Monday, February 4, 2008

ఆహ్వానం !!!!

ముందుగా తెలుగు బ్లాగర్లందరికీ అభినందనలు.

సెప్టెంబరులో కంప్యూటర్ ఎరా సాంకేతిక మాస పత్రికలో ఇంటర్నెట్‌లో తెలుగు వెలుగులు అనే వ్యాసం తర్వాత నవంబరు నుండి ప్రతి నెల ఒక బ్లాగు సమీక్ష ప్రచురించబడుతుంది. మొదటి సమీక్ష కొత్తపాళిగారిది చూసారుగా. అలాగే ప్రతీనెల ఒక బ్లాగు సమీక్ష రాయడానికి అందరికి ఇదే ఆహ్వానం. మీకు నచ్చిన బ్లాగు/బ్లాగులు గురించి వివరంగా కనీసం రెండు పేజీలు రాయండి. ఎలా రాయాలో ఈ సమీక్ష చూసి తెలుసుకోండి. ఇది రాయడానికి కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడాలు లేవు. ఎవరైనా రాయొచ్చు. మీరు బ్లాగరు కాకున్నా సరే. సమీక్ష రాయగలము అనుకుంటే ఆ బ్లాగు టపాలన్ని చదివి సవివరంగా రాయండి. మీరు రాసిన సమీక్షను నాకు పంపండి. అందులో దిద్దుబాట్లు ఉంటే సరిచేసి కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ కు పంపిస్తాను. త్వరపడండి మరి..
నా చిరునామా. :- jyothivalaboju@gmail.com


ఇంకో ఆహ్వానం..

నిన్నటి ఈనాడు వ్యాసం లో అందరికి వికీ గురించి వివరాలు తెలిసాయి కదా. తెలుగు బ్లాగులు రాసేవాళ్ళు కూడా ఒక అడుగు అటువైపు వేయండి. మీరు రాసే బ్లాగులు మీకోసమే . అందులో వచ్చే మెప్పులు, కామెంట్లు మీవరకే పరిమితమై ఉంటాయి. పైగా ఈ మధ్య బ్లాగుల ఎక్కువై వాటిని చదవడంలనే అందరికీ ఓపిక తగ్గి ఎక్కువ వ్యాఖ్యలు రాయడం లేదు. బాధ కలుగుతుంది. కాని ఏం చెయ్యగలం? సో మీరు బ్లాగులకు రాసే సమయాన్నే కొంచం పక్కన పెట్టి కనీసం వారానికొకసారైనా , వారానికొక గంటైనా వికిలో రాయండి.ఈ వికీలో ఏం రాయాలి , ఎలా రాయాలి అనే సందేహాలుంటే వికీ గుంపులో చేరి అడగండి. బ్లాగు గుంపులోలాగానే ఇక్కడ కూడా మీకు చేయిపట్టి ఎలా రాయాలో, ఏమి రాయాలో చూపించడానికి సభ్యులు సిద్ధంగా ఉంటారు.

మీకు ఎలాంటీ సందేహమైనా, సలహా ఐనా, సహాయమైనా కావాలనుకుంటే కూడలి కబుర్లలోకి రండి. అక్కడెవరూ లేకపోతే సాంకేతిక సహాయానికి రండి. ఎవరో ఒకరు మీకు చేయందిస్తారు.

6 వ్యాఖ్యలు:

Naveen Garla

తెలుగు వికీలో మీకు ఏమి వ్రాయాలో తోచకపోతే..ఈ_వారము_సమైక్య_కృషి
చూడండి. లేకపోతే తెవికీ గుంపులో అడగండి.

* మీ సొంత ఊరుకు సంబంధించిన వివరాలు పొందుపరచవచ్చు
* మీకు ఆంగ్లం, తెలుగు రెండు భాషలు వచ్చునా? ఐతే తెలుగు వికీలో పేరుకుపోయిన ఆంగ్ల వ్యాసాల్ని తెలుగులో అనువదించండి
* తెలుగు వికి ఎలా ఉపయోగించాలో అనుమానాలుంటే..సహాయపు పేజీలను చూడండి.

- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

Anonymous

సహాయాన్నందించటంలో ఎప్పుడూ ముందుంటారు. భేష్.

