Thursday 28 February 2008

పుణుకులు

1. అది ఒక ఆఫీసులో లంచ్ టైమ్. కామేశం, వీరేశం, గిరీశం ముగ్గురు తమ తమ లంచ్ బాక్స్ లు తీసారు.

కామేశం : " ఉప్మా!!!.. రోజు ఉప్మా తినలేక చచ్చిపోతున్నా. రేపు కూడా నా లంచ్ బాక్స్ లో ఉప్మా పంపితే చచ్చిపోతానంతే.

వీరేశం : " చపాతీలు!!!..రోజు ఈ చపాతీలు తిని తిని విసుగెత్తింది. రేపు కూడా నాకు చపాతీలు పంపితే నేనూ చచ్చిపోతాను. బ్రతికి లాభంలేదు..

గిరీశం : " పులిహోర!!!.. రోజు ఈ నిమ్మకాయ పులిహోర తిని తిని ప్రాణం మీది తీపి చచ్చిపోయింది. రేపు కూడా నాకు పులిహోర పంపితే నేను బ్రతకనంతే."

మరుసటి రోజు ముగ్గురికీ అవే లంచ్ బాక్స్ లు వచ్చాయి. దానితో ముగ్గురూ ఆఫీసు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురి భార్యలు వచ్చారు.

కామేశం భార్య : "ఏవండి. వెదవది ఉప్మా కోసం ప్రాణంతీసుకున్నారా ? ఒక్క మాట చేప్తే వేరే చేసేదాని కదా" అని ఏడుస్తుంది.

వీరేశం భార్య : "ఏవండి.. చపాతీలు ఇష్టం లేదని ఒక్క మాట అంటే వేరే ఏదైనా చేసి పంపేదాన్ని కదా . ఇంత దానికే ఆత్మహత్య చేసుకున్నారా ?" అని ఏడుస్తుంది.

గిరీశం భార్య మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అలా కూర్చుంది.

ఆఫీసు వాళ్ళు వచ్చి "ఏంటమ్మా ! మీ భర్త చనిపోతే ఎటువంటి బాధలేకుండా అలా కూర్చున్నావు?"

గిరీశం భార్య " ఈ నా కొడుకు! రోజు తనే వంట చేస్తాడు కదా ! రోజొక వంట చేయొచ్చుగా. రోజు పులిహోర ఎవడు తెచ్చుకొమ్మన్నాడు. దొంగ సచ్చినోడు. అనవసరంగా నన్ను ఇరికించాడు."


2. ఒక ఆఫీసులో ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఉద్యోగానికి ఒక ఢిల్లీ వ్యక్తి, ఒక ముంబాయి వ్యక్తి, ఒక హైదరాబాది ముస్లీమ్ వచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో ఒకే పదంతో గదిలోకి ప్రవేశించాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడితే అనర్హులుగా ప్రకటిస్తారు.

ఢిల్లీ వ్యక్తి తలుపు తట్టి " May I come in ?" అని అడిగాడు.

నాలుగు పదాలు వాడాడని అతనిని పంపేసారు.

ముంబాయి వ్యక్తి తలుపు తట్టి " మై అందర్ ఆ సక్తా హూ?’

ఐదు పదాలు వాడాడని అతనిని కూడా పంపేసారు.

ఇక హైదరాబాదీ ఈ విషయాలు తెలుసుకుని తలుపు కొద్దిగా తీరిచి " …. " అన్నాడు.

అంతే అతనికి ఉద్యోగం వచ్చేసింది.

ఇంతకీ అతనేమన్నాడు… " ఘుసూ.. घुसू ’

घुसू అంటే దూరనా అని అర్ధం..

వారెవ్వా హైదరాబాదీ…. క్యా బాత్ హై..



3. సగం మనిషిగా ఉన్నదెవరు???


క్లూ: ఇది ఇటీవల వచ్చిన ఒక భారతీయ సినిమా పేరు కూడా……..

6 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

నెం 2 సూపరు. నిజంగా పైకి నవ్వేశాను.
నెం 3 - నేనింక మీ పుణుకు ప్రశ్నలకి సమాధానాలు చెప్పి తలబొప్పి కట్టించుకో దల్చుకోలేదు. అందుకని ఆ స్మాధానమేదో మీరే చెప్పెయ్యండి వచ్చే వారం.

శ్రీ

బాగున్నాయండీ పుణుకులు! మీ 3 వ ప్రశ్నకు సమాధానమేమిటో?

Anonymous

జ్యొతిగారూ, నరసింహ గానీ కాదు కదా!

గౌరి

జ్యోతి

కొత్తపాళిగారు,

ఆదిలోనే అస్త్రసన్యాసం చేసారేంటండి.

శ్రీ గారు,
ప్రశ్న అడిగి , సమాధానం కూడా నేనే చెప్పాలా? తీరిగ్గా ఆలోచించండి. వీకెండ్ వస్తుందిగా. అప్పటికీ రాకపోతే సోమవారం చెప్తా.

anonymous గారు,

కాదండి. పూర్తి మనిషికాదు. ఒక భాగం మాత్రమే మనిషి.

సరే ఇంకో క్లూ ఇస్తా. అది ఈ మధ్యే వచ్చి హిట్ అయిన హిందీ సినిమా.సల్మాన్ ఖాన్ హీరో.

Anonymous

part నర్

Anonymous

గిరీశం భార్య మాటలు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తున్నాయి.
కొత్తపాళీ గారు అస్త్రసన్యాసం చేయలేదు జ్యోతి గారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేసారు ఈసారికి. (కొత్తపాళీ గారు మనలో మన మాట మనకెందుకండి భయం. ధైర్యే సాహసే లక్ష్మి.)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008