Saturday, March 1, 2008

అమ్మ గురించి ఆలోచించండికార్యేషు దాసి
కరణేషు మంత్రి
భోజ్యేషు మాతా
శయనేషు రంభ…

ఇలా ఉండాలని ప్రతి అమ్మాయికి నేర్పిస్తారు. ప్రతి ఆడపిల్ల పెళ్ళికాకముందు హాయిగా చీకుచింతా లేకుండా, చదువు , స్నేహితులతో సరదాగా ఉంటుంది. కాని పెళ్ళీకాగానే తనంతట తానుగా అమ్మలా మారుతుంది. లేదా మారడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. ఒక కుటుంబాన్ని తనదిగా భావించి మరో తరాన్ని సృష్టించి,ముందుకు నడిపించే పెద్దరికం నెత్తిన వేసుకుంటుంది స్త్రీ. అత్తవారింటి కొచ్చాకా కొత్తగా ఆంక్షలు, పద్ధతులు కూడా మొదల్వుతాయి. ఐనా అనుభవం మీద ఒక్కటోక్కటిగా భర్త సహకారంతో నేర్చుకుంటుంది. అత్తమామలకు, భర్త పిల్లలకు కావలసినవి అమర్చి పెట్టడం, బంధువులతో మర్యాదగా ఉండడం ఇలా ఎన్నో బాధ్యతలతో సతమతమవుతుంది. తనకంటు కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని ఎవరైనా ఆలోచిస్తారా? తమకాలనీలో చీరలమ్మేవాడు వస్తే అందరు చీరలుకొనుక్కున్నారు. తను ఉద్యోగం చేయట్లేదు. కాబట్టి స్వతంత్రించి కొనుక్కోలేదు. ఇంటి ఖర్చులకోసం భర్త ఇచ్చిన డబ్బులలొ నుండి కొనుక్కోవచ్చు . కాని అది తన స్వంతం కాదు. ఖర్చు పెడితే దాని లెక్క చెప్పాలి. లేదా భర్తను అడగాలి. అందరికి అన్నీ అమర్చి పెడుతున్నా తనకంటూ స్వంత డబ్బుఉండదు. అది భర్తదో, కొడుకుదో, కూతురిదో అవుతుందిగాని. వాళ్ళు ఇస్తేనే తప్ప తనకిష్టమైనది కొనుక్కోలేదు.ఇంటిపనులనీ చేసి ఉద్యోగం కూడా చేయాలంటే కష్టం.

పెళ్ళై , పిల్లలు వాళ్ళ పెంపకం, చదువులు,ఉద్యోగాలు, పెళ్ళిల్లు ఇలా బాధ్యతలు పెరుతూనే ఉంటాయి. ఈ పరిణామంలో తన ఉనికినే కోల్పోతుంది స్త్రీ. తనకు ఏదిష్టం, ఏది తనకు నిజమైన సంతృప్తి నిస్తుంది అనే విషయాలు. ఎప్పుడూ భర్తకు కావల్సినవి, పిల్లలకునచ్చినవి చేయడం అనే ఆలోచనలే. ఈరోజులో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, కుట్లు అల్లికలు మొదలగునవి చేసి తమకంటూ ఆదాయం ఏర్పరచుకుంటున్నారు. కాని అవి కుటుంబ నిర్వహణకు, పిల్లల ఖర్చులకు సరిపోత్తున్నాయి. సరేలే భార్య ఎంత కష్టపడినా కుటుంబ ఆదాయానికే కదా అని భర్తలు ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో మాత్రం ఆమె తన కుటుంబ నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఊరుకోరు. తమను దాటి పోనివ్వరు భర్తలు. పాతకాలంలో ఆడవాళ్ళని ఎప్పుడు మగాడి వెనకాలే ఉండేలా చేసేవావాళ్ళు, ఇప్పుడు కనీసం తమతో సమానంగా ఉండేలా ఒప్పుకుంటున్నారు కాని తమను దాటి ఒక్కడుగు కూడా ముందుకు పడనివ్వరు . అయినా స్త్రీలు సహనంతో రెండు బాధ్యతలు సమర్ధవంతంగానే నిర్వహించగలుగుతున్నారు. ఎవ్వరిని నొప్పించక తానొవ్వక అన్నట్టు.

నిజంగా అమ్మ చేసే పనులన్నీ మీరు చేయగలరా? ఇక్కడ అమ్మ అంటే ఇంటి ఇల్లాలు. ఒక్కసారి కనీసం మూడు రోజులు అమ్మ స్థానంలోకి వెళ్ళి ఆవిడ చేసే పనులన్నీ మీరు చేయగలరా ప్రయత్నించండి. లేదా కనీసం ఒక్క రోజు. చెప్పడంకాదు. చేయాలి. అలాగే ఉద్యోగం చేస్తూ , ఇంటిపనులు కూడా సమర్ధవంతంగా చేయగలరా అందరు మగవాళ్ళు. మరి అలాంటప్పుడు స్త్రీని ఎందుకు తప్పులు ఎత్తి చూపుతారు? అంటే భార్త్య(అమ్మ ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా. పెళ్ళి అయినప్పటినుండి కుటుంబం కోసం ఇంత కష్టపడుతుంది కదా అని ఒక్కసారైనా అనుకున్నారా? లేదు ఆవిడ ఉన్నది ఆ పనులు చేయడానికే అని అనుకుంటున్నారా? పిల్లలకు చేయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా చేయాలి. కాని అవన్నీ తను సంతోషంగా చేస్తుంది.