తెలుగు'వాడి'ని

సమీక్ష ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై నా సూచనలు/సలహాలు :


1. బ్లాగరు వివరాలు : బ్లాగరు ఏయే వివరాలు (వ్యక్తిగత, ఉద్యోగ, వివాహ, ఆసక్తి/ఆభిరుచి మొదలగు) అయితే ఇతరులతో పంచుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ .... సమీక్ష వ్రాయబోయే ముందు ఒకసారి వారినే అడిగి చూడవచ్చు ... అలాగే ఒక వేళ బ్లాగరు Profile (About Page) లో ఎక్కువ సమాచారం ఉంటే ఆ లంకె కూడా ఇవ్వటం మంచిది.

2. ఎన్ని బ్లాగులు ఉన్నాయి .. వాటి పేర్లు, లంకెలు ... టపాల సంఖ్య .. చివరి టపా వ్రాసినది ఎప్పుడు ... సగటున నెలకు మరియు ఎన్నిరోజులకు ఒక టపా వ్రాస్తున్నారు .. ముఖ్యంగా ఈ బ్లాగు గురించి ఒకటో, రెండో వాక్యాలు ... ఒకవేళ కాప్శన్ వివరంగా ఉంటే లేదా వివరణకు సరిపోతుందు అనుకుంటే అదే వాడుకోవచ్చు.

3. ఈ బ్లాగరుకు ఉన్న అన్ని బ్లాగులు, అందులొ వ్రాసిన టపాలను బట్టి మరియు తను వివిదా బ్లాగుల్లో వ్రాసే/వ్రాసిన వ్యాఖ్యలను బట్టి, తనకు ఏ విషయాలపై మక్కువ/అవగాహన/ఉత్సాహం ఉంది....ఆయా విషయాలపై తనకున్న పట్టును ఎంత బాగా వ్యక్తీకరించ గలుగుతున్నారు ... అలా అనిపించిన టపాలు ఏవైనా ఉంటే వాటి లంకెలు....

4. ఈ సమీక్షకునికి ఆ బ్లాగరు యొక్క అన్ని బ్లాగులలో నచ్చినవి(మచ్చుకి) కొన్ని టపాలు, వాటి లంకెలు ... అలాగే ఎక్కువ వ్యాఖ్యలు వచ్చిన టపాలు, ఆ బ్లాగరుకు నచ్చిన లేదా కొత్త/పాత పాఠకులకు పరిచయం చేయాలి అనుకునే టపాలు

5. ఒకవేళ ముందుగానే ఫలానా బ్లాగు వచ్చే నెలలో రివ్యూ చేస్తున్నాము అని చెప్పవచ్చు అనుకుంటే, దీనికి ఒక చిన్న టపా వ్రాసి, పాఠకుల నుంచి వారికి నచ్చిన లంకెలు పొందవచ్చు. లేదా సమీక్ష వ్రాసిన తరువాత అయినా, ప్రతి పాఠకుడినీ వారికి నచ్చిన టపాలు, వ్యాఖ్యలు అడిగి తెలుసుకొని వాటిని ఆ సమీక్షలో పొందుపరచాలి (అలాగని ప్రతి రోజూ లేక ప్రతి పాఠకుడి వ్యాఖ్య తరువాత కాదు .. ఒక వారం పది రోజుల తరువాత అంటే ఈ సమీక్షకు పాఠకుల తాకిడి తగ్గింది, ఇక వ్యాఖ్యలు రాకపోవచ్చు
అనుకున్నప్పుడు)


6. సమీక్ష లో చెప్పిన విషయానికి సంబంధించి ఎన్ని లంకె లు ఇవ్వగలిగితే అంత సులభంగా ఆ బ్లాగరు, బ్లాగులు, టపాలు కొత్త/పాత పాఠకులకు చేరువకాగలుగుతుంది. ఈ చేరువచేయటం తద్వారా సరికొత్త చేయటం అనేది ఈ సమీక్షల ముఖ్యమైన ఉద్దేశ్యాలలో ఒకటి కావాలి.

