Showing posts with label మాలిక పత్రిక. Show all posts
Showing posts with label మాలిక పత్రిక. Show all posts

Tuesday, 4 June 2024

మాలిక పత్రిక జూన్ 2024 సంచిక విడుదల

మాలిక పాఠకులు, మిత్రులు, రచయితలకు సాదర ఆహ్వానం... మండే ఎండలనుండి ఉపశమనము కలిగిస్తూ వానజల్లుల హోరు మొదలైంది. ఇది చిరుజల్లుల వరకైతే అందరికీ హాయిగా, ఆనందంగానే ఉంటుంది. కాని అది భీభత్సంగా మారినప్పుడు అందరికీ కష్టమే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు ఏ కాలమైనా సాధారణంగా ఉంటే అంతా బావుంటుంది. తీవ్రంగా మారినప్పుడే ఇబ్బందులు మొదలై అమ్మో అనుకుంటాం. కాలానుగుణంగా ఆహారం, ఆహార్యం అన్నీ మారతాయి. మల్లెల కాలం చివరికొచ్చింది. సన్నజాజుల సువాసనలు మొదలయ్యాయి వాన జల్లులకు తోడుగా... ఏది ఏమైనా కాలం ఆగదు... మాలిక పత్రికలోని వివిధ అంశాలు మీకు నచ్చుతున్నాయని నా నమ్మకం. కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, సినిమాలు, సంగీతం, యాత్రలు.. ఇన్ని అంశాలతో మరోమారు మీ ముందుకు వచ్చింది జూన్ మాసపు మాలిక. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

 

 

ఈ మాసపు విశేషాలు:

 1. సుందరము సుమధురము – తాను నేను మొయిలు మిన్ను

 2. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -10

 3. మా ఊరి తొలకరి

 4. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 11

 5. తెల్ల కాగితం

 6. అమ్మమ్మ – 57

 7. ఎనిమిదో అడుగు

 8. సెల్లే నా ప్రాణం

10. క్షమించు నాన్నా!

11. నేస్తం

12. సినిమా చూడు మామా!

13. ప్రత్యేకత

14. నాటి తారలు – శ్రీమతి పసుపులేటి కన్నాంబ

15. శ్రీ లక్ష్మీనర్సింహ దేవాలయం – కోరుకొండ

Sunday, 12 May 2024

మాలిక పత్రిక మే నెల 2024 సంచిక విడుదల


మాలిక మిత్రులు, పాఠకులు, రచయితలకు మాలిక పత్రిక మే నెల 2024 సంచికకు స్వాగతం... సుస్వాగతం... మా పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు..

మన తెలుగువారింట ప్రస్తుతం ఏం జరుగుతోంది.. మండే ఎండల్లో కాని, ప్రాణాలు తీసే కరోనా విలయతాండవ వేళ కాని, ఆరు నూరు నూరు పదహారైనా మానని ఒకే ఒక ప్రహసనం మీకు తెలుసు కదా.. అదేనండి ఆవకాయ.. 

గోవిందుడు అందరివాడేలే లాగే ఆవకాయ మన అందరిదీ...
ఒకటా రెండా నాలుగా.. అబ్బబ్బా... కొబ్బరి మామిడి, నాటు కాయలు, జలాల్ కాయలు, గులాబీ.. ఇలా పేరు ఏదైనా ఉన్నదొక్కటే మామిడికాయ. కాని ఎన్ని రకాల ఆవకాయలో... నేను పేర్లు చెప్పనులెండి..

చెప్పాలంటే ఆవకాయ ఒక ఎమోషన్ మనందరికీ.. కొందరు ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తి చేసి, తిరగ కలిపి, రుచి చూడడం, విదేశాల్లో పిల్లలకు కొరియర్ చేయడం మొదలైపోయింది కూడా.. ఇంకా కొందరు ఎండలు ఇంకొంచెం ముదిరితే ఇంకొంచెం మంచి కాయలు వస్తాయి. అప్పుడు పెడదాము అనుకుంటున్నారు నాలాగ..  ఈ రోజుల్లో ఆవకాయలు చాలా సులువుగా దొరికేస్తున్నాయి. అయినా మనమే రంగంలోకి దిగి, కారం పొడులు, ఉప్పు, ఆవ,మెంతి, జీలకర్ర, వెల్లుల్లి, కాయలు, ఇంగువ అన్నీ శ్రేష్టమైనవి చూసి, కొనుక్కొచ్చి ఇంట్లో చేయకపోతే తృప్తిగా ఉండదంటే ఉండదు.

