Saturday, 13 December 2014

పుస్తకప్రదర్శనలో జె.వి.పబ్లిషర్స్



శుభవార్త.... శుభవార్త.... ధమాకా... ధమాకా...
ప్రమదాక్షరి/J.V.Publishers సంయుక్తంగా నిర్వహించబోతున్న కార్యక్రమం..
ఈ నెల అంటే డిసెంబర్ 17 నుండి 26 వరకు హైదరాబాదులో జరగబోయే పుస్తకప్రదర్శనలో తెలుగు మహిళా రచయితలు , జె.వి.పబ్లిషర్స్ తరఫున ఒక డబల్ స్టాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది. మొన్నే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఈ స్టాలులో రచయిత్రులు తమ పుస్తకాలను అమ్మకానికి పెట్టడమే కాక పాఠకులను పలకరిస్తారు కూడా.. నిర్వహణ కూడా మేమే కలిసి చేసుకుంటున్నాం..


హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఎన్నో పుస్తకాలు మీకోసం. పుస్తకానికి మించిన బహుమతి ఏమున్నది. మీకు, మీ మిత్రులకు నచ్చిన పుస్తకాన్ని కొనండి. బహుమతిగా ఇవ్వండి..

మా స్టాలులో మీ అభిమాన రచయిత్రుల పుస్తకాలను తీసుకోవచ్చు. వీలైతే రచయిత్రితో ఓ పలకరింపు, ఓ ఫోటోగ్రాపు, ఓ ఆటోగ్రాఫు కూడాను...


  ఇక ఈ స్టాలులో పాల్గొనే రచయిత్రులు, రచయితలు:
1. మంధా భానుమతి
2. నండూరి సుందరీ నాగమణి
3. కొండవీటి సత్యవతి
4. కన్నెగంటి అనసూయ
5. శీలా సుభద్ర
6. అల్లూరి గౌరీ లక్ష్మి
7. సుశీలా సోమరాజు
8. కోసూరి ఉమాభారతి
9. పి.ఎస్.ఎమ్. లక్ష్మి
10. సమ్మెట ఉమాదేవి
11. ముచ్చర్ల రజనీ శకుంతల
12. కె.బి.లక్ష్మి
13. వేంపల్లి షరీఫ్
14. స్వాతీ శ్రీపాద
15. గంటి భానుమతి
16. జ్యోతి వలబోజు
17. అత్తలూరి విజయలక్ష్మి
18. సి.ఉమాదేవి
19. రామా చంద్రమౌళి
20. వారణాసి నాగలక్ష్మి
21. శారదా శ్రీనివాసన్

Saturday, 6 December 2014

మాలిక పత్రిక డిసెంబర్ 2014 సంచిక విడుదల

మాలిక పత్రిక ఈ సంవత్సరపు ఆఖరు మాసపు సంచిక విడుదల అయింది. ఈ నెలలో తండ్రి కూతురు అంశం మీద వచ్చిన మరో అయిదు కథలు ప్రచురించబడ్డాయి. ఈ తండ్రి కూతురు అంశం మీద వచ్చిన కథలన్నీ ప్రింట్ పుస్తకంలా రూపుదిద్దుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. పద్యమాలిక అనే గ్రూపులో నెలకు ఒకటి లేదా రెండు చిత్రాలను ఇచ్చి పద్యాలు రాయమని కోరిన తడవుగానే పద్యాల వెల్లువెత్తింది. వాటిని ఒకచోట చేర్చి ప్రతీనెల మాలిక పత్రికలో ప్రచురించడం జరుగుతుంది.