7. దయచేసి మినీ సమీక్షలు లేదా ఒక పది, పదిహేను వాక్యాలు వ్రాయటం లేద వ్రాయాలి కాబట్టి వ్రాయటం లేదా అసంపూర్ణంగా వద్దు ... మొదటికారణం ఏమిటి అంటే భ్లాగర్లు కొంచెం ఎక్కువగానే ఉన్నారు...నెలకు ఒకటో రెండో తీసుకున్నా తిరిగి మరలా అదే బ్లాగు సమీక్షకు అవకాశం/సమయం చాలకపోవచ్చు. ఇంకొక కారణం ఏమిటి అంటే, చదివే పాఠకునికి, ఈ సమీక్ష వ్రాసిన గుండెలోతుల్లోనుంచి, మనసు పెట్టి, తన భావాభిమానోత్సాహపానందాభిప్రాయాలను ఇక్కడ అక్షర రూపం ఇచ్చారు అనిపించేలా ఉండాళి.

8. ముఖ్యంగా చేయవలసింది ఇంకొకటి ఏమిటి అంటే ... ఆ బ్లాగరు యొక్క టపాలలో చాలా అరుదుగా క(వి)నిపించేవి ఏవైనా ఉన్నాయేమో పరిశీలించి వాటిని వెలుగులోకి తీసుకురావటం .. ఉదాహరణకు : అరుద్దైన చిత్రాలు, సేకరణలైనా ఫర్వాలేదు, “కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి మరియు రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ గారి స్వరంలో

9. సమీక్ష ఎప్పుడూ ఒక క్రమపధ్ధతిలో, ఒక ప్రవాహం లాగా ఉండాలి అంతే గానీ ఎగుడు దిగుడుగా అంటే రెమ్డు వాక్యాలు వ్రాయటమ్ వెంటనే వేరే విషమ్యంలోకి దూకెయ్యటమ్ మరలా కొంత సేపు తర్వాత ఇంతకు ముందు చెప్పిన విషయంలోకి వెళ్లకుండా చూడాలి. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఈ సమీక్ష అనబడే మల్లెదండలో, ఇలా వ్రాసే క్రమం అనే దారం లాంటి ప్రయత్నం, ఆయా బ్లాగుల్లోని విర(సన్న)జాజులు లాంటి టపాలను, అక్కడక్క చటుక్కున మెరిసే కనకాంబరాల వంటి వైవిధ్యమైన మరి కొన్ని టపాలను, తక్కువగా వాడే/కనిపించే/పరిమళించే మరువం లా మీ మాటల కూర్పూ/చేర్పు ఉండేలా చూసుకోవాలి.

రాధిక

తెలుగు వాడినిగారూ అచ్చూ మీరు చెప్పినట్టుగానే పొద్దు పత్రిక వారు చరసాల ప్రసాదు గారి బ్లాగుని సమీక్షించారు.ఇప్పటికి వచ్చి నాకు నచ్చిన బ్లాగు సమీక్ష అది ఒక్కటే.

తెలుగు'వాడి'ని

రాధిక గారు : ఎంతో బాగా గుర్తుపెట్టుకొని పొద్దు లోని ప్రసాద్ గారి బ్లాగు సమీక్ష గురించి చెప్పినందుకు ధన్యవాదములు. మీరు చెప్పినట్టు చాలా అధ్బుతంగా వ్రాశారు. ఆ లంకెను మొత్తానికి పొద్దులో కనిపెట్టాను. ఇష్టము/ఉత్సాహము ఉన్న వాళ్లు చదవచ్చు ఇక్కడ : సూటిగా, వాడిగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా - చరసాల ప్రసాద్

జ్యోతి

తెలుగువాడుగారు,

మీరు చెప్పిన అమూల్యమైన సలహాలకు ధన్యవాదములు. మీరు శ్రమ అనుకోకపోతే పన్నెండో తారీఖు లోపల మీకు నచ్చిన బ్లాగు సమీక్ష రాసి పంపగలరా.. వచ్చే నెల కోసం.. నేను ఇంతకు ముందే శ్రీదర్‍తో మాట్లాడాను. అతను బ్లాగు సమీక్ష కోసం మొత్తం పేజి ఇవ్వడానికి ఒప్పుకున్నాడూ. సో మిని సమీక్ష కాకుండా సంపూర్ణ సమీక్ష ఇవ్వొచ్చు ... మీరు రాసిన దాన్ని బట్టి మిగతా వారికి ఒక అవగాహన వస్తుంది..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008