మాలిక పత్రిక ఏప్రిల్ 2021 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head 
Maalika Web Magazine
మాలిక పత్రిక పదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది.. 2011 లో నాతోపాటు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ, వేగంగా నడుస్తూ, ఎన్నో ప్రయోగాలతో , కొత్తవారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ , అలరిస్తూ సాగుతోంది. దీనికి సహ రచయితలు, మిత్రులు, పాఠకుల ఆదరాభిమానాలు కూడా మెండుగా ఉన్నాయి.. నేను కూడా నేర్చుకుంటూ, మాలికతోపాటే ఎదుగుతూ పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటూ వస్తున్నాను. మీకందరికీ మాలిక తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.. 
ఇటీవలి కాలంలో మాలిక సహకారంతో రెండు కథలపోటీలు నిర్వహింపబడ్డాయి. ఒకటి మంథా భానుమతిగారు, రెండు కోసూరి ఉమాభారతిగారి ఆధ్వర్యంలో. ఈ సంచికలో మాలిక పత్రిక, మంథా భానుమతిగారి సంయుక్త నిర్వహణలో ఉగాది కథలపోటిలలో మొదటి బహుమతి అందుకున్న  1. ఒకసారి చెప్తే అర్ధం కాదా?, 2. ఇంటర్నేషనల్ కల, 3. చంద్రహారం.. మూడు కథలను  ప్రచురిస్తున్నాము. మిగతా కథలు వచ్చే నెలలో ప్రచురించబడతాయి.  ఉమాభారతిగారు నిర్వహించిన కథలపోటీ ఫలితాలను ఈ సంచికలో ప్రకటిస్తున్నాము. భవిష్యత్తులో మాలిక పత్రిక ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి సంసిద్ధంగా  ఉంది. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు.
మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ వార్షికోత్సవ సంచికలోని విశేషాలు.
1. పడతి! ఎవరు నీవు? కథలపోటి ఫలితాలు

 
 
 
 