అదన్నమాట సంగతి.. 

మాలిక పత్రికకోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ మాసపు విశేషాలు.

 1. సుందరము సుమధురము –13

 2. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు 10

 3. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -8

 4. ఎత్తుకు పై ఎత్తు… చిత్తు చిత్తు!

 6. బాలమాలిక – పసి మనసు

 7. బాలమాలిక – మంచి తల్లిదండ్రులంటే…

 9. జీవనయానం

10. అత్తా, ఒకింటి కోడలే…

11. యస్.వి. రంగారావు

12. ఏది పొందడానికి ఏం కోల్పోతున్నావు?

13.మధ్యతరగతి మందహాసం – నవలా సమీక్ష

14. తీర్థరాజ్ లో మా కల్పవాసం




Tuesday, 9 April 2024

ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల

పాఠక మిత్రులు, రచయితలకు, అందరికీ క్రోధి నామ నూతన సంవత్సర శుభకాంక్షలు. 

గత మాసంలో మాలిక పత్రిక, ప్రమదాక్షరి (రచయిత్రుల ఫేస్బుక్ సమూహం) సంయుక్త ఆధ్వర్యంలో సమూహ సభ్యులకు నిర్వహించిన సరదా కథల పోటీల విజేతల వివరాలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన కథలను ఈ ప్రత్యేక సంచికలో చదవవచ్చు.. 

ఈ ఉగాది కథలపోటీకి వచ్చిన ముప్పై కథల్లో నియమనిబంధనలకు కట్టుబడి, న్యాయనిర్ణేతలు పది కథలను ఎంఫిక చేసారు. వీలువెంబడి మిగతా కథలు కూడా మాలిక పత్రికలో ప్రచురించబడతాయి. 

మాలిక, ప్రమదాక్షరి ఉగాది కథలపోటి విజేతలందరికీ హార్ధిక శుభాకాంక్షలు.. 

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com బహుమతుల వివరాలు: 

ప్రథమ బహుమతి: రూ. 1500 ఒక్కోటి. 

 1.కొత్త కోడలు- తెలుగు కాపురం

2.  చాదస్తపు మొగుడు


ద్వితీయ బహుమతి: రూ. 1000 ఒక్కోటి. 

 1.  భలే భలే పెళ్ళిచూపులు

2.  కిష్కింధ కాండ


తృతీయ బహుమతి: రూ. 500 ఒక్కోటి 

1.  నత్తి రాంబాబు

2. అయిందా పెళ్లి!

3.  మామ్మగారు

4.  హ్యాపీ హార్మోన్స్

5.  ‘ప్ర’మా’దాక్షరి’

6.  వాస్తు

Friday, 5 April 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2024 సంచిక విడుదల

మాలిక పాఠక మిత్రులు, రచయితలకూ సాదర ఆహ్వానం. మండే ఎండాకాలంలో అందరూ ఎలా ఉన్నారు. మధురమైన మామిడిఫలాలు, మనసును మురిపించే మల్లెపూవులు కూడా ఈ మండే ఎండలతో పోటీపడే సమయమిది. ఉగాది పండగ రాబోతోంది. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుందాం. ఒక ముఖ్య ప్రకటన: ఈ ఏప్రిల్ సంచిక తర్వాత ఉగాదికి మరో ప్రత్యేక సంచిక రాబోతోంది. విశేషాలు ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఉండదు కదా. కొద్దిరోజులు ఆగితే చాలు. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

 

ఈ ఏప్రిల్ సంచికలో ముఖ్య విశేషాలు: 

 1. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 9

 2. సుందరము సుమధురము –12

 3. శుచిరో అస్మాకా!

 4. జామాత

 5. అమ్మమ్మ – 56

 6. బాలమాలిక – బెల్లం కొట్టిన రాయి

 7. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 8

 8. పూల సంకెల

 9. బాలమాలిక – రెప్లికా

10. తప్పదు!

11. భగవత్ తత్వం

12. కార్టూన్స్ – భోగా పురుషోత్తం


Wednesday, 6 March 2024

మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల

 
 
 
మాలిక మిత్రులు, రచయితలు, శ్రేయోభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం.. 
 