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

మీ ఆదరాభిమానాలకు నమస్సుమాంజలి పలుకుతూ ఈ మాసపు విశేష రచనలు మీకోసం:

 1. దుస్సల
 2. పద్యమాలిక - 2
 3. పద్యమాలిక - 1
 4. మాలిక పదచంద్రిక డిసెంబర్ 2014
 5. నువ్వు నేర్పిందే నాన్నా
 6. కథ కాని కథ
 7. నాన్నకు ఆసరా
 8. నాన్నా నన్ను మన్నించు 
 9. చినుకు
10. వంతెన
11. ఇసుక బట్టీలు - ఒక కల
12. మా నేపాల్ దర్శనం - ముక్తినాధ్
13. భారతీయ సంస్కృతిలో నైమిశారణ్యం
14. మాయానగరం - 10
15. తెలుగుపాటల్లో మంచి సాహిత్యం లేదా?
16. ఉగ్గుపాలతో
17. వాగుడుకాయ
18. ఆరాధ్య - 3

Thursday, 6 November 2014

మాలిక పత్రిక నవంబర్ 2014 విడుదల

Jyothivalaboju

Chief Editor / Content Head


ప్రతీ నెల సరికొత్త అంశాలతో మిమ్మల్ని అలరిస్తోంది మాలిక  పత్రిక. ఈ నెల ప్రత్యేకంగా జడ అనే అంశం మీద వచ్చిన సరదా పద్యాలు మీకోసం... మమ్మల్ని ఆదరిస్తోన్న  పాఠకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల మాలిక పత్రికలోని వివిధ వ్యాసాలు:

మీ రచనలు పంపవలసిన చిరునామా editor@maalika.org
 00. శిక్షణ (తండ్రి - కూతురు)
 01. జడమాలిక 
 02.  పదచంద్రిక - నవంబర్ 2014
 03. ఆత్మీయం.. ఎగిరే పావురమా
 04. మూడుపాయల జడ
 05. ఆరాధ్య - 2
 06. అనగనగా బ్నిం కథలు - బాయ్ ఫ్రెండ్
 07. మాయానగరం -9
 09. మలాలా - ది ఫైటర్
 10. మా నేపాల్ దర్శనం
 11. వెటకారియా రొంబ కామెడియా - 4
 12. అమ్మాయి వెళుతోంది
 13. మా సినిమా బొమ్మల బాపు
 14. జ్ఞానపీఠ గ్రహీతలు - పరిచయం
 15.  కార్తీక మాసం
 16. హ్యూమరధం

Monday, 3 November 2014

మాలిక పదచంద్రిక అక్టోబర్ 2014 ఫలితాలు




పదచంద్రిక అక్టోబర్ 2014 ఫలితాలు::
 
ఈ నెల పదచంద్రికని పూరించి పంపినవారు శ్రీచెనెకల మనోహర్ (రెండు తప్పులతో),  శ్రీ దాతా రమేష్ (రెండు తప్పులతో), శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మి (ఒక తప్పుతో).  శ్రీమతి శుభావల్లభ గారు, శ్రీ మాచెర్ల హనుమంతరావు గారు సరిగా పూరించినారు.  అందరికీ అభినందనలు.  సరియైన సమాధానాలు కింద ఇచ్చాం.
సత్యసాయి కొవ్వలి


Friday, 31 October 2014

అష్టవిధ నాయికల జడపద్యాలు:




బ్నింగారు జడ మీద పద్యాలు రాయమని అలా అన్నారో లేదో సునామీలా పద్యాలు అందునా కందాలు వెల్లువెత్తాయి. అన్నీ జడ మీదేనండోయ్.. పుస్తకానికి కావలసినవి తలా ఐదు పద్యాలైనా ఆ తర్వాత కూడా అద్భుతమైన పద్యాలు రాసారు ఎందరో కవిమిత్రులు. ఇంకా రాస్తూనే ఉన్నారు. పూలదండలోని పూల వాసన దారానికి తగలదా అన్నట్టు నాదో చిన్న ప్రయత్నం. కాని ఇంతోటి దానికి నన్ను శతకకర్తను చేసి సన్మానించారు.. ఏంటో!!!


అష్టవిధ నాయికల జడపద్యాలు:

భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలుగా ఎనిమిది రకాల నాయికలను తెలిపారు. ఈ ఎనిమిది రకాల నాయికలు ప్రేమ, వలపు మొదలైన ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తారు. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. వాటిపై పద్యాలు రాస్తే బాగుంటుందని భావిస్తూ.. జడలకు అన్వయిస్తూ...
1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!
2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!
3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!
4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!
5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!
6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!
7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!
8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008