Thursday 10 October 2013

మాలిక పదచంద్రిక - సర్వే


 మాలిక పదచంద్రిక గడులు ఇక్కడ చూడంఢి..: 


సెప్టెంబర్ నెల మాలిక పత్రిక సంచికలోని పదచంద్రికకు ఒకే పూరణ వచ్చింది. 
మురళి మోహన్ గారు అన్ని సమాధానాలు సరిగా రాసారు.ఒక్క నిలువు ఏడు తప్ప.
7.రిదాయమా  కాదు. తడియార అని ఉండాలి.   ఆధారం..

తలకి నీళ్ళోసుకుని .....మంజుల కురులారబోసుకంటే, మరి మల్లిగాడు?

మాయదారి మల్ల్గిగాడు సినిమాలో, కృష్ణ తలకి నీళ్ళోసుకుని కురులారపెట్టుకుని అని మంజులని చూసి పాడితే, సమాధానంగా, మంజుల తలకి నీళ్ళోసుకుని తడియార పెట్టుకుని  అని పాడుతుంది.   కృష్ణకి బట్టబుర్రకదా. బహశ: అందుకే అలా పాడి ఉంటుంది !
పదచంద్రిక ఆగస్ట్ నెలలో ఒక్క పూరణ కూడా రాలేదు. ఈ క్రమంలో  ప్రియ తెలుగు మిత్రులందరికీ మా విన్నపం. 
పొద్దు, మాలిక మరియు ఇతర పత్రికలలో గడి నుడి లాంటి (క్ర్షాస్ వర్డ్) శీర్షికలు మీరు చూసే ఉంటారు. మీలో కొందరు ఒక్కసారో, వందసార్లో పూరించే ఉంటారు. . నాకు తెలిసి ఆరుద్ర గారితో మొదలైన ఈప్రక్రియ దాదాపు అన్ని పత్రికలలోనూ ఏదో ఒక రూపంలో నిర్వహించబడుతోనే ఉంది.  వాటికి ఆదరణ కూడా బాగానే ఉంటోంది. విజేతల పేర్ల జాబితా చాలా పెద్దగానే ఉంటోంది.  వీటిలో చాలా పత్రికలలో కేవలం కాలక్షేపం తప్పించి   గడులు పూరించడంలో   వేరే ఆర్ధిక లేదా ఇతర ప్రయోజనాలు ఉండవు. అంటే గడి నుడి మన తెలుగు సంస్కృతిలో ఒక భాగమయిందని అర్ధమవుతోంది. కానీ అర్ధం కానిదేమిటంటే,  మాలిక  పత్రికలో మేము నిర్వహిస్తున్న పదచంద్రిక కి సరియైన, ఉచిత  స్పందన ఎందుకు రావడం లేదా అని.   ఇప్పటిదాకా 12 గడులు వచ్చాయి. కానీ పాఠకుల నుండి స్పందన అతి స్వల్పంగా ఉండడం గమనార్హం  ఒకే మూసలో ఉండి బోరు కొడుతోందేమోనని వైవిధ్యం కోసమని ఒకసారి సాహిత్యమని, ఒకసారి సంగీతమని రకరకాల పాట్లు పడుతూనే ఉన్నాం.  కష్టంగా ఉందేమోనని సులభంగా ఇస్తే, అప్పుడు కూడా చుక్కెదురే.    ఆఖిర్ క్యోం? .. క్యోం?.. క్యోం?  అని డాల్బీ డిజిటల్గో అరిచినా  ప్రయాజనం కనిపించక పోవడం వల్ల పాఠకదేవుళ్ళనే సూటిగా అడిగేస్తే పోలా అనిపించి మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం. దయచేసి కొద్దిగా ఓపిక చేసుకుని వాటికి మీ సమాధానాలిచ్చి గడి తల్లిని బ్రతికించే ప్రయత్నానికి చేయూతనివ్వండి. 

మా ప్రశ్నలు.. మీసమాధానాలు ఇక్కడ..

భవదీయుడు
సత్యసాయి

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008