కాని ఒక్కసారైనా అమ్మకు ఏదంటే ఇష్టం. ఏ స్వీటు అంటే చాలా ఇష్టం. ఏ పుస్తకం చదవాలనుకుంటుందో, ఏదైనా నేర్చుకోవాలనుకుని మానేసిందో తెలుసా. తనకు తెలిసినవాళ్ళెవరికైనా సహాయం చేయాలని చేయలేకపోయిందా. ఆడది కదా ఓ చీరో, ఓ నగో ఇస్తే సంతోషిస్తుందిలే అనుకుంటారు కదా. కాని వాటికంటే ఆమెకు చాలా ఇష్టమైనది ఏదో ఉంటుంది . ఆ పని చేస్తే (డబ్బులు రాకున్నా) ఆమెకు నిజమైన సంతృప్తి కలుగుతుందేమో. ఇప్పటికైనా కనుక్కోండి. అది ఆమెను చేయమని ప్రోత్సహించండి. తల్లిగా, భార్యగా తన బాధ్యతలతో పాటు తనకంటూ ఒక జీవితం , ఒక లక్ష్యం సృష్టించుకోనివ్వండి. అప్పుడు ఇంకా ఉత్సాహంతో ఉంటుంది.అందుకే ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించండి.. " అమ్మా నీకు ఏమిష్టం ? "
నేను చెప్పాలనుకున్న మరి కొన్ని విషయాలు వసుంధర లో చూడండి.


నేటి తరానికీ ఈ టపా నచ్చకపోవచ్చు. ఇది నా తరానికి, నా ముందు తరానికి చెందిన అమ్మలకు చెందిన వాస్తవాలు. ఇలాంటి ప్రాణమిచ్చే అమ్మలు ఎందరికో ఉన్నారు. లేనివాడు కోట్లున్నా బిచ్చగాడే. పైసా లేకున్నా కోటీశ్వరుడే..ఏమి చేయాలో తెలీని అయోమయంలో ఉన్న నాకు " నీకంటూ ఒక జీవితం సృష్టించుకో. నీకిష్టమైనవి చేయి" అని నా ఆలోచనా విధానాన్ని మార్చిన ఒక ఆత్మీయ స్నేహితునికి మనఃపూర్వక సుమాంజలి.

8 వ్యాఖ్యలు:

జాన్‌హైడ్ కనుమూరి

I felt little bit confusion

చిన్నమయ్య

శీర్షిక ఎంతో ఉదాత్తమైనదే, కానీ భావం వెలిబుచ్చడంలో కాస్త తిక మక అనిపించింది. అమ్మ ఇచ్చే ప్రేమొక్కటే సృష్టిలో ప్రతిఫలాపేక్ష లేనిది. చీరా, నగా, నట్రాతో, ఆ ప్రేమకి విలువ కట్టడమా? కూడని పని. వ్యక్టి స్వయం శక్తిమంతుడయ్యేక ఆ ప్రేమని వారికి, బేషరతుగా పంచి ఇవ్వడమే, మన ఋణభారాన్ని తగ్గించుకునే మార్గం.

జ్యోతి

జాన్ గారు, చిన్నమయ్యగారు,

నిజమే నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో. కాని అమ్మకు ప్రతిఫలం ఇవ్వమని అనలేదు. ఇంట్లో అందరికి ఇష్టమైనవి చెప్పకుండానే తెలుసుకునే అమ్మకు ఏమిష్టమో తెలుసుకోండి. తనకు తీరని ఆశ, ఆశయం, అభిరుచి ఇలాంటివి.

Kottapali

Bravo Jyothi.
చిన్నమయ్య గారు అసలు పాయింటూ మిస్సయ్యారు. చీరో నగో కొని ఇవ్వటం ద్వారా అమ్మ ఋణం తీరుకోమని చెప్పలేదు .. అమ్మ (లేదా భార్య, గృహిణి) కి కూడా అందరు మనుషులకి లాగే వ్యక్తిగతమైన ఆశలుంటాయి ..ఒక మనిషిగా ఆమెని గుర్తించమని చెపుతోంది ఈ వ్యాసం.

Anonymous

బిడ్డలు బాగుండడమే, అమ్మ కిష్టం. దాన్ని ఆమెకు అందించగలిగితే చాలు. జన్మ ధన్యమైనట్టే.

రాధిక

జ్యోతిగారూ వ్యాసం చాలా క్లియర్ గానే వుంది[నా వరకు].బహుమతులు అనేవి ప్రేమని,ఇష్టాన్ని తెలియచేయడం లో ఒక భాగం.ఆ బహుమతులు నగలు,ధన రూపేణా వుండక్కరలెద్దు.పుస్తకం మీద ప్రేమ వున్నవారికి నగలు ఇచ్చి సంతోషమేనా అని అడగొద్దు.నచ్చిన పుస్తకమేమిటో తెలుసుకుని లైబ్రరీ నుండి తెచ్చి ఇచ్చినా చాలు.లేకపోతే నీకేమి ఇష్టం అని మామూలుగా కనుక్కున్నా చాలు.తల్లి కనే కాదు,నిస్వార్ధం గా సేవలు చేసే ఎవరికయినా ఇలాంటి బహుమతులు,నాగురించి ఆలోచిస్తున్నారు అనే భావన కొండంత ఆనందాన్నిస్తాయి.

Sudhakar

నిజమేనండి. బహుశా బాచిలర్ అబ్బాయలందరికీ అమ్మ విలువ తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో? చివరికి అమ్మాయలకు కూడా..

Unknown

amma gurunchi wrayadam chala goppa mariu adrustam

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008