స్వరాల ఊయలూగు వేళ ...
మనం ఎన్నో పాటలు వింటుంటాం. చూస్తుంటాం కదా!. వేల పాటల్లో కొన్నిమాత్రమే మనకు ఎప్పటికీ స్పెషల్ గా అనిపిస్తాయి. ఆ పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటారు?. ఆ పాటల సంగీతం, సాహిత్యం, ఆయా గాయకుల స్వరం, చివర్లో ఆ నటీనటుల అభినయం.. ఇవన్నీ కలిసి మనకో మరపురాని, మరవలేని అనుభూతిని ఇస్తాయి. ఆ పాటలు విన్నప్పుడు మనం చేస్తున్న పనులు ఆపేసి అందులో లీనమైపోతాం. అది పూర్తయ్యేవరకు ఆ మత్తులోనే మునిగిపోతాం. కాదంటారా? అలాగే ఆ పాటల పదాల సయ్యాటలో ఊయలూగుతాము. తలలూపుతాం.. మనమూ ఊగుతాం. ఏమంటారు? నాకైతే ఈ మూడు పాటలు అలాంటి అనుభూతిని ఇస్తాయి. రెపీటెడ్ గా ఐదుసార్లన్నా వింటాను. :)
క్షణక్షణం చిత్రంలోని ఈ పాటలోని బాలు పదాల విరుపులు, సంగీతం ఒకదానికొకటి కలిసి అల్లరి చేసేస్తాయి. బాధపడుతున్న హీరోయిన్ ని నిద్రపుచ్చడానికి హీరో పాడిన ఈ జోలపాట వింటుంటే మనమూ ఆ అడవిలోకి వెళ్లిపోయినట్టు ఉంటుంది. వాళ్ల నటన కూడా ఎంత సహజంగా ఈజ్ గా ఉంటుంది. అమాయకమైన శ్రీదేవి మొహం. దేవుడ దేవుడ అంటూ ఖంగారు పడే దృశ్యం మీకు గుర్తుందా?
సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ఈ పాట.. అమెరికా అమ్మాయి ఐన మీనా తాతగారి పల్లెటూరికి వచ్చి బావతో పందెం కడుతుంది తన వాయులీనానికి పదాలు కూర్చమని. పచ్చని పంటపొలాలు, పళ్లతోటల మధ్య పరికిణీ, ఓణీ వేసుకుని పొడవాటి జడ దాని చివర ఊగే జడకుప్పెలతో మీనా వాయించే స్వరానికి నాయకుడు అల్లిన పదలహరి కుర్రకారుని గుండెలలో గిలిగింతలు పెట్టదంటారా??
సాగరసంగమంలోని ఈపాట కూడా అద్భుతమని చెప్పవచ్చు. ఈ పాట వింటుంటే బాలు, జానకిలకు జోహారు చెప్పకుండా ఉండలేము. ఎంత మత్తు, మాధుర్యం. ఆ సంగీతం వింటుంటేనే ఆ రాత్రి, చల్లని గాలి మనను కూడా తాకక మానదు. ఒకరిమీద ఒకరికి ప్రేమ ఉన్నా ధైర్యం చేసి చెప్పలేని పరిస్ధితి, మౌనంగానే వాళ్ల మనసు చెప్పే ఊసులు ఈ పాటలో దాగి ఉన్నాయి.
పాటలు వింటుంటే మీకే అర్ధమవుతుంది. వ్యక్తపరచలేని భావాలు. మనసును తాకే మధురమైన సంగీతం..
7 వ్యాఖ్యలు:
కుహుకు స్వరగాలే సృతులుగా కుషలమ అనే స్నేహం పిలవగా కిలకిల సమేపించే సడులతొ ....ఔర్ క్యా బోల్నేక జీ...thanks for sharing nice post
జ్యోతి గారు,
అబ్బా!! నాకు ఈ పాటలంటే చాలా ఇష్టం అండి, ఇప్పటి వరకు ఎన్ని సార్లు వినుంటానో.... నేను సహజం గా సాహిత్యం అర్థమైతేనే పాట లు వింటాను,అద్భుతంగా వుంటుంది వీటి సాహిత్యం. మంచి పాటలు గుర్తు చేసారు.
రఘురాం.
మూడుపాటలు వేటికవే సాటి. మంచి పాటలు మరోసారి వినిపించినందుకు నెనర్లు జ్యోతిగారు.
బాగున్నాయి అని చాలా సార్లు వింటూ ఉంటాం, కాని చుడండి ఎంత బాగున్నాయో అని మల్లి ఒక్కసారి వినిపిస్తే .....మల్లి ఒకసారి ఆస్వాదించాం.
>>ఆ పాటలు విన్నప్పుడు మనం చేస్తున్న పనులు ఆపేసి అందులో లీనమైపోతాం
మీరు అలానే లీనమైపోతే మంచిదేమో, బ్లాగ్ లు వ్రాయకుండా :))
అప్పారావుగారు, నేను బ్లాగులు రాయడం వల్ల మీకొచ్చిన ప్రాబ్లమేంటి??
నేను మీ బ్లాగులని అనుసరిస్తున్నాను కాబట్టి :))
సరదాగా అన్నా, అలా కోప్పడితే ఎలా?
Post a Comment