Monday, March 23, 2015

ధీర - 2
పసితనపు నీడలో ఉండగానే జరిగిన వివాహం, పట్నవాసపు ఉమ్మడికుటుంబంలో కాపురం, పంచుకున్న అనుభవాలు, కలిసి ఎదుర్కొన్న కష్టసుఖాలూ, అనుకోని అవాంతరాలు, ఒడిదుడుకులూ, పిల్లలూ, బంధుమితృలూ, బాధ్యతలూ.. ఒక సాధారణ గృహిణి జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో రకాలా అనుభవాలూ, సమస్యల మధ్య, కేవలం ఇంటిని నడుపుకుంటూ, పుస్తకాలు చదువుకుంటే చాలదా? అనుకోలేని నైజం ఉండాలే కానీ, నేర్చుకోవడానికెన్నో విషయాలు, నెరవేర్చుకోవడానికెన్నో మార్గాలు. కావలసినదల్లా నేర్చుకోవలన్న కోరికా, అది సాధించడానికి కావలసినంత ఓపికా. ఈ రెండు చేరితే తీరిక దానంతట అదే దొరుకుతుంది, కనపడుతుంది. అది కొత్త వంట కావచ్చు, కొత్త స్వెటర్ అల్లిక కావచ్చు, భగవద్గీతా పారాయణం కావచ్చు లేక యోగాభ్యాసం కావచ్చు, మరేదైనా కావచ్చు.. 
 " ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ ' అన్న దానికి భిన్నంగ " ముదితల్ నేర్వగ రాని విద్య కలదే మనసారా నేర్చిన" అని చెప్పుకోవచ్చు మన ఈ నెల " ధీర" లో ప్రస్తావిస్తున్న మహిళ గురించి చదివితే. 

" ఆ మహిళ ఎవరు? ఆమె వెనకున్న కధ ఏమిటి? ఆవిడ ఊరేమిటి? పేరేమిటి?" వివరాలు వచ్చే నెల మాలిక ధీర లో చదవండి.

Sunday, March 22, 2015

మాలిక పత్రిక మహిళా ప్రత్యేక సంచిక - 4 మార్చ్ 2015 విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head

నెలకో సంచికగా మీ ఆదరాభిమానాలను పొందుతున్న మాలిక పత్రిక మార్చ్ నెలలో వచ్చే మహిళా దినోత్సవ సంధర్భంగా  సంచికను మహిళలకోసమే ప్రత్యేకంగా ముస్తాబు చేయాలనుకుంది. కాని ఈ స్పెషల్ సంచిక కోసం వచ్చిన వ్యాసాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల నాలుగు భాగాలుగా విడుదల చేయడం జరుగుతోంది. ఈ వారం ఈ స్పెషల్ సంచిక నాలుగవది, చివరి భాగం కూడా..  ఈ స్పెషల్ సంచిక కోసం టైపింగ్ విషయంలో నాకు సహాయం చేసిన గౌతమి, సుభద్రలకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి..

మా ఆహ్వానం మేరకు సహకరించి ఎన్నో, ఎన్నెన్నో విభిన్నమైన వ్యాసాలను, కథలు, కవితలను పంపించిన రచయిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని మా కోరిక..  మా యీ ప్రయోగం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాము.

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ సంచికలోని విశేషాలు ఈ విధంగా ఉన్నాయి..
01. ప్రమదాక్షరి ఉగాది జ్ఞాపకాలు
02. సొరకాయ సొగసులు
03. నా మాట
04.  తెలుగులో ఇంగ్లీషు
05.  మై గ్రేట్ అమ్మమ్మ
06. నేస్తం
07. కాలాన్ని చేజారనివ్వకు
08. నిజమే కల అయితే
09, కవయిత్రి మొల్ల
10. గృహలక్ష్మీ స్వర్ణకంకణం
11. పెరుగుతున్న అత్యాచారాలు
12. మహిళా సాధికారత
13. Universe Speaks
14. PaalammaMonday, March 16, 2015