ముందుగా మీ అందరికీీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రతీరోజు మనదే కాని ఒకరోజు ఇతర మహిళామణులతో కలిసి పండగ చేసుకోవాలి. ఈ స్పెషల్ డే రోజు ఇంటిపని ఏ మాత్రం తగ్గదు నాకు తెలుసు కాని, పనంతా తొందరగా ముగించుకుని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లి సరదాగా గడపండి.. గొప్పగా ఏమీ చెప్పను కాని అన్ని రంగాలలో ఎంతో ప్రతిభ చూపిస్తూ, రాణిస్తూ, మిగతావారికి స్ఫూర్తిగా ఉన్న మహిళలందరికీ మరోసారి అభినందనలు.. ఇందులో ఉద్యోగం, వ్యాపారం చేయకుండా ఇంట్లో ఉండే గృహిణులకు పెద్ద పీట వేయాలి సుమా.. 
 
 
మరొక ముఖ్యగమనిక మాలిక, ప్రమదాక్షరి గ్రూపు సభ్యులకోసం ఉగాది కథలపోటీ ప్రకటించబడింది. ఫలితాలతో బాటు బహుమతి పొందిన కథలు వచ్చే నెల సంచికలో చూడండి... చదవండి...
 
 
మీ రచనలు పంపడానికి చిరునామా: maalikapatrika@gmail.comm
 
 
ఈ మాసపు సంచికలో ముఖ్య విశేషాలు.


Monday, 5 February 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2024 సంచిక విడుదల

స్వాగతం... సుస్వాగతం... ప్రియ పాఠకమిత్రులు, రచయితలందరికీ మాలిక పత్రిక తరపున ధన్యవాదాలు... కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒక నెల గడిచిపోయింది కదా.. చలి పులి పారిపోయినట్టే అనిపిస్తోంది. మామిడిచెట్లన్నీపూతబట్టి నిండుగా ఉన్నాయి. మల్లెలు కనపడుతున్నాయి.. పిల్లలు పరీక్షల హడావిడిలో ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులు పిల్లలకంటే ఎక్కువ టెన్షన్ గా ఉన్నారు.. ఎప్పటిలాగే మీకోసం, మీరు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, సంగీతం, మొదలైన అంశాలతో మాలిక కొత్త సంచిక వచ్చేసింది. మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com 

ఈ మాసపు విశేషాలు: 

 1. వెంటాడే కథ – 25

 2. డయాస్పోరా జీవన కథనం – త్రిశంకు స్వర్గం

 3. ‘కల వరం’

 4. అమ్మమ్మ – 54

 5. సుందరము సుమధురము – 10

 6. లోపలి ఖాళీ – మృత్యువు యొక్క మృత్యువు

 7. సినీ బేతాళ కథలు – సమ్‍అంతరరేఖ

 9. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ – 6

 10. ఎవరు మారాలి?

11. ఉరూరి – ఉరూరి

12. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 7

13. అన్నమాచార్యులు – హరి నీవే సర్వాత్మకుఁడవు

14. చివరి బోధ

15. మనసు యొక్క ప్రాశస్థ్యం


Monday, 1 January 2024

మాలిక పత్రిక 2024 సంచిక విడుదల


 

 


 

 

మనిషి ఎన్ని అవాంతరాలు, ఆపదలు, దుర్ఘటనలు, సమస్యలను ఎదుర్కున్నా కొత్త సంవత్సరం అనగానే ఒక కొత్త ఆశ కలుగుతుంది. జరిగిందేదో జరిగింది, ఇక రాబోయేవి మంచి రోజులు అన్న చిన్న ఆశ, నమ్మకంతో ముందుకు సాగుతాడు. ఇదే ఆశావహ దృక్పథం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సరికొత్త ఆశలతో,సరికొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగిడదాము. 

మాలిక పత్రికను ఆదరిస్తొన్న మీ అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటిలాగే ఈ కొత్త సంవత్సరపు మొదటి మాసంలో మీకోసం ఎన్నో మంచి కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు అందిస్తున్నాము. మీకు తప్పకుండా నచ్చుతాయని మా ఆశ. 

 

మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com 


1. డయాస్పోరా జీవన కథనం – కథ కాని కథ

2. అమ్మమ్మ – 53

3.ప్రాయశ్చితం – 8

4. సినీ బేతాళ కథలు – వేస్ట్ ఫిల్మ్ రావు

5. లోపలి ఖాళీ – లోపల సముద్రం… పైన ఆకాశం…

6. స్వప్నాలూ, సంకల్పాలు, సాకారాలూ -5

7. బాలమాలిక – స్వశక్తి

8. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 6

10. వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా! – 3 వ రంగము

11. వెంటాడే కథలు – 23, ఎవరతను?

