్యలు పరిష్కరించాం. సిస్టమ్ సమస్యలు, వైరస్ లు, జావా, సి వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డౌట్లు, ఎక్సెల్ టెక్నిక్స్, ఆసక్తికరమైన వెబ్ సైట్లు వంటివి ఎన్నో ఈ ఛాట్ రూమ్ ద్వారా డిస్కస్ చేయడం జరిగింది. విజిటర్స్ కి ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా ముఖ్యమైన వాలంటీర్లం టైమ్ షెడ్యూల్ షిఫ్టులు వేసుకుని మరీ స్పెండ్ చేయడం జరుగుతోంది. అలాగే కొత్తగా వచ్చేవారిలో బాగా ఔత్సాహికులను గుర్తించి వారిని మోటివేట్ చేయడం ద్వారా ఇంతవరకూ దాదాపు 25 మంది వరకూ తక్షణ సహాయంకు ఏదో సమయంలో డెడికేటెడ్ గా కంట్రిబ్యూట్ చేసే టీమ్ తయారైంది. ఈ ప్రధాన సభ్యులందరితోనూ తరచూ టచ్ లో ఉంటూ మరింత ప్రొడక్టివ్ గా దీనిని డెవలప్ చేయడానికి అందరి ఆలోచనలు, సూచనలు సేకరిస్తూ సరైన, స్థిరమైన ప్రణాళికను రూపొందించాలన్నది ఆలోచన. అలాగే ఈ ప్రాజెక్టులో ఇంతవరకూ జ్యోతి, ప్రసాద్, వీవెన్, శ్రీధర్, శ్రీనివాస్ కర, సాయి పోతూరి, మౌర్య, మురళీ, గిరిచంద్, రామచంద్రరావు, రాము, నాగశివ, జాకబ్, రవీంద్ర కాట్రగడ్డ, జీవి, మొయిన్, సలీంభాషా, చైతన్య, రాము, రామ్ యనమల, వినయ్, రాజ్ కిరణ్ (అమెరికా), జాహ్నవి (వైజాగ్), సరిత (అమెరికా), రఘునాధ్ (రిటైర్డ్ జడ్జ్ అమెరికా), శ్రీను (పర్చూరు), భరత్, రాధిక (కువైట్), శాస్ర్తి (హైదరాబాద్), అభిరామ్ వంటి అనేకమంది చాలా డెడికేటెడ్ గా కమిట్ మెంట్ తో వర్క్ చేస్తున్నారు. వీరిలో తెలుగు బ్లాగర్లు, కంప్యూటర్ ఎరా పాఠకులు కాక కొత్తగా వచ్చినవారు కూడా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు.

ఈ ప్రాజెక్ట్ పై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తెలియజేయగలరు.

5 వ్యాఖ్యలు:

Anonymous

జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇంత కస్టపడి ఈ టప పొస్ట్ చేసారు దానికి నా ధన్యావాదలు

Anonymous

జ్యొతి గారి పొస్ట్ వండెర్ ఫుల్ జ్యొతి గారు మీరు ఇంత కస్టపడి ఈ టప పొస్ట్ చేసారు దానికి మన టీము తరపున దాన్యావాదములు., మీ ఈ స్పూర్తితో మా జీవీతానికి ఒక మలుపు వస్తుంది అని నా అలొచన .... ధన్యావాదలు జ్యొతి గారు

కొత్త పాళీ

గ్రేట్! తెలుగు బ్లాగుల వల్ల ఇప్పటివరకూ ఇతర ఫలితాలు ఏవైనా వచ్చినా రాకపోయినా ఈ ప్రయత్నం మాత్రం నిజంగా చారిత్రాత్మకం. ఒక సూచన: ఇప్పటిదాకా ఆ చాట్ రూములో వచ్చిన సందేహాలు ప్రశ్నల ఆధారంగా ఒక తరచూ అడిగే ప్రశ్నలపేజీ రూపొందిస్తే బాగుంటుంది.

Unknown

కొత్తపాళీ గారు మీ సూచన చాలా బాగుంది. లాగ్ ఫైల్ ఆధారంగా ఈ ఛాట్ రూమ్ లోని ప్రతీ ప్రశ్న సమాధానాన్ని ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించే పని కూడా చేపట్టాం. అతి ముఖ్యమైన అంశాలను సమాధానాలతో సహా ఒక చోట ఇప్పటికే తరచూ అడిగే ప్రశ్నలు అని ఛాట్ రూమ్ లో ఓ లింకు కూడా ఇచ్చాం. నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారు లాగ్ ఫైళ్ల లోని ఉపయోగపడే సమాచారాన్ని ఒక కొలిక్కి తెచ్చే బాధ్యతని స్వచ్ఛంధంగా స్వీకరించారు. త్వరలో దాదాపు అన్ని అంశాలూ తరచూ అడిగే ప్రశ్నలు పేజీలో పొందుపరచడం జరుగుతుంది.

- నల్లమోతు శ్రీధర్

Anonymous

మీరు అంతర్జాలంలో తెలుగుతో సాధించిందేమిటి? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పుకోవటానికి ఇన్నాళ్ళకు కొంతైనా ఉంది మన దగ్గర. నిస్వార్ధంతో సేవ చేయాలన్న తలంపుతో దీన్ని మొదలు పెట్టిన నల్లమోతు శ్రీధర్ గారు, వీవెన్ గార్లని ఎంత కొనియాడినా తక్కువే. ఇందులో భాగస్తులవుతున్న వారు ఇంత ఉత్సాహంతో రేయి పగలు వంతులు వారిగా పని చేస్తున్న తీరు ఊహకే అందనంత గొప్పగా ఉంది. ఇది ఇంతై ఇంతింతై వటుడింతై.... అన్నట్లుగా పెరుగుతుందనటం లో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతి గారు మీరీ సమాచారం అందరికీ అందిస్తూన్నందుకు అభినందనలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008