షడ్రుచులు పునఃప్రారంభం...ఏంటో నా వంటల రాతల ప్రహసనం మొదలై ఎనిమిదేళ్లైనా , బ్లాగునుండి వెబ్ సైట్ , అక్కడినుండి వివిధ పత్రికలలో రాసిన నా వంటల వెబసైట్ (తెలుగులొ మొదటి వంటల వెబ్ సైట్) షడ్రుచులు రెండుమూడేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయింది. వారం వారం ఆంధ్రభూమి రుచి కాలమ్ కోసం వంటలు చేసి రాసి పెట్టుకున్నా షడ్రుచులు సైట్ అప్డేట్ చేయడం కుదరలేదు. వార్షికోత్సవంనాడు మాత్రం తప్పనిసరిగా ఒక పోస్టు పెడుతున్నా. నాకు ఒక passion ని సృష్టించి అందులో నాకు విశేష గుర్తింపును ఇచ్చిన షడ్రుచులు పేరునే నా పుస్తకాల సిరీస్ కు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ సిరీస్ లో మొట్టమొదటగా వేసి తెలంగాణ వంటల పుస్తకాల మంచి స్పందనను ఇస్తున్నాయి. మరి అలాంటప్పుడు నా షడ్రుచులు సైట్ ని నిర్లక్ష్యం చేయడం నాకు తగునా? అని నాకు నేనే అక్షింతలు వేసుకుని మళ్లీ క్రమం తప్పకుండా కొత్త కొత్త వంటకాలతో అప్డేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.. అందుకే పాతదైనా నా షడ్రుచలు సైట్ ని తెలుగు , ఇంగ్లీషులో మళ్లీ ప్రారంభిస్తున్నాను.. ఆశీర్వదించి, ఆదరిస్తారు కదూ//

When i realised that cooking and writing are my passions i started blogs and then a website named Shadruchulu five years back. This site and name have given me a special recognition in various print magazines and a column in popular telugu daily for four years.. Being busy with various activities i have been neglecting my website and not updating it regularly. Shadruchulu name is very special to me so decided to write various cookery books in shadruchulu series. first two books were telangana tradtiional recipes in veg and non veg which are well appreciated.. more to come in this series. In this context i am relaunching my shadruchulu website with blogs in telugu and english from today promising to update it with new, innovative and easy recipes regularly.. Requesting ur encouragement ...

Sunday, March 15, 2015

మాలిక పత్రిక మహిళా సంచిక - 3 , మార్చ్ 2015 విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Headమార్చ్ నెల ప్రత్యేక మహిళా సంచిక సంధర్భంగా మాలిక పత్రికలోని మూడవభాగం ఈరోజు విడుదల అవుతుంది. ఇందులో , వచ్చేవారం వచ్చే నాలుగవ భాగంలో విభిన్నమైన అంశాలమీద మహిళలు రాసిన వ్యాసాలు ప్రచురించబడతాయి..

ఈ భాగంలో ...

01. న్యూస్ ఏంకర్లు vs రీడర్లు
02. స్త్రీ పురుష సమానత - ఒక మిథ్య
03. మలేషియా తెలుగు మహిళలు
04. పవిత్ర వృక్షాలు
05. ఊర్మిళ 
06. నా మార్గదర్శకులు
07. మహిలో మహిళ
08. స్త్రీవాద సాహిత్యం
09. సైరంధ్రి (నవపారిజాతం)
10. మాతృస్వామ్య రాష్ట్రం - మేఘాలయ
11. తానా వ్యాసరచన  పోటీ
12.  పద్యమాలిక - 5
13.  పద్యమాలిక - 4
14. బాల్య, కౌమార్యదశలలో బాలికల సమస్యలు
15. We are Hormone Beings

Sunday, March 8, 2015

మాలిక పత్రిక మహిళా సంచిక - 2 మార్చ్ 2015 విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head