12. అన్నమాచార్య కీర్తనలు – వివరణ


Saturday, 2 December 2023

మాలిక పత్రిక డిసెంబర్ 2023 సంచిక విడుదల

Jingle Bells Jingle Bells.. Jingle All the Way.. పాఠక మిత్రులు, రచయిత మిత్రులు అందరికీ సాదర ఆహ్వానం... డిసెంబర్ మాసం.. చలి చలి మాసం.. పిల్లలకు పరీక్షలు,సెలవులు,క్రిసమస్, న్యూఇయర్.. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం..

మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియల్స్, కార్టూన్స్ తో వచ్చేసింది ఈ సంవత్సరం అంటే 20233 సంవత్సరపు మాలిక ఆఖరి సంచిక మీకోసం వచ్చేసింది. 

  మీ రచనలను పంపవలసిసన చిరునామా:maalikapatrika@gmail.comm

 

ఈ సంచికలోని విశేషాలు:

1. లోపలి ఖాళీ 14 – ఏదో…

2. ప్రాయశ్చిత్తం – 6

3. సినీ బేతాళ కథలు – 3, నబూతోనభవిష్యతి

5. డయాస్పోరా జీవన కథనం – పితృత్వం

6. అత్తగార్లూ… ఆలోచించండి

8. రామాయణంలో తాటక వధ

10. బాలమాలిక – గురుర్బ్రహ్మ

11. వెంటాడే కథ – 22

12. స్వప్నాలూ, సంకల్పాలూ – సాకారాలు – 4

13. వాట్సాప్ వాట్సాప్ వల్లప్పా – 2

14. ‘కోసూరి ఉమాదేవి కథలు’

15 భగవంతుని ఆత్మస్వరూపం

16.కార్టూన్స్ – భోగా పురుషోత్తం

Friday, 3 November 2023

మాలిక పత్రిక నవంబర్ 2023 సంచిక విడుదల

స్వాగతం... సుస్వాగతం...

ప్రియ మిత్రులు, సాహితీ మిత్రులు, రచయతలకు, పాఠకులకు మాలిక కొత్త సంచికకు సాదర ఆహ్వానం.

ముందుగా క్షమాపణ కోరుతున్నాము. సాంకేతిక కారణాల వల్ల గత మాసం అక్టోబర్ 2023 సంచిక విడుదల చేయలేకపోయాము.

తెలుగువారి అనే కాక భారతీయులందరికీ ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా. నవరాత్రులు, బతుకమ్మ పండుగ జరుపుకున్నాము. రాబోయే దీపాల పండుగ దీపావళి పండగ మీ అందరికీ సంతోషాలను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. 

మీ రచనలు పంపవలసిన చిరునామా:maalikapatrika@gmail.com

 1. ప్రాయశ్చితం – 5

 2. సినీ భేతాళ కథలు  2 – ధ్రువతార

 3. అమ్మమ్మ – 50

 4. లోపలి ఖాళీ – ధృవధర్మాలు

 5. స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -3

 6. వైద్య నారాయణుడు

 7. మారిన తీరు

 8. ప్రియనేస్తమా

 9. కర్ణాటకలో పండుగలు

10. వెంటాడే కధ – 21

11. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 4

12. సుందరము - సుమధురము – 7

13. బాలమాలిక – ‘నీవే దీపం వెలిగించు…’

14. వాట్సప్ వాట్సప్ వల్లప్పా!

15. ఏమండీ కథలు (సమీక్ష)

16. శ్లోకం – పాట

17. నవదుర్గా దేవి

18. బంజారా తాండాలో తీజ్ సంబురాలు


Saturday, 2 September 2023

మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక 2023 విడుదల

 


 

కృష్ణం వందే జగద్గురుం...

షరతులు లేకుండా ప్రేమించడం, ఉద్దేశం లేకుండా మాట్లాడటం, కారణం లేకుండా ఇవ్వడం, నిరీక్షణ లేకుండా శ్రద్ధ వహించడం, అదే నిజమైన ప్రేమ యొక్క ఆత్మ.

కృష్ణుడు అనగానే జీవిత సారాంశాన్ని ఉద్భోదించిన భగవద్గీత స్ఫురణకు వస్తుంది. ప్రతి మనిషి సైకాలజీ కృష్ణునిలో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య.  ఆయన అసలు సిసలైన ఫిలాసఫర్. కృష్ణుడు అలౌకిక ఆనందానికి ప్రతిరూపం.

ఈ కృష్ణతత్వాన్నిమననం చేసుకుంటూ మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అందజేస్తున్నాము.

పాఠకమిత్రులకు, రచయితలకు స్వాగతం... సెప్టెంబర్ 2023 సంచికకు సాదర సుస్వాగతం..