జ్యోతిశ్శాస్త్రములో శుక్రగ్రహానికి చిహ్నము ఒక వృత్తము, దాని క్రింద ఒక సిలువ లేక కూడిక చిహ్నము. ఈ శుక్రగ్రహపు గుర్తే  స్త్రీలింగానికి అంతర్జాతీయ చిహ్నము. ఇట్టి ఎనిమిది చిహ్నములతో చేయబడిన ఒక అష్టభుజి ఈ చిత్రమునకు మౌలిక అంశము (basic motif). మధ్యలో ఒక దీపము ఉంచబడినది. ఈ అష్టభుజాకారములను పదేపదే చేర్చగా లభించిన చిత్రమే యిది. ఇందులో పక్క పక్కన ఉండే రెండు అష్టభుజములకు ఒకే శుక్రగ్రహ వృత్తము ఉపయోగించబడినది. సౌష్ఠవ సిద్ధాంతముల రీత్యా ఈ చిత్రపు సౌష్ఠవము 4/m.2/m.2/m, అనగా చిత్రపు సమతలములో (horizontal plane) 45 డిగ్రీలకు ఒక దర్పణ సాదృశ్యము గలదు. ఇట్టి నిలువు అద్దములు నాలుగు ఉన్నవి. నిలువుగా ఉండే అక్షములో (z axis) 90 డిగ్రీల పరిభ్రమణము ద్వారా మారని చిత్రము మనకు లభిస్తుంది. ఇది కంప్యూటరుతో గీయబడిన ఒక రంగవల్లిక.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మాలిక పత్రిక మహిళా ప్రత్యేక సంచిక రెండవ భాగం మీకోసం. ఈ వారం పత్రికలోని ముఖ్యాంశాలు...
 1. ధీర
 2.  ఆరాధ్య -6
 3. చిగురాకు రెపరెపలు
 4. వెటకారియా రొంబ కామెడియా - 7
 5. Dead people dont speak
 6. స్పెషల్ పదచంద్రిక 
 7. హాట్ హాట్ కూరగాయలు
 8. సీతామహాసాధ్వి
 9. Facets
10. మనిషి ఖరీదు
11. ముఖం లేని చెట్టు
12. రససిద్ధి
13. ఆఖరి  మజిలీ
14. అనుకోని అతిధి
15. ప్రవర్తన
16. ఇది సరైన దారేనా?
17. అమ్మ ఓడిపోయింది
18. ముహూర్త బలం
19. ఫిట్నెస్ ఫ్రీక్
 

Sunday, March 1, 2015

మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head


అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి (International Women's Day) గుర్తుగా సృష్టించబడిన వృత్తము స్త్రీ వృత్తము. దీనికి గణములు- స/స/స/స/త/ర (సీ యందలి ఈ-కారమునకు నాల్గు స-గణములు, త,ర ఒత్తులకు ఒక్కొక్క గణము). యతి మూడవ, ఐదవ గణములతో చెల్లును. ఈ లక్షణములు గల స్త్రీ వృత్తము ధృతి ఛందములో 83676వ వృత్తము. క్రింద  ఒక  ఉదాహరణము-
స్త్రీ - స/స/స/స/త/ర, యతి (1, 7, 13) 18 ధృతి 83676


తరివో, సిరివో, - దరివో, మురివో, - ధర్మమ్మొ, దాసివో
పరువో, మురువో, - బరువో, తరువో, - వాగ్దేవి వాణివో
వెరవో, పెరవో, - వెఱపో, చెఱపో, - ప్రేమామృతాబ్ధివో
చిరమో, క్షరమో, - స్థిరమో, పరమో, - స్త్రీదేవి నీవిలన్


(తరి - నౌక, దరి - మేర, మురి - కులుకు, గర్వము, మురువు - సౌందర్యము, వెరవు - యుక్తి, పెర - అన్య, వెఱపు - భయము, చెఱపు - కీడు, చిరము - శాశ్వతము, క్షరము - నశించునది, పరము - ఇహము కానిది)

మార్చ్ అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందని తెలుసు. ఈ సందర్భంగా మాలిక పత్రికను ప్రత్యేక మహిళా సంచికగా ఆవిష్కరిస్తుంది. ఈ సంచికలో ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళా రచయిత్రులే.. ఈసారి పత్రిక ఒక్కసారి కాకుండా నాలుగు భాగాలుగా ప్రతీ ఆదివారం ఒక్కో భాగం విడుదల అవుతుంది. మొదటి భాగంలోని విశేషాలు...

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 1. భక్తి - ముక్తి
 2. Happy Women's Day
 3. వీణ
 4. రాగలహరి - కళ్యాణి
 5. దివ్య ద్విగళ గీతాలు
 6. బేటి బచావ్
 7. నెచ్చెలి
 8. మొండి గోడలు
 9. తరుణి
10.జయహో మహిళా
11. కాలుతున్న పూలతీగలు
12.  పునీత
13. ఆడజన్మకెన్ని శోకాలో
14. అన్ని బుుతువుల ఆమని
15. Tv9 నవీన 
16. లాంతరు వెలుగులో ...
 


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008