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

 

 

 1.  స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2

 2.  అనగనగా ఓ జాబిలమ్మ

 3.  లోపలి ఖాళీ – తపస్సు

 4. సినీబేతాళ కథలు – 1. ఓవర్ నటేశన్

 5. ప్రాయశ్చితం - 4

 6.  ఇంటర్వెల్ బెల్

 7. శంఖు చక్రాలు

 8. సమన్వయం

 9.  ధైర్యం శరణం గచ్చామి

10.  సుందరము సుమధురము

11.  కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 3

12.  బాలమాలిక – ఎవరికి ఇవ్వాలి?

13. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

 

 


Wednesday, 2 August 2023

మాలిక పత్రిక ఆగస్ట్ 2023 సంచిక విడుదల

 


మాలిక పాఠక మిత్రులకు, రచయితలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం...


ఈసారి ప్రకృతి మనమీద కోపంగా ఉందా? అన్నీ అతివృష్టిగానే ఉన్నాయి. ఎండలు ఎక్కువే ఉండినాయి. ఇపుడు వానలు కూడ విజృంభించి కురుస్తున్నాయి. ఈ ఎండా వానల మధ్య ఈ రంగుల హరివిల్లు మనసులకు ఉల్లాసాన్ని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.. 


పాఠకులకు నచ్చే విధంగా వివిధ అంశాల మీద వివిధ రచనలు అందించడానికి మాలిక ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. కథలు, కవితలు, వ్యాసాలు, కార్టూన్స్, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, పురాణాలు, సీరియల్స్, అనువాదాలు...

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ ఆగస్టు మాసంలో మీకోసం వచ్చిన విశేషాలు: 

 1.  ‘డయాస్పోరా జీవన కథనం’ – ముళ్ళ గులాబి

  3. లోపలి ఖాళీ – బ్రహ్మపీఠం

  4. పరవశానికి పాత(ర) కథలు – రండి! స్కిప్టు మీద కూచోండి

 5. ప్రాయశ్చితం – 3

 6. అమ్మమ్మ – 49

 7.  బాలమాలిక – ‘నీవే దీపం వెలిగించు…’

 8. సుందరము – సుమధురము – 4

 9. వెంటాడే కథ – 20

10. తిత్తి కాసులు చెల్లె… తిరుణాలు చెల్లె

11. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 2

12. దానశీలత

13. కార్టూన్స్ – భోగా పురుషోత్తం


Monday, 3 July 2023

మాలిక పత్రిక జులై 2023 సంచిక విడుదల

 

 
ప్రియ పాఠక మిత్రులు, రచయితలందరికీ  సన్నజాజులు, చిరు చినుకులతోడుగా మాలిక కొత్త సంచికకు స్వాగతం. అమెరికాలో, అన్నవరం, అయిద్రాబాదులో కూడా అందరూ ఎండల్లో మండిపోతూ,  వరుణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కరుణ కూడా తక్కువగానే ఉంది ఇప్పటివరకు.  పూర్తి వానాకాలపు జోరువానలు వస్తాయని ఆశిద్దాం. సన్నజాజులు కూడా తోడున్నాయి కదా.. 


పాఠకులను అలరించడానికి  మాలిక పత్రిక  ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలను ప్రవేశపెడుతోంది. ఈ మాసం నుండి సంగీతమాలిక రాగమాలికలు ప్రారంభమవుతోంది. కథలు, కవితలు, సీరియళ్లు, వ్యాసాలు, కార్టూన్స్, సమీక్షలతొ పాటు మరెన్నో అంశాలు మీకోసం ఈ మాసపు సంచికలో..


మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com


ఈ జులై మాసపు విశేషాలు:


 1.  అమ్మమ్మ – 48

 2. ప్రాయశ్చితం – 2

 3.  ఊయల వంతెన

 4.  పరవశానికి పాత(ర) కథలు – కొన్ని కన్నీళ్లు కొందరికే వస్తాయి

 5. ఈశ్వర సేవ

 6.తులసి

 7. లోపలి ఖాళీ – భూమిపుండు

 8.  తనివి తీరింది

 9. బాలమాలిక – ‘నెపాలెందుకు?’

10.  విరించినై విరచించితిని… సిరివెన్నెల

11. సుందరము – సుమధురము – 3

12. రాగమాలికలు – 1

13. దానశీలత

14. వెంటాడే కథ 19

15. జగజ్జనని

17. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

18. వెంటాడే కథ – 18 పేదవాడు మనసు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008